top of page

కస్తూరి రంగ రంగా!! 15


'Kasthuri Ranga Ranga Episode 15' Telugu Web Series


Written By Ch. C. S. Sarma



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆరోజు పౌర్ణమి. పండువెన్నెల...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.


సమయం... రాత్రి ఎనిమిదిగంటలు... ఎనిమిదీ ఏభై అయిదుకు...07032 హైదరాబాద్ డక్కన్--ముంబై సి.యస్.యం.టి. కోవిడ్ స్పెషల్ ట్రైన్ బయలు దేరుతుంది. ప్రయాణీకులు స్టేషన్ చేరుతున్నారు. రైల్వే స్టేషన్ ముందు టాక్సీ వచ్చి ఆగింది. దాని నుండి నలుగురు పాతిక సంవత్సరాల లోపు యువతులు... మువ్వ దిగారు. స్టేషన్లోకి వెళ్లపోయారు. ఆటోలో పీర్ దిగాడు. అతనూ స్టేషన్లోకి వెళ్లాడు... మరో టాక్సీ వచ్చింది. మూగచాన్ టీ బాయ్ దిగాడు. వెనక సీట్లో మారు వేషాల్లో వున్న సుగంధి... యాదగిరీలు, ఎ.డి.యస్.పీలు దిగి వారిరువురూ స్టేషన్లో ప్రవేశించారు... కొంతమంది ఆడ మగ పోలీసులు కూడా మఫ్టీలో స్టేషన్లో ప్రవేశించారు.


ఖాజా పోలీసులను గమనించి వేగంగా మెట్లు ఎక్కి పారిపోవాలని ప్రయ త్నించాడు. మెట్లపై వున్న పోలీసులు అతన్ని పట్టుకొన్నారు. చేతులకు బేడీలు వేసి లాక్కొని వెళ్లిపోయారు.


ఆడ పోలీసులు... వారి వెనుక మగపోలీసులు... మువ్వ, ఆమెతో వున్న నలుగురు యువతులతో...

"గలాభా చేయకుండా మాతో రండి..." అని చెప్పడంతో భయపడిన ఆ యువతులు, మువ్వా మౌనంగా వారి వెనకాలే నడిచారు.


అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. పోలీసులు వారిని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ వెళ్లిపోయింది.

ఆరోజు ఉదయం... దుర్గాదేవి... తన పెద్దకుమారుడు భూషణ్ కుమార్ నకు గోపాలయ్య కుమార్తె కస్తూరికి సాంప్రదాయ బద్ధంగా తన స్వగృహంలో వారికి ఎంతో ముఖ్యులైన హితుల సమక్షంలో నిశ్చితార్థాన్ని జరిపించింది.


వివాహాన్ని రేపల్లెలో జరపాలనే నిర్ణయంతో ఒక వారం రోజులుగా ఆ ఇంటి ప్రాంతాన్నంతా బాగుచేయించడం ప్రారంభించారు. శుభలేఖలను ముద్రించి రెండు రోజులుగా బంధువులకు హితులకు ఆప్తులకు పంచడం జరిగింది. ఆ శుభలేఖలను చూచి ఐ.జి. అనంత్ నాగ్ కస్తూరి రంగాకు ఫోన్ చేశాడు.విషయాన్ని చెప్పాడు.


"కస్తూరి రంగా!... భూషణ్ కుమార్ వివాహం వచ్చే శుక్రవారం... రేపల్లెవాసి కీర్తిశేషులు గోపాలయ్యగారి కుమార్తె కస్తూరిగారితో.. వివాహం జరగబోయేది రేపల్లెలో... కస్తూరి స్వస్థలంలో... అంటే... టుడే మండే... ఆన్ ఫ్రైడే అంటే ఐదవరోజు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వివాహానంతరం... ఫారిన్ ట్రిప్ ఫర్ హనీమూన్... వివాహ ఆహ్వాన పత్రిక ఇస్తూ భూషణ్ కుమార్ చెప్పాడు..." వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు. ఐ.జి. అనంత్ నాగ్. వివాహపత్రికను రంగా సెల్ వాట్సాప్ కు పంపాడు. విషయాన్ని వసంత్కు వివరించాడు రంగ.

ఆ వివాహ పత్రికను కస్తూరి రంగ... ముంబైలో వున్న తన బావగారైన శశాంక్ గారికి పంపి... విజయవాడకు గురువారం ఫోర్నూన్ రావల్సిందిగా మెసేజ్ పంపాడు. ఫొటోలో వున్న కస్తూరిని చూచి వారంతా ఆశ్యర్యపోయారు.


కస్తూరి రంగ... వసంత్ విజయవాడ చేరారు. సమయం ఆరు గంటలు…


హెూటల్లో బసచేసి... రెండు గంటలు శయనించారు.

ఎనిమిది గంటలకు లేచి రెడీ అయి టిఫిన్ తిని లాయర్ కీర్తి ప్రసాద్ కు ఫోన్ చేశాడు కస్తూరి రంగ.

"డియర్ కీర్తి!... గుడ్మార్నింగ్...."

"సార్!... శుభోదయం సార్!..." నవ్వుతూ చెప్పాడు కీర్తిప్రసాద్.


"ఆ.. మామ గారు ఎలావున్నారు?... వారికి ఎవరెవరి దగ్గరనుంచి ఫోన్స్ వచ్చాయి?... నోనో... మీరు ఇక్కడికి రాగలరా వారిని తీసుకొని…”


“ఓకే సార్!... అరగంటలో మీ ముందు వుంటాను. ఏ హెూటల్ సార్?...”


"అదే... మునుపు ఉన్నది... లెమన్ ట్రీ హెూటల్...."

"ఓకే సార్!... " కీర్తిప్రసాద్ సెల్ కట్ చేశాడు.


"బ్రో!..."

"బాస్..."

"కీర్తి ప్రసాద్ మనకన్నా స్పీడు... గుడ్... అలాగే వుండాలి. అరగంటలో వస్తున్నాడు మామతో!..." వ్యంగ్యంగా నవ్వాడు.


క్షణం తర్వాత...

"వసంత్!... ఈలోగా మనం అడ్వకేట్ కృష్ణమూర్తి ఆఫీసు వెళ్లి వద్దాం... లే!..."

ఇరువురూ ఇరవై నిముషాల్లో కృష్ణమూర్తిగారి ఆఫీసుకు చేరారు...


ఆరోజు సోమవారం...

కృష్ణమూర్తిగారు స్నానం చేసి నొసటన విభూతిరేఖలు ధరించి... చందనం... దాని మధ్యన బొట్టుతో... సలక్షణంగా తెల్ల షర్టు... ప్యాంటు ధరించి కూర్చొని ఏదో కేస్ పేపర్లను దీక్షగా చూస్తున్నారు.


ముందు సీట్లో శిష్యుడు... వారు అడిగింది కేసు కట్టనుంచి తీసి ఇచ్చేదానికి... అక్కడవున్న యువతి... వీరి రాకను వారికి తెలియజేసింది... వెంటనే రమ్మన్నారు... కస్తూరి రంగ... వసంత్ వారికి విష్ చేసి గదిలో ప్రవేశించారు.


"మిత్రుడు భూషణ్ కుమార్ వివాహం శుక్రవారంనాడు. ఈవూరికి వచ్చాను. మిమ్మల్ని చూచి పలకరించి వెళదామని వచ్చా... థాంక్యూ సార్... వస్తాను..." టేబుల్ క్రింద వుంచిన చేతిని వెనక్కు తీసుకొని లేచి గది బయటికి ముందు రంగా... వెనకాల వసంత్ నడిచారు.


వారి చర్యకు కృష్ణమూర్తికి కొంత ఆశ్చర్యం కలిగింది. శిష్యుడు వేదాంతితో.... "ఒరేయ్!... వేదా!... వారు ఎందుకు వచ్చినట్టు?..."


"మీకు అర్దం కాలేదా సార్!...”.

“కాలేదురా!.."

క్షణం తర్వాత... "మరి నీకు?..."

"గురూజీ..."

"చెప్పరా!..."


"మీకే అర్ధంకాని విషయం నాకేం అర్ధం అవుతుంది సార్!...నేను ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదుగా సార్!..."


అమాయకంగా నవ్వాడు వేదాంతి.

కృష్ణమూర్తి నిట్టూర్చాడు.


"కస్తూరి రంగా... వసంతలు హెూటల్ కు చేరారు.

కీర్తి ప్రసాద్ పున్నయ్యలు వెయిటింగ్…


"సారీ!... కీర్తి... అడ్వకేట్ కృష్ణమూర్తిని కలసి వస్తున్నాము...”

"సార్!... నాకు తెలుసు సార్... గ్రహించాను.. మీరు ఒక్క నిముషాన్ని కూడా వేస్టు చేయరు సార్!... డ్యూటీ మీన్స్ డ్యూటీ..." చిరునవ్వుతో చెప్పాడు కీర్తి ప్రసాద్.


రంగా నవ్వి... "యస్... యస్... ఆ మామా ఈ రెండురోజులూ విశ్రాంతి... నో ఫోన్ కాల్స్... నో పైసా డిమాండ్స్... హ్యాపీగా వుందిగదా!... నేను అత్తను కలిశాను... మాట్లాడాను... మన రంజనీకి... శ్యామ్ కుమార్ కి పెండ్లి మొన్న జరిగిందట. వాళ్లు ఆనందంగా వున్నారు. నీవు... నిజాలను చెబితే... చేసిన తప్పులకు లైట్ శిక్ష పడేలా చూస్తా... శిక్షను అనుభవించాక నీవు మన వారందరితో కలసి ఆనందంగా బ్రతకవచ్చు... ఆయన పేరు వసంత్ దేశాయ్... వారికి నీకై నీవు... నీకు తెలిసిన నిజాలన్నీ చెప్పు.... సరేనా!..." అడిగాడు రంగ.


పున్నయ్య బిక్కమొగంతో తల ఆడించాడు.

వసంత్ అతన్ని గదిలో ఓ మూలకు తీసుకువెళ్లి... అడగవలసిన ప్రశ్నలను అడిగి నిజాలను రాబట్టసాగాడు.


"వచ్చే శుక్రవారం కీర్తిప్రసాద్... మీరు ఉదయాన్నే మాతో రేపల్లెకు రావాలి… శశిరేఖాపరిణయం జరగబోతూవుంది..." నవ్వాడు కస్తూరి రంగ…


"సార్!... మీరు చెప్పింది..."

"నిజం... అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు ప్రత్యక్షంగా చూడబోతారు.."


"ఓకే... ఓకే...సార్... ఇక నే వెళతాను..." కీర్తి ప్రసాద్ వెళ్లిపోయాడు.


వసంత్ పున్నయ్యను విచారించి అన్ని విషయాలను నోట్ చేసుకొన్నాడు. పున్నయ్య రంగాను సమీపించి విచారంగా నిలుచున్నాడు.

"మామా... నీవు హైదరాబాద్ వెళ్లి గురువారం రాత్రికి అందరితో ఇక్కడికి రావాలి... మనమందరం కలసి భూషణ్ కుమార్ పెండ్లికి రేపల్లెకు వెళదాం...."


తల ఆడించి పున్నయ్య బయలుదేరాడు.

ప్యాంట్ జేబునుంచి మైక్రోరికార్డరును తీసి వసంత్ కు చూపి... "దీన్లో కృష్ణమూర్తి దుర్గాదేవి... భూషణకుమార్ సంభాషణ మొత్తం రికార్డు అయింది... పద.. ఛలో హైదరాబాద్..." నవ్వుతూ చెప్పాడు కస్తూరి రంగ... ఇరువురు పోలీస్ ఆఫీసర్సు... హైదరాబాద్ కు బయలుదేరారు.


***


ఆడపిల్లల రవాణా... గంజాయి దొంగ విక్రయం కేసుల్లో ఖాజా... అతని శిష్యుడు పీర్లను అరెస్టు చేశారు పోలీసులు... ఐ.జి. అనంత్ నాగ్ కార్యాలయంలో కస్తూరి రంగ... వసంత్ దేశాయ్ లు తాము రికార్డు చేసిన అడ్వకేట్ కృష్ణమూర్తి, దుర్గాదేవి.. భూషణ్ కుమార్ లు.. తమ మాట ప్రకారం... కస్తూరిని భూషణ్ కుమార్ కు ఇచ్చి వివాహం చేసేదానికి నిరాకరించిన కారణం... ప్రేమను చూపి అస్వస్తతతో వున్న గోపాలయ్య తమ నిలయానికి తీసుకెళ్లి... తాము మరోసారి అడిగినా కాదన్నందుకు గొంతు పిసికి చంపేశారన్న నిజాన్ని శ్యామ్ కుమార్ మాటల ద్వారా అందరూ గ్రహించారు.


పున్నయ్య, మువ్వ సాక్ష్యం ద్వారా బాంబ్ బ్లాస్టులు... ఆడపిల్లల రవాణా... గంజాయి వ్యాపార కేసులలో కూడ భూషణ్ కుమార్... ఖాజాల ప్లాన్ ప్రకారం జరిగిందని రుజువయింది.


శుక్రవారం... రేపల్లెలో భూషణ్ కుమార్.. కస్తూరీల వివాహం జరిగాక అరెస్టు చేయవలసిన భూషణ్కుఊమార్... ఖాజా. పున్నయ్య, మువ్వ, పీర్లను కస్టడీలోకి తీసుకోవలసిందిగా... ఐ.జి. అనంత్ నాగ్ ఆజ్ఞాపించారు.


శుక్రవారం... రేపల్లెలో గోపాలయ్యగారి ఆవరణలో ఏర్పాటుచేసిన వేదికపై భూషణ్ కుమార్... కస్తూరీల వివాహం ఘనంగా జరిగింది. దుర్గాదేవి, శ్యామ్ కుమార్... బందువులు, మిత్రులు శ్రేయోబిలాషులు... ఆ దంపతులను ఆశీర్వదించారు.


కస్తూరి రంగ తన భార్య చిన్నీ... బావగారు శశాంక్, వారి అర్ధాంగి నిర్మల... పిల్లలు కవిత... కమలలు.. పుండరీకయ్య, సయ్యద్, కీర్తిప్రసాద్ మండపంలో ఒక్కసారిగా ప్రవేశించారు.

పోలీస్ ఐ.జి. అనంత్ నాగ్... తన పరివారంతో... ముంబైనుండి సక్సేనా... అన్వర్... అక్కడి ఖాజా ఏజెంట్ మరికొంతమంది లోనికి వచ్చారు. అన్వర్, ఇర్ఫాన్ లు చేతులకు బేడీలు తగిలించి వున్నాయి... ఇరువురు ఐ.జి.లు ఆనందంగా కరచాలనం చేసుకొన్నారు. వేదిక చుట్టూ పోలీసులు... చెవులు దద్దరిల్లేలా నాదస్వర వాద్యాలు... వేదికపైని వారు భయంతో బిత్తర చూపులు...


మాంగల్యధారణ ముగిసింది.

కస్తూరి రంగా ఇరువురి బాసెస్ (అనంత్ నాగ్, సక్సేనా)లకు సెల్యూట్ చేసి తనవారిని పరిచయం చేశాడు. భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని వేదికను ఎక్కాడు. దుర్గాదేవి... భూషణ్ కుమార్.. పెండ్లికూతురు కస్తూరి ముఖాల్లో భయం... శరీరాలు చమటతో తడిశాయి.


పురోహితుల చేతిలోని మైక్ ను కస్తూరి రంగా అందుకొన్నాడు....


"అందరికీ నమస్కారాలు... వివాహం బాగా జరిగింది. అది అలా జరగాలనే మా కోరిక... తీరింది. కాని ఇక్కడ ఇప్పుడు ఇరువురు కస్తూరీలు వున్నారు. ఒకరు నాభార్య కస్తూరి. రెండవ వ్యక్తి భూషణ్ కుమార్ గారి భార్య"... ఆగిపోయాడు. పెండ్లికూతురు కస్తూరి వంక చూచాడు. వీరు మరో కస్తూరి. గోపాలయ్యగారికి ఒకే కూతురు కస్తూరి. వీరిరువురులో ఆ కస్తూరి ఎవరు?.... ఎవరు ఒరిజనల్?... ఎవరు డూప్లికేట్?... ఈ ప్రశ్నకు జవాబు ఈ వేదిక మీదనే వుంది.... హు ఈజ్ డూప్?... హూ ఈజ్ డూప్?..." సింహంలా గర్జించాడు కస్తూరి రంగ....


వేదిక కిందవున్న, పైన వున్న అందరి ముఖాల్లో భయం.... భయం.. భయం... పెద్ద డూప్లికేట్ కస్తూరి భూషణ్ కుమార్ భార్య... పున్నయ్య పెద్దకూతురు రాగిణి... శ్రీ కస్తూరిరంగ కాళ్లపై బడింది.


"సార్!... నేను కస్తూరిని కాను... పున్నయ్య పెద్దకూతుర్ని. నా పేరు రాగిణి. ఐదు సంవత్సరాల కిందట నన్ను ఈ భూషణ కుమార్ పెండ్లి చేసుకొంటానని నమ్మించి తనదాన్ని చేసుకొన్నాడు. నన్ను అమెరికాకు పంపించి నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి నా పేరును కస్తూరిగా మార్చాడు. ఈవిషయం నాకు, మానాన్న పున్నయ్యకు, దుర్గాదేవిగారికి భూషణ్ కుమార్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఇదంతా అతను చేసింది... నన్ను అడ్డం పెట్టుకొని గోపాలయ్యగారి ఆస్తిని కాజేయాలనే... నిస్సహాయ స్థితిలో నేను వారికి లొంగిపోయాను. నన్ను క్షమించండి..." భోరున ఏడ్చింది రాగిణి.


అడ్వకేట్ కృష్ణమూర్తి ఈ వివాహానికి రాలేదు. కాశీయాత్రకు వెళ్లాడు…


రాగిణి భుజాలు పట్టుకొని ఆమెను పైకిలేపాడు కస్తూరి రంగ... ఇరువురు ఐ.జి.లను స్టేజి పైకి ఆహ్వానించాడు. ఐ.జి. సక్సేన, ఐ.జి. అనంత్ నాగ్ స్టేజి పైకి ఎక్కారు.


"సార్!... ఇది యదార్థ గాథ. శ్రీ గోపాలయ్యగారి కుమార్తె... నా అర్ధాంగి... కస్తూరి... సార్... నేను పుట్టింది ఈ గడ్డమీదనే... చాలా పేదవాడిని..." కస్తూరిని చూపిస్తూ... "ఈమె నాదేవత.. నన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దింది. దోషులు, నిర్దోషులు అందరూ ఇక్కడే వున్నారు. దోషులకు తగిన శిక్ష విధించవలసిందిగా మామూలు పౌరునిగా కోరుతున్నాను..." అంటూ కస్తూరి రంగ చేతులు జోడించి ఐ.జి. గార్లకు నమస్కరించాడు.


వసంత్, సక్సేనా, కీర్తిప్రసాద్, యాదగిరి... సుగంధి మరికొందరు సీనియర్స్ వచ్చి రంగాతో కరచాలనం చేశారు.

కస్తూరి ప్రీతిగా నవ్వుతూ కస్తూరిరంగా చేతిని తనచేతిలోకి తీసుకొని అతని భుజం పై వాలిపోయింది. వారు వేదిక దిగారు.


ఐ.జి. అనంత్ నాగ్ దుర్గాదేవి.. భూషణ కుమార్... ఇర్ఫాన్... అన్వర్... ఖాజా... పీర్... మువ్వ... పున్నయ్యల చేతులకు సంకెళ్లు వేయించి... పోలీస్ వ్యాన్లో ఎక్కించారు.


తన కుటుంబం చుట్టూ చేరిన వూరి జనానికి చేతులు జోడించారు. కస్తూరి రంగ... కస్తూరి... శశాంక్... నిర్మల పిల్లలు... మనసారా వారిని దీవించారు. సయ్యద్ పుండరీకయ్యలు... గ్రామస్థులనుండి.... "కస్తూరిరంగ... రంగా సార్... జిందాబాద్... జిందాబాద్..." అంటూ ఆనంద కేరింతలు మిన్నుముట్టాయి.


***సమాప్తం***


కస్తూరి రంగ రంగా ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.










24 views1 comment

1 Comment


vidya sagar vesapogu • 1 hour ago

Chala bagundi sir thanks for good naration

Like
bottom of page