top of page

క్షీరసాగర మథనము - 18

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 18 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 02/04/2025

క్షీరసాగర మథనము - 18 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


ఇక క్షీరసాగర మథనము - 18 చదవండి..


100.

వచనము.


ఆ సమయంబున దైత్యులు గర్వోన్మత్తులై దుష్టచిత్తంబుతో.//


101.

తేటగీతి.


బలము జూపిన దైత్యులు వంచనమెయి 

నమృత కలశమున్ గైకొని యదిరిపడుచు 

పాఱుచుండగా దేవతల్ బాధనొంది 

విష్ణుమూర్తిని శరణమ్ము వేడుకొనిరి.//


తాత్పర్యము.


బలముతో రాక్షసులు ఆ ధన్వంతరి చేతిలోని అమృత కలశమును తీసికొని పారిపోయారు. అప్పుడు దేవతలు బాధపడి విష్ణుమూర్తిని శరణువేడుకొనిరి.//


102.

తేటగీతి.


దుఃఖమగ్నులై దేవతల్ దొరలుచుండ 

భక్తవశ్యుండు విష్ణుండు పలికె నిట్లు 

'మాయకల్పించి దైత్యుల మదమడంచి 

యమృతమున్ దెచ్చి యిత్తు మీ యాశదీర!"//


తాత్పర్యము.


దుఃఖంతో దేవతలు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు వారితో విష్ణుమూర్తి "నేను మాయతో రాక్షసుల గర్వాన్ని అణచివేసి, మీ కోరిక తీరేలాగా మీకు అమృతమును తెచ్చి ఇస్తాను!"అని పలికాడు.//


103.

తేటగీతి.


విష్ణుమాయచే దైత్యులు విముఖులగుచు 

బంధుతతితోడ పెనగుచు పశులవోలె 

కలశమున్ గోరి పోరాడి కలతచెంది 

కలహపరులౌచు దుష్టులై కలియబడిరి!//


తాత్పర్యము.


విష్ణుమాయ చేత రాక్షసులు వాళ్లలో వాళ్ళే ఒకరినొకరు కొట్టుకొంటూ అమృతము కోసము తగవులాడుకొంటున్నారు.//


(సశేషం )


క్షీరసాగర మథనము - 19 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page