top of page

కొడిగట్టిన అల్ప జీవులు

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #కొడిగట్టినఅల్పజీవులు, #KodigattinaAlpaJivulu, #TeluguComedyStories, #TeluguSpecialArticle, #సామాజికసమస్యలు


Kodigattina Alpa Jivulu - New Telugu Article Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 24/11/2024

కొడిగట్టిన అల్ప జీవులు - తెలుగు వ్యాసం

రచన: కందర్ప మూర్తి


అల్ప జీవులు, ఔను నిజంగానే అల్పజీవులు. జీవితంలో నా అనేవారు, లాలించే వారు, పోషించే వారు లేక తిండి గుడ్డ గూడు లేని అల్పాయుష్కులు వారు. 


పెద్ద నగరాలు, పట్టణాలలో రాత్రి పగలు ఫుట్ పాత్ ల మీద వంటి మీద సరైన బట్టలు, అర్థాకలితో సరైన పోషణ లేక బక్కచిక్కి కేశ సంరక్షణ లేక చర్మ వ్యాధులు ఎముకల గూడు శరీరంతో చావ లేక బతుకుతున్న బడుగుజీవులు కానొస్తారు. 


పట్టణాలు నగరాల్లో అంతస్థుల భవంతుల్లో ఉంటూ, స్టార్ హోటళ్లలో ఎ. సి. రూముల్లో మందు విందు భోజనాలతో భారీ శరీరాలతో మజా చేసే బడా బాబులుండే చోటే రోడ్ల మీద గాలికి ధూళికి పెరుగుతు అర్థాకలితో బక్క చిక్కిన బడుగు ప్రాణులూ ఉంటున్నారు. 


ఎక్కడ పుట్టారో, అమ్మానాన్నలెవరో, తోబుట్టువులు ఉన్నారో లేదో తెలియని బతుకులు వారివి. పిలవడానికి పేరంటు ఉందోలేదో తెలియదు. 


పగలంతా అక్కడా ఇక్కడా తిరిగి దొరికింది తిని రాత్రిళ్ళు పెద్దవ్యాపార కూడళ్లు, బస్టాండ్లు, పబ్లిక్ పార్కులు, రోడ్డు, బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు వారి నివాస స్థానాలు. 

 

చలికాలమైనా ఎండా కాలమైనా వర్షా కాలమైన వారి కదే విడిది. చలికాలంలో చిరిగిపోయిన బట్టలతో చలికి తట్టుకోలేక కాళ్లు ముడుచుకుని ఏ పాత న్యూస్ పేపరో.. సినేమా ఫ్లెక్సీలాంటిది కప్పుకుని గోడో ఫ్లెక్సీ బోర్డు పక్కనో పడుకుంటారు. చల్లదనానికి ఊపిరి సంబంధ జబ్బులున్న వారు రాత్రంతా దగ్గుతూనే ఉంటారు. ఉపశమనానికి బీడీయో, సిగరెట్ ముట్టిస్తారు. 


వేసవిలో ఐతే బస్టాండ్ బెంచీలు వ్యాపార దుకాణాలు మూసిన తర్వాత షట్టర్ల ముందు పడుకుంటారు. దోమలు ఇతర కీటకాలు వారి దోస్తులు. కడుపు నిండే వరకూ శరీరాలపై కొలువు దీరుతాయి. 


వీరి వల్ల మున్సిపాలిటీ సిబ్బందికి పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతాయి. ఈ ఫుట్ పాథ్ జీవుల్లో అన్ని వయసుల వారు ఉంటారు. 


పురుషులే కాదు మహిళలు కనబడతారు. మహిళలకు కొందరు బాసటగా ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలు అంటే వ్యభిచారం, దొంగతనాలు, తండ్రులెవరో తెలియని

పసిపిల్లలతో బిచ్చగాళ్లగా సంపాదన చేస్తూంటారు మహిళలు. 

 

మరికొందరు పగలు గోనె సంచి పట్టుకుని వీధులంట తిరిగి ప్లాస్టిక్ వస్తువులు కాగితాలు ఏరి పాత పేపరు అడ్డాల వద్ద అమ్మి బ్రతుకు వెళ్లదీస్తారు. ఇటువంటి మహిళలు అనేక

సంక్రమిత ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధులతో బాధ పడుతు ఇతర పురుషుల్ని రోగాల పాలు చేస్తారు. మరికొంత మంది పురుషులు హోమో సెక్స్వల్సుగా మారుతారు. 


వీధులంట చెత్తా చెదారం ఏరి బ్రతికే వారిలో అనేక వైరల్ రోగాలు ప్రబలే అవకాశం ఉంది. వీరు వ్యర్థాలు సేకరించేవాటిలో హాస్పిటల్ ఇతర ప్రమాదకర వస్తువులు ఉంటాయి. చేతికి ఎటువంటి రక్షణ తొడుగులు ఉండవు. అదే చేతులతో ఆహార పదార్థాలు తింటారు. 


పాత రోజుల్లో రక్తం ఇవ్వడానికి బ్లడ్ డోనర్స్ అందుబాటులో లేక రిక్షాపుల్లర్స్ హోటల్ సర్వర్స్ తో పాటు ఫుత్ పాత్ మీద బతికే వారి నుంచి వ్యాపార దృక్పధంతో నడిపే బ్లడ్ బ్యాంకులవారు డబ్బుకు రక్తం సేకరించ వల్సి వచ్చేది. అటువంటి వారిరక్తంలో హెమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండటమే కాకుండా లైంగిక శంక్రమిత రోగాల ముప్పు ఉండేది. 


వీరిలో కొంతమంది మానసిక రోగులు ఉంటారు. వారు పిచ్చి వాళ్లలా అటుఇటు తిరుగుతూంటారు. వారేం తింటారో తెలియని పరిస్థితి. మల మూత్రాదులు బట్టల్లోనే చేసుకుంటారు. 


 కొందరు శరీర వికలాంగులు బస్ అడ్డాల వద్ద రైల్వే స్టేషన్లు వద్ద నివాసం ఏర్పరచుకుని బెగ్గర్స్ మాదిరి బతుకు వెళ్లదీస్తారు. 


కొంతమంది కుర్రాళ్లు గంజాయి వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాటి కోసం అనేక పాట్లు పడుతూంటారు. ఇటువంటి వారిని ఎన్నుకుని కొన్ని అసాంఘిక శక్తులు మాదకద్రవ్యాల్ని అక్రమ రవాణాకు వినియోగిస్తారు. 


ఈ అల్ప జీవుల జీవన ప్రమాణం అల్పమే. మురికి కూపంలో పుట్టిన కీటకంలా ఆకలి, రోగాలు, వాతావరణ పరిస్థితుల వల్ల వీరి బతుకులు తెల్లారిపోతాయి. 


నా అనేవారు ఒక్కరు ఉండరు. చనిపోతే ఒక కన్నీటి చుక్క కార్చే వారుండరు. రోడ్డు మీద మృత జంతు కళేబరాల్లా మున్సిపాలిటీ లారీలో పడేస్తారు. 


ఇటువంటి అల్పజీవుల్ని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేరదీసి మనుషులుగా మార్చి వారి జీవితాలకు ఒక దారి చూపాలి. ఎవరో విదేశీ వి ఐ పి లు వచ్చినప్పుడు వారిని ఎక్కడో దాచి తర్వాత గాలికి వదిలేస్తే ప్రయోజనం లేదు. ఊరు పేరు లేని అనామకులు వారూ మనుషులే. వారి తలరాత అలా మారింది. 


సర్వ్ నీడీ, రాబిన్ హుడ్ బ్రిగేడ్ వంటి స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో దాతల సాయంతో ఇటువంటి అల్పజీవుల ఆకలి తీరుస్తున్నందుకు వారిని అభినందించాలి. 


 "సర్వే జనః సుఖినోభవంతు" నినాదం సాకార మవాలి. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


37 views0 comments

Comments


bottom of page