#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #LeelamahalCentre, #లీలామహల్సెంటర్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
'Leelamahal Centre' - New Telugu Story Written By Achanta Gopala Krishna
Published In manatelugukathalu.com On 05/10/2024
'లీలామహల్ సెంటర్' తెలుగు కథ
రచన: ఆచంట గోపాలకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
లీలా మహల్ ముందు అభిమానుల సందోహం తో కళ కళ లాడుతోంది..
ఎటు చూసినా జనం, తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని అందరి
తపన.
ఒక ప్రక్క.. టికెట్ క్యూ.. మరో ప్రక్క అభిమాన సంఘాల హడావుడి..
కటౌట్ లు కట్టారు.. దండలు వేస్తున్నారు.. కొందరు పాలతో అభిషేకం చేస్తున్నారు..
విజయ్ కూడా పెద్ద దండ తీసుకుని వచ్చి తన అభిమాన హీరో కటౌట్ కి వేసాడు..
ఈ లోగా ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకుని వచ్చారు..
ఫాన్స్ కోసం మేనేజర్ కొన్ని టిక్కెట్లు కేటాయించారు.. అందరూ లోపలికి వెళ్లారు..
సినిమా మొదలు అయింది..
ఈలలు కేకలు తో హాలు దద్దరిల్లుపోతోంది..
ఒక్క డైలాగ్ కూడా వినిపించటలేదు..
సినిమా పూర్తి అయింది..
అంతా కబురులు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు విజయ్.
అమ్మ : ఏరా ఇవాళ ఇంత ఆలస్యం అయింది.. భోజనం కూడా చేయలేదు.. రా కాళ్ళు కడుక్కో వడ్డించేస్తా..
(అంటూ తల్లి అడిగింది ఆప్యాయం గా.. )
విజయ్: "ఇవాళ కాలేజ్ లో ఎక్స్ ట్రా క్లాసులు ఉన్నాయి.. అందుకే" అని అబద్ధం చెప్పాడు..
భోజనం కానిచ్చి.. సాయంత్ర ము కూడా హాలు దగ్గరకు చేరారు.. మళ్ళీ రాత్రి ఫస్ట్ షో చూసి.. ఇల్లు చేరాడు విజయ్.. తండ్రి ఇంకా రాలేదు..
విజయ్: "అమ్మా, నాన్న ఇంకా రాలేదా.. " అని అడిగాడు..
అమ్మ : "అవును రా బస్ లో రావాలి కదా. బహుశా ఇవాళ బస్ దొరకడం లేటు అయి ఉంటుంది లే,
నువ్వు తినేసి పడుకో మళ్ళీ పొద్దున్నే కాలేజ్ కి వెళ్ళాలి గా.. " అంది.
విజయ్ : " నాకు కొన్ని పుస్తకాలు కొనాలి. కొంచెం డబ్బు కావాలి. నాన్నని అడుగు" అన్నాడు.
నిజానికి మరునాడు దండలకు.. ఇంకా సినిమా హిట్ అయినందుకు, పార్టీ లకి, ఫ్రెండ్స్ కి టిక్కెట్లకి.. కావాల్సి వచ్చి..
అమ్మ : "సరే లే అడుగుతాలే" అంది ఆవిడ.
రాత్రి లేటు గా వచ్చాడు సుబ్బారావు.
అమ్మ : " ఏమండీ ఇంత ఆలస్యం అయింది.. ఇవాళ కూడా బస్ దొరకలేదా" అంది.
నాన్న : " అవును ఆఫీసులో ఆలస్యం అయింది. ఈ లోగా డైరెక్ట్ బస్ వెళ్ళిపోయింది.. సగం దూరం వచ్చి.. మిగతాది నడిచి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది.. సరేలే భోజనం వడ్డించు.. నువ్వు అబ్బాయి తినేసారా.. " అని అడిగాడు.
అమ్మ : "వాడు తిని పడుకున్నాడు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను.. " అంది..
నాన్న : " సరేలే వడ్డించు.. కాళ్ళు కడుక్కుని వస్తాను " అంటూ లోపలికి వెళ్ళాడు..
భోజనం చేస్తుంటే విజయ్ కి మెలుకువ వచ్చింది..
కానీ అలాగే పడుకొని సెల్ ఫోన్ లోమెసేజ్ లు చూస్తున్నాడు.
భోజనాలు అనంతరం
గదిలో కి వెళ్లారు సుబ్బారావు, భార్య.
అమ్మ డబ్బులు గురించి చెపుతుందో లేదో అని ఓ చెవి పారేశాడు విజయ్.
నాన్న : సరోజా ఇవాళ కాళ్ళు లాగుతున్నాయి కాస్త కొబ్బరినూనె రాయి" అని అడిగాడు సుబ్బారావు.
అమ్మ : " రోజూ ఇలా కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటే లాగవు మరి.. బండి అబ్బాయికి ఇచ్చేసి మీరు ఇలా కష్టపడితే ఎలా వాడు చిన్నవాడు కాలేజ్ కూడా దగ్గిరే. మీరు మోటార్ సైకిల్ మీద వెళ్లొచ్చు కదా" అని అడిగింది.
నాన్న : " మనం మధ్య తరగతి వాళ్ళం.. రెండు బళ్ళు ఎక్కడ కొనగలను? వాడు కాలేజ్ కి వెళ్ళే అప్పుడు సరదాలు ఉంటాయి. నాన్న గా వాడి ముచ్చట్లు తీర్చే బాధ్యత నాదే కదా.. కొన్నాళ్ళు కష్ట పడితే వాడి కి మంచి ఉద్యోగం వస్తుంది నాకు కొంచెం ఆసరాగా ఉంటాడు" అన్నాడు.
అమ్మ : " ఇదిగో ఇప్పుడు మళ్లీ ఏవో పరీక్షలు అంట, పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి అంటున్నాడు" అంది.
నాన్న : " అమ్మో మళ్ళీ డబ్బులా, మొన్ననే ఓవర్ టైం చేసి తీసుకుని వచ్చాను. అస్తమాను నేనే చేస్తాను అని అడిగితే ఇవ్వరుకదా. మిగతా వాళ్ళు కుడా చెయ్యాలి కదా అన్నాడు మా మేనేజర్.
ఇంకో నాలుగు రోజులు ఆగితే జీతాలు వస్తాయి అప్పుడు ఏర్పాటు చేస్తాలే. మరీ అర్జెంట్ అయితే పక్కింటి విశ్వనాధం గారి దగ్గర అప్పు చేయాలి.. చూద్దాం. ఇక చాలులే, పడుకో మళ్ళీ పొద్దున్నే బయలు దేరాలి " అని నిద్రకి ఉపక్రమించారు.
అపుడు అర్థం అయింది, విజయ్ కి (మనసులో)
విజయ్: "తల్లి తండ్రులు అంటే ఏమిటో, వాళ్ళ ప్రేమకి అంతే లేదని. ఈ ప్రపంచం లో వాళ్ళు చూపించే ప్రేమ కన్నా ఏది గొప్ప కాదని.
మా నాన్న నాకోసం ఇంత కష్ట పడుతున్నాడు.. నా ఫీజులు కోసం ఓవర్ టైం చేసున్నాడు.
నాకు బైక్ ఇచ్చేసి తాను రోజూ ఎంతో దూరం నడుస్తున్నాడు.
ఇన్నాళ్లు నాకు తెలియలేదు. కాదు కాదు వాళ్ళు నాకు తెలియనివ్వలేదు
అది వాళ్ళ గొప్పదనం.
నేను మాత్రం సినిమా లు, అభిమానం పేరుతో కటౌట్ లకి దండలకి.. పార్టీలకి.. డబ్బులు వృధా చేస్తున్నా. "
అప్పుడు గుర్తుకు వచ్చింది తన అభిమాన హీరో అన్న మాటలు.
హీరో : "మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు. కానీ అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.
మా మీద ప్రేమ చూపించండి. సినిమా చూడండి. అంతవరకే. అనవసర ఖర్చులు పెట్టొద్దు.
టికెట్ దొరకలేదని, ఏదేదో చేసేసు కోవడం, ఎంత ఖరీదైనా పెట్టి టికెట్ కొనడం లాంటివి చేయొద్దు.
మీరు మమ్మల్ని ఎంత గా అభిమానిస్తారో అంతకు వెయ్యి రెట్లు మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమని పంచుతున్నారు.. అది అందరూ గుర్తించాలి.
మేము సినిమాలు చేస్తున్నాము అంటే ఒకపక్క అవంటే ఇష్టం, మరియు మా తల్లితండ్రులని ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపన, అది మీరు కూడా గ్రహించాలి,
అలవర్చుకోవాలి " అని విజయ్ ఎంత బాగా చెప్పాడు.
ఇప్పుడు అర్థం అవుతోంది ఆయన అన్న మాటలు. " అనుకున్నాడు.
పొద్దున్నే తండ్రి ఆఫీస్ కి బయలుదేరే సమయంలో
విజయ్ : నాన్నా మీరు బండి మీద వెళ్ళండి నా ఫ్రెండ్ వస్తానన్నాడు. వాడితో వెళతాను అన్నాడు.
నాన్న :" సరే " అంటూ ఆయన బయలు దేరారు.
విజయ్ : (మనసులొ)
నాన్న.. ఇంక మీకు కాళ్ళు లాగవు. ఆ అవసరం రానీయకుండా చూసుకుంటా
అని మనసులో అనుకున్నాడు.
విజయ్ : అమ్మా నేను కాలేజ్ కి వెడుతున్నా.. అని చెప్పాడు.
అమ్మ : " అదేమి రా ఫ్రెండ్ వస్తాడు అన్నావు" అని అడిగింది.
విజయ్ : " లేదమ్మా ఎవరు లేరు. నాన్న నా కోసం అంత దూరం నడుస్తున్నారు అని రాత్రి తెలిసింది. ఇంకా ఆయనని కష్టపెట్టను. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాను. "
అంటుంటే ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసాడు.
విజయ్ " ఫ్రెండ్ అని చెప్పక పోతే నాన్న బండి తీసుకుని వెళ్ళరు. అందుకని అలా చెప్పా.
సరే నేను బయలు దేరతాను". అంటూ గేటు తీసుకుని బైటకి వచ్చాడు.
పక్కింటి అంకుల్: ఇదిగో అబ్బాయి విజయ్.. మీ నాన్న ఏదో బుక్స్ కొనాలి డబ్బులు కావాలని ఆడిగావుట. ఇదిగో నీకు ఇమ్మన్నాడు. నాకు జీతాలు వచ్చిన తరువాత తిరిగి ఇస్తానన్నాడు"
అంటూ అతనికి ఇచ్చాడు.
ఒక్కసారి గా విజయ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
విజయ్ : నాన్నంటే నే ప్రేమ ప్రేమంటే నే నాన్న,
ఇన్నాళ్లు నేను నీడలో ఉన్నానని అనుకుంటున్నాను.
కానీ నువ్వు ఎండలో నిలబడి నాకు నీడ నిస్తున్నావాని తెలుసుకోలేక పోయాను,
నన్ను క్షమించండి నాన్నా అని మనసులో నే అనుకుంటూ వెంటనే కళ్ళు తుడుచుకుని,
విజయ్ : " వద్దండి. నేను ఈ వాల్టి నుంచి లైబ్రరీలో చదువు కుంటాను. ఈ డబ్బు లు ఇప్పుడు అవసరం లేదు. సహాయం చేసినందుకు థాంక్స్ అండీ " అంటూ బయలు దేరాడు.
కాలేజ్ గేట్ దగ్గర
ఫ్రెండ్ విశాల్ : ఒరేయ్ విజయ్ ఇదిగో రా నువ్వు అడిగిన టికెట్స్. నాకు కొంచెం పని ఉంది రా,
మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు విశాల్.
విజయ్: ఇప్పుడు నాకు కావాల్సింది టికెట్స్ కాదు, పుస్తకాలు " అనుకుంటూ.. ఆ టికెట్ చింపేసి, లైబ్రరీ వైపు కి అడుగులు వేసాడు విజయ్.
ఈ తొలి అడుగు ఎన్ని విజయాలకి దారితీస్తుందో..
సమాప్తం
ఆచంట గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు ఆచంట గోపాలకృష్ణ
రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..
15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..
నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..
ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..
Comments