top of page
Vedurumudi Ramarao

కర్తవ్యం - ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Karthavyam - Episode 3' Mini Telugu Web Series

Written By Vedurumudu Ramarao

రచన: వెదురుమూడి రామారావు



వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం మూడవ భాగం


గత ఎపిసోడ్ లో


మనోహర్, సుధలతో కలిసి షాపింగ్ కి బయలుదేరుతారు విశ్వనాథం దంపతులు.

అక్కడ వారిద్దరినీ కలపడానికి చాల ప్రయత్నాలు చేస్తారు.

పిల్లలిద్దరూ కలిసి బోట్ షికార్ చేసేలా ప్లాన్ చేస్తారు.


ఇక కర్తవ్యం మూడవ భాగం చదవండి.


ఇదేకదా కావలసింది. ఇది మూడవ స్టెప్. ట్రిప్ ముగిసిన తరువాత సంతోషంగా అందరూ మద్రాస్ కేఫ్ వైపు దృష్టి మళ్లించారు. మంచి సౌత్ ఇండియన్ భోజనం ముగించారు. ఇంటికి బయలు దేరే వేళకి అందరు ప్రసన్నంగా వున్నారు. ఇదే సమయం అని విశ్వనాథం గారు మరో ప్రస్తావన తెచ్చారు.


"ఇది మంచి సీజన్. మనం కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళ్ళితే చాలా ఎంజాయ్ చెయ్యచ్చు. మేం ఇద్దరం ఎప్పటినించో వెళదాం అని ప్రయత్నించాం. కుదర లేదు. మాకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని ఆగి పోయాం. ఎటూ ఇప్పుడు శలవలే కదా . మీరు కూడా ఎప్పుడు చూడ లేదు కదా ఈ ప్రదేశాలు అన్నీ. కోర్ట్ కి ఇంకా టైం వుంది. అంచేత మీరు మాకు సాయంగా వస్తే చాలా బాగుంటుంది. అరెంజ్మేట్స్ అన్నీ నేను చేస్తాను. నిజంగా జన్మలో మరచి పోలేని ట్రిప్ ఇది. వస్తారు కదా. అలోచించి రేపు చెప్పండి.” అన్నారు. ఒక్క సారి ఈ ప్రతిపాదన వచ్చే సరికి వాళ్లకి ఏం చెప్పాలో తెలియ లేదు. ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చోండి పోయారు.


మనసులో ఆ సాటిలేని ప్రదేశాల మీద ఊహలకి అందని వివరణలు విన్నారు. మంచి ప్రతిపాదనే. కానీ మౌనంగానే వున్నారు ఇద్దరూ.


పరిస్థితి తేలిక చెయ్యడానికి విశ్వనాథం గారు "రాత్రి అంతా బాగా ఆలోచించి రేపు మీ నిర్ణయం చెప్పండి. ఇన్నాళ్లూ మాకు తోడు లేక ఇద్దరమే వెళ్ళ లేక మానేస్తున్నాం. మీరిద్దరూ మాకు సాయం అని అడిగాను” అని, అక్కడ వదిలేశారు.


వాళ్లకి తెలుసు నిర్ణయం ఏంటో. వాళ్ళను కలపడానికి మరొక ప్రయత్నం ఇది. చిన్న దంపతులు ఇద్దరు రాత్రంతా ఆ విషయం మీద మాట్లాడుకుని వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. చాలా కాలం తరువాత వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఇదే. ఇద్దరు రాజీ పడి ‘కులు మనాలి’ ట్రిప్ కి వెళ్ళడానికి సిద్ధమైయ్యారు.


కారు ఢిల్లీ సిటీ లిమిట్స్ దాటి హర్యానా లోంచి దూసుకు పోతోంది. ఆ రెండు జంటలు చాలా ఉత్సాహంగా వున్నారు. కొంత దూరం తర్వాత డ్రైవింగ్ సీట్స్ మార్చుకోవాలి అని నిర్ణయించుకొన్నారు. మొత్తం సుమారు 650 కిలోమీటర్స్ దూరం. దాదాపు 14 నించి 15 గంటలు ప్రయాణం. దారిలో చాలా ప్రసిద్ధి గాంచిన స్థలాలు వున్నాయి.ఎక్కడ పడితే అక్కడ టిఫన్ కి కాఫీ కి బోల్డన్ని డాబాలు. మొత్తము మీద ప్రయాణం చాలా ఆసక్తికరంగానే వుంది.


‘పానిపట్టు’ దగ్గర ఒక రెస్టౌరెంట్ లో మంచి పరోటాలు పెరుగు తో బ్రేక్ఫాస్ట్ కానిచ్చి కొంచం రెస్ట్ తీసుకొన్నారు. అక్కడి చారిత్రాత్మికమైన విషయాలు మళ్ళా మననం చేసుకొని ముందుకు బయలుదేరారు. విశ్వనాథo దంపతులు వెనక సీట్లో కి మారి కొంచం విశ్రాంతిగా స్థిరపడ్డారు.


‘కురుక్షేత్ర’ వస్తోంది అనగానే అందరు చాలా ఉత్సాహంగా మహా భారతాన్ని, భగవద్గీతని మననం చేసుకొన్నారు. మన హిందూ సంసృతి, అభ్యాసాలు, విధి విధానాలు, నమ్మకాలు చర్చాంశాలుగా వచ్చాయి. ఇదే మంచి సమయం అని విశ్వనాథం గారు తన ధోరణి లో మాట్లాడడం మొదలు పెట్టారు.


“మీ వివాహం అయి నాలుగు ఏళ్ళు దాటింది కదా, జరిగిన మంచి సంఘటనలు ముచ్చటించు కొందామా ? డ్రైవింగ్ కష్టం తెలియకుండా సమయం కూడా గడుస్తుంది”అన్నారు.


మనోహర్,సుధ మౌనంగా రోడ్డు వైపే చూస్తూ కూర్చున్నారు. దారి ఆపిల్ తోటల పక్కనించి వెళుతోంది. మనకి ఆపిల్ చెట్లు చాలా అరుదు. ఇంకాపండని ఆకుపచ్చని, మధ్యలో కొన్ని యెర్రని పళ్ళు, చెట్టు మీద చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా వుంది ఇద్దరికీ.


“మీకు ఇంటరెస్ట్ ఉంటే మనం తోట లోకి వెళ్ళచ్చు. ఇక్కడి వాళ్లు మనలాంటి సందర్శకులని చాలా ఆప్యాయంగా ఆహ్వానిస్తారు పదండి” అన్నారు విశ్వనాథంగారు.

రోడ్ దగ్గరనించి తోట లోకి వెళ్ళడానికి రోప్ వే ఉపయోగించాలి. చిన్న బకెట్ లాంటి సీట్ లో ఇద్దరే కూర్చోవచ్చు. మనమే రోప్ ఒక పక్కనించి లాగుకొని వెళ్లితే అవతల వైపు చేరతాం. సుధ ఎవరెవరు కూర్చోవాలా అని సందేహిస్తోంది. సుమతి గబగబా విశ్వనాథం గారి తో కూర్చొని వాళ్ళిద్దరిని ఒక దాంట్లో రమ్మని బయలు దేరింది.


రోప్ లాగుకొంటూ ముందుకి వెళ్లడం దారిలో ఆపిల్ తోటల నించి మంచి సువాసన , వాతావరణం మత్తు ఎక్కించిలా వుంది. ఇద్దరు చక్కగా ఒక సీట్ లో అమరి గువ్వల్లా వున్నారు.


తోట యజమాని, భార్య ఎంతో సంతోషంగా వీళ్లని పిలచి టీ, ఆపిల్ ముక్కలు పెట్టారు .

“మీ చేత్తో మీకు నచ్చిన పళ్ళు కోసుకోండి. చెట్టు నించి డైరెక్ట్ గా కోసుకు తినడం బాగుంటుంది” అన్నారు. చిన్నపిల్ల లాగా సుధ చెట్ల మధ్యకి వెళ్లి కొన్ని పచ్చి కాయలు, కొన్ని పళ్ళు కోసింది. మనోహర్ తనకి సాయం చేస్తూ ఆమెని ఆప్యాయంగా చూస్తున్నాడు.వాళ్లకి థాంక్స్ చెప్పి కార్ వైపు బయలు దేరారు.


ఇదే సమయం అని విశ్వనాథం గారు అక్కడి స్థానిక ఆచారాలు, నమ్మకాల టాపిక్ తెచ్చారు. “తోట యజమాని, భార్య ఎంత బాగా మెలిగారో చూసారా ! అలాగే మనం మన ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవాలి, మసలుకోవాలి” అంటూ ప్రారంభించారు .


“మీ పెళ్లి లో చాలా మంత్రాలూ ,తంతులు జరిపారుకదా . మీరు ఆ తంతు అంతా యాంత్రికంగా చేసి వుంటారు. వాటి అర్ధం, విశేషం కొంచం చెప్తాను. మన హిందూ సంప్రదాయం, వాటి వెనుక వున్నగూడార్థం తెలుసుకోవడం మన విధి. నాకు తెలిసిన వరకు చెప్తాను. మనకు టైం కూడా గడుస్తుంది. మళ్ళా తీరుబాటుగా వాటి అర్ధాలు, అవసరాలు చెపుతాను” అన్నారు.


వాతావరణం చల్లగా వుంది . ఆపిల్ తోటలో పొందిన సంతోషం వాళ్లిద్దరికీ కొంచం ప్రోత్సాహకరంగా వుంది. ఏదో పోయిన క్షణం తిరిగి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయినా మౌనంగానే వున్నారు. కార్ లోంచి ముందర దృశ్యాలు చాలా బాగున్నాయి. దూరంగా ఎత్తైన కొండ శిఖరం, దాని మీద ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక కట్టడం కనిపిస్తోంది.


మనోహర్ ,సుధ ఒకే సారి "ఎంత బాగుందో ఆ ఆకాశం లో మబ్బులలో తేలుతున్న ఇల్లు. అక్కడ ఒక్క క్షణం గడిపితే జన్మ ధన్యం కదా " అన్నారు.


“మనం కులు వాలీ లో వున్నాం . అది ‘బోర్డరు సెక్యూరిటీ’ వాళ్ల ‘కులు’ స్పెషల్ గెస్ట్ హౌస్ . ఇక్కడి ‘డీజీ’ నా ఫ్రెండ్. ఈ గెస్ట్ హౌస్ స్పెషల్ గా మీకోసం తీసుకొన్నాను. ఇప్పుడు అక్కడే ఉండ బోతున్నాం. ఇవాళ పౌర్ణమి కదా. ఈ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళా పొద్దున్న ముందుకు వెళదాం” అన్నారు విశ్వనాథం గారు.

వీళ్ళ ఉత్సాహానికి, సంతోషానికి ఇంక పగ్గాలు లేవు. రోడ్ మెలికలు తిరుగుతూ కొండ శిఖరం మీదకి వెళ్ళింది. కార్, మబ్బుల మధ్యలో వుంది. సెంట్రీ వీళ్ళని ఎంతో మర్యాదగా ఆహ్వానించి వాళ్ళ గదులు చూపించాడు. సుధ ఇంకా ఆ ఊహ లోకం నించి తేరుకోలేదు.


కార్ దిగుతూ విశ్వనాథం గారు అన్నారు "మన టాపిక్, రేపు ఇక్కడనించి 'మనాలి' కి వెళుతున్నప్పుడు మాట్లాడుకొందాం. ఈ ర్రాత్రి ఇక్కడ ఎంజాయ్ చెయ్యండి " అంటూ టాపిక్ కి వాయిదా వేశారు.


డిన్నర్ ఐన తరువాత ఆరు బయట కుర్చీలు, టేబుల్ వేసి ఉంచారు. 'డెసెర్ట్' అక్కడ ఆ చల్లటి వాతావరణం లో చంద్ర కాంతి లో ఏకాంతం లో కూర్చొని తింటూ ఉంటే మనోహర్, సుధ ల కి స్వర్గం అంటే ఇదేనేమో అన్నట్టు వుంది. వాళ్లని ఏకాంతము లోకి వదలి విశ్వనాథo దంపతులు నిశ్శబ్దంగా అక్కడనించి నిష్క్రమించారు. చిన్నదంపతులిద్దరూ ఊహ లోకం లో ఉన్నట్టు మెల్లగా మాట్లాడు కొంటున్నారు.


ఆకు పచ్చని లాన్ మీద తెల్లని వెన్నెల కురుస్తోన్న రాత్రి. ఉన్నత శిఖరాల మీద చల్లటి గాలి వీస్తుంటే ఒంటరిగా ఇద్దరు కూర్చొని ప్రకృతి అందాలన్నీ అనుభవిస్తున్న వారికి విశ్వనాథం గారు చేస్తున్న ప్రయత్నం అర్ధమవుతోంది.

ఇన్నాళ్లు జనారణ్యం లో రాతి గోడలు, మనుషులు,పనుల , వేర్వేరు ఉద్రిక్తల వల్ల వారిద్దరిమధ్య వచ్చిన భేదాభిప్రాయాలు మెల్ల మెల్లగా విడుతున్నట్టు అనిపించింది. అవును..


‘వాటిని విశదీకరించుకొని, పునరాలోచన చేసుకొంటే మంచిది కదా’ అనే ఆలోచన ఇద్దరికి ఒకే సారి కలుగుతోంది. జీవితానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చుకొందాం అనే ఆలోచన వచ్చింది. ఏదో మత్తులో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాళ్ల హనీ మూన్ , ఆ సంగతులు అన్ని మననం చేసుకొన్నారు.


రాజీ పడడం అనేది చెడ్డ ప్రకృతి కాదు.. ఎంత సేపు అక్కడ గడిపారో తెలీదు.చాలా దగ్గరగా ఉన్న విషయాలు స్పష్టంగా మాట్లాడుకున్నారు. కిటికిలోంచి చూస్తూ సుమతి ఎంతో సంతోషించింది. ఇది వాళ్ళు ఒకళ్ళకొకరు దగ్గరగా రావడానికి తాను అనుకున్నట్టుగా విజయవంత మైన స్టెప్. నవ్వుతు సుమతి వైపు చూస్తూ రూమ్ వైపు వెళ్లారు విశ్వనాథం.


"మనుషులు దగ్గర ఐయితే మనసులు కూడా దగ్గర అవుతాయి" ..


ఇంకా ఉంది...


వెదురుమూడి రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం: వెదురుమూడి రామారావు. M.Com; LLB;



జననం:- జనవరి1945 విజయనగరం.

Till B.com – M.R college vizianagaram,

M.COM at Andhra university college of commerce –

LL.B at Osmania University Hyderabad.

Some diplomas and certifications.

రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ - గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు / oriental bank of commerce– హైదరాబాద్

(21 years with Andhra Bank )–

4 years with a Bank in Oman and -10 years with a Global trust bank in various capacities.

Rich experience in Banking activities. Retired from active services in 2005.

Team member for campus recruitment of B.Tech students from various colleges for Infosys for 6 years.

Trainer in behavioral sciences. with Andhra bank training college and

Later a resource faculty at many organizations.

Played Tennis/ Hockey and basket ball.

రచనలు;

తెలుగు లో చాలా వ్యాసాలు :- సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం . వాణిజ్యము / న్యాయ శాస్త్రము మొదలైనవి.

ప్రచురణలు –

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ ,హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎచ్ ఆర్ డీ , లింక్డిన్ ,

అల్ ఇండియా రేడియో హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థుల కు (telugu) కామర్స్ లో పాఠాలు.

గెస్ట్ లెక్చరర్ గ చాలా కంపెనీస్ అండ్ బిజినెస్ స్కూల్స్.

Study handouts and matters for Bankers in the banker’s training college.

Recently in December 2019, one short story in Telugu was published in ' Aavirbhava" online magazine.

Two short stories in Telugu were published in the online magazine ‘Madhura Vaani’ in 2021-2022


Two stories published in "mana Telugu kadhalu.com"

Trying / pencil sketches/ painting and story writing and being active.

ప్రస్తుతం అమెరికా లో పిల్లల తో .


29 views0 comments

Comments


bottom of page