#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మధురము, #Madhuramu
Madhuramu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 01/12/2024
మధురము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
పాప పలుకు మధురము
జుంటితేనె మధురము
దేశ భాషలందున
తెలుగు భాష మధురము
చిలుక పలుకులు మధురము
పంచదార మధురము
అన్నింటి కంటే
అమ్మ మాట మధురము
అమృతమెంతో మధురము
కోయిల గొంతు మధురము
సృష్టిలోనే చూడ
దైవ నామం మధురము
జోలపాట మధురము
ఈల పాట మధురము
జీవితాలు దిద్దే
గురువు వాక్కు మధురము
వెన్న ముద్ద మధురము
పాలకోవ మధురము
దైవ సృష్టిలోన
ఎన్నెన్నో మధురము
-గద్వాల సోమన్న
コメント