కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Kolpoyina Sweccha' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
రవి సినిమాకి వెళ్ళి ప్రతి రోజూ లేటుగా రావడం అతని తండ్రి హరీష్ రావు గమనించాడు. ఈ విషయాన్ని తన భార్య అయిన శ్యామల దగ్గర చర్చకు తీసుకు వచ్చాడు.
“శ్యామలా! మన రవి ఈ మధ్య సినిమాలు ఎక్కువగా చూస్తున్నాడు. అంతే కాకుండా వాడు కొంత వరకు దురలవాట్లకు అలవాటు పడ్డాడేమో అనే భయం వేస్తుంది. అందుకే వాడికి మనం నచ్చ చెప్పి సినిమాలకి వెళ్లకుండా ఆపాలి” అన్నాడు హరీష్ రావు.
“నిజమేనండీ! వాడు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు” అంది శ్యామల.
“మనం ఏమైనా చేసి ఆపాలి. మరి ఏమి చేద్దాం అంటావు శ్యామలా?” అన్నాడు హరీష్ రావు.
“ముందు మనం మంచిగానే మాట్లాడి చెపుదాము” అంది శ్యామల.
“సరే” అన్నాడు హరీష్ రావు. రవి ఇంటికి వచ్చాడు. అప్పుడు టైం పదిన్నర అవుతోంది.
“ఎందుకు రా లేట్ గా ఇంటికి వస్తున్నావు?” అంది శ్యామల.
“లేదమ్మా! ఫ్రెండ్స్ పార్టీ అంటే వెళ్ళాను..” అన్నాడు రవి.
“సరే కానీ ఇప్పటి నుంచి అయినా కొంచెం ఇంటికి తొందరగా రా రవి” అంది శ్యామల.
“సరే అమ్మా! అలాగే వస్తాను వెళ్ళి పడుకుందాం” అంటూ ఆ రోజును ముగించాడు రవి. ఒక వారం రోజుల పాటు తొందరగా ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునే వాడు. తరువాత రోజులలో కుక్క తోక వంకర అనట్లు కథ మొదటికి తెచ్చాడు రవి. ఒక రోజు రాత్రి తొమ్మిదిన్నర అయినప్పుడు సిగరెట్ కాలుస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక టీ స్టాల్ దగ్గర హరీష్ రావుకు కనిపించాడు రవి.
ఆరోజే రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చాడు. వచ్చిన వాడు కొంచం తూగుతూ, మాటలు సరిగ్గా తిరగక ఏదేదో మాట్లాడతున్నాడు రవి.
కొడుకును అలాంటి స్థితిలో చూసిన శ్యామల “ఏమిట్రా ఇది? ఇంతలా ఎందుకు తాగావు..” అంటూ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చాడు రవి,
“వచ్చి “అమ్మా.. కాఫీ” అన్నాడు.
“సరే! నేను కాఫీ తీసుకువస్తున్నాను” అంటూ చెప్పింది శ్యామల.
కాఫీ తీసుకువచ్చి “ఎందుకు రా అలా తాగి వచ్చావు? నీకు ఏమైనా అయితే ఎలా చెప్పు.. దారి వెంట వచ్చే సమయంలో” అంటూ కన్నీరు కార్చింది.
“అలా ఏమి జరగదులే అమ్మా” అంటూ తప్పించుకున్నాడు రవి.
రవి వెళ్ళగానే హరీష్ రావు గారు “నువ్వు చెప్పింది చాలు కానీ వాడికి తిట్టి చెపితే సరిపోతుంది. అప్పుడే వాడికి అర్థం అవుతుంది” అని కోపంతో అన్నాడు. ఆ మాటలు అన్న తరువాత కాఫీ తాగుతూ పేపర్ చదవసాగాడు హరీష్ రావు.
ఆ న్యూస్ పేపర్ లో నాలుగైదు ఆత్మహత్యలు కనిపించాయి. అందులో మూడు వరకూ తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేదని, తిట్టారని.. ఇలాంటి వార్తలను చూసాడు హరీష్ రావు. కంటి నిండా నీటిని నింపి ‘నేను కూడా కొడితెనో తిడితెనొ నాకొడుకు ఇలా చేసుకుంటే ఏమిటి పరిస్థితి’ అని ఆలోచిస్తూ, “శ్యామలా! మనం మాట్లాడే, తిట్టే, కొట్టే స్వేచ్ఛను ఎప్పుడో కోల్పోయాము. కాబట్టి మనం తిట్టకుండా కొట్టకుండా మంచి మాటలతోనో.. అడిగిన వస్తువులు ఇచ్చో.. మన వాడిని మార్చుకోవాలి కానీ కొప్పడితే తిప్పలు తప్పవు” అని చెప్పాడు.
“సరే అండి! అలానే చేద్దాం” అంటూ శ్యామల చెప్పింది.
నాటి కాలంలో తల్లిదండ్రులకు కొడుకులు కూతుర్లు భయపడే వారు.
నేటి కాలంలో కొడుకులను కూతుర్లకు తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అప్పట్లో తమ మనసులో మాట చెప్పే స్వేచ్ఛ, ధైర్యం పిల్లలకు ఉండేది కాదు.
ఇప్పుడు పిల్లల్ని గట్టిగా ఒక మాట అనే స్వేచ్ఛ, ఇలా చెయ్యకూడదు అని చెప్పే చొరవ పెద్దలకు ఉండటం లేదు.
ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలీని అయోమయ పరిస్థితులలో మునిగిపోయిన నేటి ఆధునిక సమాజంలో, ఇకనుంచి అయినా పిల్లల అవసరాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని, తల్లిదండ్రుల మాటలను పిల్లలు వినాలని కోరుకుంటూ….!!!!
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments