#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మహిలోమహనీయులు, #MahiloMahaniyulu
Mahilo Mahaniyulu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 17/12/2024
మహిలో మహనీయులు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
అన్నం పెట్టే అన్నదాతలు
అవనిలో ఆపద్భాంధువులు
దేశ సరిహద్దుల్లో సైనికులు
వారే! వారే! మన మహనీయులు
విద్యాబుద్ధులు నేర్పు గురుదేవులు
జన్మనిచ్చిన అమ్మానాన్నలు
జగతి ప్రగతికి శ్రమించు కార్మికులు
వారే! వారే!ఘన మహనీయులు
మానవత్వం చూపే వ్యక్తులు
దాత్రుత్వం కలిగిన మనసులు
దైవత్వం మూర్తీభవించే
వారే! వారే!!కదా మహనీయులు
ఆపదలోనూ ఆదరించే
ఆశయ సాధనలో తోడుండే
అక్కరలో చేయూత నిచ్చే
వారే! నిజమైన మహనీయులు
సత్య మార్గమును ప్రబోధించే
ముత్యము మాదిరి జీవించే
ఘన వ్యక్తిత్వం తొణికిసలాడే
ఆదర్శమూర్తులే మహనీయులు
దేశాభివృద్ధికి పాటుపడే
మాతృభూమి కొరకు నిలబడే
క్రొవ్వొత్తి రీతినికరిగిపోయే
త్యాగమూర్తులే మహనీయులు
-గద్వాల సోమన్న
Yorumlar