'Kondapalli Matti Bathukulu' New Telugu Kavitha Written By Lakshminageswara Rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
బంకమన్ను ముద్దలు చేసి, పిడచలు కట్టి
బాధలన్నీ తనలో ఇముడ్చుకొని, భారమైన హృదయంతో,
బతుకు తెరువు కోసం, రకరకాల మట్టి బొమ్మలు చేస్తూ,
మట్టిని గట్టిగా పిసికే ఓపిక లేక, తెల్లారే గంజినీళ్లు త్రాగి
'జీవిత చక్రం’ అనే చక్రంలో త్రిప్పుతూ,
బంకమన్ను తో కుండలు చేస్తూ,
కొనేవారు లేక, చల్లని కుండ నీరు మరిచిపోయి,
ఫ్రిజ్జు నీళ్లకు అలవాటు పడి,
పేరుకుపోయిన కొండలన్నీవెర్రి ముఖం వేస్తూ,
ఎవరు కొంటారా? అని ఎదురు చూస్తూ,
ఈ రోజుల్లో స్మశాన వాటిక కు, మనిషి తో పాటు తరలిపోయి,
బద్దలై పోయే తమ జీవితాలను తలుచుకుంటూ
కుండ తో పాటు 'కుమ్మరి' కూడా ఆక్రోసిస్తు,
పోనీ 'మట్టిబొమ్మలు’ చేద్దామంటే
మరబొమ్మలు వచ్చి భారతీయ కళలను అధ: పాతాళానికి త్రోసివేసిన
నేటి సమాజానికి బడుగు జీవుల బాధలను అర్థం చేసుకోమని,
ఈ ప్రాణమున్న మట్టి బొమ్మ లను ఆదుకోమని
మనసారా ప్రార్థిస్తున్నా
మీ..
వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
��������
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
コメント