'Katte Vampu Poyyi Tirusthundi' - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 13/06/2024
'కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది' తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పూర్వం కళింగ రాజ్య సరిహద్దుల్లో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఏపుగా పెరిగిన చెట్లు, లావు పాటి వృక్షాలు, చింపిరి మొక్కలు, తుప్పలు, డొంకలు, వంకరటింకరగా ఉండే చెట్లు ఎన్నో ఉన్నాయి.
వంకరటింకరగా ఉండే చెట్లు, వాటి కొమ్మలు, ఏపుగా, తిన్నగా పెరిగే చెట్లను చూసి “మీరు తిన్నగా లావుగా ఉన్నారు. గృహోపకరణాలకు మీరు బాగా ఉపయోగ పడతారు. మనుషులు మిమ్మల్నే ముందుగా నరుకుతారు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు హాయిగా ఇక్కడే ఉండొచ్చు.” అన్నాయి పకపకమని నవ్వుతూ.
‘కాలమే సమాధానం చెప్తుందిలే’ అని మనసులో అనుకుని మౌనం దాల్చాయి ఏపుగా పెరిగిన మొక్కలు. కాలం గడిచింది. అడవికి సమీపంలో ఉండే గ్రామస్తులు కలప కోసం అడవికి వెళ్ళారు. వారిలో వీరేసు ఒకడు. వాడికి ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది. దాని కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని అన్నిటినీ ఒక మోపుగా కట్టి ఇంటికి పట్టుకెళ్లాడు. మర్నాడు వీరేసు భార్య వంట చెయ్యడానికి సిద్ధపడింది. మోపులో తిన్నగా ఉన్న కర్రలను తీసి పొయ్యిలో పెట్టి మంట పెట్టింది.
అది చూసిన వంకర కర్రలు “భలే భలే మీకు మంచి పని అయ్యింది.” అని నవ్వేయి.
పాపం కాలిపోతూ కన్నీళ్లు కార్చాయి తిన్నగా ఉండే కర్రలు. రోజులు గడిచాయి తిన్నగా ఉండే కర్రలన్నీ అయిపోయాయి.
“ఏమయ్యా ఇలాంటి కర్రలు నేనెట్టా పొయ్యిలో పెట్టాలి. వంట ఎలా చేసేది?” అని వీరేసుని గదమాయించింది భార్య వీరమ్మ.
“పొయ్యిలో పెట్టీ నిప్పు పెడితే ఆ కట్టె వంపు పొయ్యే తీరుస్తాది.” అన్నాడు వీరేసు.
భర్త చెప్పినట్లు వంకరటింకగా ఉన్న కర్రలన్నీ పొయ్యిలో పెట్టి నిప్పురాజేసింది. వంట పూర్తి అయ్యేసరికి కట్టె వంపులన్నీ పోయి పొయ్యిలో బూడిదగా మిగిలాయి వంకరటింకగా ఉన్న కర్రలు. నాటినుంచి “కట్టె వంపు లేదా కర్ర వంపు పొయ్యి తీరుస్తుందనే” సామెత వాడుకలోకి వచ్చింది.
పిల్లలు బాగా అల్లరి చేసే సందర్భంలో విసిగిపోయిన తల్లిదండ్రులు “బడికి వెళ్తే నీ ఆటలు కట్టిస్తారు” అనే సందర్భంలోనూ, ఆకతాయిల ఆగడాలు ఎక్కువైన సందర్భంలో “పోలీసులు రంగప్రవేశం చేస్తే మీ ఆటలు వాళ్ళు కట్టిస్తారు” అని చుట్టుపక్కల ప్రజలు అనుకునే సందర్భంలో ఈ సామెత వాడతారు. ఎంత వంపు కర్ర అయినా పొయ్యిదగ్గర లొంగినట్లు ఒక్కొక్కరు ఒక్కోచోట లొంగక తప్పదని, అది కాలమే అది నిర్ణయిస్తుందని ఈ సామెత అర్థం.
కాలమే సమాధానం చెప్తుంది అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
コメント