#AyyalaSomayajulaSubrahmanyam, #KarunaGatha, #కరుణగాథ, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguFamilyStory
Karuna Gatha - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/12/2024
కరుణ గాథ - తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
“మమ్మీ, కాలేజీకి వెళ్ళొస్తా. తలుపేసుకో. ;” చెప్పింది కరుణ వాళ్ళ తల్లితో.
“జాగ్రత్తమ్మా; ట్రాఫిక్ ఎక్కువ. చూసుకో?”
“సరే” అంది కరుణ.
కరుణ బి. ఎస్. సి మొదటి సంవత్సరము చదువుతుంది. మంచి మార్కులు తెచ్చుకుంటూ జాగ్రత్తగా చదివే పిల్ల. మంచి ఎథల్‌టిక్. బాస్కెట్‌బాల్ ప్లేయర్. టోర్నమెంట్స్ లో పాల్గొంటూ ఉంటుంది. చక్కటి అవయవసౌష్టవం, ఒడ్డు పొడుగు ఉన్న పిల్ల. ఇంకేముంది. ఇటువంటి పిల్లల వెంబడపడటమే పోకిరీల పని. ఏడిపిస్తూ ఉండడం, లవ్ లెటర్స్ పంపటం.. రోడ్ల మీద బీట్ కాయడం వీళ్ళ ప్పవృత్తి.
కరణ తండ్రి అరుల్‌రాజు మతభోద ప్రచారకుడుగా, మరియు ఊరిలో RMP వైద్యుడుగా జీవనం గడుపుతున్నాడు. హస్తవాసి బావుండడం వలన ఊరిజనమే కాకుండా ప్రక్క ఊరిజనం కూడా వైద్యానికి వస్తూంటారు. ముఖ్యంగా సంతానం నిలవని వారికి మందులిచ్చి గర్భం నిలిచేలా మందులు ఇచ్చేవాడు.
పేరు ఆర్. ఎమ్. పీ. అయినా MBBS డాక్టర్ కంటే కూడా మంచి అనుభవశాలి. ఫీజు ఎప్పుడూ అడగడు. ఇచ్చింది తీసుకోవడమే కానీ. అందువల్ల ఊరి రైతులు, ప్రక్క వూళ్ళ జనాలు పంట ఇంటికొచ్చాక ధాన్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు. , పండ్లు - ఇలా ఎవరికి వీలైంది వారు అరుల్‌రాజుకు ఫీజుకింద ఫలసాయం అందించేవారు.
అరుల్‌రాజు కు సహాయంగా అతని భార్య మేరీ, కూతురు కరుణ కూడా ఎంతో సహకరిస్తారు. ఆ గ్రామంలో ప్రభుత్వఆరోగ్యకేంద్రం ఉంది. కానీ, అది నామమాత్రమే. ఊరి జనాలందరికీ అరుల్‌రాజు మందులే కావాలి. సాయంత్రం ఐదు కావస్తోంది. నవంబర్ నెల కావడంతో మెల్లగా చీకటులు అలుముకుంటున్నాయి.
రైతులు గిత్తలను తోలుకుని పొలం నుంచి గ్రామం వైపు వెను తిరుగుతున్నారు. మెల్లగా చలి ఆరంభమైంది. సమయం ఆరైంది. పట్నం నుండి. ఆ గ్రామానికి వచ్చే చివరి ట్రిప్ బస్ నిండా జనాన్ని మోసుకొచ్చి పంచాయితీ ఆఫీసు దగ్గర ఆగింది. అందులోంచి ఓ యువకుడు, ఓ నడి వయస్కుడు దాదాపు దూకినట్లుగా దిగి దాదాపు రెండు ఫర్లాంగుల దూరంలో వున్న అరుల్‌రాజు ఇంటికి పరుగెత్తారు.
చివరి బస్సు వచ్చింది. అయిదు నిమిషాల్లో కూతురు వస్తుందని ఎదురు చూస్తున్న మేరీ చూపు రోడ్డువైపు చూసింది. ఇంతలో రొప్పుతూ మేరీ తమ్ముడు అనిల్, దూరపు బంధువు ఆనంద్ వచ్చారు. వాళ్ళ వాలకం కంగారుగా వుంది.
అనిల్ “అక్కా, బావ ఏరి? మీరోసారి పట్నం రావాలి. కరుణకు జ్వరం వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించి వచ్చాం” అన్నాడు.
మేరీకి వాళ్ళు చెప్పిన విషయం వినగానే రక్తపోటు 120 నుండి 160 కి ఎగబాకింది. ఇంతలో అరుల్‌రాజ్ లోపలినుండి బయటికి వచ్చాడు.
“ఏం అనిల్, ఈ వేళప్పుడు వచ్చావు?” అని అడిగాడు.
మేరీ, “ఏమండీ; మన కరుణకి జ్వరం. ఆసుపత్రిలో చేర్చారట. తొందరగా బయలుదేరదాం.
పదండి” అంది.
ఆయనకు పరిస్థితి అంతా అయోమయంగా అనిపించింది. ” అసలు విషయం ఏమిటి అనిల్? ఉదయం చక్కగా కాలేజీకి వెళ్ళిన పిల్లకి జ్వరం ఎలా వచ్చింది? వివరంగా చెప్పు” అన్నాడు.
“బావా, క్లాసులో కరుణ కళ్ళు తిరిగి పడిపోయింది. బి. పి బాగా తక్కువైంది. హాస్పిటల్ లో చేర్చి గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. బస్సు ఆపించాను. మనం వెంటనే బయలుదేరుదాం” అని ముగించాడు.
మేరీ, అరుల్‌రాజు లు వారివెంట బయలుదేరి అయిదు నిమిషాల్లో బస్సు ఎక్కారు. ప్యాసింజర్లు ఎక్కువగా లేరు. ఇరవైఐదు నిమిషాల్లో బస్సు ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆగింది.
గబగబా పైకి వెళ్ళారు. పెద్దడాక్టర్ వారికి ఎదురొచ్చి “కంగారు పడకండి, ప్రాణాపాయం ఏమీ లేదు” అన్నాడు.
ఆసుపత్రి బయట వందలాది మంది విద్యార్థులు, డజన్ల సంఖ్యలో పోలీసులు, విలేకరులు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అరుల్‌రాజు మనసులో విపరీతమైన ఆందోళన తన్నుకు వచ్చింది.
డా: రంగారావు ముందుకొచ్చి “రండి. అమ్మాయిని ఐసి లో వుంచాం. ప్రాణభయం లేదు. తలపై నించి ఛాతివరకు కాలింది” అన్నాడు.
ఇంతలో అరుల్‌రాజు మరియు మేరీ వార్డ్ లోపలికి వెళ్ళి కూతురి వికృత రూపం చూసి ఇద్దరూ “కరుణా”; అంటూ సొమ్మసిల్లిపోయారు. డాక్టర్స్ ఇద్దరికీ ఇంజక్షన్స్ ఇచ్చారు. గంట తరువాత అరుల్‌రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
చుట్టూరా విద్యార్థులు, డాక్టర్లు, ప్రిన్సిపాల్, లెక్చరర్లు, పోలీసులు, మీడియా ప్రతినిదులు.
కరుణ కాలేజీ నుంచి తిరిగి వెళ్ళే క్రమంలో స్నేహితులతో కలిసి బస్టాండు వచ్చింది.
ప్రేమించానంటు ఓ విద్యార్థి కరుణ వెంట పడుతుంటే వాడి ప్రేమను తిరస్కరించిందని యాసిడ్ పోశాడు. దాంతో కరుణ తల, ముఖం కాలింది. ఛాతీలో కూడా 30శాతం కాలింది. ప్రాణాపాయం తప్పిందని డా: రంగారావు చెప్పారు.
ఇనస్పెక్టర్ ఖలీల్ ముందుకు వచ్చి “ఆ యువకుడిని గుర్తించాం. వాడి పేరు అక్బర్. పలు కేసుల్లో
పోలీస్ రికార్డుల్లో వున్నాడు. వాళ్ళ నాన్న ఎమ్. ల్. ఏ. జహంగీర్. పక్క గ్రామంలో వంద ఎకరాల
భూమి ఉంది. ఆ ఇంట్లో వారందరిదీ రాజకీయ జీవితమే. వారిపై అనేక కేసులు ఉన్నాయి. అరెస్టు చేయబోతే, ముందుగానే బెయిల్ తెచ్చుకుంటారు. ఈ సారి మాత్రం నా ఉద్యోగం పోయినా సరే వాడిని వదలను” అన్నాడు సి. ఐ. ఖలీల్.
“ఏం ఉపయోగం నాయనా, అల్లారుముద్దుగా పెంచుకున్న నా కూతురికి పిశాచి రూపము వచ్చింది. లేకలేక పుట్టిన నా కూతురిని పెళ్ళి చేసుకునేందుకు ఏ కుర్రాడు ముందుకొస్తాడు. ? జీవితాంతం ఈ క్షోభ మేము భరించాల్సిందే. ఏ జన్మ పాపమో?” అన్నాడు అరుల్‌రాజు.
ఇంతలో వారి నియోజకవర్గ శాసనసభ్యుడు కొండల్‌రెడ్డి వచ్చి “ఫాదర్; మీరు బాధ పడకండి. మీ అమ్మాయి, మా అమ్మాయితో సమానం. ఎంత ఖర్చయినా సరే, ఫారిన్ పంపించి కరుణకు పాత కరుణ రూపం తెప్పిస్తాను. టెక్నాలజీ అభివృద్ధి చెందింది” అని అభయమిచ్చాడు.
బయట గోల గోల. “అక్బర్ డౌన్, అక్బర్ డౌన్ డౌన్.. వాణ్ణి వెంటనే ఉరితీయండి. కొట్టి చంపండి” అని అరుపులు, కేకలు.
ఊరిలో యుద్ద వాతావరణం నెలకొంది. అప్పటికే కొంతమంది అక్బర్ ఇంటి మీద దాడి చేసి దొరికిన సామాను మరియు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆ సమయానికి ఇంటిలో ఎవ్వరూ లేరు. అందరూ పరారై ఒక్కొక్కరు, ఒక్కో దిక్కుకు పారిపోయారు.
రాత్రి పదకొండు గంటలయినా విద్యార్థుల ఆవేశం తగ్గలేదు. నిందితుడిని ఉరి తీయాలని ఆందోళన చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ అక్బర్ అతని మిత్రబృందాన్ని అరెస్ట్ చేసేందుకు మెరికల్లాంటి కానిస్టేబుల్స్ ను రంగం లోకి దింపాడు. కానీ అతని స్నేహితులైన డేవిడ్, ముత్తయ్.. పక్క గ్రామంలోని ఓ వేశ్య ఇంటిలో విందు, పొద్దులతో జల్సా చేస్తూ దొరికిపోయారు. ఆ ఇద్దరు అక్బర్ కరుణపై యాసిడ్ దాడి చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నారు.
సి. ఐ. ఖలీల్ పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టాడు. స్టేషన్ బయట వందలాది విద్యార్థులు తో బాటు ఊరిజనం, ఓ పది మంది మీడియా ప్రతినిధులు, కొందరు వీడియో కెమెరాలు ఆన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్దమయ్యారు.
‘నేరస్థులందరూ దొరికారటగా సార్? ఎక్కడ.. ఎలా.. దొరికారు? వాళ్ళు విద్యార్థులే? లేక బయటివారా? గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయా?’ ఇలా ప్రశ్నాస్త్రాలు సంధించారు.
సి. ఐ. మనసులో కోపాన్ని నిగ్రహించుకుని నెమ్మదిగా ఇలా అన్నాడు. -“ఆసుపత్రి నుండి ఇప్పుడు మీ ముందే స్టేషన్ లోకి వచ్చాను. అనుమానితుల ముఖమైనా చూడలేదు. ఇన్ని వివరాలు అడిగితే ఎలా చెప్పండి?
అందరూ సహకరిస్తే విచారణ సాగిస్తాను. ఇంకా అసలు నిందితుడు అక్బర్ పట్టుబడలేదు. అతని కోసం వెతుకులాట సాగుతోంది. తొందరలోనే అరెస్ట్ చేసి రేపు సాయంత్రానికి ఎస్. పి. గారి సమక్షంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం” అని ముగించాడు.
ఓ చానెల్ విలేకరి లైవ్ పెట్టి “యాసిడ్ దాడి జరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఇంకా నేరస్థులను అరెస్ట్ చేయటంలో విఫలం చెందారు” అంటూ ఇంకా ఏవేవో కల్పించి యాంకరింగ్ చేయసాగాడు.
ఇంతలో ఎస్. పి. దివాకర్ స్టేషన్ లోకి అడుగు పెట్టాడు. కెమెరామెన్లు కెమెరాలను ఆయనకు గురి పెట్టారు. మీడియా వారి ప్రశ్నలకు ఆయన ముఖం గంభీరంగా మారింది.
అందరి ప్రశ్నలు విన్నాక “చూడండి; నిన్న సాయంత్రం 5. 30 కు సంఘటన జరిగింది. రాత్రి పదకొండు గంటలకి ఫిర్యాదు అందింది. వెంటనే ఎస్. ఐ. నలుగురు జవాన్లు రంగంలోకి దిగి యాసిడ్ దాడి చేసిన వారి పేర్లు, ఇతర వివరాలు సంపాదించారు. మొత్తం ఆరుగురు దాడిలో పాల్గొన్నారు.
ప్రధాన నిందితుడు అక్బర్. ఇద్దరిని గంటక్రితం అరెస్ట్ చేశాం. మిగతా వారిని తొందరలో అరెస్ట్ చేసి, మీకు సమాచారం ఇస్తాం” అని ముగించాడు ఎస్. పి.
కొందరు విలేకరులు అర్థం లేని, అసందర్భ ప్రశ్నలు వేయబోయారు.
“చూడండి.. పోలీసులకు అతీంద్రియ శక్తులు ఏమీ లేవు. మా పంథాలో మేము పని కొనసాగిస్తాం. రేపు కలుద్దాం. ” అని ఎస్. పి. , సి. ఐ. గది వైపు కదిలారు.
డేవిడ్, మత్తయ్ లను లాకప్ లోంచి బయటకు తీసి ఎస్. పి. దివాకర్ ముందు హాజరు పరచారు జవాన్లు. బాగా తాగడం వల్ల ముఖాలు ఉబ్బి వున్నాయి. ముఖాల్లో ఎక్కడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం లేదు. నటిస్తున్నారు ఇద్దరూ.
ఎస్. పి. కంఠం ఖంగుమంది.. “అక్బర్ ఎక్కడ దాక్కున్నాడు?”
“మాకు తెలీదు సార్;”
“యాసిడ్ ఎక్కడనుంచి తెచ్చారు?”
“మాకు తెలీదు సార్;”
ఇద్దరి వీపు మీద లాఠీలు నాట్యం చేశాయి. లాఠీలు అరగంట నాట్యం చేశాక మత్తయ్ నోరు విప్పాడు..
“పక్క గ్రామంలో కంసాలి దగ్గర వెయ్యి రూపాయలకు అక్బర్ కొన్నాడు సార్; కరుణను బెదిరించి లొంగదీసుకో వాలనుకున్నాం. కానీ చెయ్యి జారి సీసాలో యాసిడ్ మొత్తం కరుణ తలమీద ఒలికిపోయింది సార్; దాంతో అందరం తలా ఒక దిక్కుకు పారిపోయారు. అక్బర్ ప్రక్క గ్రామంలో ఉండొచ్చు సార్;”
“అక్కడెవరున్నారు?” ఎస్. పి. ప్రశ్న.
“సలీనా వుంది సార్; అది అక్బర్ లవర్. శని, ఆదివారాల్లో అక్బర్ ఆమె వద్ద గడుపుతాడు. ఆమె కాల్ గర్ల్. ఆమె మిగిలిన రోజుల్లో వేరే వాళ్ళతో గడుపుతుంది. ఆమె వ్యాపారమే అది.
కొడుకు నిర్వాకం తండ్రికి కూడా తెలుసు. గారాబం వల్ల ఏమీ అనడు. ఆ గ్రామంలో సలీనాకు రాజభవనం లాంటి ఇల్లు కట్టించాడు. ఇంటికి ఏ. సి, డిజిటల్ టివి, స్విఫ్ట్ కారు కూడా కొనిచ్చాడు. ఇంటికి విటులెవ్వరూ రాకుండా టైట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేశాడు. అయినా సలీనా శని, ఆది వారాలు తప్ప మిగతా రోజుల్లో తన వేశ్యావృత్తి చేస్తూ వుంటుంది “ చెప్పాడు డేవిడ్.
ఎస్. పి దివాకర్ సి. ఐ. ఖలీల్ కి కనుసైగ చేశాడు. ఆయన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న సి. ఐ. వెంటనే ఇద్దరు వెల్ ట్రైన్‌డ్ కానిస్టేబుల్స్ ని వెంటబెట్టుకుని జీపు ఎక్కారు.
అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో వున్న పల్లెలోకి ప్రవేశించింది. పోలీసు జీపు ఇరవై నిమిషాల
తరువాత ఇవస్పెక్టర్ ఖలీల్ సలీనా ఇంటి తలుపు తట్టాడు. సెక్యూరిటీ వాళ్ళు కూడా పోలీస్ ఐడెంటిటీ చూసి ఏమీ చేయలేక తప్పుకున్నారు.
లోపలినుంచి ఒక ఆడగొంతు “ ఎవరూ?” అని.
సి. ఐ. బదులు చెప్పలేదు. మళ్ళీ కాలింగ్‌బెల్ చప్పుడు చేశాడు. ఈసారి కూడా బదులు రాలేదు. వెనుకవైపు నుంచి తలుపు తెరుచుకుంది. చుట్టూ చిమ్మచీకటి. కీచురాళ్ళ ధ్వని. ఓ పాతికేళ్ళ మానవాకారం దొడ్డిదారి గుండా పరుగెత్త బోయింది. ఇద్దరు జవాన్లు ఆ ఆకారం మీదపడి ఏ మాత్రం కదిలేందుకు వీలు లేకుండా కడుపు, నడుం, వెన్నుపై పిడిగుద్దులు కురిపించారు. అర నిమిషంలో ఆ ఆకారాన్ని ఎత్తి జీపులో కుదేశారు.
ఖలీల్ కళ్ళు ప్రశంసాపూర్వకంగా చూశాయి. జీపు కదిలింది. డ్రైవర్ పక్కసీట్లో సి. ఐ. ఖలీల్, వెనుక అక్బర్, సలీనా- నలుగురు కానిస్టేబుల్స్ కాళ్ళ దగ్గర.
అక్బర్, సలీనా ను అరెస్టు చేసి తెచ్చిన పోలీసు జీపు తెలతెలవారుతుండగా జిల్లా ఎస్. పి. కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది రహస్యంగా.
సూర్యోదయమైంది. కరుణ కళ్ళు తెరిచింది. మళ్ళీ అరుల్‌రాజు, మేరీలు కళ్ళు తిరిగి పడిపోయారు.
కరణ ఊపిరితిత్తుల్లోకి చేరిన ఏసిడ్ ఊపిరితిత్తులను పూర్తిగా మాడ్చివేసింది. వైద్యులు కృత్తిమ గొట్టాలు అమర్చకమునుపే అవి కాలిపోయాయి. కరుణ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకదని వైద్యులకు తెలుసు. తండ్రి అరుల్‌రాజుకు తెలుసు. కానీ మేరీకి కురూపి అయినా కూతురు బతుకుతుందని
గంపెడాశతో ఉంది. ఆమె ఆశలు ఆవిరి అయ్యాయి. కరుణ ప్రాణం తనువు వీడి వెళ్ళిపోయింది.
జిల్లాలో కళాశాలలన్నీ మూత బడ్డాయి. నిరవధికంగా. వ్యాపారసంస్థలు బంద్ పాటించాయి. విద్యార్థుల ఆవేశం కట్టలు త్రెంచుకుంది.
అక్బర్ తండ్రి, ఆయన బంధువుల ఇళ్ళపై విద్యార్థులు దాడి చేశారు. వారి వాహనాలు దగ్ధం చేశారు. ఇళ్ళను నేలమట్టం చేశారు. గోదాంలో పశువులను విడిచిపెట్టి గడ్డివాములను తగులబెట్టారు. కొండలరెడ్డి కుటుంబం, వారి బంధువులు కూడా అందరూ తెల్లవారుతుండగా ఎక్కడికో పారిపోయారు.
జిల్లా లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరుణ మృతికి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు సంతాపం తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు ఈ దారుణ మైన సంఘటనను తీవ్రంగా ఖండించారు.
పోలీసులు యాసిడ్ దాడికి ప్రధాన సూత్రధారి అక్బర్ ను, అతని మిత్రబృందాన్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టారు. “నిర్భయ” చట్టం క్రింద కేసు నమోదైంది. అక్బర్ తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవ్వరూ రాలేదు.
ఆస్తి, ఐశ్వర్యానికి తోడు మంచితనం, మానవత్వం లేని మనుషులకు బ్రతికే హక్కు లేదన్నారు ప్రజలు. ప్రజల దగ్గర బకాయిల క్రింద రాయించుకున్న దస్తావేజులను గ్రామస్థులు వెలికి తీశారు.
వాటిని ఊరి మధ్యలో కుప్పగా పోసి తగలేశారు. సూర్యాస్తసమయానికి ముందే కరుణ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గ్రామగ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అరుల్‌రాజును ఓదార్చి, కన్నీటితో కరుణకు శ్రద్దాంజలి ఘటించారు. కళాశాల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంది. జిల్లామంత్రి, శాసనసభ్యులు, గ్రామపెద్దలు, పోలీసు ఉన్నతాదికారులు, లెక్చరర్లు.. అందరూ అరుల్‌రాజును, మేరీలను ఓదార్చారు.
అన్ని వాహనాలు ఆ ఊరి ఉత్తరాన శ్మశానవాటిక వైపు..
వారం వరకూ అరుల్‌రాజు ఇంట్లో వంట లేదు. వారి బంధువులు వండి తెచ్చి బలవంతంగా తినిపిస్తున్నారు. అరుల్‌రాజు బంధువులు వచ్చి తమ ఇంట్లో మూడు నెలలపాటు వుంటే కాస్త బెంగయినా తగ్గుతుందన్నారు.
అరుల్‌రాజు కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందజేసింది. కాలేజీ విద్యార్థులు, గ్రామస్థులు మరో ఐదు లక్షలు పోగుచేసి అరుల్‌రాజు దంపతులకు అందజేశారు. అరుల్‌రాజు, మేరీలు వాటి వైపైనా చూడకుండా కరుణ ఫోటో దగ్గర వుంచారు.
కొండల్‌రెడ్డి తనకున్న పొలంలో కొంత భాగాన్ని ఆ ఊళ్ళో పెద్ద కళాశాల నిర్మాణానికి ఇచ్చి, దగ్గరుండి శంకుస్థాపన కూడా చేయించాడు. కాలేజీ నిర్మాణ పనులన్నీ తనే దగ్గరుండి చూసుకోసాగాడు. అందులో చదువుకునే విద్యార్థినులందరికీ పుస్తకాలు, భోజనం ఉచితం.
“కరుణ మహిళా కళాశాల“ ప్రారంభం అయ్యింది.
***సమాప్తం***
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ఈ కథ "కరుణ గాథ"లో, ఒక యువతి కరుణను ఆకర్షించే కథగాచూపించబడింది. ఆమె ఒక మంచి విద్యార్థి, బాస్కెట్‌బాల్ ప్లేయర్. తన కర్తవ్యాలను నిర్వహించేది. కానీ ఓ రోజు, ఆమెపై జరిగిన దారుణమైన యాసిడ్ దాడి ఆమె జీవితాన్ని మారుస్తుంది.
కరుణ అనుకోకుండా ప్రేమను తిరస్కరించిన యువకుడి చేతిలో మోసం, వేధనకు గురవుతుంది, దీనితో ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు వస్తాయి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ, ఆమె కుటుంబం, గ్రామవాసులు, విద్యార్థులు ఈ సంఘటనపై ఆందోళనగా ఉంటారు.
ఈ కథ అనేక భావోద్వేగాలను కలిగిస్తుంది, ముఖ్యంగా కరుణ బాధలు, ఆమె కుటుంబంలోని ఘర్షణ , సమాజంలో దారుణమైన వివక్ష, ప్రతిఘటనను చూపించారు