#KYCMosamTechhindiKashtam, #కేవైసీ మోసం తెచ్చింది కష్టం, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

KYC Mosam Techhindi Kashtam - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 13/02/2025
కేవైసీ మోసం తెచ్చింది కష్టం - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శ్రవణ్ కుమార్ ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. భార్య కాఫీ కప్పును అందిస్తూ కళ్ళతోనే సైగ చేసింది.
ఆ సైగ కి అర్థం ఏంటో తను ఏం చేయాలో తెలుసు శ్రవణ్ కి. కాఫీ కప్పు అందుకుని సిప్ చేస్తూ మొబైల్ చూస్తున్నాడు.
ఆ సమయంలో మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూశాడు. అందులో ఏముందంటే మీ యొక్క బ్యాంకు కేవైసీ డీటెయిల్స్ రేపటిలోగా అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని ఉంది. దాని కింద ఒక లింకు కూడా ఉంది.
అది చూసిన కుమార్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే అప్డేట్ చేయకపోతే తన బ్యాంక్ అకౌంట్ ను ఆపరేట్ చేయడం కష్టం అనుకున్నాడు. అందులోనూ తన దగ్గర క్యాష్ కూడా లేదు. అదీగాక తన భార్య ఈ వారం పండగ షాపింగ్ కు వెళ్లాలని పదేపదే చెప్పింది. ఇందాకటి సైగకు అర్థం అదే.
ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు గాని భార్యకు సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. డబ్బు మొత్తం అకౌంట్లోనే ఉంది.
వెంటనే ఆ మెసేజ్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేశాడు. కానీ ఆ లింకు పనిచేయలేదు. సరే తర్వాత బ్యాంకుకు వెళ్దాంలే అనుకుని ఆఫీసుకు బయలుదేరే లోపల మొబైల్ కు కాల్ వచ్చింది. ఏదో కొత్త నెంబర్. కాల్ చేసిన వ్యక్తి, "సార్! నేను ఫలానా బ్యాంకు ప్రతినిధిని. మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయడంలో ఏమైనా మీకు ఇబ్బంది ఉందా?" అని అడిగాడు.
దానికి కుమార్ "అవును ఇందాక మెసేజ్ వచ్చింది. అయితే ఆ లింకు పనిచేయడం లేదు" అని చెప్పాడు.
దానికి కాల్ చేసిన వ్యక్తి "సర్వర్ పని చేయడం లేదేమో? నేను మీ డీటెయిల్స్ ని అప్డేట్ చేస్తాను. నాకు చెప్పండి" అంటూ కుమార్ బ్యాంకు డీటెయిల్స్ తీసుకున్నాడు. తర్వాత "మీకు ఒక ఓటిపి వచ్చుంటుంది. అది నాకు షేర్ చేయండి" అన్నాడు.
కుమార్ వెంటనే ఓటిపిని షేర్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి "ఓకే సార్. మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయ్యాయి” అన్నాడు.
కుమార్ థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేశాడు. కాసేపటి తర్వాత కుమార్ కి ఒక మెసేజ్ వచ్చింది మీ అకౌంట్లో నుంచి ఇరవై వేలు డ్రా అయినట్లు ఆ మెసేజ్ లో ఉంది. కంగారుపడిన కుమార్ వెంటనే ముందు కాల్ వచ్చిన నెంబర్ కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
తర్వాత కుమార్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బు ఖాళీ అయింది. కుమార్ కు అప్పుడు అర్థమయింది అది ఒక స్కామ్ అని. చేసేదేం లేక బ్యాంకు వారికి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాడు పండగ షాపింగ్ కి ఎవరి దగ్గర అప్పు చేయాలా అని ఆలోచించుకుంటూ.
బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాక అక్కడ ఆఫీసర్ శ్రవణ్ తో "మీరు కేవైసీ చేయాలనుకుంటే బ్యాంకుకు వచ్చి అక్కడున్న సిబ్బందితో సంప్రదించి చేయాలి తప్పితే అలా ఫోన్ కాల్ తో గాని, ఆన్ లైన్ లో గాని చేయకూడదు" అని చెప్పాడు.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
@veeraiahkatam4399
• 1 hour ago
nice
పల్లా దీపిక గారు రాసిన "కేవైసీ మోసం.. తెచ్చింది కష్టం!" కథ ఆధునిక డిజిటల్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం. కథా నాయకుడు శ్రవణ్ కుమార్ అనుకోకుండా ఓ సైబర్ స్కామ్‌కు బలైపోతాడు. తక్కువ సమయంలో, అత్యంత సున్నితమైన బ్యాంకింగ్ సమాచారం ఎలా దొంగిలించబడుతుందో, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా నష్టపోతాడో ఈ కథ ద్వారా చూపించారు. కథలో శ్రవణ్ ఓ ఫిషింగ్ మెసేజ్‌కు, అనుమానాస్పదమైన ఫోన్ కాల్‌కు బాధితుడవుతాడు. అవగాహన లేకుండా తన బ్యాంక్ వివరాలు, ఓటిపీ షేర్ చేయడంతో అతనికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. కథ చివర్లో బ్యాంకు అధికారుల ద్వారా నిజమైన సమాచారం ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు ఎలా గురికాకూడదో సందేశం ఇచ్చారు. కథనం సరళమైన భాషలో ఆసక్తికరంగా సాగింది. అయితే, మరింత ఉత్కంఠ, ఉద్వేగం కలిపి ఉంటే ఇది మరింత బలంగా పాఠకులపై ప్రభావం చూపించేదని చెప్పొచ్చు. ఇది ప్రసక్తమైన, అవసరమైన సందేశాన్ని అందించే మంచి కథ.
GA SQUARE CREATIONS
•6 hours ago
❤❤❤❤