top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

క్షుద్బాధ


'Kshudbadha' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 17/11/2023

'క్షుద్బాధ' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


క్షితిని దౌర్భాగ్య జీవుల క్షుత్తు నెరుగ

క్షణ క్షణము క్షుబ్దాధ తీక్షణము గాగ

కుక్షి నింపెడి లక్షణంబుపేక్షింప లేక్

రక్షణెరుగని తిండి కైనను నిరీక్షించి నిలుచు నరుడు


పక్షి పశువు లాపేక్ష పక్కనుంచి

మక్షికంబుల మాట మనసు నొదిలి

కుక్షి నింపెడి లక్షణంబె కుదురు నంచు

తీక్షణంబగు ఆకలి తీర్చుకొన బూను నరుడు


పరుగు పరుగున ముందడుగు వేసి

నరుడు నాగరికత దా నెరుగ బోక

మొరుగు శునకంబు సైతము మొత్తుకోగ

జరుగు చేజాచి ముందిస్తరాకులెతుక


విందు జరిగిన ఇంటి ముందు నిలిచి

సందడెరుగగ నా యింటి సందు నడిచి

మంది దిని వైచిన ఇస్తరాకుల నంద బూని

తొందరొందును ఆకలి మంద మణుచ


శ్వాస నాడించ లేనట్టి శ్వాన మొకటి

సందు నీడన బరుండె ముందు చూపు తోడ

కావు కావున అరచెడి కాకులింక

కుక్కకన్నను ముందుండె కూటి మెతుకు లేర


మక్షికంబులును జేరె ఆ క్షణంబె

కుషి రక్షణె వాటి లక్ష్యమనగ

పక్షి మక్షికంబులు మరి మొరుగు

లక్షణంబగు కుక్క కన్నను నరుని కృంగదీసె

- సుదర్శన రావు పోచంపల్లి

54 views0 comments

Commentaires


bottom of page