#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ManaMathrubhasha, #మనమాతృభాష, #మాతృభాషాదినోత్సవం

మాతృభాషాదినోత్సవం సందర్భంగా..
Mana Mathrubhasha - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 21/02/2025
మన మాతృభాష - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
మర్మమెరుగని, మచ్చలేని మన మాతృభాష.
మమతలెరిగిన, మధువులొలికే మన తెలుగు భాష.
సుగంధ పూతోటలో వికసించిన పుష్పమై, మదిలోని భావాలకు తెలుగు భాషా సౌరభం రంగరించి, ప్రేమ సౌభ్రాతృత్వంతో, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటుదాం.
ప్రేమామృతాన్ని పంచుతూ, ఆ మధువు లోని మాధుర్యాన్ని గ్రోలుతూ, కామధేనువు వంటి తెలుగు తల్లి క్షీరామృతాన్ని గోవత్సలై త్రాగుదాం.
ఆ తల్లి ముద్దుబిడ్డలై కీర్తి శిఖరాలను అథిరోహించి , నలు దిశలా కీర్తి బావుటాలను ఎగురవేసి ఆ చంద్ర తారార్కం అఖండ తేజస్సుతో ప్రకాశిద్దాం.
తెలుగు తల్లికి పట్టుబట్ట కట్టి, అచ్చ తెలుగు నుడికారంతో నుదుట కుంకుమ దిద్ది, ఘనకీర్తిని పూలమాలగా వేసి మృతమవుతున్న మన మాతృభాషను అమృతమయం చేద్దాం.
జై తెలుగుతల్లి…
జై జై తెలుగుతల్లి🙏
-నీరజ హరి ప్రభల
Comments