top of page

మనసున మనసై.. తోడొకరుండిన

#ManasunaManasaiTodokarundina, #మనసునమనసైతోడొకరుండిన, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Manasuna Manasai Todokarundina - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 27/02/2025

మనసున మనసై.. తోడొకరుండిన - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


అరవింద్ వస్త్ర పరిశ్రమల యజమాని వెంకటేశ్వరరావు గారికి పట్నంలో పెద్ద వస్త్ర వ్యాపారిగా అనాథాశ్రమాలకు, పాఠశాలలకు, ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తు ధర్మదాతగా సమాజంలో పలుకుబడి ఉంది. వారి ధర్మపత్ని రాఘవమ్మ కూడా దానధర్మాలలో భర్తకు సరిజోడుగా ఉంటుంది. ఆ దంపతులకు పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా సంతానభాగ్యం కలగడం లేదు. 


ఇంద్ర భవనంలాంటి బంగ్లా, కార్లూ పనివాళ్లతో సకల సౌభాగ్యాలు ఉన్నప్పటికీ ఇంట్లో ముద్దు మురిపాలతో సందడి చేసే పిల్లలు లేకపోవడం వారిని చింతనలో పడేసింది. 


పిల్లల కోసం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా పుణ్యక్షేత్రాల దర్శనం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక సంతానభాగ్యం లేదని నిరాశగా ఉన్న సమయంలో ఎవరో సాధువు చెప్పిన ఆశ్రమం దర్శించి బాబా ఇచ్చిన మంత్రజలం సేవించిన తర్వాత రాఘవమ్మ గర్భం దాల్చి ఇద్దరు కవల ఆడ శిశువుల్నిప్రసవించింది. కాని వారి దురదృష్టం కొద్దీ పుట్టిన ఇద్దరు ఆడ పిల్లల తల

 ఒకదానితో ఒకటి అతుక్కుపుట్టారు. 


 అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి కాని తలలు కలిసే ఉన్నాయి. చాలకాలం తర్వాత లేకలేక పుట్టిన కవలలు ఇలా తలలు కలిసి పుట్టడం బాధనిపించినా తమ వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుందని సరిపెట్టుకున్నారు. 

 ఆఇంట్లో సందడే సందడి. పేదలకు అన్నదానాలు వస్త్రదానాలతో పాటు దేవాలయాలలో ఘనంగా పూజలు సంబరాలు జరిపించారు వెంకటేశ్వరరావు. 


పుట్టిన కవల పిల్లలకు కీర్తి, దీప్తి గా నామకరణం చేయించారు. వారి రూపాలు ఒకేలా ఉన్నందున ఇద్దరి కుడి చేతుల మీద పేర్లు పచ్చబొట్టులు వేయించారు. పేరు పెట్టి పిలిస్తే ఊ అంటూ సమాధానమిస్తున్నారు. 


 పట్నంలో పేరున్న డాక్టర్లకు కవలల్ని చూపిస్తే పరిక్షలు చేసిన తర్వాత ఈ వయసులో ఆపరేషన్ చెయ్యడం కుదరదని కొంచం వయసు ముదిరాక తలలు సరిచేద్దామని చెప్పడంతో ఆగవల్సి వచ్చింది. 


క్రమంగా ఆడపిల్లలిద్దరూ పెరిగి పది సంవత్సరాల వయసుకొచ్చారు. విదేశాలకు తీసుకెళ్లి అక్కడి పేరుపొందిన న్యూరో సర్జన్లకు చూపేరు. న్యూరో సర్జన్లు అందుబాటులో ఉన్న అన్ని పరికరాలతో పరీక్షలు చేసి ఈ వయసులో ఆపరేషన్ చేస్తే మెదళ్లు దెబ్బతిని మతి పోవచ్చు లేదా ప్రాణాలకే ముప్పు రావచ్చని తమ అభిప్రాయం చెప్పడంతో ఆపరేషన్ కేన్సిల్ చేసి ఇండియాకు తిరిగివచ్చారు. 

 

ఇద్దరూ బొద్దుగా చూడముచ్చటగా ఉన్నారు. శ్రీమంతులైనందున చక్కటి పౌష్టికాహారం లభిస్తుండటంతో నిగారింపుగా కనబడుతున్నారు. కవలలైనందున ఇద్దరిలో ఒకరికికి జ్వరం లేదా దగ్గు వచ్చినా రెండవ అమ్మాయికి బాధ కలుగుతుంది. ఇద్దరికీ ఒకే మెదడు పనిచేస్తోంది. 


 పిల్లల చిన్న వయసు నుంచి ఆయా నర్సమ్మను పెట్టి వారి దైనందిన పనులు జరిపించేవారు. భోజనం, స్నానాలు, బట్టలు వెయ్యడం ఇద్దరి ఆరోగ్య పరిస్థితుల్ని చూస్తు కన్నబిడ్డల్లా సాకుతు డాక్టర్లకు తెలియ చేస్తుంది నర్సమ్మ. 


 లేడీ టీచర్ ద్వారా వారి చదువులు సాగేవి. రోజూ స్కూలుకి వెళ్లకపోయినా ఆ పరిజ్ఞానం వారికి ఇంటి వద్దే తెలిసేది. తలలు కలిసి ఉన్నాయి కాని మిగతా అన్నిటిలో వారు చురుకుగా సాధారణ బాలికలలాగానే ఉంటున్నారు. 


పన్నెండు సంవత్సరాల వయసు రాగానే అందరి ఆడపిల్లల మాదిరి బాలికల నుంచి కన్నె పిల్లలయారు. క్రమేపి వారి శరీర అవయవాల్లో యవ్వన ఛాయలు మొదలయాయి. ముఖాలు, శరీరాలలో నిగారింపు ఆకర్షణ కనబడుతోంది. చిన్నప్పటి నుంచి పనిమనిషి నర్సమ్మ ఆధ్వర్యంలో వారి పోషణ సంతృప్తిగా సాగుతోంది. 


ఇప్పుడు వారికి పరిపూర్ణ యవ్వనం 20 సం. లు దాటేయి. వారి భవిష్యత్తు ఎలాగని వెంకటేశ్వరరావు దంపతులకు దిగులు పట్టుకుంది. పెళ్లి ఎలా జరపడం వారి సంసార జీవితం ఎలాగని చింత మొదలైంది. 


చివరకు డాక్టర్ల సలహా మేరకు వారిద్దరికీ ఒకే అబ్బాయితో పెళ్లి జరిపించి సంసార జీవితంలోకి నెట్టాలనుకున్నారు. 


సంప్రదింపుల తర్వాత వెంకటేశ్వరరావు అక్క కొడుకు మాధవ్ ఇల్లరికం వచ్చి వారిద్దర్నీ వివాహం చేసుకోడానాకి ముందుకు వచ్చాడు. ఘనంగా పెళ్లి జరిగి మాధవ్ ఇద్దరి మెడల్లో మంగళసూత్ర ధారణ చేసాడు. 


 ఇప్పుడు వారి సంసార జీవితం ఎలాగని ఆలోచించనలో పడ్డారు. డాక్టర్ల సలహా మేరకు వారి సంసార జీవితం ఎలా జరగాలో సూచనలు ఇచ్చారు. ఇద్దరు ఆడపిల్లల సంసార జీవితానికి ఒక పరిష్కారం దొరికింది. 


భార్యలిద్దరికీ తలలు ఒకటే కాని యవ్వన శరీరాలు వేరైనందున మాధవ్ సంసార జీవితం సాఫీగా జరుగుతోంది. 


కొద్ది సంవత్సరాల తర్వాత ఇద్దరూ పండంటి పిల్లలకు జన్మనిచ్చారు. పుట్టిన పిల్లలకు ఎటువంటి అంగలోపం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 


పిల్లలు లేరని బాధపడే వెంకటేశ్వరరావు దంపతులు ప్రశాంతంగా ఉన్నారు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page