'Kulame Ma Pranam' - New Telugu Story Written By Pitta Gopi
'కులమే మా ప్రాణం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నేటి సమాజంలో కులం పేరు బాగా మారుమోగుతోంది.
అది చెడైనా మంచైనా..
ఒక ప్రేమైనా, ఒక పెళ్ళైనా,
ఒక విద్యా వ్యవస్థ అయినా ఒక రాజకియం అయినా..
కులం పేరుతో తచ్చాడే సమాజమే ఇది.
అలాంటి సమాజంలో, అలాంటి కాలంలో క్రాంతి అనే యువతి, వేరే కులం యువకుడిని ప్రేమించింది.
మద్యతరగతి కుటుంబం అయినా.. తల్లిదండ్రుల కష్టంతో ఉద్యోగ శిక్షణ తీసుకుంటూ ప్రేమలో పడింది.
ఈరోజుల్లో ప్రేమలో పడని వారు ఉండరు కదా..ప్రేమలో పడినంత మాత్రాన, ఒకరి వ్యక్తిత్వం మంచిది కాదని అనుకోలేం కూడా.
అయితే సమాజం, కాలం కొత్త పుంతలు తొక్కుతున్నా కొందరు తల్లిదండ్రులు ఇంకా పాత కాలంలోనే ఉన్నారు.
పరిక్షలు రాసి కాలం గడుస్తోంది. ఉద్యోగం రాలేదు. దీంతో క్రాంతి తల్లిదండ్రులు తనకు పెళ్ళి చేయాలని నిర్ణయించారు.
క్రాంతి తన ప్రేమ విషయం చెప్పింది.
అబ్బాయి వ్యక్తిత్వం గూర్చి ఆరా తీయకుండా "ఏ కులం వాడు? అన్నాడు క్రాంతి తండ్రి సూరన్న.
"అబ్బాయి కులంతో ఏం పని నాన్నా? మంచోడా లేదా చూడాలి కానీ.." భయపడుతూ ప్రశ్నించింది క్రాంతి.
"ఎవరో తక్కువ కులం వాడిని ప్రేమించి మా పరువు తీస్తున్నావ్ కదే " అని చంప ఛెళ్ళుమనిపించింది తల్లి దేవి.
‘అల్లారు ముద్దు గా పెంచారు. ఏది కావాలంటే అది తెచ్చి పెట్టారు. కోరుకున్న జీవితం మాత్రం ఇవ్వరట.. ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే నేను ఆనందంగా ఎలా ఉంటాను..
తమ పిల్లల ఆనందం కంటే కులమే వీళ్ళకి ప్రాణం. కులం కులం అని చస్తారే.. పెద్దలు కుదిర్చే పెళ్ళి అయితే మాత్రం విడిపోవటంలేదా..’
ఇవే ఆ రాత్రికి క్రాంతి ఆలోచనలు.
తెల్లారేసరికి క్రాంతి ఇంట్లో లేదు.
తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన రఘు ని రిజిస్టర్ మేరేజ్ చేసుకుంది. అలా అని తల్లిదండ్రులపై ప్రేమ తగ్గించుకోలేదు.
తల్లిదండ్రుల దగ్గరకు రఘుని తీసుకెళ్ళింది. ఇరుగుపొరుగు చూస్తుండగా.. "మా పరువు తీశావు కదరా " అంటూ రఘు పై సూరన్న దాడి చేశాడు. కాలితో తన్ని పడేశాడు.
వద్దని అడ్డు వచ్చింది క్రాంతి. కోపోద్బుక్తుడైన సూరన్న నా కూతురు చచ్చిపోయిందని ప్రకటించాడు.
ఏడుస్తున్న క్రాంతి ని రఘు ఓదార్చి తనతో తీసుకుపోయాడు.
క్రాంతి తన కలల ఉద్యోగం కోసం రఘు మద్దతు ఇచ్చి సహకరించాడు. తల్లిదండ్రులను ఎదురించి వచ్చిందే కాక తనను నిజాయితీగా ప్రేమించింది కదా.. క్రాంతి భావోద్వేగాలే రఘు భావోద్వేగాలు కదా..
ఏడాది గడించింది.
క్రాంతి కలెక్టర్ అయింది. అయితే ఆ ఆనందం నిలవలేదు. ఎందుకంటే..
సూరన్న తన కూతురు చచ్చిపోయి ఏడాది గడించిందని లేఖలు ఫ్రింటిగ్ తీసి అందరికీ పంచి కర్మకాండలకు, పిండప్రధానానికి ఆహ్వానించాడు.
తల్లిదండ్రుల్లో మార్పు కోసం చూస్తున్న క్రాంతిని ఇది విషాదం లోకి నెట్టింది.
కులమే ప్రాణంగా బతికే వారు మనిషి కోసం పరితపించరని సర్దిచెప్పుకుంది.
కొంత డబ్బులు పంపింది. చచ్చిపోయిన కూతురు డబ్బులు ఎలా పంపుతుందని వెటకారం చేశారు.
అన్నీ భరించింది. ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రుల్లో మార్పు కోసం ఎదురు చూడని రోజు లేదు. ఎప్పటికైనా తనకోసం వస్తారని ఆశతో గుమ్మం దగ్గర చూడని రోజు లేదు.
రెండేళ్ళు గడచాక..
ఒకరోజు విధుల్లో బాగంగా బస్టాండ్ సందర్శించింది క్రాంతి.
అపరిశుభ్రంగా ఉందని అదికారులకు చీవాట్లు వేసింది. అలా.. మూలన ఆకలితో ఉన్న ఓ వృద్ధ దంపతులను చూసి, దగ్గరకు వెళ్ళింది.
ఆచేతనంగా పడి ఉన్న సూరన్న - దేవి లను ఆ పరిస్థితి లో చూసింది. అక్కడి వారు అసహ్యించుకునేంతగా వారు ఉన్నారు.
అమ్మా.. నాన్న.. అంటూ వాళ్ళని కౌగలించుకొని ఏడుస్తూనే సవర్యలు చేసింది. కళ్ళు తెరిచిన తల్లిదండ్రులు జరుగుతున్నది గమనిస్తున్నారు.
అనంతరం తల్లిదండ్రులను అదికారులు సాయంతో తన ఇంటికి తీసుకెళ్ళింది. రఘు సాదరంగా నవ్వుతూ ఆహ్వానించాడు. మరో వైపు రఘు తల్లిదండ్రులు వారికి గౌరవంగా నమస్కరిస్తూ ముందుకు వచ్చారు.
సూరన్న దేవి లు తలవంచుకుని సిగ్గు పడ్డారు.
ఎందుకంటే తమ సొంత కులపోళ్ళు కూడా ఏనాడూ ఇంత గౌరవించలేదు సరికదా వారితో చీటికీ మాటికీ గొడవలు పడేవారు.
అలాంటిది తక్కువ కులపోడని గెంటేసిన వాళ్ళే ఇప్పుడు అక్కున చేర్చుకున్నారు. తన కూతురు కూడా ఇప్పుడు సూరన్న దేవి ల కంటే తక్కువ కులమే కదా మరీ..
సూరన్న లేవలేని స్థితిలో ఉండగా రఘు తండ్రి గా భావించి అన్నీ తానై చూసుకున్నాడు. ఏ కాలితో అయితే తనను తన్ని పడేశాడో ఆ కాళ్ళు నొప్పులతో విలవిలాడుతుంటే కాళ్ళు పట్టాడు.
సూరన్న, దేవి లు తాము చేసిన పాపానికి చింతించారు. క్రాంతి, రఘులను దగ్గరకు పిలిచి క్షమించమని వేడుకున్నారు.
"కాలం వెనక్కి వెళితే బాగుణ్ణు.. రఘు లాంటి మంచి మనసున్నోడు తనకు అల్లుడు అయినందుకు పదిమందికి చెప్పుకుని తిరగాలని ఉంది.
కులాల పేరుతో బతికే వారందరికీ నా కూతురికి కులాంతర వివాహం చేశానని.. ఇక్కడ కులం గొప్పకాదని, వ్యక్తిత్వం గొప్ప అని చాటేవాడిని. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చే తల్లిదండ్రులు తమకు నచ్చిన భాగస్వామి ని ఎందుకు ఇవ్వలేరో ప్రశ్నించేవాడిని.
సరే.. ఇప్పుడు ఆ కాలం రాదు. అయినా..
‘కులమంటు కూతురుని వదులుకున్నా..నేను రోడ్డున పడితే నా కులపోడు రాలేదని అందరికీ చెబుతాను. ఎవడినైతే తక్కువ కులపోడని అవమానించానో వాడే నన్ను తండ్రి లా చూసుకుంటున్నాడని చెప్పుకుంటాను.
మమ్మల్ని ఎదిరించి పెళ్ళి చేసుకుని నా కూతురు మంచి పని చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుని ఉంటే బజారు రోడ్లలో బస్టాండ్ దగ్గర.. మా బతుకులు ముగిసే’వని
క్రాంతి, రఘులను వేడుకుంటూ, అనంతరం కన్నీటి తో దీవిస్తారు ఆ వృద్ధ దంపతులు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments