top of page

క్షీరసాగర మథనము - 15

Writer: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 15 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 22/03/2025

క్షీరసాగర మథనము - 15 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 15 చదవండి..


86.

సీసము.


కమలహారంబును కరముల ధరియించ 

సిగ్గుదొంతరలతోన్ జెలగు మోము 

సన్నని కౌనుపై స్తనద్వయంబట

సమముగా విలసిల్ల చాన సౌరు 

నటునిటు కదులుచు నడుగులు వేయంగ

కాలియందల మ్రాగి గలగలనుచు

పట్టు వస్త్రంబుతో వల్లెవాటమ రంగ

నయన మనోజ్ఞమీ నాతి చెలువు!//


తేటగీతి.

కమల చనుదెంచ కలహంస గమనమువలె

స్వేదబిందువుల్ మోముపై చిందుచుండె

కరమునన్ గొని పూమాల  కనులు త్రిప్పి

తగిన వరుడెవ్వ రాయని తరుణి గాంచె!//


తాత్పర్యము.


లక్ష్మీదేవి చేతితో తామర పూలమాలను  ధరించింది.ఆ సమయంలో ఆమె సిగ్గుపడుతూ ఉంది. ఆమె నడుస్తూ ఉంటే కాలి మువ్వలు మ్రోగుతున్నాయి. పట్టుచీర కట్టుకొని రమాదేవి నయనమనోహరంగా ఉంది. ఆమె అలా హంసలాగా నడుస్తూ ఉంటే ఆమెకు చిరు చెమట పోసింది, ఆ  చెమట బిందువులు కూడా ఆమె ముఖానికి అందాన్ని తెచ్చాయి. చేతిలో పూమాలతో 'తనకు తగిన వరుడెవ్వరా!' యని ఆ శ్రీదేవి కనులు త్రిప్పి చుట్టూ చూస్తూ ఉంది.//


87.

తేటగీతి.


దోషరహితుడైనట్టియా దొర యెవరు?

సకల గుణములు కల్గిన శాశ్వతుండు 

పరమపావన మూర్తియై వరములొసగు 

వరుడు దొరకునా లోకాన? వధువు కొఱకు!//


తాత్పర్యము.


ఎటువంటి దోషము లేనటువంటి దొర ఎవరు?

అన్నీ మంచి గుణాలు కల్గి శాశ్వతుడైనవాడు, పరమ పావనమూర్తిగా నిలిచి, భక్తజనులకు వరములిచ్చే వరుడు ఈ వధువు యైన లక్ష్మీదేవికి ఈ లోకంలో దొరుకుతాడా?//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page