కోడి మెదడు
- Sudarsana Rao Pochampalli
- Oct 29, 2023
- 2 min read

'Kodi Medadu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 29/10/2023
'కోడి మెదడు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అనుమయ్య తనకు తానే అనుకుంటాడు తనకు మెదడు చిన్నగ ఉన్నదనుకొని. కారణం తనతో ఎవరు ఏది వ్యంగ్యముగా మాటాడినా సమయస్పూర్తి కరువై వెంటనే తగిన సమాధాన మీయ లేని దుస్థితి. ఏదైనా పుస్తకము చదివినా చలన చిత్రము చూసివచ్చినా ఆ కథ ఏమిటో వెంటనే చెప్పలేడు, మూడు నాలుగు సార్లు పుస్తకము చదువుడో చలనచిత్రమైనా చాలా సార్లు చూస్తే తప్ప.
అందరూ పండిత పుత్ర శుంఠ అని అనుకుంటుంటె బాధ పడేది అనుమయ్య. ఎందుకంటే అనుమయ్య తండ్రి భీమయ్య చాలా తెలివిగలవాడుండెడిది . కొడుకు బలహీనత గ్రహించి పది ఎకరాల పొలము మంచి ఇల్లు సమకూర్చి కాలధర్మం చెందుతాడు భీమయ్య.
చనిపోయే ముందే సూరమ్మ అనే తెలివిగల అమ్మాయితో పెళ్ళి చేస్తాడు అనుమయ్యకు భీమయ్య.
అనుమయ్య భార్య సూరమ్మ కొంత తెలివిగలది గనుక సంసారాన్ని నెట్టుక వస్తుంటది. ఇద్దరు పిల్లలు- కూతురు అగజాత, కొడుకు శరధి.
తనకు చదువు కూడా అబ్బలేదు కనుక కూతురును, కొడుకును బాగా చదివిస్తాడు అనుమయ్య. దానికి సూరమ్మే ఎక్కువ కష్టపడుతుంది.
పొలము పనులు చేయించాలన్నా, ఏ కారులో ఏ పంట వేస్తె పంట బాగుగా పండుతుందో ఆలోచించడు అనుమయ్య. కొడుకు శర్ధి భార్య సూరమ్మే వాళ్ళను వీళ్ళను సంప్రదించి తగిన తీరు విత్తనాలు వేయించుతుంది.
ఒకనాడు తీర్థ యాత్రలకని హనుమయ్య, సూరమ్మ, కూతురు అగజాత కొడుకు శరధి కలిసి తిరుపతికి పోతారు. నడిచి గుట్ట మీదికి ఎక్కుతె పుణ్యము అని నడక దారిన మెట్లు ఎక్కుతూ పోతుంటారు. దారి లో బండలమీద ఎందరివో పేర్లు చెక్కి ఉంటాయి. అది చూసి దారిన పోయే వారితో అడుగుతాడు
ఇలా నడక బాటలో పరచిన రాళ్ళ పై పేర్లు చెక్కడమేమి అని.
కొంత మంది ఏ పుణ్యాత్ముడిదో కాలు పడితే తమకూ పుణ్యమొస్తుంది అనుకొని చెక్కించుకుంటారు అని చెబుతారు. అనుమయ్య అనుకుంటాడు తనపేరుకూడా చెక్కించుకుంటె బాగుంటుంది అని. ఈ సంగతి సూరమ్మకు చెబుతాడు . సూరమ్మకు కొంత విసుగనిపిస్తుంది అనుమయ్య మాటలకు.
“నీ వోలె కోడి గూడా అనుకుంటుందట తన మాంసము ఏ పుణ్యాత్ముని పంటికింద పడుతుందో తనకూ పుణ్య మొస్తుతుందని . దీనినే ‘కోడి మెదడు’ అంటారు” అంటుంది సూరమ్మ.
అనుమయ్య కొంత మనసుకు బాధ పడి “సరె పదండి, పైకి పోయి ఆ దేవుని దర్శించుకొని పుణ్యము రావాలని ఆ దేవుణ్ణే మొక్కుకుంట” అని తిరుమల పోయి దైవ దర్శనము చేసుకొని ఇంటి బాట పడుతారు నలుగురు.
కూతురు, కొడుకు అంటరు తండ్రితో “నాయనా! పుణ్యము అనేది మంచి పనులు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో లేదా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటేనో లభిస్తుంది. దేవుడు ఒక్క తిరుపతిలోనే లేడు. మన ఇంట్లో దేవుని గుడి అంటూ ఉన్నదిగద. మన ఊర్లో గుడి ఉన్నది. ప్రపంచములో ప్రతి చోట వారి వారి నమ్మకము అనుసారము గుడినో, మసీదునో, చర్చినో కట్టించి పూజిస్తారు. నువ్వు చూసినప్పుడే కద మన ఊరిలో ఒక బండ రాయితో శిల్పులను పిలిపించి చెక్కించింది. అంటే ఆ రాయిలో దేవుడు లేడు. మనము నమ్మిన ఆకారము రాముడో, శివుడో, హనుమంతుడో, కాళీ మాతనో చెక్కించి దేవుడని పూజిస్తాము. అంటే ఆ దేవుడే మనలో ఉన్నాడన్నమాట”.
ఇదంతా వింటుంటె ‘ఈ జ్ఞానమంతా తన పిల్లలు చదువుకుంటే తెలిసిందన్న మాట’.
అప్పుడనుకుంటాడు ‘చదివితే తెలివి వస్తుంది . తెలివితో డబ్బు సంపాదించవచ్చు. డబ్బుతో దాన ధర్మాలు చేయవచ్చు. ఆపన్నులను ఆదుకొనవచ్చు’ అని.
ఆలోచనకు వచ్చుడే తడవుగా అనుమయ్య పెద్దవారికి రాత్రిపూట చదువుచెప్పేవారి దగ్గరకు పోయి అందులో చేరుతాడు.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentarios