top of page
Writer's pictureAchanta Gopala Krishna

మనసెరిగిన వాడు

#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #మనసెరిగినవాడు, #ManaseriginaVadu, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Manaserigina Vadu' - New Telugu Story Written By Achanta Gopala Krishna

Published In manatelugukathalu.com On 29/10/2024

'మనసెరిగిన వాడు' తెలుగు కథ

రచన: ఆచంట గోపాలకృష్ణ


కొత్త గా కాపురానికి వచ్చిన శైలజ కి కొద్దిరోజులలో నే భర్త తో సఖ్యత కొరవై... గొడవ పెద్దది అయ్యి, పుట్టింటికి చేరుతుంది. 


ఆమె మొదటి నుంచి బాగా చదువుకునేది. కలెక్టర్ అవ్వాలని తన అభిలాష. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు.... తనని పెళ్లి చేసుకునే లాగా చేసాయి... 


ఇంక అత్తారింటికి వచ్చాక భర్త.. అత్తారిల్లు.. ఇదే జీవితం

అని సరిపెట్టుకుంది. ఆ సంసార జీవితంలో బిజీ అయిపోయింది. నిజానికి తన భర్త చాలా మంచి వాడు. అయినా ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. కోపం ఎందుకు వస్తోందో తెలియదు... 


అతనికి ఏదైనా లోటు చేస్తున్నానా... ఏమైందో.. అర్థం కాదు.. 

ఎప్పుడూ ఆలోచిస్తూ, బాధ పడుతూ, గదిలోనే గడప సాగింది... 


"దాన్ని చూస్తూ ఉంటే మనసుకి బాధ గా ఉంది... 

ఒకసారి కనుక్కో ఏమి జరిగిందో " అని అడిగాడు తండ్రి వెంకట్రావు. 


"సరే " అంటూ ఆ గదిలోకి వెళ్లి "అసలు ఏమి జరిగిది " ఆని

అడిగింది శైలజ తల్లి వనజ. 


"నాకు తెలిసి చెప్పుకో తగ్గ గొడవలు ఏమీ లేవు, అమ్మా, తను ఎప్పుడూ బైటకి తీసుకువెళతానని, అంటాడు.... ఇంట్లో ఏదో పని వస్తూ ఉంటుంది... 


"ఇప్పుడు కుదరదు మరోసారి అంటూ ఉంటాను... 

"అలాగే ఎప్పుడు సరదాగా మాట్లాడదామన్నా ఉమ్మడి కుటుంబం, 

జరిగేది కాదు... "

"క్రమ క్రమం గా విసుక్కోవడం మొదలు పెట్టాడు రామ్. అలాంటి గొడవలే, కానీ పెద్దవి కూడా కాదు " అంది శైలజ.


"ఇలాంటి చిన్న చిన్నవే పెద్దవి అయిపోతాయి తల్లీ, అయినా భర్త అన్నాక అతనికి కొన్ని కోరికలు ఉంటాయి గా,

భార్య గా నీ భాద్యత కూడా.


ఎన్ని పనులున్నా అతనితో కూడా సరదా గా కొంత సమయం గడపాలి కదా మరి " అంది తల్లి.. 


"లేదమ్మా.... ఈ మధ్య చిన్న విషయాలకే కోపం పెరిగిపోయింది. మొదట్లో బాగానే ఉండే వారు, రాను రాను ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడం, చీటికీ మాటికి విసుక్కోవడం, ఎక్కువైంది. 


మొదట్లో ఆఫీస్ టెన్షన్స్ అనుకునే దాన్ని... కానీ, కోపం ఎందుకు వస్తోంది అర్థం కాదు " అంది శైలజ... 


"సరేలే. ఇదేమీ పెద్ద విషయం కాదులే. ముందు నువ్వు నీ పద్దతి మార్చుకో... మీ నాన్న ని పంపించి అల్లుడి గారితో మాట్లాడిస్తాను... నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి... అన్ని సమస్యలు పరిష్కారము అవుతాయి... నువ్వు రెస్ట్ తీసుకో"

అంటూ వంటిట్లోకి వెళ్ళింది. 


ఆ రాత్రి... భోజనాల తరువాత జరిగిన విషయం భర్త తో చెప్పి... 


"మీరు ఒక సారి అల్లుడి గారిని కలిసి మాట్లాడండి.. ఇది రెండు జీవితాలకి సంబంధించిన విషయం... అనవసర రాద్ధాంతం చేసుకుని జీవితాలు పాడు చేసుకోవద్దు, అని నచ్చ చెప్పండి” అని అడిగింది... 


"సరే, రేపు నేను వెళ్లి మాట్లాడి వస్తాలే. నువ్వేమి దిగులు పడకు, అన్నిటికి ఆ భగవంతుడు ఉన్నాడు... తెలిసి మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అన్ని ఆయనే చూసుకుంటాడు... " అని నిద్రకి ఉపక్రమించాడు. 


మరుసటి రోజు అబ్బాయిని ఒప్పించేందుకు వాళ్ల ఇంటికి వెళ్ళాడు. రామ్ తో మాట్లాడిన తరువాత, ఇంటికి వచ్చేసాడు.


"ఏమండీ ఏమైంది విషయం " అని అడిగింది తల్లి.


"ఇంకా కోపం తగ్గలేదు. ఇంకా సాగదిస్తే గొడవ పెరుగుతుంది అని వచ్చేసా"


"అసలే ఆడపిల్ల వాళ్ళం, సంయమనం ఉండాలి, "


"కొన్నాళ్ళు చూద్దాం మారతాడేమో.. "


"పరిస్థితులకు పోరాడాలి గాని కుంగి పోకూడదు... 

సమస్య లు ఎన్నిఉన్నా.... పోరాడి సాధించుకోవాలి.... 

మూసి ఉన్న తలుపు కొడుతూ కూర్చోకుండా తెరిచి ఉన్న గుమ్మలోనించి... వెళ్లి గమ్యం.. లేదా విజయం సాధించాలి. "


"అమ్మా శైలజా! నువ్వు మొదటి నుంచి, 

టాప్ రేంకర్... మన కుటుంబ పరిస్థితుల వలన పెళ్లి చేసేయాల్సి వచ్చింది... అనుకోకుండా

ఇలా జరిగింది... ఇప్పుడు నేనూ కొంచెం స్థిరపడ్డాను. ముందు. నువ్వు నీ చదువు ని కొనసాగించు... నీ కోరికని సాధించు కోవడానికి నేను నీ ప్రక్కనే ఉంటాను " అన్నాడు వెంకట్రావు... 


"ఎలాగూ సివిల్స్ ఇష్టం కదా దానికి ప్రయత్నించి

చూడు. అబ్బాయి, మారితే సరే లేదంటే, నీ కాళ్ళమీద నువ్వు నిలబడవచ్చు, " అని వెంకట్రావు అన్నాడు. 


"సరే నాన్నా మీ ఇష్టం.. "


అలా ఆమె పంతం పట్టి, కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. 

ఛార్జ్ తీసుకున్నాక డ్రైవర్ తో కార్ తీయమని అన్నప్పుడు

ఆమె తండ్రి "ఎక్కడికి " అని అడిగాడు. 


"ఆయన దగ్గరకే నాన్నా, తాను వదిలేసినా, నేను సాధించిన విజయాన్ని అతనికి చూపించి బుద్ధి చెప్పాలని " అంది శైలజ. 


"సరే అలాగే వెళదాం.. కానీ కార్ నేను డ్రైవ్ చేస్తా, 

మళ్ళీ డ్రైవర్ ఎందుకు, నేను కూడా అతనిని కడిగేయాల్సి ఉంది... " అన్నాడు వెంకట్రావు. 


"సరే నాన్న బయలుదేరండి "అంది. 


ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి రామ్ కిటికీ దగ్గర నిలబడి పుస్తకం చదువుకుంటున్నాడు... ఇద్దరిని చూడగానే నవ్వుతూ దగ్గరకి వచ్చాడు. 


"రండి మామయ్య" అంటూ ఆహ్వానించాడు. 


"ఏం శైలు ఎలా ఉన్నావ్ " అని పలక రించాడు రామ్, ప్రేమగా. 


ఆమె కోపం తో తిట్టబోయేంతలో "నువ్వు ఉండు అమ్మా

నేను మాట్లాడతాను " అంటూ ఆపాడు.... తండ్రి. 


"ఇదిగో అల్లుడు నీ కలెక్టర్ భార్య.... నీ కోరిక ప్రకారం కలెక్టర్ని చేసి నీకు అప్పగిస్తున్నాను.... హమ్మయ్య నా బాధ్యత తీరింది... " అంటూ నవ్వు తూ అన్నాడు.. 


శైలజ షాక్ తింది... 


"ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు, నాన్నా మీరు ఏమి అంటున్నారు.... అసలేం జరిగింది... " అంటూ అడిగింది... ఆశ్చర్యం గా.. 


"ముందు నువ్వు ఇలా కూర్చో, అంతా వివరం గా చెపుతాను..." అంటూ జరిగినది అంతా వివరంగా చెప్పాడు.

 

ఇంట్లో పనులు అన్నీ చేస్తున్నావు కానీ నీకు దేనిమీదా

ధ్యాస ఉండదు. ముఖం లో ఏదో ముభావం కనబడుతూ ఉంటుంది... ఏదో పొగుట్టుకున్న వెలితి.... 


మొదట్లో పెళ్లి అయిన కొత్త కదా... అయిన వాళ్ళందరిని వదిలేసి వచ్చింది కదా కాపురానికి, కొన్నాళ్ళు అలాగే ఉంటుంది అని సరిపెట్టుకున్నాను.


కానీ ఏదో ఉంది.... కానీ చెప్పదు... ఎన్ని సార్లు అడిగినా ఏమీలేదు, ఊరికినే అంటూదాట వేస్తూ ఉంటుంది "

అన్నాడు రామ్. 


ఒక సారి అనుకోకుండా నీ డైరీ చదవడం జరిగిందిట, 

ఎప్పుడూ ఇంటిపని వంట పని అంటూ బిజీ గా తిరిగే నీకు ఒక కల వుందని, అది ఆర్ధిక ఇబ్బదులవలన పక్కన పెట్టి నీ పెళ్లి చేసేశారని... జీవితంలో రాజీ పడి బ్రతుకుతున్నావని తెలుసుకున్న రామ్, 


నేను సర్దిచెప్పేటందుకు ఇక్కడ కు వచ్చినప్పుడు, 

ఈ విషయం నాకు చెప్పి, తన ఆశయం నెరవేరేలా నేను చేస్తాను కానీ ఇప్పుడు నేను చెపితే శైలు వినదు.... 

ఇల్లు కుటుంబం అంటూ ఒప్పుకోదు... 


పైగా ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి మాట వినదు. 

నేను చెప్పినట్లు చేయండి, అంటూ అతను నిన్ను విసుక్కోవడం, దగ్గర నుంచి చిన్న గోడవలని పెద్దది చేసి... 

నిన్ను పుట్టింటికి పంపించేయడం, అన్ని రామ్ చెప్పినట్లే జరిగింది. 


నీ చదువు కు అయిన ఖర్చు అంతా అతనే పెట్టాడు. 

ఇంత మంచివాడివి, ఇంత ప్రేమ పెట్టుకుని ఈ ఎడబాటు ఎలా భరిస్తున్నవయ్యా, మహానుభావా.... ఇంక చాలు, శైలజ తో జరిగినది చెప్పేస్తా అని, చాలా సార్లు, అతనితో అంటే, 


‘వద్దు మామయ్య గారు, నా మీద కోపం తో మరింత శ్రద్ధ గా చదివి సాధిస్తుంది’ అని వారించేవాడు.... ఇప్పుడు ఇంక చెప్పక తప్పలేదు అల్లుడు” అంటూ.... 

నవ్వాడు వెంకట్రావు. 


తన భర్త కి తనమీద ఇంత ప్రేమ ఉందా !

తన మనసులో కోరిక తీర్చడానికి ఇంత కష్టపడ్డాడా. 

ఇంత మంచి భర్త నాకు ఏ జన్మలోను దొరకడు. 

నా భర్త నిజంగా నా " మనసెరిగిన వాడు " అనుకుంటూ, 

“అపార్ధం చేసుకున్నా నన్ను క్షమించండి” అంటూ కాళ్ళమీద పడబోయిన భార్య ని ఆపి, 

“నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ” అంటూ హృదయానికి హత్తుకున్నాడు…

అలాగే మామయ్యగారి వైపు చూసాడు... 


“ఆ ఆ అర్థమైంది... ఇంక నేను దయచేస్తే.... అనేగా ఆ చూపుకి అర్థం.... వెళతాలే మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు.... 

దుర్మార్గుడా... మామయ్య అని గౌరవం లేకుండా ఎలా పొమ్మంటున్నాడో”, అని మనసులోనే మురిసిపోతూ

బయలు దేరాడు వెంకటరావు.... 


శుభం


ఆచంట గోపాలకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు ఆచంట గోపాలకృష్ణ

రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..

15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..

నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..


ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..

42 views0 comments

Comments


bottom of page