మనసులో మాట
- Mohana Krishna Tata
- Jan 11, 2024
- 3 min read

'Manasulo Mata' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 11/01/2024
'మనసులో మాట' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆనంద్, సోను ఇద్దరు మంచి స్నేహితులు. ఆనంద్ కి ఒక ఆక్సిడెంట్ లో కంటి చూపు పోయింది. అప్పటినుంచి సోను సహాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ రూమ్ లో ఆనంద్ కు ఆపరేషన్ జరుగుతుంది. బయట అతని స్నేహితుడు కూర్చొని, డాక్టర్ ఎప్పుడు వచ్చి మంచి కబురు చెపుతాడా.. అని ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ఆనంద్ తనతో అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు సోను...
"నా కళ్ళు పోయి సంవత్సరం అవుతుంది కదా! నన్ను డాక్టర్ కి చూపించరా సోను..కళ్ళు వస్తే, మళ్ళీ ఈ లోకాన్ని చూడొచ్చు.."
"అలాగే ఆనంద్..చూపిస్తాను. కానీ, కళ్ళు వస్తే, ఫస్ట్ ఏం చేస్తావో చెప్పనేలేదు.."
"నా మిత్రుడు ఐన నిన్ను ఫస్ట్ చూడాలని అనుకుంటున్నాను.."
"ఆ తర్వాత..."
"చెబితే, నువ్వు ఏమి అనుకోకూడదు మరి!" అన్నాడు ఆనంద్.
"చెప్పరా! ఏం అనుకోను లే!"
"పల్లవి ని కలవాలి..అప్పట్లో ఆగిపోయిన కథ ను మళ్ళీ నడిపించాలి.."
"పల్లవి ఎవరు?..నాకెప్పుడు చెప్పలేదు.." అన్నాడు సోను.
"నా కళ్ళు పోకముందు..జరిగిన కథ నీకు తెలియదు.. అయినా నువ్వు నన్ను కలిసింది ఆక్సిడెంట్ తర్వాత కదా.."
"అవుననుకో..కథ చెప్పరా వింటాను..నీకూ మనసు బాగుంటుంది.." అన్నాడు సోను.
****
నేను కాలేజీ లో చదువుతున్న రోజుల్లో, నా క్లాసుమేట్ పల్లవి. అబ్బాయిలలో నేను ఎలా బాగా చదువుతానో, అమ్మాయిలలో పల్లవి అలాగ చదివేది. అబ్బాయిల ఫస్ట్ బెంచ్ లో నేను కూర్చుంటే, అమ్మాయిల ఫస్ట్ బెంచ్ లో, నాకు పక్కనే పల్లవి కూర్చునేది. పల్లవిని చూడడానికి రెండు కళ్ళు చాలవనుకో. ఆ నవ్వు, ఆ అందం నన్ను కట్టి పడేసింది. అలా, ఒక రోజు అనుకోకుండా...ఇద్దరము వర్షం లో బస్స్టాప్ లో కలిసాము. వాన చాలా సేపటి వరకు తగ్గక పోవడం తో..మాట్లడడానికి నాకు చాలా టైం దొరికింది.
అప్పుడే నేను పల్లవికి ప్రపోజ్ చేసాను. ఆలోచించుకుని, చెబుతానని చెప్పింది. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి, కాలేజీ మానేసాను..అయినా తను ఏమి చెప్పలేదు. కనిపిస్తే, నవ్వుతూ 'హాయ్' చెబుతుందంతే! నాకు ఏమీ అర్ధం కాలేదు.
ఒకసారి..పల్లవి ని ఎలాగైనా..విషయం అడిగి తెలుసుకోవాలని.. కార్ తీసుకుని.. తనని కలవడానికి వెళ్ళాను. బర్త్ డే పార్టీ కోసం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని తెలిసి అక్కడకు వెళ్ళాను. పల్లవి ఎక్కడికైనా బస్సు ఎక్కి వెళ్ళడమంటే ఇష్టం. అందుకే, తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్న బస్స్టాప్ లో పల్లవి కోసం వెయిట్ చేసాను. చాలా పొద్దు పోయాక, పల్లవి ఒంటరిగా బస్స్టాప్ దగ్గరకు వచ్చింది.
కార్ పక్కకు పార్క్ చేసి, బస్స్టాప్ లో ఉన్న పల్లవి దగ్గరకు వెళ్ళాను. అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది.
"హాయ్ పల్లవి..ఎలా ఉన్నావు?"
"బానే ఉన్నాను ఆనంద్.."
"నీ మనసులో మాట కోసం ఎదురు చూస్తున్నాను..ఎప్పుడు చెబుతావు..?"
"చెబుతాను ఆనంద్!..అప్పటివరకు వెయిట్ చెయ్యి..."
"అలాగే పల్లవి..వర్షం తగ్గేటట్టు లేదు. ఏదో అల్పపీడనం అంటా..బస్సులు కుడా వస్తాయో లేదో? పదా.. కార్ లో వెళ్దాం. ఏమి ఆలోచించకు పల్లవి..నా వల్ల నీకు ఏ హాని జరుగదు.."
అలాగ పల్లవి నా కార్ ఎక్కి..ఆ జోరు వానలో ఇద్దరు ఇంటి దారి పట్టాము. అప్పుడే నాకు ఈ ఆక్సిడెంట్ జరిగింది. ఆ వర్షం లో కంట్రోల్ తప్పి, కార్ ఆక్సిడెంట్ కు గురయింది. కొంత సేపటికి నా పక్కన పల్లవి లేదు. తర్వాత ఆ దారిలో వచ్చిన నువ్వు, నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసావు.
ఆ తర్వాత నువ్వు నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసిన తర్వాత..డాక్టర్ ఆపరేషన్ చేస్తే, కళ్ళు రావొచ్చు అన్నారు. దానికి నేను చాలా ఆనందపడ్డాను. కానీ, ఒక సంవత్సరం ఆగిన తర్వాత చేద్దాం అని డాక్టర్ చెప్పారు. అప్పటినుంచి ఇద్దరము మంచి ఫ్రెండ్స్ అయ్యాము.
నా లాంటి అనాధను ఆక్సిడెంట్ నుంచి కాపాడిన నీ మంచితనం నేను మర్చిపోలేను సోను. అప్పుడే నీకు పల్లవి గురించి చెప్పి ఉంటే, కథ వేరే లాగ ఉండేది. ఈ సంవత్సర కాలం లో పల్లవి కుడా నా గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఫోన్ చేస్తుందేమోనని అనుకున్నాను. కానీ చెయ్యలేదు.
నా కళ్ళు బాగుంటాయని పల్లవి ఒకసారి నాతో అంది. అందుకే, నాకు చూపు వచ్చిన తర్వాతే, కలుద్దామని అనుకున్నాను.
****
"ఆనంద్! నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రేపే డాక్టర్ ని కలుద్దాం. మర్నాడు ఇద్దరు డాక్టర్ ని కలిసి.. ఆపరేషన్ గురించి డాక్టర్ తో మాట్లాడారు. చాలా ఖర్చవుతుందని అనడం తో ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. కానీ, సోను మాత్రం..అంతా తాను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు. ఆపరేషన్ రూమ్ లో ఆనంద్ కు ఆపరేషన్ జరుగుతుంది.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వారం పోయాక..మొదటిగా, తన ఫ్రెండ్ సోను ని చూసి మురిసిపోయాడు ఆనంద్. తనకి చూపు వచ్చిందని సంబర పడిపోయాడు. ఈలోపు డాక్టర్, నర్సులు అందరూ బయటకు వెళ్లారు.
"కొంత సేపు అలా కూర్చో ఆనంద్..నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. వెయిట్ చెయ్యి.." అన్నాడు సోను.
రూమ్ డోర్ తీసుకుని, లోపలికి వచ్చిన అమ్మాయిని చూసిన ఆనంద్ కు నోట మాట రాలేదు. వచ్చింది ఎవరో కాదు.. పల్లవి. వచ్చి, స్మైల్ తో ఆనంద్ ని పలకరించింది.
"పల్లవి! ఎలా ఉన్నావు..?" అడిగాడు ఆనంద్
"బానే ఉన్నాను..మీ ఫ్రెండ్ కష్టపడి నా అడ్రస్ పట్టుకుని.. నీ విషయం అంతా చెప్పాడు. ఆ రోజు ఆక్సిడెంట్ తర్వాత, కళ్ళు తెరిచాక, నేను మా ఇంట్లో ఉన్నాను. నీ గురించి ఇంట్లో తెలిసి..నన్ను ముంబై లో మా పిన్నిగారింట్లో ఉంచారు. నిన్ను కలవడానికి నీ ఫోన్ నెంబర్ కుడా లేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ నా గురించి తెలుసుకుని, నీ విషయం చెప్పాడు. ఎలాగో తప్పించుకుని, వచ్చాను… నీ కోసం ఆనంద్. ఆ రోజు కార్ లోనే నీకు నా మనసులో మాట చెబుదామని అనుకున్నాను. అంతలోపే, ఆక్సిడెంట్ జరిగింది.." అని ఆనంద్ ని కౌగలించుకుంది పల్లవి..
సమాప్తం
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント