'Kavitha' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 06/11/2023
'కవిత' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
కవిత నాలో మేలుకొన్నది
కలము చేత బూనమన్నది
కష్ట జీవుల బతుకులన్ని
కలము చేత జూపుమన్నది
రాత్రి లేక పగలు లేక
ఎల్ల వేళల పొలము పనులలొ
రైతు బతుకల రాతలన్ని
కలము చేత వ్రాయమన్నది
ఎండ వేళలొ కండ కరుగగ
బండ రాతిని పిండి గొట్టి
గుండెలవిసి బతుకు మనుషులపై
దండివారల మొండి తనమును
దాచకుండా చూపుమన్నది
మూడు కాలముల పూట ఎరుగక
మూడు పూటల గూడు వదలి
బీడును పొలముగ చేయు మనుషుల
కడుపు నిండని గాథలన్ని
కవితలోన తెలుపమన్నది
నేతిబీర కాయ మాదిరి
నీతి లేని ఖ్యాతి బెంచుచు
కష్ట జీవుల కడుపుగొట్టి
ఇష్టముగ గాదె నింపు
నీచ బతుకుల పెద్దమనుషులదె
నికృష్ట జీవితమని నిరూపించమన్నది
ఉరికంబం ఎక్కు వానికి
ఉరిపోసుక చచ్చు వానికి
భేదమేమిటొ వ్రాయమన్నది
కవిత నాలో మేలుకున్నది
కలము చేత బూనమన్నది
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments