top of page

మంచి మార్పు

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ManchiMarpu, #మంచిమార్పు, #TeluguChildrenStories


Manchi Marpu  - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 03/03/2025

మంచి మార్పు - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1) ఆ రోజు ఏదో పని మీద టీచర్లు కూర్చునే గది కి వెళ్ళింది 'చిన్నారి అందాల వింధ్య'. ఆమె ఆరవ తరగతి విద్యార్థిని. 


అక్కడ ముగ్గురు టీచర్లు ఇలా మాట్లాడుకుంటున్నారు దిగులుతో.


మొదటి టీచర్: "నా కొడుకు పేరు అమర్, ఆరవ తరగతి విద్యార్థి. కొత్త బూట్లు కావాలని ఊరికే మారాం చేస్తున్నాడు. పాతవి బాగానే ఉన్నాయి. కొత్తవి ఎందుకురా డబ్బు దండగ - దుబారా అంటే వినడు. మా టీచేర్లవి తక్కువ జీతాలు ... మనవి మధ్య తరగతి లేక బీద కుటుంబాలు ...  అని విడమర్చి చెప్పినా వినట్లేదు. డబ్బుల విలువ పొదుపు అస్సలు తెలీదు వాడికి. ఎలా వాడిని మార్చాలి? ఏమిటి ఉపాయం"?


రెండవ టీచర్:  "నా కొడుకు అక్బర్ కూడా ఆరవ తరగతి విద్యార్థి. గోగ్గిల్స్ - రంగుల కళ్ల జోడు కావాలని ఒకటే గొడవ. అంత డబ్బు లేదంటే వినట్లేదు"


మూడవ టీచర్: "నా కొడుకు ఆంథోనీ కూడా ఆరవ తరగతి యే. చేతి వాచీ కావాలని ఒకటే గొడవ. అంత డబ్బు లేదు నా దగ్గర. వాడికి దాని అవసరం అంత లేదు. స్కూల్ లో మరియు ఇంట్లో కూడా గోడ గడియారం ఉందిగా, అది చాలు కదా ... అంటే వినడు. ఏం చేయాలి? ఎలా నచ్చజెప్పి చూడాలి? నాకు పాలు పోవట్లేదు?"


ఆ ముగ్గురు టీచర్లు ...  అప్పుడే వచ్చిన 'చిన్నారి తెలివైన అందాల వింధ్య' ను చూసి  "నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా ... మా అబ్బాయిల్లో మంచి మార్పు వచ్చేటట్టు ... దుబారా పోయి పొదుపు మరియు చదువు పై శ్రద్ధ - నిండు మంచితనం - ఆదర్శమైన అలవాట్లు - సాయం చేసే గుణం - నిర్మాణాత్మక త ... అబ్బేటట్టు", అని విన్నవించారు. 


"వచ్చే ఆదివారం, సెలవు రోజు, పాఠశాలకు రమ్మనండి, నేను ఏదో ఓ ఉపాయం ఆలోచిస్తా" అన్నది వింధ్య. 


--- X X X ----


2)


'వింధ్య' తిరిగి తన ఆరవ తరగతి గదికి వెళ్ళాక ఈ సమస్యను తన సహ విద్యార్థి 'మంచి - మాధవ్' తో చెప్పింది. ఇద్దరూ కాసేపు తర్జన - భర్జన చేశారు. చర్చించారు. తరువాత జంటగా - బృందం గా ఓ ఉపాయం పన్నారు. 

-- X X X ----


3)


ఆ రోజు ఆదివారం. 


ఆ రోజు ముగ్గురు టీచర్ల కొడుకులు (అమర్, అక్బర్, ఆంథోనీ) పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద నిల్చున్నారు. 'చిన్నారి అందాల వింధ్య' కూడా అక్కడికి చేరుకున్నది. 


"దుకాణం కోసం వెతుకు దాము. నడుచు కుంటు వెళదాము. 

మీకు నేను కొని పెడతాను కావాల్సినవి. నాతో రండి", అన్నది.


అలా నలుగురూ నడుస్తూ వెళుతుంటే అక్కడ చెట్టు కింద ముగ్గురు చిన్న బాబులు కూర్చుని ఉన్నారు ఒక్కో దుప్పటి కప్పుకొని. ఆ ముసుగులో వారు - వారి ముఖాలు పూర్తిగా - సరిగ్గా కనపడట్లేదు. 


వింధ్య ఒక బాబుని అడిగింది. "రంగుల కళ్ళ జోడు అమ్మే దుకాణం దగ్గర లో ఎక్కడ", అని


వాడు గట్టిగా నవ్వాడు.


"ఎందుకలా నవ్వు తున్నావు?" అని అడిగింది వింధ్య ఆశ్చర్యంగా.


వాడు కప్పుకున్న దుప్పటి తీసాడు. వాడికి కళ్ళు లేవు.


వింధ్య మరియు అమర్ - అక్బర్ - ఆంథోనీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 


--- X X X ----


3) 


రెండో బాబు ను అడిగింది వింధ్య "బూట్ల దుకాణం దగ్గర్లో ఎక్కడుందో నీకు తెలుసా?" అని


వాడు కూడా బిగ్గరగా నవ్వాడు.


"ఎందుకలా నవ్వు తున్నావు?" అని అడిగింది వింధ్య రెండింతల ఆశ్చర్యంతో.


వాడు కప్పుకున్న దుప్పటి తీసాడు. వాడికి కాళ్ళు లేవు.


వింధ్య మరియు అమర్ - అక్బర్ - ఆంథోనీ కళ్ళలో నీళ్ళు వర్షంలా పారింది ఈసారి. 

--- X X X ----


4)


మూడో బాబు ను అడిగింది వింధ్య "వాచీల దుకాణం దగ్గర్లో ఎక్కడుందో నీకు తెలుసా?" అని


వాడు వికటహాసం చేస్తూ, ఆ ప్రదేశం దద్ధరిల్లి పోయేలా నవ్వాడు.


"ఎందుకలా నవ్వు తున్నావు?" అని అడిగింది వింధ్య మూడింతల ఆశ్చర్యంతో. 


వాడు కప్పుకున్న దుప్పటి కిందికి పడేలా ఒళ్ళు నిమిరాడు. వాడికి ఒక చేయి లేదు.


వింధ్య మరియు అమర్ - అక్బర్ - ఆంథోనీ కళ్ళలో నీళ్ళు వర్షం లా కురిశాయి ఈసారి.


--- X X X ----


5) 

 'చిన్నారి అందాల వింధ్య' ఆ ముగ్గురు వికలాంగుల తో ఇలా అన్నది.


"రేపు 'చల్లటి సాయింత్రం - సంధ్యా సమయం' వేళ ఇక్కడికి మళ్లీ వస్తాను".


"మీకు అన్ని వైద్య సదుపాయాలు కలిగేలా చూస్తాను. AI వినూత్న సాంకేతికత - ఆపరేషన్  ద్వారా చూపు వచ్చే మార్గం చూస్తాను. కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేస్తాను. డబ్బులు కట్టి మిమ్మల్ని విద్యా సంస్థల్లో చేర్పిస్తాను. హాస్టల్లో ఉండే సదుపాయం చేస్తాను. బాగా చదువుకుంటారు గా? డబ్బులు దుబారా మీద కాకుండా చదువు - ఆదర్శ జీవితం - మంచి అలవాట్ల పై శ్రద్ధ పెట్టాలి ... అదీ బెట్టు - మారాం లేకుండా", అని అన్నది.


వారు సంతోషంగా తల వూపారు.


------ X X X ----


6)


అమర్ - అక్బర్ - ఆంథోనీ లకు బుర్ర తిరిగి పోయింది. వాళ్ళు తమ - తమ (మధ్య తరగతి - పేద కుటుంబాల) తల్లి - తండ్రులను ... ఊరికే డబ్బుల కోసం - దుబారా కోసం మారాం చేయ వద్దని, గొడవ - హింస పెట్ట కూడదని ... అప్పటికప్పుడే  నిర్ణయించు కున్నారు. చదువు - ఆదర్శ జీవితం - మంచి అలవాట్ల పై శ్రద్ధ పెట్టాలని దేవుడి పై ఒట్టు కూడా పెట్టుకున్నారు. 


వెనువెంటనే, మూకుమ్మడిగా అలాగే తెలియ చేశారు చిన్నారి - అందాల - వింద్యకు. ఆమె సంతోషించింది ఆ 'ముగ్గురి హృదయాలలో మంచి మార్పు' - పరివర్తనకు.




-------- X X X ----------


7)


మరు నాడు, ఈ విషయం ... టీచర్ల ద్వారా (వారిరువురి శ్రేయోభిలాషి - ప్రోత్సాహం ఇచ్చే) హింది టీచర్ గిరి గారికి తెలిసింది. అతడు 'మంచి మాధవ్ - చిన్నారి అందాల వింధ్య లను' దీవించారు ఇలా ... "అత్యుత్తమ ఆదర్శవంతమైన జోడీ - జంట ... లోక ఉద్ధరణ కోసం పుట్టిన కారణ జన్ములు - మంగళప్రదమైన జోడీ", అని

------- X X X ----------


నీతి:


i)

పొడుపు -  చదువు - ఆదర్శ జీవితం - మంచి అలవాట్ల పై - మంచిని పంచటం పెంచటం పై - నిర్మాణాత్మక త పై - ఉన్నత ఆశయాల పై - అత్యున్నత జీవితం పై - అనుబంధాల పైన ... శ్రద్ధ పెట్టాలి... మనుషులు అన్నాక. 


ii)

ఆడంబరాలు, భూత - సర్ప - పైశాచిక - నివృత్తి, ... డాలర్ మొహం - మోజు ... డబ్బు దురాశ ... హాని ...  విడనాడాలి (దేవుడు చేసిన మనుషులు అన్నాక. 


iii)

ఎందుకంటే ??? ... దేవుడు మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు ... మంచి చెడు తెలుసుకోటానికి. జంతువులకు ఇవ్వలేదు. అయినా కూడా అవి చంపి తినవు ఆకలి లేనప్పుడు.


iv)

అను క్షణం మనుషులు పాపాల భైరవులు లా - రక్తం పీల్చే క్రూర మృగాల లా -  రాక్షసులు లా జీవించ కూడదు.


V) హృదయం తో ఆలోచించాలి, నిర్వహణ చేయాలి. మెదడు తో కాదు.


Vi) అర్థమయ్యే మంచి రీతిలో చెబితే .. అదే ఉదాహరణలు చూపించి ... తేలిక గా మంచి (హృదయ పూరిత - ఆలోచనా తీరు) మార్పు వస్తుంది ... ప్రతి ఆడ - మగ ... చిన్న - పెద్ద లో. 


--- X X X ---- కథ సమాప్తం --- X X X ----



పంపిన వారు ...


పి. వి. పద్మావతి మధు నివ్రితి



పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






 
 
 

1 commento


mk kumar
mk kumar
03 mar

బాగుంది

Mi piace
bottom of page