top of page

 మనసుంటే మార్గం దొరుకుతుంది

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #ManasunteMargamdorukuthundi, #మనసుంటేమార్గందొరుకుతుంది, #TeluguStories, #తెలుగుకథలు


'Manasunte Margam dorukuthundi' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 24/10/2024

'మనసుంటే మార్గం దొరుకుతుంది' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


వస్త్ర పరిశ్రమలో పనిచేసే చిన్నయ్య కొడుకు శివరామ్ చిన్నప్పటి నుంచి చదువంటే శ్రద్ధ చూపేవాడు. తను బాగా చదువుకుని మంచి ఉధ్యోగం సంపాదించి తండ్రికి ఆర్థికంగా

సహాయపడాలని తాపత్రయపడుతున్నాడు. 


 శివరామ్ షిర్డీ సాయిబాబా భక్తుడు. అవకాశం ఉన్నప్పుడు గుడికెళ్లి బాబా గార్ని దర్సనం చేసుకుంటాడు. 


 మెల్లగా గవర్నమెంటు పాఠశాలలో హైస్కూలు చదువు తర్వాత స్కాలర్ షిప్ సంపాదించి పట్నంలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఉద్యోగం

లభించడం లేదు. రోగ గ్రస్తుడైన తండ్రిని బట్టల మిల్లు పని నుంచి తప్పించి విశ్రాంతి కలిగించాలని చూస్తున్నాడు. 


 ఒకరోజు ఉదయం సాయిబాబా దర్సనానికి మందిరానికి వచ్చాడు శివరామ్. దర్సనమై మందిర చావడి మీద కూర్చుని ధ్యానం చేసుకున్నాడు. 


 బాబా వార్షికోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరానికి రంగులు వేసి పువ్వులతో అలంకరణలు చేస్తున్నారు. భక్తులు పలుచగా కనబడుతున్నారు. శివరామ్ లేచి ఇంటికి వెళదామని బయలుదేరాడు. 


 గుడి మెట్ల మీద ముసలి అవ్వ తన ముందు అల్యుమిలియం సిల్వర్ పళ్లెం పెట్టుకుని బిచ్చమెత్తుకుంటోంది. 


కంటి చూపు సరిగ్గా ఆనక కళ్లకి చెయ్యి అడ్డం పెట్టుకుని వచ్చే పోయే వారిని డబ్బులు వేయమని అడుగుతోంది. 


 శివరామ్ కి జాలేసింది. కాని అవ్వకి పళ్లెంలో వెయ్యడానికి తన దగ్గర డబ్బులు లేవు. అవ్వకి ఎలాగైన ఆర్థికంగా సహాయ పడాలనుకున్నాడు. 


 సడన్ గా ఒక ఆలోచన తట్టింది. తను కూర్చున్న కొద్ది దూరంలో బాబా గారి వార్షికోత్సవ

కార్యక్రమాలు ముద్రించిన రంగుల కరపత్రం కంటపడింది. దాని వెనుక భాగం కాళీగా ఉంది. 


 ఆ వార్షిక కార్యక్రమాల పేపరు అందుకుని జేబులోంచి పెన్ను తీసి వెనుక భాగంలో పెద్ద తెలుగు అక్షరాలతో  "బాబా భక్తులకు ఒక విజ్ఞప్తి " హెడ్డింగు పెట్టి


 "మెట్ల మీద కూర్చున్న కళ్లు కనిపించని ముసలి అవ్వ తన సంపాదన ఇరవై రూపాయలు నోటు పోగొట్టుకున్నది. నోటు దొరికిన వారు దయచేసి అవ్వకి అందచేయ ప్రార్థన " అని నల్లటి అక్షరాలు దిద్ది పూజారి గారి దగ్గరున్న పులిహార అన్నం మెతుకులు అద్ది గుడి ప్రాంగణ ముఖద్వారం గోడమీద అంటించి, అవ్వ దగ్గరకెళ్లి ఎవరైన నిన్ను అడిగితే ఇరవై రూపాయల నోటు పోగొట్టుకున్నట్టు చెప్పమని వెళిపోయాడు. 


 సాయంకాలమైంది. భక్తుల రాక మొదలైంది.  ఒక్కొక్కరు రంగు కరపత్రం మీద విషయం చదివి

"అయ్యో, పాపం" అని సానుభూతి చూపించి వెళ్తున్నారు. 


 కొద్ది సేపటి తర్వాత ఒక నూతన పెళ్లిజంట ముఖద్వారం గోడ మీదున్న పేపరులోని విషయం చదివి విచారంతో బాబాగారి హుండీలో వేద్దామనుకున్న డబ్బు ఇరవై రూపాయల నోటు అవ్వ కిద్దామని తలిచి దర్శనం తర్వాత మెట్ల మీద కూర్చున్న అవ్వ చేతిలో పెట్టారు. 


 ముసలి అవ్వ ఆనందంతో చేతులు జోడించి నూతన దంపతుల్ని చల్లగుండాలని దీవించింది. 


 ఇలా అడపా దడపా గోడ మీద కరపత్రం చదివి అవ్వకి డబ్బు సహాయం చేస్తున్నారు భక్తులు. 


 నిరుద్యోగి శివరామ్ ఇలా తను ప్రత్యక్షంగా అవ్వకి డబ్బు సహాయం చెయ్యలేకపోయినా పరోక్షంగా సాయం జరిగింది. 


 ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత శివరామ్ కి మంచి ఉధ్యోగం వచ్చింది. ఈసారి బాబా దర్సనాని కొచ్చి గుడి మెట్ల మీదున్న అవ్వకు తన వంతుగా పళ్లు, బట్టలు కొని తెచ్చి ఇచ్చాడు. అవ్వ మనసారా దీవించింది. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


42 views0 comments

Comments


bottom of page