'Manchithanam' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 17/05/2024
'మంచితనం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
“నాకు వేరే మార్గం కనిపించట్లేదు అమ్మా.. ! నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా.. " అని అనుకుంటూ ఎత్తైన కొండ మీద నుంచి దూకడానికి సిద్ధమైంది రచన.
"ఎవరో అక్కడ.. ఆ కొండా పైనా.. ? కొంపదీసి ఆత్మహత్యా ఏమిటి.. ?" అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శ్రీధర్.
"ఎవరండీ.. ! ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపం తెలుసా.. ? మనకి దేవుడు జీవితం ఇచ్చింది బతకడం కోసం. బతికే ఈ కొద్ది సంవత్సరాలు కూడా వద్దనుకోవడం ఏమిటి.. ? చూస్తుంటే చదువుకున్న వారి లాగ ఉన్నారు.. కొంచం వెనుకకు తిరిగి నా వైపు చూడండి మిస్.. " అని బతిమాలాడు శ్రీధర్.
"నేను పోయే ముందు.. నన్ను చూసి మాత్రం మీరు ఏం చేస్తారు.. ?"
"ఏమో నన్ను చూసిన తర్వాత.. మీరు మీ డెసిషన్ మార్చుకుంటారేమో.. ట్రై చెయ్యండి.. " అన్నాడు శ్రీధర్.
"ఇంతలాగ మీరు అడుగుతుంటే, నా మొహం చూపించి.. అప్పుడే దూకేస్తాను లెండి.. "
రచన వెనుకకు తిరిగి, ముఖం పైకి ఎత్తి శ్రీధర్ వంక చూసింది..
"బావా.. ! నువ్వా.. ?" అంటూ పలకరిస్తూ.. కళ్ళు తుడుచుకుంది రచన.
"నువ్వా.. రచన.. ! ఇక్కడ ఏం చేస్తున్నావు.. ? నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది.. నీకు పెళ్లి కూడా అయింది కదూ.. మీ అమ్మ పంతం కొద్ది, నన్ను నీ పెళ్ళికి కూడా పిలవలేదు.. "
"సారీ బావ.. మా అమ్మ సంగతి తెలిసిందే కదా.. "
"ఇంతటి పరిస్థితిలో కుడా మరి నేను గుర్తుకు రాలేదా రచన.. ?"
"పెళ్ళైన తరువాత నా పరిస్థితి అంతా మారిపోయింది బావ. చనిపోయిన తర్వాత, ఎలాగో నా జీవితం గురించి అందరికీ తెలుస్తుంది గా " అంది రచన.
"సూసైడ్ చేసుకునే అంత కష్టం ఏమొచ్చింది నీకు.. ? చిన్నప్పటినుంచి మా అమ్మ నిన్ను కోడలిగా చేసుకోవాలని చాలా అనుకునేది. ఆ విషయం నాతో చాలా సార్లు చెప్పింది. అప్పట్లో మావయ్య కూడా మన పెళ్ళికి ఓకే చెప్పాడని అమ్మ చెప్పింది. కానీ, ఆ తర్వాత.. మీరు వేరే ఊరు వెళ్ళిపోవడం.. అదే నిన్ను నేను ఆఖరిసారిగా చూసింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫొటోలలో నిన్ను చూసాను అంతే.. !
నాకు పెళ్లి వయసు వచ్చాక.. మా అమ్మ మావయ్యకు ఫోన్ చేసి.. నిన్ను తన కోడలిగా చేసుకోవడానికి మళ్ళీ అడిగింది. అప్పుడు అత్తయ్య ఫోన్ లో ఈ పెళ్ళి తనకి ఇష్టం లేనట్టుగా మాట్లాడింది. పైగా, నీకు మంచి సంబంధం కుదిరిందని కుడా చెప్పింది. ఆ విషయానికి బాగా కలత చెంది అమ్మ మంచం పట్టి చనిపోయింది.. "
"అయితే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా బావా.. ?"
"అదొక పెద్ద కథ రచన. అమ్మ పోయిన తర్వాత బంధువులంతా పెళ్ళి చేసుకోమని నన్ను బలవంతం చేసారు. అప్పుడు అంతా వారి ఇష్టానికే వదిలేసాను. ఒక అమ్మాయిని చూసి నాకు పెళ్ళి చేసారు. కొన్ని రోజులు నా భార్య తో హ్యాపీ గానే ఉన్నాను. నేను తండ్రిని కాబోతున్నానని తెలిసిన తర్వాత, నా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత డెలివరీ టైం లో ఆపరేషన్ వికటించి నా భార్య చనిపోయింది"
"ఐ యాం సో సారీ బావ.. "
"మరి నీ పెళ్ళైన తర్వాత, నీ జీవితం హ్యాపీ గా లేదా రచనా.. ? మంచి సంబంధం అని మీ అమ్మ చెప్పింది కదా.. !"
"నా గురించి ఏం చెప్పను బావ.. పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ కష్టాలే. చిన్నప్పటినుంచి నువ్వంటే చాలా ఇష్టం బావ. కానీ, పెళ్ళైన తర్వాత నా లోకం వేరే అయిపోయింది. నా కథ చెప్పి నిన్ను ఎందుకు బాధపెట్టడం చెప్పు.. ?"
"పర్వాలేదు.. నీ గురించి చెప్పు.. నేను చేయగలిగే సాయం చేస్తాను.. ఎంతైనా నువ్వు నా మరదలివి.. "
"నా గురించి ఏమిటి చెప్పను.. మా నాన్నకి నన్ను నీకు ఇచ్చి పెళ్ళి చెయ్యాలనే ఉండేది.. కానీ మా అమ్మ కు ఇష్టం లేదు. కొంత కాలానికి నాన్న చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మ ఏది చెబితే అదే నేను చెయ్యాల్సి వచ్చింది. నాకు ఒక సంబంధం చూసి పెళ్లి చేసింది. ప్రేమలేని సంసారం నాది. మా అత్తగారు, నాకు పిల్లలు పుట్టట్లేదని తెగ ఇబ్బంది పెట్టేది. మా ఆయనకి వేరే పెళ్ళి చెయ్యడానికి రెడీ అయిపోయింది. మా అమ్మ ఉన్న రోజుల్లో, నన్ను ఒక మాట కూడా అనేవారు కాదు. మా అమ్మ పోయిన తర్వాత, ఇప్పుడు పిల్లల కోసం మా ఆయనకి మళ్ళీ పెళ్ళి చేస్తానంటోంది మా అత్తగారు. దానికి మా అయన కుడా వంత పాడారు. బలవంతంగా విడాకులు తీసుకుని, మా ఆయనకి మళ్ళీ పెళ్ళి చేసింది మా అత్తయ్య. ఇందులో నా తప్పేముంది చెప్పు.. ? నాకు ఎవరూ లేరు.. నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి.. ?"
"నువ్వు చనిపోతే, నీ సమస్య తీరిపోతుందా రచన.. ? పైలోకంలో ఉన్న మీ అమ్మ ఎంత బాధ పడుతుందో చెప్పు.. ?"
"నువ్వు చెప్పింది నిజమే బావ. అయితే ఏమిటి చెయ్యడం చెప్పు.. ?"
"మీ బావ ని పెళ్ళి చేసుకో.. అప్పుడు నీ కష్టాలు తీరిపోతాయి.. " అని ఒక గొంతు వినిపించింది.
"ఎవరది.. నాతో మాటలాడింది.. ?" అడిగింది రచన.
"నేను మీ అమ్మను.. నేను చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నీకు నీ బావే కరెక్ట్. పోయిన ఆ పాత జీవితం గురించి మర్చిపో. మంచితనం లేని వారు ఎప్పటికైనా డేంజర్ రచన. నా తప్పుని సరిదిద్దుకునే ఆవకాశం వచ్చింది. మంచివాడైన నీ బావని పెళ్ళిచేసుకో.. "
"మా అమ్మ ఏమిటి ఇలా మాట్లాడుతుంది.. ?"
"అవును.. నేనే, నేను చేసిన తప్పుకి నాకు పై లోకంలో కుడా ప్రవేశం లేదు. మీ పెళ్ళి చూసి, నేను సంతృప్తిగా పైలోకానికి వెళ్ళిపోతాను. మళ్ళీ నీ పాపగా పుడతాను రచన.. "
శ్రీధర్ ని పెళ్ళి చేసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించింది రచన..
*************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments