top of page

క్షీరసాగర మథనము - 10

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #కందం, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 10 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 21/02/2025

క్షీరసాగర మథనము - 10 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 10 చదవండి..


66.

కందం.

ఉదరంబందుండు జగతి

యదురునటంచు తన కంఠ మందున విషమున్

కదలక నిల్పగ పశుపతి

ముదమొంది దివిజులు భక్తిఁ మ్రొక్కిరి శంభున్.//

తాత్పర్యము :

తన కడుపులో ఉన్న జగతికి ఆ విషాగ్ని వలన ప్రమాదం వస్తుందేమో అని శంకరుడు ఆ భయంకరమైన గరళాన్ని తన కంఠంలోనే నిల్పి ఉంచాడు. అది చూచి దేవతలందరూ సంతోషంతో పరమశివుడిని మ్రొక్కారు.//

67.

తేటగీతి.

జలములోనుండి పుట్టిన కలుషితంబు

పరమశివునిపై జూపంగ ప్రభవశక్తి

భవుని కంఠముపై నీల వర్ణకాంతి

ప్రజ్వలించంగ విశ్వంబు పరవసించె.//

తాత్పర్యము :

పాలసముద్రం నుండి పుట్టిన విషము పరమశివునిపై ప్రభావాన్ని చూపటం వలన ఆయనకంఠం నీలంగా మారింది.అప్పుడు శివుడి కంఠము క్రొత్త కాంతితో ప్రకాశించింది. అది చూచి విశ్వమంతా పరవశించింది 

68.

తేటగీతి.

నీలకంఠుడై భవుడు తాన్ నెనరు జూపి

కఠిన కార్యమున్ సల్పగ కరము కలిపి

సర్వదేవతా గణములు సంతసించి

పుష్ప వర్షమున్ గురిపించి పొగడిరంత.//

తాత్పర్యము :

అప్పటి నుండి పరమశివుడు నీలకంఠుడయ్యాడు. ఆయన కరుణ వలన దేవతలకు తాము చేయబోయే కార్యం సఫలమైనట్లు భావించి, శంకరుని అందరూ పొగిడారు.//



క్షీరసాగర మథనము - 11 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




32 views0 comments

Comments


bottom of page