'Katna Pisachi' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 08/11/2023
'కట్న పిశాచి' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
దాత దక్షిణ ఈయవద్దని
వరుడు డబ్బులు కోరవద్దని
విప్రుడా మంత్రం చదువ వద్దని
చట్టాలెన్నో వ్రాసిపెట్టిరి కాగితాలలో
కట్టిపెట్టిరి వాటి నన్నిటిని బట్ట మూటలో
పుట్టుక తోటే ఆడపిల్లలు
కట్టుబాటుతో పెరుగుచుందురు
ఈడు వచ్చి రాగానే చేతురు వారు
తల్లికి తోడుగ ఇంటిపనులు వంటపనులు
ఆడపిల్లకు జోడుకొరకై
జాడలెన్నో తీసి తండ్రి
తనకు అల్లుడు తగిన వాడని
చదువు సందెలు నేర్చినాడని
కులం మతం కుదిరిందని
జాతకాలు కలిశాయని
పట్టలేని ఆనందం తో
పట్టికి కలిగిన అదృష్టానికి
పెట్టించును పెద్దలతో పెళ్ళి ముహుర్తం.
అప్పుడే
కట్న పిశాచి కళ్ళు దెరుచును
వరుని తండ్రిని ఆవహించును
దాక్షిణ్యం దారి తెలియక
దక్షిణ తెమ్మని దబాయించుచు
కనికర భావం కలుగబోదను
వియ్యంకునితో సదా నెయ్యం గోరుచు
ఉన్నదంతా ఊడ్చి పెట్టినా
వరుడు మాత్రం మరువడెప్పుడు
మామను కోరుట మామూళ్ళు
తను గూడా తండ్రినగుదునని
అల్లునికెప్పుడొ మామ నగుదునని
ఆలోచించడు అవివేకం వదలడు
పరాన్న భుక్కై శరాన్ని దలువడు.
-------------------------
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
కవిత ను ఎంతో చక్కగా వివరించారు 👌