#PittaGopi, #పిట్టగోపి, #Love Story Of A Commando, # లవ్ స్టోరీ ఆఫ్ ఏ కమాండో, #TeluguKathalu, #తెలుగుకథలు, ##TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Love Story Of A Commando - New Telugu Story Written By - Pitta Gopi
Published In manatelugukathalu.com On 13/02/2025
లవ్ స్టోరీ ఆఫ్ ఏ కమాండో - తెలుగు కథ
రచన: పిట్ట గోపి
దాదాపు 7నెలల సుదీర్ఘ సమయం తర్వాత శత్రు సైన్యంతో ఉద్రిక్తతలు చల్లారటంతో క్షణం ఆలస్యం చేయకుండా లీవ్ తీసుకున్నాడు శరత్. అవును.. భార్య సుమిత్ర అంటే అతనికి అంత ఇష్టం మరి. మనం ప్రేమించే మనుషుల నుండి కాకుండా మనల్ని ప్రేమించే మనుషుల నుండి మాత్రమే ఎక్కువ ప్రేమను పొందగలం కదా.. తన రాకకోసం తన భార్య కూడా ఎంతో ఎదురు చూస్తుంటుందని, అయితే తన రాక విషయం ఆమెకు చెప్పకుండా సర్ఫైజ్ చేద్దామని ఇంటికి వెళ్ళాడు.
డోర్ లాక్ కూడా తీసే ఉండటంతో లోపలికి మెల్లగా వెళ్ళాడు. బెడ్రూమ్ డోర్ కొంచెం తీసి ఉంది. ఎంతో ఉత్సాహంతో డోర్ తోసుకుని ఆమెను చూడగా సుమిత్ర పరాయి మగాడితో అర్దం నగ్నంగా బెడ్రూంలో ఉంది. అది చూసిన శరత్ ఖిన్నుడైయ్యాడు. తమాయించుకుని డోర్ కాస్తా మూసి వాళ్ళు డ్రెస్ వేసుకునేందుకు సమయం ఇస్తున్నాననే సంకేతాలు ఇస్తూ వెనక్కి వచ్చాడు.
శరత్ ని చూసిన సుమిత్ర తటాలున లేచి డ్రెస్ సర్దుకోగా ఆమెతో సరసం చేసిన వ్యక్తి అర్థనగ్నంగానే బయటకు పరుగుతీశాడు. సుమిత్ర వచ్చి శరత్ కాళ్ళ పై పడింది. శరత్ మాత్రం ఇంకా నేను ఇక్కడ ఉంటే నన్ను ఓదార్చి జరిగింది మర్చిపోయేలా చేస్తుందని ఆలోచించాడు కాబోలు, ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఓ కొండ గుట్ట దగ్గర భార్య తన కాళ్ళపై పడినా పట్టించుకోలేదనే ఆలోచనలో పడ్డాడు.
అయినా.. శరత్ మనసు ఆమెను క్షమించటం లేదు. ఎందుకంటే.. ప్రాణంగా ప్రేమించిన భార్య అక్రమ సంభంధాన్ని ఫోన్ లోనో.. లేదా ఏ బీచ్ లోనో చూస్తే తెలియక చేసింది, తప్పు తెలుసుకుంటుందని అనుకోవచ్చు. కానీ.. ! వాళ్ళ ఇంట్లోనే అది కూడా.. డోర్స్ కూడా వేయకుండా అంత ధైర్యంతో, మరెంతో ఇష్టంతో పరాయివాడితో బెడ్రూంలో అర్ధనగ్నంగా ఉన్నప్పుడు చూసి తట్టుకోవటం అంటే మాటలా.. ? విది నిర్వహణలో కొన్ని వేలమంది శత్రువులను ఎదుర్కునే ధైర్యం ఉంటే ఏం లాభం.. భార్య చేసిన ఈ పనికి అతడు బలహీనుడైపోయాడు.
చిన్నప్పుడే అమ్మకు మాటిచ్చాడు. "చేరితే ఆర్మీలోనే చేరుతా" అని.
"చనిపోవల్సి వస్తే కొంతమంది శత్రువులను చంపి చనిపో " అని అమ్మ మాటలు కళ్ళముందు కదిలాయి. అమ్మ అన్న మాటలు గుర్తు ఉన్నా..
అది చేసే అవకాశం ఉన్నా.. శత్రువులను చంపకుండానే తనువు చాలించాలనుకున్నాడు శరత్. చివరిసారి తాను సుమిత్ర ను ఎలా పొందాడో ఒకసారి నెమరువేసుకున్నాడు.
ఆరో తరగతిలో తొలిసారిగా శరత్, సుమిత్రలు ఒకే తరగతిలో కలిశారు. అసతికాలంలోనే మంచి స్నేహితులు అయ్యారు. తరగతిలో అందరి కంటే శరత్ ఆటల్లోను, చదువులోను ముందు ఉండటంతో సుమిత్రకు శరత్ అంటే సహజంగానే ఇష్టం పెరిగింది. స్కూల్ స్థాయిలోనే ఆమె శరత్ ని ప్రేమించింది. ఎంతలా అంటే శరత్ పేరును తన చేతి పై పచ్చ బొట్టు వేసుకున్నంత. ఎట్టకేలకు పదో తరగతిలో సుమిత్ర ప్రేమను శరత్ అంగీకరించాడు. ఆ తర్వాత ఆమె ఓ దారిలో తాను ఓ దారిలో ప్రయాణించాల్సి వచ్చింది.
ఇక కాలం ముందుకు వెళ్ళగా శరత్ డ్యూటీ చేస్తున్న దగ్గర ఓ కాలనీలో షాపింగ్ మాల్ అగ్నిప్రమాదానికి గురికావడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుంది శరత్ రేజ్మెంట్. చాలామందిని రక్షించారు. చివరగా ఓ యువతిని శరత్ తన భుజాలపై వేసుకుని వేగంగా అంబులెన్స్ దగ్గరకు వచ్చాడు. ఆమె ముఖం గాయాలతో ఉంది. కాలికి బలమైన గాయం తగిలింది. రక్తం చాలా పోయింది. చేతి పై టాటూ చూసి అప్పుడు గుర్తించాడు. తన చిన్ననాటి ప్రియురాలు సుమిత్ర అని ఆసుపత్రిలో రక్తం తానే ఇచ్చాడు. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు. రేజ్మెంట్ తిరుగు ప్రయాణం కావల్సి ఉంది. వెళ్తు వెళ్తూ.. తన ఆర్మీ చొక్కాను ఆమె దిండు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు.
తర్వాత ఆమె కళ్ళు తెరవగానే తనను ఆసుపత్రికి తెచ్చిన వారిని, అలాగే జరిగింది ఆరా తీసింది. దిండు దగ్గర ఆర్మీ చొక్కాను చూసింది. దానిపై ఎడమ సైడ్ బ్రిడ్జి పై సుంకర. శరత్ అని ఉంది. తెగ ఆనందపడిపోయింది. చొక్కాను గట్టిగా ముద్దు పెట్టుకుని హత్తుకుంది.
పూర్తిగా కోలుకున్నాక ఆ రేజ్మెంట్ వివరాలు తెలుసుకుని శరత్ ని కలిసింది. తన ప్రేమకు చిహ్నంగా పచ్చ బొట్టు చూపించింది. కానీ.. శరత్ ఆమె ప్రేమను తిరస్కరించాడు.
"ఎందుకు" అని సుమిత్ర ప్రశ్నించింది.
"నిన్ను తప్ప ఇంకెవర్ని పెళ్ళి చేసుకోన"ని ఖరాఖండిగా చెప్పింది.
"నేను దేశ సరిహద్దుల్లో పని చేస్తాను. నా ప్రాణం పై నాకే గ్యారెంటీ లేదు నిన్ను పెళ్ళి చేసుకుంటే.. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటమే కానీ.. " అన్నాడు.
"నువ్వు దేశం కోసం వీరమరణం పొందిన.. డ్యూటీలో ఉన్నా నేను ఎప్పుడూ నీ జపమే చేస్తాను " చెప్పింది.
ఆమె మొండి ప్రేమకు శరత్ దిగి వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు ఎంతో చక్కగా కాపురం చేస్తు కాలం గడిపారు.
డ్యూటీకి వెళ్ళే సమయంలో శరత్ ని వదిలి పెట్టలేక బిగ్గరగా ఏడ్చింది సుమిత్ర. చివరగా శరత్ తో
"దేవుడి దయవల్ల నా కోసం ప్రాణాలతో తిరిగి వస్తావు కదా.. !’ ఆంటూ సాగనంపింది.
అప్పటి నుండి రోజు మిస్ కాకుండా ఫోన్ చేసేవాడు శరత్.
అయితే గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లో శత్రు సైన్యం దూకుడు పెంచటంతో భారత సైన్యం ధీటుగా బదులివ్వల్సి వచ్చింది. దీంతో మన సైనికులు సరిహద్దుల్లో అప్రమత్తత వలన సుమిత్రకి ఫోన్ చేయటం కుదరలేదు.. అనంతరం 7నెలల తర్వాత సరిహద్దుల్లో శాంతి నెలకున్న వెంటనే లీవ్ తీసుకుని భార్యకు సర్ఫైజ్ ఇద్దామని వెళ్ళిన శరత్ కి భార్యే అతిపెద్ద సర్ఫైజ్ ఇచ్చి పడేసింది.
మనం ప్రేమించే వారి కంటే మనల్ని ప్రేమించే వారి నుండి ప్రేమ లభిస్తుంది అంటారు కానీ.. ఇది అబద్ధం. మనల్ని నచ్చినప్పుడు ప్రేమించి మనం నచ్చనపుడు ఇంకొకరితో వెళ్ళిపోతారనేది నిజం. శరత్ ఆ గతాన్ని నెమరు వేసుకోవటం పూర్తి కాగానే కడుపులో నుండి రక్తపు వాంతులతో, నొప్పులతో కూలబడిపోయాడు.
భర్త సాయంత్రానికైనా ఇంటికి వస్తాడని వస్తే క్షమించమని అడగటానికి సిద్ధంగా ఉన్న సుమిత్రకు అంబులెన్స్ రావటం, కొంతమంది సైనికులు పెట్టెను మోసుకురావటం చూసి షాక్ అయ్యింది. వాళ్ళు దగ్గరకు కూడా రాలేదు.
మేటర్ అర్థం చేసుకుని, "అయ్యో.. పాపిష్టిదాన్ని. మంచి భర్తను వదులుకున్నాను” అంటూ తల బాదుకుంది. ఓ జవాను వచ్చి శరత్ యూనిఫామ్ సుమిత్ర చేతిలో పెట్టి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ యూనిఫామ్ చూస్తూ.. ప్రమాదం సమయంలో తన దిండు దగ్గర పెట్టిన ఆర్మీ చొక్కాను ముద్దు పెట్టి హత్తుకున్న సంఘటన తలుచుకుని మోకాళ్ళ పై పడి జవాను ఇచ్చిన యూనిఫామ్ పై ముఖం పెట్టి ఏడవసాగింది.
శరత్ తాను అనుకున్న ఆర్మీని ఆవలీలగా ఇష్టంతో సంపాదించాడు కానీ.. సరిహద్దుల్లో శత్రువులను చంపి చనిపోయో అవకాశం ఉన్నా అలా చేయలేకపోయాడు. అలా చేస్తే దేశం కోసం వీరమరణం పొందాడనే పేరు ఉంటుంది. కానీ.. భార్య మోసం చేసినందుకు చనిపోయాడనే విషయం భార్యకు అర్థం కావాలి.
ఇష్టంతో తన జీవితంలోకి వచ్చి పరాయివాడితో ఎలా అక్రమ సంభంధాన్ని కలిగి ఉండగల్గిందనేదే ఇక్కడ శరత్ కి మిక్కిలి బాధ పెట్టిన విషయం. ఈ రోజు (14th Feb) ప్రేమికుల దినోత్సవం మరియు పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం శరత్ అమరుడు. వ్యక్తిత్వంలోను, విజేయుడు.
*** *** *** *** *** *** ***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
"లవ్ స్టోరీ ఆఫ్ ఏ కమాండో" కథ భావోద్వేగాలతో నిండిన ప్రేమ, విశ్వాసం, మోసం, దేశభక్తి అంశాలను కలగలిపిన దృఢమైన కథనం. శరత్ అనే కమాండో తన భార్య సుమిత్రను ఎంతో ప్రేమిస్తాడు, కానీ ఏడాదిన్నర తర్వాత ఇంటికి వచ్చి ఆమెను పరాయివాడితో చూడడం అతనికి తట్టుకోలేనిది అవుతుంది. తన దేశానికి శత్రువులతో పోరాడే ధైర్యం ఉన్నప్పటికీ, తన జీవితంలో అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతాడు. కథలో ప్రేమ కంటే విశ్వాసం ముఖ్యమైనదని చెప్పే శక్తివంతమైన సందేశం ఉంది. శరత్ తన ప్రాణాలను దేశ సేవకు అంకితం చేసినా, చివరికి భార్య మోసం వల్లనే మరణించాల్సి రావడం హృదయవిదారకంగా ఉంటుంది. ఈ కథను పుల్వామా అమరవీరుల దినోత్సవంతో అనుసంధానించడం రచయిత భావోద్వేగాన్ని మరింత పెంచేలా చేస్తుంది. మొత్తం మీద, ప్రేమ, నిబద్ధత, మోసం, దేశభక్తి వంటి అనేక మానవీయ భావోద్వేగాలను ప్రభావశీలంగా పాఠకులకు అందించిన కథ ఇది.