top of page
Writer's pictureGadwala Somanna

కీలకమైనవి తలపులు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #కీలకమైనవితలపులు, #KeelakamainaviThalapulu


Keelakamainavi Thalapulu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 23/12/2024

కీలకమైనవి తలపులుతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


బలమైనవి తలపులు

చురుకైన మెరుపులు

మంచివైతే శుభములు

లేక హానికరములు


శుద్ధమైన తలపులు

ఆదరించు పలుకులు

నలుగురికి సాయపడి

బాగుచేయు బ్రతుకులు


మహనీయుల తలపులు

చేయునోయి మేలులు

చూడంగా  ప్రగతికి

అసలుసిసలు బాటలు


పనికిరాని తలపులు

పాడుచేయు మనసులు

సమాజానికి ముప్పు

తగలబెట్టు నిప్పులు


శ్రేష్టమైన తలపులు

కలిగియున్న మంచిది

లేకుంటే కష్టము

తెచ్చిపెట్టు నష్టము


-గద్వాల సోమన్న



14 views0 comments

Comments


bottom of page