top of page
Writer's pictureMohana Krishna Tata

మళ్ళీ పెళ్ళి


'Malli Pelli' - New Telugu Story Written By Mohana Krishna Tata

'మళ్ళీ పెళ్ళి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


మురళి పెళ్ళి కి తొందర పడుతున్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ.. పెళ్లిళ్లు చేసుకుని.. చక్కగా వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే.. తట్టుకోలేకపోయాడు..


"నాకేమి తక్కువ!.. మంచి ఉద్యోగం.. కాస్తో కూస్తో అందగాడిని.. మంచివాడిని. అన్నిటికంటే.. మంచి రసికుడని".. అనుకున్నాడు. మురళి..


రోజూ అద్దం ముందర నిల్చొని.. తన జుట్టు.. ఒకటి కి పది సార్లు సవరిస్తూ.. మీసాలు తిప్పుతూ.. రెండు రింగులు ముందుకు లాగుతూ.. ఇలాగ.. తెగ ఫీల్ అయిపోతూవుంటాడు..


ఇప్పటిదాకా చాలా సంబంధాలు వచ్చాయి.. కానీ ఎవరు నచ్చలేదు మురళి కి. అమ్మాయిలకు కూడా.. చాలా ఎక్కువ ఆశలే కాబట్టి.. వాళ్ళు కూడా 'నో' అంటున్నారు.


"ఎందుకురా! తొందర పడతావు.. ఎంత వయసైపోయిందని.. ఇంకా ౩౦ దాటాయి.. అంతే కదా! 40 దాటి.. ఇంకా పెళ్ళి కానీ ప్రసాదులు చాలా మందే ఉన్నారు మన కాలనీ లో.. "


"వాళ్ళ విషయం వేరే బామ్మ! నా విషయం వేరే.. నాకు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనీ ఉంది.. "


"తొందరపడి.. ఏ పిల్లని పెడితే ఆ పిల్లని చేసుకున్నావనుకో.. జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది.. ఆలోచించుకో.. "


"పర్వాలేదు బామ్మ!.. మా ఫ్రెండ్స్ ముందు.. నా పెళ్ళాన్ని తీసుకుని.. అలా బైక్ మీద తిప్పాలి.. "


"ఈసారి సంబంధం ఎలాగైనా ఖాయం చేసేద్దాం అయితే!.. "


"మురళి కి చాలా సంతోషం వేసింది.. ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే అనుకున్నాడు"


పెళ్ళిచూపులు రోజు.. అమ్మాయి ని చూస్తున్నాడు మురళి..

"బామ్మా! అమ్మాయి చాలా అందంగా ఉందే.. !"


"అందం కాదురా!.. మనసు ముఖ్యం.. " అంది బామ్మ.


"మనసు మార్చుకోవచ్చు గాని.. అందం లేకపోతే ఎలా వస్తుంది బామ్మ.. ?”


"అలాగ వెళ్ళి.. అమ్మాయి తో మాట్లాడు.. "


"ఇద్దరు మాట్లాడుకొని.. పెళ్ళి కి ఓకే అన్నారు"

పెళ్ళి ఉన్నంతలో బానే జరిగింది..

***


పెళ్ళైన వారం రోజుల్లోనే.. మురళి కి పెళ్ళాం గురించి కొంచం కొంచం గా.. తెలిసి వస్తుంది.. మాయ చాలా మొండిది, మాట వినదని.. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నటుగా వ్యహరిస్తుందని.. కొత్త కాబట్టి.. ఏమి అనలేక పోయాడు..


వంట కూడా అంతంత మాత్రంగానే చేస్తుంది.. నాలుగు రోజులు ఓపిక పట్టాడు.. 5 రోజు.. మాత్రం గట్టిగా అడిగేశాడు..

"నీకు వంట చెయ్యడం వచ్చా?"


"నాకు ఎంత వస్తే అంతే చేస్తాను.. మీరు సర్దుకోవాలి.. అంది మాయ"


"పోనీ.. పెద్దవారి దగ్గర అడిగి నేర్చుకో.. మా బామ్మ.. లేక.. మీ అమ్మ దగ్గర గానీ "


"నాకు అవసరం లేదు.. నాకు అంతా వచ్చు.. "


"రాత్రి కూడా ఒక ముద్దు ముచ్చట సరిగ్గా లేదు.. ఏమిటో ఈ మొండితనం?" అన్నాడు మురళి


"నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను!.. "


అందంగా ఉంటే సరిపోదు అని.. మనసు ముఖ్యమని తెలుసుకున్నాడు మురళి..


రోజు రోజు కు భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువ అవుతున్నాయి.. ప్రతిదానికి.. మాయ మొండితనం చేత, భర్త మాట అసలు వినడమే మానేసింది..


దుబారా ఖర్చు చేయడం..

వంట ఏదో తూతూ మంత్రం గా చెయ్యడమూ..

సరదా.. సరసం కరువైపోవడం..


ఇంటికీ ఎవరైనా వస్తే.. సరిగ్గా మాట్లాడక పోవడం.. ఏంటో.. ఈ ధోరణి.. అనుకున్నాడు మురళి..


"ఇలా కాదని.. మురళి వాళ్ళ అత్తగారికి.. కాల్ చేసి.. విషయం చెప్పాడు.. వెంటనే అత్తగారు, మావగారు బయల్దేరి వచ్చారు.. "


"అమ్మ ని చుసిన మాయ.. అమ్మా! అంటూ ఏడుస్తూ..

ఆయన నన్ను టార్చర్ పెడుతున్నారు.. ఎప్పుడూ.. అది బాగోలేదని.. ఇది బాగోలేదని.. తిడుతూ ఉంటారే!" అని చెప్పింది మాయ


"అదేంటి!.. నేను చెప్పింది వినండి.. " అని ఏదో చెప్పబోయాడు మురళి


"ఏమిటయ్యా! చెప్పేది.. అమ్మాయి అంత గా ఏడుస్తుంటే..

మాకేమి లోటు లేదయ్యా.. మా ఇంటికి తీసుకుని వెళ్లి మా అమ్మాయిని రాణి లాగ చూసుకుంటాం".. అని చెప్పి మాయ ను తీసుకుని వెళ్లిపోయింది.. తల్లి.

భర్త మాట కూడా పట్టించుకోలేదు.. మురళి అత్తగారు..

తల్లీ.. కూతురు దొందు దొందే అనుకున్నాడు.. మురళి


మాయ.. తానే వస్తుందేమో.. అని ఆపలేదు మురళి.. అయినా.. తన మాట వినే స్థితిలో లేరు ఇద్దరూ.. అనుకున్నాడు మురళి


చాలా రోజులు చూసాడు.. కానీ మాయ రాలేదు..

ఒక రోజు పోస్ట్ ఒకటి వచ్చింది.. చూస్తే మురళి షాక్.. అవి విడాకుల పత్రాలు.. మాయ నుంచి..


ఇంక చేసేదేమి లేక.. మాయ మొండితనం దగ్గర, తన మంచితనం గెలవదని తెలుసుకుని.. విడాకులు ఆమోదించాడు..


ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది కోర్ట్..

***


"నీ జీవితం ఇలా అయిపోవడం నేను చూడలేకపోతున్నాను.. ఇంకో పెళ్ళి చేసుకో రా!" అని బామ్మ అంది


"నీ ఇష్టం బామ్మ!.. నువ్వే.. మంచి అమ్మాయి చూడు.. " అన్నాడు మురళి


బామ్మ.. మురళి చెప్పినట్టే ఒక మంచి అమ్మాయిని చూసి.. పెళ్ళి చేసింది.. ఈసారి మురళి అందమే కాక.. గుణగణాల మీద ఎక్కువ ఫోకస్ చేసాడు.. మంత్ర ను

పెళ్ళి చేసుకున్నాడు..


పెళ్ళైన కొన్ని రోజులలోనే మాయ కి.. మంత్ర కి తేడా తెలిసింది మురళి కి..


అర్ధం చేసుకున్న పెళ్ళాం దొరికినందుకు.. హ్యాపీ గా ఉన్నాడు మురళి..


ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోబోయిన తనకి.. మళ్ళీ పెళ్ళి తనకి మరో లైఫ్ ఇచ్చిందని అనుకున్నాడు..


*********************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


46 views0 comments

Comentários


bottom of page