top of page

మహానటి

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Mahanati, #మహానటి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Mahanati - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 22/02/2025

మహానటితెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



రింగ్ అవుతున్న ఫోన్ తీసి "హలో.. !" అంది మీనాక్షి.


"హలో అమ్మా.. ! ఎలా ఉన్నావే.. ?" అడిగింది కూతురు జానకి. 


"ఇప్పటివరకు బాగానే ఉన్నాను.. నువ్వు చెప్పు.. "


"బీపీ టాబ్లెట్ వేసుకున్నావా.. ?"


"వేసుకున్నాను లే.. విషయం చెప్పు.. "


"అల్లుడుగారు.. అల్లుడుగారు.. "


"అల్లుడు సతీష్ కి ఏమైందే.. ? తొందరగా చెప్పు.. బీపీ పెరుగుతోంది ఇక్కడ.. " అంది మీనాక్షి. 


"సతీష్ ని నమ్మటానికి లేదే.. ! మొన్న ఆఫీస్ ట్రిప్ మీద ఢిల్లీ వెళ్ళారా.. అక్కడ పాత గర్ల్ ఫ్రెండ్ కనిపించింది. ఇంకా పెళ్లి అవలేదని చెప్పి.. తన పాత ప్రేమని గుర్తుచేసింది. అప్పట్లో ఇద్దామనుకున్న లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసిందే.. "


"మరి సతీష్ ఏం చేసాడో చెప్పు.. నా బీపీ ఇంకా పెరుగుతోంది.. "


"ఏం చేస్తాడు చెప్పు.. ! అందరు మగాళ్లు చేసేదే చేసాడు.. లెటర్ తీసుకుని.. 'ఐ లవ్ యు టూ' అని చెప్పేసాడు.."


"నిజమా.. !"


"అంతేకాదు.. ! ఇద్దరు గుడిలో పెళ్ళి కూడా చేసుకున్నారే.. " అంటూ ఏడుపు మొదలుపెట్టింది జానకి.


"పెళ్ళి కూడా చేసేసుకున్నాడా! అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు.. అల్లుకుపోతారు ఈ మగాళ్ళు.. " అంటూ మండిపడింది మీనాక్షి. 


"జానకి బతుకు అన్యాయం అయిపోయిందే అమ్మా.. ! అందుకే నీకు ఫోన్ చేసాను.. కొంచం ఓదార్చవే అమ్మా.. ! నాన్నతో కూడా విషయం చెప్పవే.. "


"చెప్పి.. ఇద్దరం ఓదార్చుకుని.. వెంటనే నీ దగ్గరకు బయల్దేరి వస్తాము.. ధైర్యంగా ఉండు జానకి"


ఇంకో రెండు బీపీ మాత్రలు వేసుకుని.. ఎక్కువ రేట్ పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని మరీ బయల్దేరి వచ్చారు అమ్మ, నాన్న.. 


"అమ్మా.. ! నా బతుకు అన్యాయం అయిపోయిందే.. " అంటూ తల్లిని చూసిన వెంటనే బోరున ఏడుపు మొదలుపెట్టింది జానకి.. ఈసారి ముక్కు చీది మరీ గట్టిగా ఏడుపు కంటిన్యూ చేసింది. 


"బాధపడకు తల్లీ.. ! అల్లుడిని రానీ.. గట్టిగా అడిగేస్తాను.. నా బీపీ ప్రతాపం అంతా చూపిస్తా.. ! మీ నాన్న కుడా బీపీ టాబ్లెట్ వేసుకోకుండా కోపంగా ఉన్నారు.. అల్లుడిని కడిగెయ్యడానికి రెడీ గా ఉన్నారు.. "


గేట్ మెల్లగా తీసుకుంటూ సతీష్ ఇంటి లోపలికి వచ్చాడు.. 


"ఏవయ్యా సతీష్.. ! మంచివాడివని మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే, ఇలా చేస్తావా.. ?" ఆ మాటల్లో అత్తగారు బీపీ ప్రతాపం కనిపించింది. 


"నేను ఏం చేసాను? జానకీ.. ! ఏమైనా విశేషమా.. ? నాకు చెప్పలేదే.. కంగ్రాట్స్" అన్నాడు సతీష్. 


"నీ విషయం పక్కన పెట్టి.. ఇవేం మాటలు.. అయినా నీకు చెప్పాలి కంగ్రాట్స్" అంది అత్తగారు సీరియస్ గా. 


"నేనేం చేసాను.. ? ఆఫీస్ కి వెళ్లి ఇంటికి రావడం కూడా తప్పేనా.. ?"


"బుకాయించకు.. ఎక్కడా అమ్మాయి.. ?"


"ఎవరు.. ?"


"నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు కదా.. నీ పాత ప్రియురాలు ఎక్కడా అని.. "


"ఇలా మీకు ఎవరు చెప్పారు అత్తయ్యా.. ?"


"చెప్పడమేమిటి.. మా అమ్మాయి ముఖం చూడు.. కళ్ళు ఎంత ఉబ్బిపోయాయో! పాపం చాలా సేపటినుంచి ఏడుస్తూనే ఉంది.. దాని ముక్కు చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో"


"అయితే.. ఇదంతా మా జానకి నటనే.. ! ముందు నేను చెప్పింది కొంచం వినండి అత్తయ్యా.. !" అంటూ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసాడు సతీష్. 


*****


"మొన్న మీ అమ్మాయి జానకి నాకు ఫోన్ చేసి.. అత్తయ్యగారికి, మావయ్యగారికి యాక్సిడెంట్ అయ్యింది. కొడుకుని చూడడం కోసం వస్తుంటే, హైవే పై లారీ గుద్దేసిందని చెప్పింది. అప్పుడు మీ అమ్మాయి.. 


"ఏమండీ.. ! మీ కెంత కష్టం వచ్చిందండీ.. ! వెంటనే బయల్దేరి వచ్చేయండి.. అంబులెన్స్ ఇంటికే వచ్చేసింది. మిమల్ని నేను ఓదారుస్తాను.. నన్ను మీరు ఓదార్చండి" అంటూ జానకి బాధతో అంది. 


"నువ్వు ఎంత మంచిదానవే.. నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు.. నువ్వే లేకపోతే నేను ఏమైపోయేవాడినో" అని ఏడుస్తూ అన్నాడు సతీష్. 


హడావిడిగా ఇంటికి చేరిన నాకు.. జానకి, అమ్మ నాన్నతో కలిసి టీవీ లో సీరియల్ చూస్తోంది.. 


"అమ్మ, నాన్న మీరు బతికే ఉన్నారా.. ?" అని అడిగేసాను. 


"మాకేం రా.. ! బ్రహ్మాండంగా ఉన్నాము.. చూస్తున్నావుగా! కోడలు చేసిన జంతికలు తింటూ సీరియల్ చూస్తున్నాము.. నువ్వూ టేస్ట్ చూడు.. బాగున్నాయి. "


"మీ కోడలు.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందో మీకు తెలుసా నాన్నా.. ?"


"మీ మధ్య మాటలు మాకెందుకు రా.. ?"


"అది కాదు.. నీకూ, అమ్మకి యాక్సిడెంట్ అయి పైకి పోయారని చెప్పింది.. "


"అదా.. సీరియల్ లో పాపం అత్తయ్యగారు, మావయ్యగారు యాక్సిడెంట్ లో పొతే.. అంబులెన్స్ లో ఇంటికి తీసుకుని వచ్చారు. అక్కడ జానకి సతీష్ కి ఫోన్ చేస్తే, ఇక్కడ నీకు మీ ఆవిడ జానకి ఫోన్ చేసింది అంతే.. !"


"అంతేనా ఏమిటి.. ? ఈ సీరియల్స్ గోల కాదుగాని.. ఎంత టెన్షన్ పడ్డానో.. కొంచం వుంటే, నేను అంబులెన్స్ లో ఇంటికి వచ్చేవాడిని తెలుసా.. !"


"ఏం చెయ్యమంటారు.. ఎప్పుడైనా ఇలా సతీష్ అని పేరు వినగానే, సీరియల్ లో లీనం అయిపోతానంతే! మీరే గుర్తొచ్చి అలా నటించేసాను.. అంతే.. !" మెల్లగా అంది జానకి. 


"నువ్వు నిజంగా మహానటి.. " అంటూ దణ్ణం పెట్టాడు సతీష్.. అదే టైం లో మహానటి పాట టీవీ లో రావడంతో, నడుం పైన రెండు చేతులు వేసుకుని పొంగిపోయింది జానకి. 


*****


"ఇప్పుడు అర్ధమైందా అత్తయ్యా.. మీకు మీ అమ్మాయి చెప్పింది ఏమిటో.. "


"చెప్పు జానకీ.. ! మీ అమ్మకీ నీ నటన తెలియాలి కదా.. లేకపోతే ఆమె ఎన్ని బీపీ మాత్రలు వేసుకున్న లాభం ఉండదు".


"అదీ.. అదీ.. 'అల్లుడుగారు' సీరియల్ లో సతీష్.. జానకి కి అన్యాయం చేసి, ఢిల్లీ లో ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. సతీష్, జానకి పేర్లు వినగానే, నాకు ఏదో అయిపోయి, వెంటనే నీకు ఫోన్ చేసేసాను.. అంతే అమ్మ.. అంతే.. !".


"నువ్వు నిజంగా మహానటి.. " అంటూ కూతురికి దణ్ణం పెట్టి.. "ఇక కదలండి ఇంటికి.. " అంటూ భర్త కు సైగలు చేసింది మీనాక్షి. 


************ 

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


1 Yorum


mk kumar
mk kumar
23 Şub

ఈ కథ హాస్యభరితంగా, కుటుంబ సంబంధాలను పటిష్టంగా చెప్పే విధంగా ఉంటుంది. ముఖ్యంగా, రోజువారీ జీవితంలో జరిగే మోసపోవడాలు, అపోహలు, వాటి వల్ల కలిగే వినోదాన్ని చక్కగా చూపించారు.


కథలో ప్రధానంగా జానకి అనే యువతి తన భర్త సతీష్ గురించి తన తల్లికి ఫోన్‌లో చెప్పే అపోహ, ఆ అపోహ వల్ల కలిగే కుటుంబ ఆందోళన, చివరికి నిజం వెలుగులోకి వచ్చి, అది ఒక హాస్యాస్పదమైన సంఘటనగా మారడం చక్కగా రచించారు. ముఖ్యంగా, తల్లి మీనాక్షి, తండ్రి, అల్లుడు సతీష్ పాత్రల మధ్య సంభాషణలు ఎంతో వినోదంగా ఉంటాయి.


కథలో టీవీ సీరియల్స్ వల్ల కలిగే ప్రభావాన్ని హాస్యపూరితంగా చూపించడం ప్రధాన ఆకర్షణ. సాధారణంగా పెద్దవారు సీరియల్స్‌ చూసి, వాటిని నిజమని భావించి స్పందించడం తరచుగా జరుగుతుంది. ఈ కథలో అదే అంశాన్ని చక్కగా వినోదాత్మకంగా వర్ణించారు.


మొత్తంగా, కథ సరదాగా సాగిపోతూ చివరికి హాస్యంతో ముగుస్తుంది. రచయిత తాత మోహనకృష్ణ గారు ఈ కథ ద్వారా కుటుంబ సంబంధాలు, అపోహలు, సీరియల్స్ ప్రభావం వంటి అంశాలను హాస్యంగా అందించారు.


Beğen
bottom of page