top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

కవితా స్వప్నం


'Kavitha Swapnam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 14/11/2023

'కవితా స్వప్నం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


కవిత వ్రాయ బూని

కలము చేబట్టగానె

భావ మేదియును రాక నా గుండె

బరువుగాగ నపుడు

బల్లెమై జూచె నావంక

తెల్ల కాగితంబు

చిత్తు వ్రాతలు వ్రాసి నా బ్రతుకు

చిత్తు జేయుట యేల యటంచు

ఎదన వ్యథయు గలిగె

నిదుర ముంచుకొచ్చె

మగత నిదురలోనె

మంచి కలలు ఎన్నొ

పెంచి వేసెను భావాలు

నిదుర అంచువరకు

స్వప్న జగతిలోన

స్వర్గధామమె జూస్తి

మేలుకొని జూస్తె నిదురయే

మేలు మేలనినా మది గోలజేయ

తెల్ల కాగితంబపుడు

మల్లె పూవుగ దోచె


-సుదర్శన రావు పోచంపల్లి




30 views0 comments

Comments


bottom of page