top of page
Writer's pictureDinavahi Sathyavathi

మల్లవ్వ

#DinavahiSathyavathi, #దినవహిసత్యవతి, #Mallavva, #మల్లవ్వ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Mallavva - New Telugu Story Written By Dinavahi Sathyavathi

Published In manatelugukathalu.com On 03/12/2024

మల్లవ్వ - తెలుగు కథ

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



పూజకి పూవులు, పత్రీ కొనడానికి మార్కెట్ వచ్చాడు భార్గవ, కొడుకుని వెంటబెట్టుకుని.

 

ఆ మర్నాడు గౌరీ పూజ అవడానో ఏమో అప్పటికే, పూవులు అమ్ముడు పోయి, పూల మార్కెట్ వెలవెలబోతోంది. 


ఎవరి వద్దనైనా పూవులు దొరుకుతాయేమో అని అటూ ఇటూ చూస్తుండగా “నాన్నా అదిగో ఆ అవ్వ దగ్గర బుట్టలో బోలెడు పూవులు ఉన్నాయి” అన్న కొడుకు మాటలకి ఆవైపు చూసి అటుగా నడిచాడు. 


పూలమ్మి అటుగా తిరిగి ఎవరితోనో మాట్లాడుతోంది. 

దగ్గరకా వెళ్ళాక “ఛి.. ఛి.. ఇక్కడ వద్దు పద. ఇంకెవరి వద్దనైనా దొరుకుతాయేమో చూద్దాము” అన్నాడు ముఖం అసహ్యంగా పెట్టి. 


“ఏమైంది నాన్నా?” 


“అటు చూడు”.. ఆమె కాళ్ళకు అంటిన బురదా, పూలమ్మి ఆకారం చూపించాడు కొడుక్కి. 


“కానీ అవ్వ దగ్గర పూలు బాగున్నాయిగా” 


ఆ మాటలు చెవిన పడ్డాయేమో శబ్దం వినవచ్చిన వైపు తిరిగి చూసింది అవ్వ. 

### 

మల్లి మధ్యతరగతి కుటుంబీకురాలు. పెళ్ళై ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టకపోయేటప్పటికి మల్లిని వదిలేసి మరో మనువు చేసుకున్నాడు ఆమె మొగుడు. 


తన దుర్భాగ్యానికి మల్లి ఏడవని రోజు లేదు. బ్రతుకు మీద ఆశ చచ్చి ప్రాణం తీసుకుందామని బయలుదేరింది. 


నదిలో దూకబోతుండగా ఒడ్డున ఓ ప్రక్కగా బురదలో కూర్చుని ‘అమ్మా’ అంటూ ఏడుస్తున్న ఒక పసివాడు కనిపించాడు. 

తాను ఎందుకు వచ్చిందీ మర్చిపోయి గబగబా అటుగా పరిగెత్తి పిల్లవాడిని ఒడిలోకి తీసుకుని “చిన్నా ఏమైందిరా?” అంటూ ఓదార్చింది. 


పిల్లవాడు వెక్కుతూ “అమ్మ, అమ్మ.. ” అంటూ నదివైపు చూపించి మళ్ళీ ఘొల్లుమన్నాడు. 


పరిస్థితి అర్థం చేసుకున్న మల్లి, పసివాడిని తనతో తెచ్చుకుని దేవుడిచ్చిన బిడ్డలా భావించి, వాడే లోకంగా పెంచి, పెద్ద చేసింది. 


ఆ క్రమంలో ఒళ్ళు హూనమయ్యేలా అక్కడా ఇక్కడా చాకిరీ చేసి బిడ్డని గొప్ప చదువులు చదివించింది. 


పెద్ద ఉద్యోగం వచ్చి కాసిని డబ్బులు చేత పడగానే వాడికి కళ్ళు నెత్తికి ఎక్కాయి. 


బీదరికంలో పనిమనిషిలా ఉన్న మల్లిని తన తల్లి అని చెప్పుకోవడానికి కూడా అవమానంగా భావించి, తాను ఎక్కడనుంచి వచ్చాడో కూడా మరిచిపోయి, ఓ రోజు చెప్పా పెట్టకుండా తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి తన సుఖం తాను చూసుకున్నాడు. 


ఆ రోజునుంచీ మల్లి బ్రతుకు మళ్ళీ మొదటికి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉంచుకోకుండా అంతా కొడుకుకే కట్టబెట్టినందుకు తనకు తగినశాస్తి జరిగిందని బాధపడి బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చేసింది. 

 ### 

ఎదురుగా నిలబడ్డ ముద్దుగారే బాబుని చూసి చిన్నగా నవ్వి “ పూవులు కావాలా చిన్నా, ఇంద తీసుకో” బుట్టలో పూలన్నీ పొట్లం కట్టి పిల్లవాడి చేతిలో ఉంచుతూ “నా కాళ్ళకి మాత్రమే బురద ఉందిరా కానీ కొంతమంది మనుషుల మనసంతా బురదే. ఈ బురదదేముందీ కాళ్ళు కడుక్కుంటే పోతుంది కానీ మనసుకి అంటిన బురద ఏం పెట్టి తోమినా పోదురా చిన్నా” అంటూ బాబు బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని, ప్రక్కనే, తనని చూసి స్థాణువులా నిలబడిపోయిన భార్గవవైపు తీక్షణమైన చూపొకటి విసిరి, ముందుకు సాగిపోయింది, అనాథ భార్గవను పెంచిన తల్లి, మల్లవ్వ ఉర్ఫ్ మల్లి! 

 *****


దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


37 views0 comments

Comments


bottom of page