top of page

కస్తూరి రంగ రంగా!! 7


'Kasthuri Ranga Ranga Episode 7' Telugu Web Series


Written By Ch. C. S. Sarma





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

సయ్యద్ ను మూటలో కట్టి మూసీ నదిలో పడేస్తాడు పీర్.

ఫాలో చేస్తూ వచ్చిన మూగ మస్తాన్ సయ్యద్ ను కాపాడుతాడు.

ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని ఢిల్లీలో ఉన్న చిన్ని దగ్గరకు వెడతాడు రంగా.

ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 చదవండి...

మరుదినం ఉదయం అందరూ కాఫీ త్రాగుతున్న సమయం..

శశాంక్.. కస్తూరి, రంగల ముఖంలోకి పరీక్షగా చూచాడు. వారిరువురూ ఒకే సోఫాలో కూర్చొని వున్నారు.

శశాంక్ లేచి వెళ్లి వారి మధ్యన కూర్చున్నాడు. నవ్వుతూ ఆ ఇరువురి ముఖాల్లోకి చూచాడు.


"ఏంటి బావా!..” అడిగాడు రంగ.

"మీ ఇరువురికి నాదొక సలహా!.." అన్నాడు శశాంక్.

"చెప్పండన్నయ్యా!.." అంది చిన్నీ

“మీరిరువురూ నాలుగురోజులు సరదాగా బెంగుళూరు, మైసూరు తిరిగిరండి. వారం రోజుల తర్వాత రంగా డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత బిజీ అయిపోతాడు కదా!.. కాబట్టి నామాట వినండి.." చెప్పాడు శశాంక్..


“అవును చిన్నీ.. మీ అన్నయ్య చెప్పింది మంచి సలహా.. హ్యాపీగా ఆ ప్రాంతాన్ని తిరిగిరండి.. చూడవలసినవి చాలా వున్నాయి.." చిరునవ్వుతో చెప్పింది నిర్మల.

"అలాగే బావా!.. ఆ చిన్నీ నీకు ఓకే కదా!.." అన్నాడు రంగ.


"మా అన్నయ్య మాటను నేను ఏనాడూ కాదనను.." నవ్వుతూ చెప్పింది చిన్నీ.

"వెరీగుడ్.. నేను సాయంత్రానికి ఫ్లయిట్ టిక్కెట్స్ బుక్ చేస్తాను. ముందు బెంగుళూరు అంటే ఈ నైట్ హాల్ట్ మీరు ఎట్ బెంగుళూరు.." చెప్పాడు శశాంక్.


వారి ఫ్లయిట్ మూడుగంటలకు. భోంచేసి ఒంటిగంటకు ఎయిర్పోర్టుకు బయలుదేరారు శశాంక్ నిర్మల.. చిన్నీ రంగా.. డ్రాప్ చేసి బైబై చెప్పి శశాంక్, నిర్మల ఇంటికి తిరిగి వెళ్లారు.


అన్నపూర్ణ హెూటల్లో రూమ్ బుక్ చేశాడు శశాంక్.

చిన్నీ.. రంగాలు టాక్సీలో హెూటల్ కు చేరి.. ఫ్రష్ అయ్యి.. టాక్సీలో బెంగుళూరు ముఖ్య వీధులన్ని సరదా కబుర్లతో తిరిగి ఎనిమిదిన్నరకు హోటల్ కు చేరారు. భోంచేశారు. ఇరువురూ పడకపై వాలారు.


చిన్నీ కదలకుండా కళ్లు మూసుకొంది..

ఆమె ముఖంలోకి చూచాడు రంగా.. సున్నితంగా బుగ్గమీద తన చేతి వ్రేళ్లను తాకించాడు. చిన్నీ కళ్లు తెరచింది.

"చిన్నీ!.. అలసటగా వుందా!.." అడిగాడు రంగా.

"లేదు.." నవ్వింది చిన్ని.

"కడుపులో !!.."


"ఆ..”

"కదలిక.."

"అంటే..'

“మీ ప్రతిరూపం..” అందంగా నవ్వింది చిన్ని. రంగా ప్రీతిగా చిన్నీని తన చేతుల్లోకి తీసుకొని ఆమె తలను తన తొడలపై వుంచుకొని కురులను సవరిస్తూ చిన్నీ ఫాలభాగాన చుంబించాడు. చిన్నీ పరవశంతో కళ్లు మూసుకుంది.

"నేను చాలా అదృష్టవంతురాలని.." ఆమె పెదవులు పలికాయి.


"కాదు అదృష్టం అంటే నాదే!.. ఎక్కడి ఒకనాటి రేపల్లె రంగడు.. ఎక్కడ నేటి ఎస్పి కస్తూరి రంగడు.. ఆ మార్పు నాకు సంక్రమించింది.. చిన్నీ.. నీవల్లే కదా!.. నేను నీకు నా జీవితాంతం ఋణపడివుంటాను.." ఆనందంగా చిన్నీ కళ్లల్లోకి చూచాడు కస్తూరి రంగ.


అతని కళ్లనుండి రాలిన కన్నీటిబొట్లు చిన్నీ చెక్కిళ్లను తడిపాయి.

"ఏంటి ఈ కన్నీరు.." అందోళనగా ఆడిగింది చిన్నీ.


"చిన్నా.. అవి కన్నీరు కాదు.. ఆనందభాష్పాలు.. నేడు మనస్సు నీ సాన్నిధ్యంలో ఎంతో ఆనందంగా వుంది.." పరవశంతో చెప్పాడు కస్తూరి రంగ.


"అలాగా!.."

"అవును.."

"కారణం ?.."

"నీకు తెలియదా?..".


"కొంచెం సందేహం.."

"ఏమిటది?..”.

"ఆ ఆనందానికి కారణం?..”

“నన్ను రెండు సంవత్సరాల క్రిందట తన వాణ్ణి చేసుకొన్న నా హృదయరాణితో ఈ చిన్ని ఏకాంత సాన్నిధ్యం..


“అంతేనా!..”

"అవును చిన్నీ!.."


“మరేం లేదా?..”

కొన్ని క్షణాలు ఆలోచించాడు రంగా..


చిన్నీ ఆంతర్యం అతనికి అర్థం అయింది .. నవ్వుతూ..

"చిన్నీ.."


“ఆ.. చెప్పండి!..”

“చెప్పనా!..”


“ఎన్నిసార్లు అడగాలేంటీ?..” గోముగా అడిగింది చిన్ని.

“నీ కడుపులో ఉన్న మన వంశాంకురం!.. అవును కదూ..” గలగలా నవ్వాడు రంగ.


ఆనందంతో చిన్నీకూడ నవ్వింది..

ఇరువురి నవ్వులు పువ్వులైనాయి.. సుగంధాన్ని వెదజల్లాయి.

"రంగా!.." లాలనగా పిలిచింది చిన్నీ..

అలా చిన్నీ రంగాను తన మనస్సుకు ఎంతో సంతోష పారవశ్యం కలిగినపుడే పిలుస్తుంది.

"ఆ.."


"నీకు ఏ బిడ్డ కావాలి?..”

"నీకు..”

“ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా!.." చిరునవ్వుతో పలికింది చిన్నీ.


“నాకు ఎవరైనా ఒకటే !..”

“ఒకవేళ ఇద్దరైతే!..”


“పదికోట్ల లాటరీ గెలిచినంతగా సంతోషిస్తాను.. నీవుచెప్పు.. నీకు ఎవరంటే ఇష్టం?..”

“నీవంటే..” గలగలా నవ్వింది.


"ఆహా.. అర్థం అయింది.." నవ్వుతూ చిన్నితో శృతి కలిపాడు రంగ.

"లైట్ ఆర్పు.. నిద్ర వస్తూవుంది.." చెప్పింది చిన్ని..

రంగా బారు లైటు ఆర్పి బెడ్ లైట్ ఆన్ చేశాడు.

ఇరువురూ ప్రశాంతంగా.. పరవశంతో.. ఆనందంగా.. శయనించారు..


మరుదినం.. ఏడుగంటలకు లేచారు. దంతధావనం చేసి.. కాఫీ సేవించారు.

స్నానం.. డ్రస్ మార్పు చేసి టిఫిన్ తిన్నారు.


టాక్సీలో మైసూరు బయలుదేరారు..

మైసూరు మహారాజా ప్యాలెస్.. బృందావన్ గార్డెన్స్.. చామరాజేంద్ర జూ.. చాముండేశ్వరి ఆలయం.. యస్.టి ఫిలోమినస్ కేథడ్రల్, రంగనతిట్టు బర్డ్స్ శాంచురీ.. మరి కొన్నింటిని రెండు రోజులు అక్కడవుండి ఆనందంగా చూచారు. రెండవరోజు నైట్ హాల్ట్ బెంగుళూరు.. అదే హెూటల్ అన్నపూర్ణ.. హాల్ట్ మరుదినం.. లాల్ బాగ్.. బన్నేరుగుట్ట.. బయోలాజికల్ పార్కు.. ఇస్కాన్ ఆలయం.. ఫ్రీడమ్ పార్కు.. టిప్పుసుల్తాన్ ప్యాలెస్.. బెంగుళూరు ప్యాలెస్.. రెండు రోజులుండి చూచారు. మనస్సుకు నేత్రాలకు ఎంతో ఆనందం.


రెండవరోజు రాత్రి భోజనానంతరం.. ఇరువురూ పడకపై వాలారు..

"రంగా!.." మెల్లగా పిలిచింది చిన్ని.


“ఆ.. చిన్నీ.. చెప్పు..”

"రేపు మనం ముంబై వెళుతున్నాం గదూ.."


"అవును.."

"మీరు హైదరాబాద్ వెళ్లవలసింది?.."


"ఆఫ్టర్ టూ డేస్!.. మండే!..”.

" ఆ ప్రోగ్రామ్ మార్చుకోలేవా?.."


రంగా వెంటనే జవాబు చెప్పలేదు.. కొన్ని క్షణాల తర్వాత..

“చిన్నీ.. ప్రతివారం.. నేను వీక్ ఎండ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని నీకోసం ఢిల్లీ వస్తాను.." అనునయంగా చెప్పాడు.


“నాకు తెలుసు!.."

“ఏం తెలుసు?”

“మీరు రాలేరని!..” విచారంగా చెప్పింది చిన్నీ.


“చిన్నీ.. అలా ఎందుకనుకొంటున్నావ్?.. హైదరాబాద్ టు ముంబై రెండు గంటల ప్రయాణం.. తప్పక వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను" అనునయంగా చెప్పాడు రంగా..


"రంగా!..నీవు పట్టుకోబోయే వారినందరినీ చంపుతావా?..”

“నో.. నో.. పట్టి వారిని కోర్టుకు అప్పగిస్తాను. వారుచేసిన తప్పులకు తగిన శిక్ష కోర్టే విధిస్తుంది.”


“భూషణకుమార్.. దుర్గాదేవీలను నేను కలవాలి.. కొన్ని మాటలను నేను వారిని అడగాలి.." చిన్నీ కళ్లల్లో ఆవేదన.


"తప్పకుండా!.. వారిని నీ ముందు నిలబెడతాను చిన్నీ.. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని.. తన చేతిని ఆమె చేతిలో వుంచాడు రంగా.. చిన్నీ కళ్లల్లో సంతోషం.. మెరుపు..


మరుదినం వారు తొమ్మిది గంటలకు కెంప్ గౌడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరి బెంగుళూరు నుండి ఢిల్లీకి బయలుదేరారు. శశాంక్ వారిని ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకొన్నాడు..


శని ఆదివారాలు అందరికీ లీవు రోజులు. చిన్నీ రంగలు వారు బెంగుళూరు మైసూర్లలో తీసిన ఫొటోలను అందరికీ చూపించారు. అందరూ ఆ రెండు రోజులూ ఆనందంగా గడిపారు.

ఆదివారం.. సాయంత్రం.. సోమవారం డ్యూటీలో చేరేటందుకు రంగా బయలుదేరాడు. శశాంక్ అతన్ని ఎయిర్పోర్టులో ఆరుగంటలకు డ్రాప్ చేశాడు.

***

యస్.పి.. కస్తూరి రంగ.. కాన్ఫరెన్స్ హాల్లో ప్రవేశించాడు. ఆఫీసర్స్ అందరూ లేచి వారికి విష్ చేశారు. రంగా తన స్థానాన్ని చేరి కూర్చున్నాడు. అందర్నీ పరీక్షగా చూచాడు. "ఇది మామూలు కాలం కాదు కరోనా సెకండ్ వేవ్ కాలం.. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి.." అంటూ ప్రారంభించాడు.


"మహానాయకుల ఆదేశానుసారం.. మనదేశంలో ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ..” ఆస్ట్రోజెనికా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్.. మరియు కోవాక్సిన్ వ్యాక్సిన్లు కరోనా నిరోధానికి తయారు చేయబడ్డాయి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు జనవరి 16, 2021న వ్యాక్సిన్ జనాలకు ఇవ్వడం ప్రారంభమయింది. మార్చి 4 తేదీ నాటికి దాదాపు 1.80 కోట్లమంది.. ఫ్రంట్ వర్కర్లు.. హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1వ తేదీనుండి ప్రైవేట్ కేంద్రాల్లోను వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది.


వ్యాక్సినేషన్ల తయారీ విధానాలు.. రెండు..

1. కొవిషీల్డ్: కొవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ టీకా. చింపాంజీలలో బలపడిన సాధారణ జలుబు వైరస్ (అడెనోవైరస్) సార్స్ కోవ్-2 యొక్క స్పైల్ ప్రొటీన్ యొక్క జన్యు పదార్థాన్ని తీసుకొని ఈ వ్యాక్సీన్ ను అభివృద్ధి చేశారు.

2.కొవాక్సిస్ సార్స్-కోవ్-2 (స్ట్రెయిన్: ఎన్ఐవి-2020-770) వైరస్ నుంచి తయారయింది..

కొవిషీల్డ్.. కొవాక్సిస్.. లలో వుండే రసాయన పదార్థాలు:


1.కొవిషీల్డ్

(ఎ)ఎల్-హిస్టీడిన్ ఇథనాల్ (బి) ఎల్-హిస్టీడిన్ హైడ్రోక్లోరైడ్ మోనా హైడ్రేట్. (సి)మెగ్నీషియమ్ క్లోరైడ్ హెక్సా హైడ్రేట్ (డి) పాలి సొర్బెట్ 80° (ఇ) ఉసుక్రోజ్ (ఎఫ్)సోడియం క్లోరైడ్ (జి) డి సోడియం ఎడెటేట్ డైహైడ్రేట్ (ఇడిటిఎ) (హెచ్) ఇంజక్షన్ కోసం నీరు.


2.కొవాక్సిన్

(ఎ) అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్. (బి) ఇమిడా జోక్వినోవినోన్ (టిఎల్ఆర్7/8 అగోనిస్ట్) (సి)2-ఫినాక్స్ థెనాల్ (డి) ఫాస్ఫేట్ బఫర్ సెలైన్.


నిల్వవుంచే విధానం:

రెండు వ్యాక్సీన్లు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ లో నిల్వచేయడంతో పాటు రవాణాలో కూడ కావాల్సిన ప్రదేశానికి పంపవచ్చును.

డోసెస్:

1. కొవిషీల్డ్

12 వారాల వ్యవధిలో డోసులుగా ఈ వ్యాక్సీన్ ఇస్తారు.

మనదేశానికి చెందిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిసి (డిసిజిఐ) రెండు డోసులకు మధ్యన వ్యవధి 4 వారాలు ఉంటే సరిపోతుందని సూచించింది.


2. కొవాక్సిన్

కొవాక్సిన్ కూడ రెండు డోసుల మధ్య కాలవ్యవధి 4 వారాలు ఉంటే సరిపోతుంది.

ఫలితాంశం: కొవిషీల్డ్ నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులు పూర్తి చేసికొన్నట్లయితే దాదాపు 70 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. కొవాక్సిన్ అదే నాలుగు వారాల వ్యవధిలో రెడు డోసులు పూర్తిచేసుకొన్నట్లయితే 81 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. వైద్యుల పర్యవేక్షణలో పై రెండులో ఏది తీసుకొన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెసిస్టెన్స్ పవర్ ఇస్తాయి. అందరూ వ్యాక్సీన్ వేసుకోండి..


ప్రియసోదరులారా!.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవరు ఏపని చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా వుండాలి. దేహ ఆరోగ్యం సవ్యంగా వుంటేనే ప్రతి ఒక్కరూ వారివారి దినచర్యలను సమర్ధవంతంగా నెరవేర్చ కలుగుతారు. ఎవ్విరివన్ టేకోకేర్ ఆప్ యువర్ హెల్త్.. మీకు వచ్చే సందేశాలను అనుసరించి మీరు వర్తించండి. నేరస్థుల నక్కవినయాలకు మాయమాటలకు.. చూపించే డబ్బుకు లొంగిపోయి వ్యక్తిత్వాన్ని అమ్ముకోకండి. అలా ఎవరైనా తప్పుగా అడ్డదారిన నడిస్తే.. వారి కథను నిర్దయగా.. ముగించేస్తాను.


కంచే చేను మేసిందనే పాత సామెత నాకు నచ్చదు..

మీరంతా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు.. ఇతవరకూ నేను చెప్పిన కరోనా వ్యాక్సిన్స్ గురించి ప్రశాంతంగా విన్నందుకు నాకు చాలా సంతోషం.. మనం రోజూ ఆడే నాటకం పేరు.. 'నేరము.. శిక్ష.. ' నేరాన్ని.. చేసిన నేరస్థుడుని శిక్ష తప్పక అనుభవించేలా చేయడం మనందరి కర్తవ్యం.. జైహింద్.. జైజై భారత్.." చిరునవ్వుతో తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు యస్.పి. కస్తూరి రంగ, అందరూ ఆనందంగా బఫె డిన్నర్ చేశారు.

కస్తూరి రంగాతో కరచాలనం చేసి గుడ్నైట్ చెప్పి వెళ్లిపోయారు.

డి.యస్.పి. వసంత్ దేశాయ్ చిరునవ్వుతో నిలబడివున్నాడు.

"హా!.. దేశాయ్ సాబ్.. హమారా స్పీచ్ బోర్ థా క్యా?..


“లేదు సార్.. కరోనా కోసం మన సైంటిస్టులు చేసిన ప్రయోగాలు కనుగొన్న వ్యాక్సిన్స్.. వాడిన వారి వివరాలు.. ఫలితాలను గురించి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకొననివారు తప్పకుండా వేయించుకొంటారు..


"అందరూ బాగుండాలి వసంత్ !.."

"అవునుసార్.."

"మీకు వివాహం అయిందా!..".

"లేదు సార్!.."

“వయస్సు ఎంత?..”

"ముప్పై రెండు.."

"లవ్ ఫెయిల్యూరా?!..

"కాదు సార్.. వెయిటింగ్ ఫర్ లవర్.." నవ్వాడు వసంతదేశాయ్.


"వెయిటింగ్.." ఆశ్చర్యంగా అడిగాడు కస్తూరి రంగ,

"యస్సార్!.. నా అత్తకూతురు ఫైనల్ ఇయర్ యం.బి.బి.యస్., సార్!..".

"ఓహెూ!.. అదా సంగతి!.." ఆనందంగా నవ్వాడు రంగ.

“యస్ సార్!..”


“ఆమె ఎక్కడ చదువుతోంది?.."

"చెన్నై.. శ్రీరామచంద్రా మెడికల్ కాలేజీ సార్!..”

"ఓకే..ఓకే.. ఐతే నెక్స్ట్ ఇయర్ వివాహం అన్నమాట!..".

“అవును సార్!.."


"అవునూ!.. వీరిరువురూ ఎందుకున్నారూ.." ప్రక్కగా నిలబడిన వారిని చూచి అడిగాడు కస్తూరి రంగా.


"సార్!.. వీరూ మన టీమ్ సార్!.. వారి పేరు యాదగిరి.. ఆవిడ పేరు.. సుగంధి.. ఇరువురూ డి.యస్.పీస్ సార్.."

వారు వినయంగా సెల్యూటిచేశారు..


“ఓకే.. మీరు వెళ్లండి.. మీరు ఏంచేయాలో వసంత్ చెపుతాడు.. గుడ్నైట్.."

వారు వెళ్ళిపోయారు.

"ఆ వసంత్..”

“చెప్పండి సార్!..”

"రేపు మనం రేపల్లె వెళుతున్నాం..

"ఎపుడు సార్.."

"ఉదయాన్నే ఐదుగంటలకు బయలుదేరుదాం.. విజయవాడలో టిఫిన్ తొమ్మిదన్నరకు.. పదకొండు గంటల లోపలే రేపల్లె చేరిపోతాం..".

"అలాగే సార్.."


"మీరు రెడీగా ఐదుగంటలకు వుండండి.. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొంటాను.. మనం ఆ ప్రాంతంలో రెండు మూడురోజులు ఉండాల్సి వస్తుంది.."


"అలాగే సార్.." ఇరువురూ రంగా కారును సమీపించారు. కూర్చున్నారు. రంగా కారును స్టార్ట్ చేశాడు.. వసంత్ ను అతని ఇంటివద్ద దించి తన రూమ్ కు చేరాడు కస్తూరి రంగ..

ఇంకా వుంది...

కస్తూరి రంగ రంగా ఎనిమిదవ భాగం త్వరలో..

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



41 views0 comments

Comments


bottom of page