top of page

కోతి పుండు బ్రహ్మ రాక్షసి

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #KothipunduBrahmaRakshasi, #కోతిపుండుబ్రహ్మరాక్షసి, #తెలుగుసామెతలకథలు,

#TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు


'Kothi pundu Brahma Rakshasi' - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham

Published In manatelugukathalu.com On 01/10/2024

'కోతి పుండు బ్రహ్మ రాక్షసి' తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జయ గారాల పట్టి క్రిష్ణ వేణి. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. ఒకరోజు క్రిష్ణ వేణి బడి నుంచి వస్తూ ఉండగా కాలికి చిన్న దెబ్బ తగిలింది. ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళి తల్లికి చెప్పింది. 


“ఇంత చిన్న దెబ్బకి అంతలా ఏడవాలా ఎవరైనా వింటే నవ్వుతారు. ” అని మరిపింతాలు పెట్టి, ఆ చిన్న గాయాన్ని తుడిచి మందు రాసి, దాని మీద దూదిని ఉంచింది. కాసేపటి తర్వాత ఆడుకోవడానికి వేణి స్నేహితురాలు భారతి వచ్చింది. కాలుకు ఏమైంది అని అడుగుతూ గాయం పై ఉన్న దూదిని బయటకు లాగింది. 


ఒక్కసారిగా నొప్పిపెట్టడంతో “అబ్బా” అని అరచింది వేణి.


 దాంతో భయపడిన భారతి ఏమీ ఎరగనట్లు దూది మళ్ళీ గాయం మీద ఉంచి ఇంటికి వెళ్ళిపోయింది. భారతి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీనివాసమ్మ తన దగ్గర ఉన్న పూత మందు పట్టుకుని వేణి దగ్గరకు వెళ్ళింది. 


“మొన్న నా కాలికి దెబ్బ తగిలినప్పుడు మా అమ్మ ఈ మందు రాసింది. ఒక్క రోజులో తగ్గిపోయింది” అని చెప్తూ దూదిని తీసి గాయం మీద మందును రాసింది. 


“మంట, మంట అంటూ అరవసాగింది వేణి. 

“పరవాలేదు కొద్ది సేపు ఓర్చుకుంటే మంట తగ్గిపోతుంది. ” అని ఓదార్చింది శ్రీనివాసమ్మ. 


ఇలా ఒక్కొక్కరూ గాయాన్ని చూసి, వెళ్ళడంతో సాయంత్రానికి నొప్పి ఎక్కువైంది. జయ పొలంపని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి వేణి మూలుగుతూ ఉంది. పక్కనే మేనకోడలు సుశీల ఉంది. 


జరిగినదంతా విని “ఎద్దు పుండు కాకికి నొప్పా? వాళ్లకేం.. పుండు మీద కారం జల్లినట్లు ఇష్టం వచ్చిన మందులు రాశారు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే ఇంతింతై వటుడింతై అన్నట్లు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయ్యింది. రేపు వైద్యునికి చూపిద్దాం. సూది మందు ఇస్తారు, తగ్గిపోతుంది. ” అంది జయ. 


“కోతి పుండు బ్రహ్మ రాక్షసి అంటే ఏమిటో చెప్పవా అత్తమ్మా.” అని అడిగింది సుశీల. 


“భలేగా ఉంది ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూ ఉంటే చుట్ట కాల్చడానికి నిప్పు అడిగాడుట మరొకడు అలా ఉంది నీ వరస.” అంటూ చెప్పడం ప్రారంభించింది జయ. 


“పూర్వం చిత్రకూట పర్వతం పర్వత ప్రాంతం లో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ దగ్గరలో ఉన్న చెట్టుమీద ఒక బ్రహ్మ రాక్షసి నివాసముండేది. 


బ్రహ్మ రాక్షసి ముని ముక్కులో, చెవుల్లో పుల్లలు పెట్టడం, జుట్టు పీకడం లాంటి కోతి పనులు చేసి తపోభంగం కలిగించేది. 


దాంతో కోపోద్రిక్తుడైన ముని ‘నా తపస్సుకి భంగం కలిగించి నన్ను ఎంతో బాధపెట్టావు కాబట్టి ఇక నుంచి నువ్వు తింగరి అనే కోతిగా జీవిస్తావు. కొద్ది రోజులకు నీకు ఒక పుండు పుడుతుంది. తోటి కోతులన్ని నిన్ను ఓదార్చడానికి వచ్చి ఆ పుండును గోకి చూస్తాయి. అలా ఆ పుండు కాస్తా నీలా బ్రహ్మ రాక్షసిలా పెద్దదై భరించలేని బాధ పెడుతుంది’ అని శపించాడు. 


ముని శపించినట్లుగానే జరిగింది. కోతి పుండు పెద్దదై భరించలేక ఏడ్చుకుంటూ ముని వద్దకు వెళ్లి, పుండు బాధ లేకుండా చెయ్యమని ప్రాధేయ పడింది. ముని జాలి పడి తన కమండలం లో ఉన్న నీళ్ళు చల్లి తింగరికి ఉపశమనం కలిగించాడు. 


‘పశ్చాత్తాపము నకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. నువ్వెవరో ఎలా ఉంటావో లోకులకు తెలియక పోయినా చిన్న సమస్యను పెద్దదిగా చేసుకున్న సందర్భంలో ‘గోటితో పోయింది గొడ్డలిదాక తెచ్చుకున్నావు’ అని, ‘కోతి పుండు బ్రహ్మ రాక్షసి’ అని వారి నోళ్ళల్లో ఒక జాతీయంగా చిరస్థాయిగా మిగిలిపోతావు’ అని వరమిచ్చాడు ముని. ” అని కథ ముగించింది అత్తమ్మ. 


"దీనివెనుక ఇంత కథ ఉందా! అత్తమ్మా" అని నోరెళ్ళ బెట్టింది కోడలు. 


అలా ఆనాటి నుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 


***


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




55 views2 comments

2 Comments



@satyavani9902

• 22 hours ago

చాలా అద్భుతము గా ఉంది మాస్టర్ గారు.

Like

@rvvlmurthy1899

• 23 hours ago

Story bagundi

Like
bottom of page