ఈ కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Lokam Thiru..Papa..Baba..' written by N. Dhanalakshmi
👦??👧?? రచన : N. ధనలక్ష్మి
అదో మ్యారేజ్ ఫంక్షన్ హాల్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు …
“ఏంటి వదినా! ఇంకెప్పుడు మాకు మనవడి గురించి శుభవార్త చెబుతారు?” అని అందరూ అడుగుతారు కామాక్షిని.
ఆవిడ నవ్వుతూ “మా వాడికి పెళ్లి అయి ఏడాది కదా అయింది! ఇంకా చాలా టైం ఉంది” అంది.
“అరే వదినా! మీ వాడికి పెళ్లి అయిన నెలకు మా వాడికి అయింది. వాడికి అప్పుడే బాబు పుట్టాడు” అని చెప్పింది అక్కడే ఉన్న సీతారత్నం ...
“అత్తయ్యా! మిమ్మలని మావయ్య పిలుస్తున్నారు” అని అక్కడికి వచ్చింది అభినయ.
“ కరెక్ట్ టైం కి వచ్చావు” అన్నారు అక్కడే ఉన్న మిగతా ఆడవాళ్లు.
“ చెప్పండి పిన్ని గారు” అని వినయంగా అడుగుతుంది అభినయ ..
“పెళ్లి అయి ఏడాది అయింది. ఇంకా ఎప్పుడు మాకు శుభవార్త చెబుతావు?” అని అడిగారు అందరూ.
అభినయ బాధగా తలదించుకుంటుంది .
సీతారత్నం కామాక్షితో “ఏదైనా లోపం ఉందో ఏమో.. ఒకసారి డాక్టర్ కి చూపించవచ్చు కదా” అంటుంది .
“ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు? అక్కడ నాన్న పిలుస్తున్నారు” అంటూ అక్కడికి వచ్చాడు అభినయ భర్త సంజయ్.
అభినయ కంట్లో నీళ్లు చూసి ‘ఏమైంది’ అని కళ్ళతోనే అడుగుతాడు.
తాను ఏమీ చెప్పదు ..
“ఏంటి సంజూ! మాకు ఎప్పుడు శుభవార్త చెబుతావు?” అని సీతారత్నం అంటే
“ ఏమి శుభవార్త చెప్పాలి? మేము కొత్తగా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము . నేను అయితే కొత్త మోడల్ బైక్ కొన్నా! “ అని సంజయ్ చెపుతుంటే సీతారత్నం “సంజూ! మేము అడిగింది పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతావూ అని! ” అని నవ్వుతారు.
సంజుకు అర్థము అవుతుంది ఎందుకు అభి కంట్లో నీళ్లు ఉన్నాయో .
“అరే ఆంటీ! మొన్నటివరకు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా అన్నావు . ఇప్పుడేమో 'ఇంకా ఎప్పుడు పిల్లలు?' అంటావు. ఏంటో మీరు!” అంటూ వాళ్ళ అమ్మను, అభిని తీసుకొని వెళ్ళిపోతాడు.
మ్యారేజ్ అంతా చూసుకొని ఇంటికి వెళ్ళారు..
సీతారత్నం అన్న మాటలు తలుచుకొని అభి ఏడుస్తూ వుంటే సంజు తనని ఓదారుస్తాడు . ‘ఇలా ఏడుస్తూ వుంటే మనకు పిల్లలు ఎలా పుడతారు? మన వంతు కొంచం కస్టపడాలి’ అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు.
ఒక రోజు అభికి డౌట్ వచ్చి సంజుని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళుతుంది . అభి అనుమానం నిజం అయి తాను ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. సంజయ్ తను hug చేసుకొని కిస్ చేస్తాడు.
డాక్టర్ గారు “బాబూ సంజయ్ ! నేను ఇక్కడే ఉన్నాను” అని నవ్వుతాడు ..
వాళ్ళు ఇద్దరూ దూరం జరగుతారు..
వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెబుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
"అమ్మా అభీ! నా మనవడు నీ కడుపులో ఉన్నాడు. ఇకనుంచి నువ్వు ఏ పనీ చేయకూడదు” అని కామాక్షి ,
“రేయ్ సంజూ! మన వారసుడు తన కడుపులో ఉన్నాడు ..అభికి ఏమి కావాలన్నా క్షణంలో తెచ్చిపెట్టు” అని సూర్యం గారు వాళ్ళ ఆనందాన్ని తెలుపుతారు..
అభి, వాళ్ళమ్మకు కాల్ చేసి చెపితే వాళ్ళ అమ్మ కూడా “రోజూ కుంకుమ పువ్వు పాలలో వేసుకొని తాగు. నా మనవడు అందంగా పుడతాడు” అని చెపుతుంది
అభి కి ఇష్టమైన స్వీట్స్ తీస్కొని వచ్చాడు సంజు.
“ అభి బంగారం! చూడు నీకు ఇష్టమైన స్వీట్స్.. కోవా.. జిలేబీ తీసుకొని వచ్చా. కొంచం తిను “ అని నోటికి అందిస్తాడు ..అపుడు గమనిస్తాడు అభి డల్ గా ఉండడం .
“ఏమైందిరా” అని లాలనగా అడుగుతాడు .
అభి “ఏమీ లేదు. నాకు నిద్ర వస్తోంది” అని నిద్ర పోతుంది ..
‘అభి ఏదో మనసులో పెట్టుకొని బాధ పడుతోంది ...
ఏమిటో నిదానంగా తెలుసుకోవాలి’ అని సంజయ్ అనుకుంటాడు.
తరవాత రోజు అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ వుంటే ఏదో న్యూస్ ఛానల్ లో ‘అమ్మాయి పుట్టింది అని వాళ్ళ హస్బెండ్ తనను వదిలివేశారు’ అని టెలికాస్ట్ చేస్తున్నారు ..
అది చూసి అభి ఏడవడం స్టార్ట్ చేస్తుంది ..
అందరూ కంగారు పడి ‘ఏమైంది రా.. ఎందుకు ఏడుస్తున్నావు?’ అని లాలనగా అడుగుతారు.
అభి సంజయ్ ని గట్టిగా పట్టుకొని “నువ్వు కూడా నన్ను వదిలివేస్తావా పాప పుడితే ...
ప్లీజ్ సంజు! అల చేయకు. నువ్వు లేకపోతే నేను బతకలేను” అని ఏడుస్తుంది ..
సంజు తనని పట్టుకొని ‘నీకు ఎవరు చెప్పారు నేను అలా చేస్తాను అని?’ అన్నాడు.
“మరి అందరూ నేను కడుపుతో ఉన్నాను అని తెలిసినప్పటి నుంచి ‘బాబు జాగ్రత్త’ అని అత్తయ్య , మామయ్య , మా అమ్మ నాన్న , ఆఖరికి ఇరుగుపొరుగు వారు కూడా అలాగే అంటున్నారు .. ఇపుడు న్యూస్ ఛానల్ లో కూడా ఎవరో అతను వాళ్ల భార్యను వదిలివేశారు పాప పుట్టిందని” అంటూ గట్టిగా ఏడుస్తుంది ..
“చూడు అభి! మన ప్రేమకు ప్రతిరూపం మన బిడ్డ. అది పాప అయితే ఏంటి? బాబు అయితే ఏంటి ? ఇంకా నిజం చెప్పాలి అంటే పాప అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? మనం సరిగా పెంచితే మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. నాకు అయితే మరో అమ్మ అవుతుంది మన పాప” అని ప్రేమగా చెపుతాడు సంజు .
ఇదంతా విన్న కామాక్షి , సూర్యం గారు కూడా “మాకు కూడా పాప అయినా , బాబు అయినా ఎవరైనా మా వారసులే కదా ! నువ్వు ఎలాంటివి మనసులో పెట్టుకోకు తల్లీ” అంటారు ..
అపుడు అభి మనసు కుదుట పడుతుంది ..కొన్ని నెలలకు అభి ,సంజు ల ప్రేమ గుర్తుగా పాపా , బాబు ఇద్దరూ పుడతారు ..
వాళ్ళ నామకరణం చాలా అంగ రంగ వైభవంగా జరుపుతారు . అభిసారిక ,అభినవ్ అని పేర్లు పెడతారు.
ఆ ఫంక్షన్ కి వచ్చిన సీతారత్నం “అవును సంజూ! ఇంతకీ పిల్లలను ఏ స్కూల్ లో జాయిన్ చేయాలి అనుకుంటున్నారు , ఇంతకీ ఏమి చదివించాలి అనుకుంటున్నారు..” ఇలా అడుగుతుంటే అభి , సంజు గట్టిగా నవ్వుతారు ..
ఎదుటివారికి ఏదో ఒక టాపిక్ కావాలి ..మనం ఎలా ఉన్న వాళ్ళు ఏదో ఒకటే అంటూ ఉంటారు అవన్నీ మనం కేర్ చేయకూడదు ..
తెల్లగా ఉన్న ,నల్లగాఉన్న ,సన్నగా ఉన్న ,లావుగా ఉన్నా ఏదో ఒకటే అంటూ ఉంటారు. వాళ్ళను పట్టించుకోకుండా మన పని మనం చేయాలి.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
ความคิดเห็น