#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #మత్తకోకిల
![](https://static.wixstatic.com/media/acb93b_4e2ad5a3c27046b99c04ae21d53d8c94~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_4e2ad5a3c27046b99c04ae21d53d8c94~mv2.jpg)
(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 7 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 08/02/2025
క్షీరసాగర మథనము - 7 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 7 చదవండి..
55.
మత్తకోకిల.
కామక్రోధగుణంబులన్నియు కాల్చుచుండగ బుద్ధిలో
తామసంబుగ దుష్టులై ప్రజ తల్చలేరయ శుద్ధులై
సేమమిచ్చెడి వాడవంచును శ్రీముఖా!కరుణాకరా!
నీతి నిష్ఠల తోడ గొల్తుము!నిన్ను మ్రొక్కుచు దేవరా!//
తాత్పర్యము.
కామక్రోధ గుణములతో కనులు మూసుకొని పోయిన దుష్టులు నిన్ను తల్చుకోలేరు శంకరా!నువ్వే మాకు క్షేమమును కలుగ చేసెడి దైవమంటూ నీతి నియమాలతో నీకు మ్రొక్కుతూ కొల్చుకుంటామయ్యా దేవరా!//
56.
మత్తకోకిల.
నీదు మోమున నగ్ని యుండును నీదు పాదము పృథ్వియౌ
నీదు కర్ణము శబ్దమౌకద!నీదు నాలుక వర్షమౌ
నీదు నాభిని యంబరంబుగ నీదు శ్వాసయె వాయువే
నీదు కన్నులు సూర్యచంద్రులు నీరు రేతసునౌ శివా!//
తాత్పర్యము.
ఓ పరమశివా!నీదు ముఖములో అగ్ని ఉంటుంది. నీ పాదమే ఈ భూమి. నీదు చెవులు ఈ ప్రపంచంలో వినిపించే శబ్దములు. నీ నాలుక నుండి వచ్చు లాలాజలము వర్షము.నీదు నాభి ఆకాశము.నీ యొక్క శ్వాస వాయువు.నీ కన్నులే సూర్యచంద్రులు.nee వీర్యము నీరుగా ఉండి ఈ ప్రపంచానికి జీవమునిస్తోంది.//
57.
మత్తకోకిల.
జ్యోతి రూపమవై జగంబుల శుద్ధమై వెలుగొందగన్
నీతిబాహ్యుల సంహరించగ నిల్చి యున్నపరాన్ముఖా!
భాతినీయుమ!భూతనాయక!ప్రాంజలింతుము సన్నిధిన్
ధాతవీవని నమ్మియుండిన దైన్యమంతయు నాశమౌ.//
తాత్పర్యము.
జ్యోతిరూపముగా ఈ జగత్తులో వెలుగుతూ ఉంటావు. నీతి, నియమాలను మరచిన దుష్టులను సంహరిస్తావు.తండ్రీ!శంకరా!ధైర్యమీయవయ్యా!నువ్వే ఈ జగత్తును పోషించేవాడవని నమ్మితే మా దైన్యమంతయు తొలగిపోతుంది స్వామీ!//
క్షీరసాగర మథనము - 8 త్వరలో
![](https://static.wixstatic.com/media/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg/v1/fill/w_980,h_1136,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg)
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments