top of page

క్షీరసాగర మథనము - 19

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 19 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 05/04/2025

క్షీరసాగర మథనము - 19 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 19 చదవండి..


104.

తేటగీతి.


ఇవ్విధంబుగ నసురజాతెఱుకలేక 

పోరుచుండి యమృతమును బొందరకట!

చతురుడైనట్టి విష్ణుండు సంతసముగ

మోహినీ రూపమున్ గొని మోసపుచ్చె!//


తాత్పర్యము.


ఈ విధంగా రాక్షసజాతి విష్ణుమాయను తెలిసికొనలేక అమృతము కోసము తగవులాడుకొంటూ ఉన్నారు. అప్పుడు తెలివిగలవాడైన విష్ణుమూర్తి నవ్వుతూ మోహినీరూపముతో వచ్చి ఆ రాక్షసులను మోసపుచ్చాడు.//


105.

సీసము.


మేఘవర్ణంబుగ మేను మెఱయుచుండ 

మోమున వాలెనా ముంగురులట 

సర్వభూషణములన్ సర్వావయములందు 

చంచరీచికుర సవరణించి 

మల్లెలమాలలన్ మక్కువఁ ధరియించి 

చందనాదులలది జాణమెరసి 

పలువరుసతళుకు ప్రస్ఫురిల్లగ తాను 

లజ్జతో నగుచుండి లలన నిలిచె!/

 

తేటగీతి.

మోహినీరూప మొందిన పురుషవరుడు

స్నిగ్ధమై తిరుగాడంగ చిత్తమందు

మోహమొందిన దైత్యులు మురిసి మురిసి

విస్మయంబుగ గాంచిరా వెలదిసౌరు!//


తాత్ పర్యము.


నల్లని మేఘము వలె మోహిని దేహము మెరుస్తూ ఉంది.ఆమె ముఖము మీద ముంగురులు వాలుతున్నాయి. ఆ నెరజాణ వంటినిండా చక్కని నగలు పెట్టుకుంది. జడలో మల్లెపూవుల మాలలను తురిమింది. తనువంతా చందనము పూసుకొంది. ఆమె పలువరుస తళుకుమనేటట్లు, కొంత సిగ్గుతో నవ్వుతూ అక్కడ నిలుచుంది. పురుషోత్తముడైన విష్ణువు మోహినీరూపమును పొంది అక్కడ తిరుగుతూ ఉంటే ఆ రాక్షసులు మోహముతో మురిసిపోయి, చాలా  విస్మయాన్ని పొంది ఆ సుందరి యొక్క సొగసును అలా చూస్తూనే ఉన్నారు.//


(సశేషం )


క్షీరసాగర మథనము - 20 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page