'Maarpu' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
సీన్ 1 :
“రేయ్! వెనుక నుంచి ఇంత అందంగా ఉంది. ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుందో? బైక్ స్పీడ్ పెంచు రా! ఈ రోజు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి” - ఇద్దరు అబ్బాయిల మధ్య డిస్కషన్.
సీన్ 2 :
“ఎప్పుడు చూడు వర్క్ చేస్తుంటాడు! ఫన్నీగా అసలు ఉండడు.. ఎప్పుడు చూడు మనల్ని వర్క్ చేయమని పోరు పెడుతుంటాడు” వాళ్ళ టీం లీడర్ గురించి డిస్కషన్ చేసారు మిగతా టీం మెంబర్స్.
సీన్ 3 :
“ఎప్పుడు చూడు.. ఆలా షార్ట్ వేసుకొని వెళ్ళ్తుంది. స్విమ్మింగ్ కోసం అంటుంది.. ఆడపిల్లలకి ఇది అవసరమా? ఆలాంటి డ్రెస్ చూస్తేనే కదా అబ్భాయిలు రెచ్చిపోయేది!” ఒక కాలనీలో ఆడవాళ్ళ మధ్య డిస్కషన్.
సీన్ 4 :
“ఏంటి.. వాళ్ళ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమా ఏంటి? ఎవరో బిడ్డని తెచ్చుకొని మరీ పెంచుకుంటున్నారు!" అపార్టుమెంట్లో ఇరుగు పొరుగు వారి మాటలు.
సీన్ 5 :
“అబ్బా! ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి మనుషులు.. ఒక స్టైల్ లేదు.. కలర్ లేదు..” తమ తోటి పాసెంజర్ ని చూసి మాట్లాడుకుంటున్నారు మరో ఇద్దరు పాసెంజర్స్..
సీన్ 6 :
ఒక సాయంత్రం వేళ టీవీ లో సాంగ్ ను చూస్తున్నారు. “హీరోయిన్ చూడు- ఎలాంటి బట్టలు వేసుకొందో.. ఈ సైడ్ క్యారెక్టర్ చూడు- ఎంత నల్లగా ఉందొ..”
ఆలా చూస్తూ వేరే ఛానల్ పెట్టాడు. ఏదో మూవీ ప్లే అవుతూంటే “ఆ కమెడియన్ చూడు- ఎంత బండగా ఉందొ.. తాను ఆ డ్రెస్ వేసుకోవాలా?” అని కామెంట్ చేస్తున్నారు ఓ ఇంట్లో తండ్రీకొడుకులు. అది అంతా తల్లి వింటూ ఉంది. తండ్రి కూడా నవ్వి 'వాళ్ళంతే' అని అంటున్నాడు. తరువాత కొడుకు న్యూస్ ఛానల్ పెట్టాడు. అపుడు హత్రాస్ లో జరిగిన రేప్ టెలికాస్ట్ చేస్తున్నారు. వెంటనే తండ్రీకొడుకులు ఇద్దరూ ఫోన్ తీసుకొని ఫేసుబుక్లో,ట్విట్టర్లో ,వాట్సాప్లో ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేసి, “మేము ఎంత గొప్ప పని చేశామో తెలుసా.. వాళ్లకు శిక్షా పడాలి అని స్టేటస్ లో పెట్టాము తెలుసా!" అంటారు. అమ్మ వాళ్లకు స్నాక్స్ ఇచ్చింది.
ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాము. ఇప్పుడు ఒక్కో సీన్ గురించి, అసలు దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాము.
సీన్ 1 :
ఆ ఇద్దరు అబ్బాయిలు ముందుకు వెళ్లి చూసారు. అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు, ఆ అబ్బాయిల్లో ఒకడు. ఎందుకుంటే తను అతని చెల్లి!
“రేయ్ మామా! నువ్వు అన్నట్టు బలే ఉంది కదా..” అన్నాడు ఇంకో అబ్బాయి.
“రేయ్! తను నా చెల్లిరా.. తనని నేను కామెంట్ చేసాను. మనం కామంతో కళ్ళు మూసుకు పోయి బిహేవ్ చేస్తున్నాము. మనం కామెంట్ చేసే ప్రతి అమ్మాయీ ఇంకొకరి చెల్లెలి కదా! “ అని వాళ్ళు ఇద్దరూ బాధ పడతారు.
సీన్ 2 :
ఆ టీం మెంబర్స్ చేసిన మిస్టేక్ వల్ల కోడ్ ఎర్రర్ వచ్చి, వాళ్లకి రావలసిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఆ కంపెనీ ఎండీ వాళ్లను జాబ్ నుంచి తీసివేయాలని చూస్తారు. వాళ్ళు చాలా కంగారు పడతారు, ఇప్పుడున్న సిట్యుయేషన్ లో జాబ్ పోతే ఎలా అని. వాళ్ళ టీం లీడర్ వచ్చి ఎండీ ని ఒప్పించి, వాళ్ళు చేసిన మిస్టేక్ తన మీద వేసుకొని.. నైట్ అంతా మేలుకొని కోడ్ ని కరెక్ట్ చేసి, ఆ ప్రాజెక్ట్ వాళ్లకు వచ్చేలా చేస్తాడు. వాళ్లంతా వాళ్ళ టీం లీడర్ ని తప్పుగా అనుకున్నందుకు బాధ పడి సారీ చెపుతారు. ఆ టీం లీడర్ "నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. నా పని చేసుకుంటూ వెళ్లడం ఇష్టం. పైగా మీ అందరూ చేసే కోడ్ నీ చూసుకోవాలిగా! అందుకు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలిగా! సో.. మీతో పాటు సరదాగా ఉండడం కుదరదు.మనకు తోడుగా పని ఉంటే మనం ఎప్పటికి ఒంటరిగా ఫీల్ అవ్వము ".
“మరి మీకు రిలాక్సేషన్ ఎలా సర్?”
“ఏమి ఉంది? 'మన తెలుగు కథలు'లో స్టోరీస్ చదువుతాను, రాస్తాను. అపుడప్పుడు 'మన తెలుగు కథలు' వాళ్ళు పెట్టే పోటీలలో కూడా పాల్గొంటాను. బహుమతి కోసం కాదు, నేర్చుకోవడం కోసం.
సీన్ 3 :
ఆ కాలనీలో వాళ్లంతా సరదాగా ట్రిప్ కి వెళ్తారు. పిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఒక చెరువులో పడిపోతే, ఆ అమ్మాయి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడుతుంది. తనని అన్న ఆడవాళ్లు "క్షమించమ్మా! నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము” అంటారు.
ఆ అమ్మాయి "నేను స్విమ్మింగ్ నేర్పించే ట్రైనీని. నేను చీర, డ్రెస్ వేసుకుంటే ఎలా నేర్పించగలను? చీర కట్టుకొని, లేదా చుడిదార్ లో నేర్పించడం సాధ్యం కాదు కదా! మనం వేసుకున్న దుస్తులను బట్టి ఏమీ జరగవు. ఎదుటివారి మనసులో నుండి పుడుతుంది, వారిలో ఉండే తప్పుడు ఆలోచన వల్ల పెరుగుతుంది. తప్పు చేసేసి, ‘బట్టలు చూసి ,సినిమాలు చూసి , తాగిన మత్తులో చేశాము’ అంటారు. అలాంటి వారు పసిపాప నుండి ముసిలి వారి వరకు కూడా వదిలిపెట్టలేదు. వారు తక్కువ బట్టలు వేసుకుంటారా? లేదు కదా! వేసుకునే దుస్తులను బట్టి క్యారెక్టర్ ని అంచనా వేయడం దయచేసి మానేయండి”అంది.
సీన్ 4 :
ఆ ఇరుగు పొరుగు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ వైఫ్, హస్బెండ్ వచ్చి స్వీట్స్ ఇస్తారు. ఎందుకు అంటే.. “మేము త్వరలో మరో బిడ్డకు తల్లిదండ్రులం కాబోతున్నాము. తాను గర్భవతి”
“మరి మీరు ఎందుకు ఎవరి బిడ్డనో పెంచుకుంటున్నారు?”
"ఆంటీ.. ప్లీజ్! ఆలా మాట్లాడకండి. తను మా బిడ్డ. ఎవరో ఆవిడ పాపని కని చనిపోయారు. మనం ఇలాంటివి చూసి 'అయ్యో' అంటాము. 'ఏమి చేస్తే బాగా ఉంటుంది?' అని అనుకోము. మాకు ఉన్న డబ్బుతో మేము ఆ బిడ్డను చూసుకోగలము. మా పాపకు రేపు పేరు పెడుతున్నాము. వచ్చి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి” అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇది విన్న వారి కంట్లో నీళ్లు..
సీన్ 5 :
వాళ్లిద్దరూ బ్యాంక్ కు వెళ్లారు. “రేయ్! మన బ్యాంకు వాళ్ళు మెయిన్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ చేసి మరీ కొత్త మేనేజర్ ని పిలిపించుకున్నారు అట! ఈ రోజు ఆయన వస్తున్నారట. ఎలా ఉంటారో.. అని ఆ రోజు ట్రైన్ లో ప్రయాణించిన పాసెంజర్స్ మాట్లాడుకుంటే ఉంటే అప్పుడే బ్యాంకు లోకి వచ్చిన మేనేజర్ ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరిని అయితే 'స్టైల్ గా లేడు, కలర్ లేడు' అని కామెంట్ చేసారో ఆ పాసెంజర్ ! వారికి అర్థం అయింది, ‘లుక్స్, కలర్ కాదు.. మీ పని మీకు గుర్తింపు ఇస్తుంది’ అని..
సీన్ 6 :
ఏవండీ! ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళాను. ఒకడు నన్ను చూసి ‘ఆంటీ! మీరు ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవారో ? అప్పుడు మీ వెనుక చాలా మంది పడి ఉంటారు కదా..’ అని ఇలా పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేసాడు. సరే అని లోపలకి వెళ్లి, కూరగాయలు తీసుకొని వస్తుంటే ఇంకో అతను డాష్ ఇచ్చాడు. కూరగాయలు అన్నీ కింద పడిపోయాయి. అవి నేను తీస్తూ ఉంటే, కావాలనే తాను నాకు హెల్ప్ చేస్తునట్టు నటించి నా చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది ఎవరు తనని ఏఏ ఉదేశ్యంతో చూస్తున్నారు” అని చెప్పింది.
తండ్రీకొడుకులు ఇద్దరికీ కోపం వచ్చేసి “ఎందుకు ఊరుకున్నావు నువ్వు? మాకు కాల్ చేసి వుంటే వాళ్ళ పని మేము చూసుకునే వాళ్లము కదా?” అన్నారు.
“కన్నా! మీ అమ్మను అలా అంటే నీకు చాల బాధగా ఉందే! మరి నువ్వు సినిమాలో హీరోయిన్ ను చూసి కామెంట్ చేసినప్పుడు ఏమైంది? తనూ ఒక అమ్మాయే కదా! నేను ఎలా లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉన్నానో, వాళ్ళు ఆలా హీరోయిన్ గా జాబ్ చేస్తున్నారు. అది వాళ్ళ వృత్తిధర్మం. అనుష్కాను చూస్తున్నావుగా! వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా డ్రెస్ వేసుకుంటారో. ఇంతక ముందు వచ్చిన న్యూస్ ని నువ్వు, మీ డాడీ అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే వేరే వాళ్ళను కామెంట్ చేస్తున్నారు. ఏంటి ఇది అసలు? శారీరకంగా బాధించి ఆనందం పొందటమే కాదు , మానసికంగా బాధించడం కూడా రేప్ కిందనే లెక్క! మీ అమ్మను కామెంట్ చేస్తే నీకు ఎంత బాధ అనిపించింది? అలాగే నువ్వు కామెంట్ చేసే అమ్మాయి కూడా వేరే వాళ్ళ అక్క, చెల్లెలు కదా! వాళ్ళు కూడా అంతే బాధ పడతారు కదా! అర్థం అయిందా కన్నా? ఫస్ట్ మన మెంటాలిటీని మార్చుకోవాలి .స్టేటస్ లో పెట్టడం గొప్ప కాదు. అలా జరగకుండా అందరి మైండ్ సెట్ ని మార్చాలి.. అర్థం అయిందా?”
తండ్రీకొడుకులు ఇద్దరికీ కూడా వాళ్ళ చేసిన తప్పు ఏంటో అర్థం అయింది.
"మనలో ఉంది తప్పు. ఎంత సేపూ మనమే ఎదుటివారిలో లోపాలను , తప్పులను వెతకడం చేస్తుంటాము. అది మానుకోవాలి. మార్పు అనేది ఎక్కడి నుండో రాదు. మన లోంచి రావాలి.
సీరియల్ లో, మూవీస్ లో విలన్స్ ని తిట్టటం చేస్తాము .. కానీ రియల్ లైఫ్ లో మనము కూడా విలన్ లాగా ప్రవర్తిస్తుంటాము.
***మార్పు రావాలి***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
Comments