top of page

'కొసమెరుపు' కథల పోటీ


Kosamerupu Kathala Potee - Telugu Story Competition By manatelugukathalu.com Published On 01/04/2025

'కొసమెరుపు' కథల పోటీ

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్


కథ మామూలుగా ప్రారంభమైనా, చివరన 

'అవునా.. మరోలా అనుకున్నామే..'

'చివరన ట్విస్ట్ బావుంది..'

'చెణుకు కథ అంటే ఇదే..'

'అస్సలు ఊహించలేదు..'

'చివరన మంచి నీతి చెప్పారు'

ఇలా అనిపించే కథలనే కొసమెరుపు కథలు అంటారు.


ఈ కథలు పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి కథలను ప్రోత్సహించడానికి మనతెలుగుకథలు.కామ్ లో 'కొసమెరుపు' కథల పోటీని ప్రారంభిస్తున్నాము.

ఇందుకోసం ప్రత్యేకంగా మీరు కథలు పంపానవసరం లేదు.


01 /04 /2025 నుండి మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమయ్యే కథలనుండి ప్రతి నెలా ఒక కథను 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపిక చేసి 500 /- పారితోషకంగా అందిస్తాము. ఈ పథకం సంవత్సరం పాటు కొనసాగుతుంది.


ఆ సమయంలో నడుస్తున్న (విజయదశమి/ఉగాది) కథల పోటీలలో 'వారం వారం బహుమతులు' గెలుచుకున్న కథలతో పాటు, 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపికైన కథలు కూడా పరిశీలింపబడతాయి.

ఈ కథలు ఎలా ఉండాలో ప్రముఖ రచయితలైన మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక అవగాహన కోసం కొన్ని లింక్స్ ఇస్తున్నాము. (అన్ని కథలు ఇలాగే.. ఇదే మూసలో ఉండాలని కాదు).



ఏప్రిల్ నెలకు ఎంపికైన కథ ఫలితం మే 15 నాటి మా పోస్ట్ లో ఉంటుంది.


ఈ కొసమెరుపు కథల పోటీని శ్రీమతి కర్లపాలెం రుక్మిణమ్మ గారి స్మారకార్థం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.


( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )




Comments


bottom of page