#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #MagicNumber, #మేజిక్నెంబర్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Magic Number - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 11/01/2025
మేజిక్ నెంబర్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"హలో.. ! ఎవరు.. ?" అంటూ ఫోన్ ఎత్తింది కాంతం
"నేనే కాంతం.. నీ మొగుడ్ని.. " అన్నాడు సుబ్బారావు
"అదేంటి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తున్నారు.. మీ ఫోన్ ఏది?"
"నా కర్మకాలి.. ఇంట్లోనే ఫోన్ మర్చిపోయాను.. మన ఇంట్లోకి రావడానికి మన సెక్యూరిటీ ఓటీపీ పంపించాడు.. చెబితేనే లోపలికి పంపిస్తాడంట.. అంతా నా కర్మ.. "
"అంతా మీరు చేసుకున్నదే.. బ్యాంకు ఉద్యోగం చేస్తూ.. ఆ ఓటీపీ గోల ఇంట్లోకి కుడా తెచ్చారు. బ్యాంకు పద్దతులు ఇంట్లో వారికి కుడా అమలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి. పాటించపోతే ఎక్కడ ఉద్యోగంలోంచి తెసేస్తారోనని వాడి భయం పాపం.. ఏం చేస్తాడు?"
"టైం దొరికిందని.. నా మీద మాటలు విసురుతున్నావా కాంతం.. ? కాస్త నా ఫోన్ చూసి.. ఆ ఓటీపీ ఏదో చెప్పెయే.. వీడికి చెప్పేసి ఇంట్లోకి వచ్చేస్తాను.. "
"చెప్తాను ఉండండీ.. హా.. రాసుకోండి.."
"గుర్తుంటుందిలే.. చెప్పు.. "
***
హమ్మయ్యా.. వచ్చారా.. ! అందుకే చెప్పా.. ఒంటి మీద చొక్కా లేకపోయినా పర్వాలేదు గానీ.. ఫోన్ లేకుండా బయటకు వెళ్ళకూడదని.. వింటారా.. ?" అంది కాంతం
"దానికి బదులు.. నేను బయటకు వెళ్ళేటప్పుడు నా ఫోన్ గురించి గుర్తు చేయొచ్చుగా"
"ఈ ఓటీపీ వెర్రి లోకమంతా పట్టుకుంది. మొన్నటికి మొన్న.. నగల షాప్ కి వెళ్తే, నేను బ్యాంకు మేనేజర్ గారి భార్యనని చెప్పినా.. వారు నమ్మలేదు. అప్పుడు మీ నెంబర్ కి ఆ ఓటీపీ పంపించి.. నన్ను చెప్పమన్నారు. మీలాగే లోకమంతా తగలడింది చూడండి. ఏదో రేపు మీ ఆఫీస్ స్టాఫ్ పెళ్ళికి వెళ్ళాలని షాపింగ్ కి వెళ్తే.. ఎంత అవమానం చూడండి..
పార్సెల్ పంపాలన్నా ఓటీపీ, పార్సెల్ తీసుకోవాలన్నా ఓటీపీ, కార్డు కి ఓటీపీ, డబ్బులు పంపించాలన్న, డబ్బులు తీసుకోవాలన్న అన్నింటికీ ఆ మేజిక్ నెంబర్. మొన్న మా ఫ్రెండ్ ఇంపార్టెంట్ పార్సెల్ తీసుకోవడానికి ఆ మేజిక్ నెంబర్ అడిగారు. పాపం దాని ఫోన్ పోయింది.. పార్సెల్ వెనుకకు పోయింది. అది ఒకటే ఏడుపు.. ఐడి ప్రూఫ్ ఇస్తానన్నా ఒప్పుకోలేదంట పాపం..
ఏమండీ.. ! రేపు పెళ్ళికి మన అమ్మాయి రాదు. దానికి ఎగ్జామ్స్ అంట.. నాకా వండి పెట్టడానికి అంత టైం లేదు. వంట వండుతూ కూర్చుంటే, మేకప్ ఎలా వేసుకోను చెప్పండి.. ?"
"పోనిలే అమ్మా.. ! ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసేయ్ నీ ఫోన్ లోంచి.. నేను తీసుకుంటాను.. " అంది కూతురు.
"ఇదిగో పెట్టసాను.. వచ్చాక పార్సెల్ తీసుకుని తిని, ఇంట్లో ఉండు.. మేము ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము.. "
***
"మొత్తానికి పెళ్ళిమండపానికి చేరుకున్నాము. ఆ జంట బాగుంది కదండీ.. "
"అవును కాంతం.. చూస్తుంటే, మన పెళ్ళి రోజులే గుర్తొస్తున్నాయి.. "
"మీరు మరీనూ.. మాటలు ఆపి పదండి.. చదివింపులు జరుగుతున్నాయి. అయ్యో చదివింపుల కవర్ ఇంట్లోనే మరిచానే.. ఇప్పుడు ఎలాగ.. ?"
"అక్కడ చూడు.. స్కానింగ్ ఫెసిలిటీ కుడా ఉంది.. వెళ్లి ఒక వెయ్యినూట పదహారులు స్కాన్ చేసి వస్తాను.. "
"మేనేజర్ కదా.. ఆ మాత్రం చెయ్యాలి.. కామెంట్స్ లో మీ పేరు రాయండి.. "
"అలాగే లే.. "
ఈ లోపు ఫోన్ రింగ్ అయింది..
"అమ్మాయి కాల్ చేస్తోంది.. ఇప్పటికే నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ బ్యాగ్ లో ఉండిపోయి చూసుకోలేదు.. " అంది కాంతం
"అమ్మా.. ! ఎన్ని సార్లు చెయ్యాలే.. బిరియాని వాడు ఓటీపీ అడిగాడు.. నువ్వా ఫోన్ ఎత్తలేదు. ఫైవ్ మినిట్స్ లో ఓటీపీ చెప్పక పొతే, బిరియాని వాడికే సొంతం అట.. నా ఎదురుగానే.. ఎలా తింటున్నాడు చూడమ్మా.. "
"పోనిలే.. ! ఏం చేస్తాం.. ? మళ్ళీ ఆర్డర్ పెడతాను.. ఈసారి పార్సెల్ తీసుకుని నువ్వు ఇచ్చిన వాడి ఎదురుగా తిను.. "అంటూ ఉండగా ఫోన్ లో ఛార్జ్ అయిపోయి ఆగిపోయింది
"ఇద్దరి ఫోన్ లో ఛార్జ్ అయిపోయింది.. ఉదయం ఛార్జ్ పెట్టడం మరిచిపోయాను. బయట ఛార్జర్ వీటికి పనిచెయ్యదు.. " అన్నాడు సుబ్బారావు
"ఇక ఫోన్ అవసరం ఉండదు లెండి.. ! పదండి భోజనాలకి.. తెగ ఆకలి వేసేస్తోంది.. "
భోజనాల దగ్గర..
"సర్.. మీ ఓటీపీ చెబుతారా.. ?"
" అదేంటి.. ?"
"అక్కడ మీరు గిఫ్ట్స్ చదివించి వుంటారు కదా.. మీ ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ పంపిస్తారు. అది ఇక్కడ చెబితే, భోజనం సర్వ్ చేస్తాం.. "
'మా ఆఫీసులో కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్ లేదే.. ' అనుకున్నాడు సుబ్బారావు
"మా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందయ్యా.. " అంటూ ముఖం అదోలాగ పెట్టాడు సుబ్బారావు
"మా ఆయన ఎవరో తెలుసా.. మేనేజర్.. " అంది కాంతం
"మేనేజర్ అయినా సరే.. ! నో ఓటీపీ, నో ఫుడ్.. మళ్ళీ మీరు కళ్యాణ మండపానికి వెళ్ళాలన్నా ఓటీపీ చెప్పాల్సిందే.. " అన్నాడు ఫుడ్ సర్వ్ చేసేవాడు
"ఏమిటో నాకు బుర్ర తిరుగుతోంది కాంతం.. "
"వాడెవడో.. మిమల్ని మించిపోయాడండి.. ! ఇక చేసేది ఏముంది.. ! మీరా ఎవరిని డబ్బులు అడగలేరు.. మేనేజర్ కదా.. "
"అవును.. నిజమే.. !" అన్నాడు సుబ్బారావు
"బయట దర్జాగా హోటల్ లో తిందాం పదండి.. మేనేజర్ కదా " అంది కాంతం
"ఫోన్ లో ఛార్జ్ లేదు కదా.. మరి ఎలా ?" అన్నాడు సుబ్బారావు
"క్రెడిట్ కార్డు తియ్యండి.. అందులో బోలెడంత డబ్బు ఉంటుంది కదా.. "
"అవును కాంతం.. ! హోటల్ కెళ్ళి బాగా తిందాము.. పెళ్ళి ఫుడ్ కన్నా రిచ్ ఫుడ్ తిందాము "
సుబ్బారావు, కాంతం కడుపునిండా హోటల్ లో వెరైటీస్ అన్నీ లాగించేసారు. కూతురు కోసం కుడా పార్సెల్ ప్యాక్ చేయించారు..
"సర్.. ! ఇదిగోండి బిల్.. "
"ఇదిగో కార్డు తీసుకో.. " అంటూ గొప్పగా కార్డు ఇచ్చాడు సుబ్బారావు
"మీ కార్డు ఓటీపీ అడుగుతోంది సర్.. చెప్పండి.. "
"అయ్యో మరచాను.. క్రెడిట్ కార్డుకి ఓటీపీ సెక్యూరిటీ కొత్తగా పెట్టారు.. పైగా నా ఫోన్ లో ఛార్జ్ కూడా లేదు.. ఇప్పుడెలా.. ?"
"ఇంకెందుకు చెప్పండి.. వెళ్లి మీ చేతి ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. లేకపొతే పరువు పోతుంది.. మేనేజర్ కదా" అంది కాంతం
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
So nice 😀
కథ ముచ్చటగా వుంది😀