#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
మంచు తాకిన ప్రేమ - ధారావాహిక ప్రారంభం
Manchu Thakina Prema - Episode 1 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 01/12/2024
మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన : చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది
కథా పఠనం: పెనుమాక వసంత
మంచు కొండ నీడలో, ఎర్ర గులాబీ పూల చెట్టు సన్నిధిలో,
మంచు వానకి ముద్దగా తడిచిన చెక్కపై,
కలువుల వంటి కనులతో, లేత గులాబీలా రంగు పెదాలతో,
తెల్లని చాయతో,
లక్ష్మి కళ మోముతో,
నీలి రంగు చీర కట్టుకొని, అందానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒక అమ్మాయి కూర్చుని ఉంది..
చెక్కిళ్లపై మెరుస్తూ నిలిచిన కన్నీటి బిందువు మంచు బిందువులతో పోటీ పడి మెరుస్తున్నట్టు నిలుస్తున్నాయి.
వెలుగుని విరజిమ్మే నల్లని కాటుక కనుల వెనుక చీకటి గతం ఏదో గానం చేస్తుంది..
మౌనంగా జారే కన్నీటి వెనుక విధ్వంసం ఏదో నాట్యం చేస్తుంది..
బిగుసుకున్న పెదవుల వెనుక, పరితపించే సంద్రంలో ఆశల అలలు ప్రేమని అందుకోవడానికి ఎగసి ఎగసి పడుతున్నాయి..
విషాద అమృతాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఏకాంతాన్ని భగ్నం చేస్తూ, జన సమూహం పరుగులు తీస్తూ అటువైపుగా వస్తున్నారు..
ఆ జన సమూహంలో ఒక పెద్దాయన చేతిలో కర్ర పట్టుకుని, పంచె కట్టుకొని తలపాగా చుట్టుకుని వణుకుతున్న చేతులతో, తడబడుతున్న నడకతో తన శక్తిని అంత ఉపయోగించి వీలున్నంత వేగంతో నడుస్తున్నాడు..
ఆ అమ్మాయి పెద్దాయన దగ్గరకు వచ్చి, “తాతా, ఏం జరిగింది.. ఎందుకు అందరూ అలా పరుగులు తీస్తున్నారు?” అని అడిగింది.
కర్ర సహాయంతో నడుస్తున్న పెద్దాయన నిలబడి కళ్ళజోడు సరి చేసుకొని తల ఎత్తి ఆ అమ్మాయి వైపు చూసి “ఏంటమ్మా సరిగ్గా వినిపించలేదు” అన్నాడు.
“అదే తాత, మీరందరూ ఎందుకు అలా పరుగులు తీస్తూ వస్తున్నారు?”
అప్పటికీ తాత నుండి ఏ సమాధానం రాకపోయేసరికి ‘ఓ! అవును కదా.. వీళ్ళకి తెలుగు రాదు కదా, మర్చిపోయాను’ అనుకొని తను కూర్చున్న ప్లేస్ కి తిరిగి వెళుతుంది..
జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతం అది.
చుట్టూ మంచు కొండలు, నిరంతరం హెవీ స్నో ఫాల్ సంభవించే ప్రాంతం అది. పర్యాటకులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకర్షిస్తుంది..
జమ్మూ కాశ్మీర్ ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించి వెళతారు. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చు..
అంతేకాకుండా ఇక్కడ మూవీ షూటింగ్స్ మరియు షార్ట్ ఫిలిం షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సహజమైన మంచి కొండల సోయగాన్ని చూపించాలి అని అనుకునే దర్శకులకు ఈ ప్రాంతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ షూటింగ్ కొంచెం కష్టం అని చెప్పవచ్చు. ఏ టైం లో స్నో ఫాల్ ఎక్కువగా ఉంటుందో చెప్పడం కష్టం కానీ రిస్క్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వెంచర్..
ఈ ప్రాంతం జననివాసానికి అంతా సౌకర్యవంతమైనది కాదు. అయితే కొంతమంది వలస వచ్చి ఇక్కడ స్థిరపడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక 50 కుటుంబాలు మాత్రం ఈ కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు..
“అందరికీ ఒక విజ్ఞ.ప్తి మరొకొన్ని నిమిషాల్లో ఈ ప్రాంతంలో హెవీ స్నో ఫాల్ సంభవిస్తుంది. మరియు మంచు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది.
కావున టూరిస్ట్ లు మరియు ఇక్కడ నివసించే ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లవలసిందిగా కోరుతున్నాము, అందుకు వీలుగా బస్సెస్ ని కూడా ఏర్పాటు చేశాము. దయచేసి మా మనవిని ఆలకించగలరని కోరుకుంటున్నాము.. “
ఒక అనౌన్స్మెంట్ ఇంగ్లీషులోనూ హిందీలోనూ వినిపిస్తుంది.
అది వినగానే ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడుచుతుంది..
‘ఏంటి దేవుడా ఇలా చేసావు.. నా రవిని కలిసి కన్నీటితో మంచు గడ్డగా మారిన నా ఈ హృదయాన్ని తన సన్నిధిలో ఉంచి, కన్నీరు వలె కరిగి పోవాలి అని అనుకున్న నా ఆశలకు ఇలా ఆటంకం కలిగిస్తున్నావు..
నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు, ఏ నమ్మకంతో ఉన్నానో కూడా నీకు తెలుసు.
నా ప్రేమ చిగురించిన చోటే నా జీవితానికి శాశ్వత చిరునామా దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది..
ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఎడబాటు ఈరోజుతో అంతం అవ్వాలి. నా ప్రేమకి ఉనికి ఇక్కడే ఉంది. నాకు నమ్మకం ఉంది తను ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. నేను తనని కలుసుకుంటాను..’ అంటూ కళ్ళు మూసుకుని దృడ సంకల్పంతో దేవుని ప్రార్థిస్తుంది..
మంచు కొండ కు మరో ప్రక్క ఒక వ్యక్తి తన ఎదుట నిలబడిన వ్యక్తితో ఏదో సీరియస్గా ఎక్స్ప్లైన్ చేస్తూ ఉంటాడు, దూరం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ ‘డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్’ అని పిలవడంతో, సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు.
కొంచెం మాసిన గడ్డం, ఒత్తుగా పెరిగిపోయిన క్రాఫ్, నిప్పులు కురిపిస్తున్న ఎర్రబడ్డ కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి అతనికి పని పట్ల తప్ప వేరే దేనిమీద ధ్యాస లేదని..
పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి తన చేతిలో ఉన్న కెమెరా మరియు షూటింగ్ కి సంబంధించిన వస్తువులు ప్రక్కన ఉంచి,
“సార్! మరో కొద్ది నిమిషాల్లో ఇక్కడ హెవీ స్నో ఫాల్ మరియు మంచుకొండ చరియలు విరిగిపడతాయంట. అందరిని ఇక్కడి నుండి వెళ్ళిపోమని అనౌన్స్మెంట్ వచ్చింది.. “
“నేను విన్నాను జగ్గు. ఎందుకు కంగారు పడతావు? మన హీరో చూడు ఎంత నిమ్మలంగా ఉన్నాడో.. నేను స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తల ప్రక్కకి తిప్పకుండా ఎంతో ఎక్సైట్మెంట్తో వింటున్నాడు..”
“సార్, మీరు అలాగే చెబుతారు. ఎందుకంటే మీకు పని తప్ప మరో ధ్యాస లేదు. కానీ మాకు అలా కాదు. ఇప్పటికే లోపల నుంచి వణుకు వస్తుంది. ఇంకా ఇలాగే ఇక్కడే ఉంటే మా ప్రాణాలు ఈ స్నో లో కలిసిపోతాయేమో అని భయంగా ఉంది”
“జగ్గు! రిస్క్ లేకుండా ఏ పనిలో కూడా కిక్ ఉండదు. కావాలంటే మీరందరూ వెళ్లిపోండి. ఆ కెమెరా అవన్నీ ఇక్కడే ఉంచు. ఆ స్నో ఫాల్ ని నేను షూట్ చేస్తాను. మన మూవీలో ఇలాంటి సహజమైన సంఘటనలు ఉండడం ఎంతో ముఖ్యం”
“సరే సార్! మీరు వినరని నాకు తెలుసు. హీరో సార్.. మీరు వచ్చేస్తారా లేదంటే ఈ రిస్క్ లో సర్కస్లు చేస్తారా.. మా డైరెక్టర్ సార్ తో కలిసి?”
‘లేదు లేదు, నేను వచ్చేస్తాను కదా.. ఒరేయ్ జగ్గు. నువ్వు అన్నది నిజమే రా, పనిలో పడితే నేను ఎవరి మాట వినను. ఎందుకంటే ఆ పనిలోనే నా ప్రాణానికి ప్రాణం అయిన హిమని చూసుకుంటున్నాను.. ఒక్క క్షణం నా పని ఆపితే మరో క్షణం నా ప్రాణం ఉండదు.
ఎక్కడున్నావు హిమ.. విచిత్రం ఏంటో తెలుసా.. నువ్వు ఎక్కడున్నా ఎప్పుడు నా ప్రక్కనే ఉన్నట్టు నాకోసం పరుగులు తీస్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది..’ అనుకుంటూ వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకుని ఒక చేత్తో బ్యాగ్స్ పట్టుకొని మరో చేత్తో కెమెరాని భుజంపై పెట్టుకుని పరుగు లాంటి నడకతో, “హిమా! ఈ ప్రదేశం మనకి ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది’ అని హిమని తలుచుకుంటూ పొంగి వస్తున్న ఏడుపుని అతి కష్టం మీద ఆపుకుంటూ,
‘నేను ఈ కన్నీటిని నేల మీద జారనివ్వను, నా ఒక్కొక్క కన్నీరు నా ఎమోషన్ ని తెలియజేస్తుంది. నీ జ్ఞాపకాలలో నా ఎమోషన్స్ నిండి ఉన్నాయి. నీ జ్ఞాపకాల్ని ఇలా కన్నీటి రూపంలో బయటకి వెళ్ళనివ్వలేను..
నా కల నిజం కాదు, నా నిజంలో నీవు లేవు, నీవు లేని జీవితం నాది కానే కాదు.. హిమ.. ఐ లవ్ యు..
ఎక్కడున్నా ఎలా ఉన్నా నా ప్రేమ నీకే.. హిమ.. ఐ లవ్ యు ఐ లవ్ యు. మై డియర్ స్వీట్ తింగరి..’
అంటూ దగ్గరగా అరిచిన అరుపు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తున్న హిమ హృదయాన్ని తాకింది.
ఆ పిలుపు హిమలో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది.
‘రవి, రవి.. ఇక్కడే.. ఇక్కడే ఉన్నాడు.. నన్ను తింగరి అని పిలిచేది అతను ఒక్కడే. ఆ వాయిస్ తనదే’ అంటూ ఆనందం నిండిన కన్నులతో చుట్టుప్రక్కల చూస్తుంది. ఎంతో ఆశగా వెతుకుతుంది.
హిమ నడుచుకుంటూ కొంత దూరం వెళుతుంది. రవి తన భారాన్నంతా ప్రకృతితో పంచుకున్నందుకు రిలీఫ్ గా ఫీల్ అయ్యి కెమెరా పట్టుకుని మంచి లొకేషన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు..
కెమెరాతో అటు ఇటు తిరుగుతున్న రవిని చూస్తుంది హిమ. తన ప్రేమని గుర్తించడానికి అంత ఎక్కువ సమయం ఏమి పట్టలేదు .తనే.. అతనే రవి.
వంద నదుల సంతోషం సంద్రంలో కలిసిన అలజడి మనసులో ఆనందం రూపంలో ఉప్పొంగుతుంది.
వెయ్యి దీపాల కాంతి మోము పై వెలుగుల్ని నింపుతుంది.
ఒక్క అడుగు కూడా దూరం ఉండలేనంటూ పాదం అతని వైపుకు పరుగులు తీస్తుంది.. తనకి దూరంగా ఉన్న తీరం పరుగులు తీస్తూ వస్తున్న రూపం హిమదే అని రవి కూడా గుర్తిస్తాడు.
చూసే కన్ను రెప్ప వేయడం మరిచింది. ఉచ్వాస నిచ్వసాలు కర్తవ్యాన్ని మరిచాయి. పాదం అడుగు కదపక నేలని అంటిపెట్టుకుంది. మనసు శరీరం స్పందన లేక నిశ్చలంగా పరుగున వస్తున్న అద్భుతాన్ని చూస్తూ ఉండిపోయాయి..
జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించే లోపే హిమ, రవికి, అత్యంత దగ్గరగా చేరువై గట్టిగా హత్తుకుంటుంది..
ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషం, ఏడాది పాటు వేచి చూసిన నిరీక్షణ ఆ ఒక్క నిమిషం వారి కౌగిలిలో తరిగిపోయింది..
కొంతసేపు నిశ్శబ్దం మౌనంగా వారికి ఎన్నో సంగతులను తెలిపింది ఒకరి స్పర్శ ఒకరికి ఎంతో ధైర్యాన్ని అందించింది..
“వేగంగా కొట్టుకునే నీ హృదయ స్పందనకి అబద్ధం లా అనిపించే ఒక నిజం చెప్పనా రవి,
మన కల నిజం కాబోతుంది. నిజం అనే నేటిలో మన భవిష్యత్తుని కలలమయం చేసుకోవడానికి కాలం సహకరించింది..”
“అసలు ఇన్నాళ్లు ఏమైపోయావు హిమ” అంటూ హిమ మోమును చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు.
కన్నీళ్ళ సంద్రంలా మారిన హిమ కళ్ళని చూసి “వద్దు హిమ, నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. నీ కళ్ళలో నిజం నాకు కనిపించింది. నీ కన్నీళ్ళకి కారణం అర్థమయింది.. నువ్వు ఇక ఒక్క కన్నీటి చుక్క ని కూడా కార్చడానికి వీలు లేదు. నువ్వు నా ప్రాణానివిరా.. నిన్ను నేను ఎప్పటికీ దూరం చేసుకోను” అంటూ హిమని గట్టిగా తన హృదయానికి హద్దుకుంటాడు..
ప్రేమ పరవశంలో తేలుతున్న ఆ ప్రేమ జంటకి చుట్టూ ఉన్న పరిస్థితి క్షణక్షణం ఎంత భయంకరంగా మారుతుందో గ్రహించుకోలేకపోతున్నారు..
మృత్యువు కాల యముడి రూపంలో తరలి వస్తుంది.
యమపాశం ప్రేమ పాశం ముందు ఓడిపోతుందా,
లేదా యమపాశం ప్రాణాలను హరిస్తుందా???
తెలుసుకోవాలంటే,
హిమబిందు, రవికాంత్ ల ప్రేమ ప్రయాణంలో ప్రయాణికులం కావాల్సిందే..
=======================================================================
ఇంకా వుంది
========================================================================
చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi
చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది.
వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా.
ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం.
సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం...
MAD Entertainers
•20 hours ago
🎉🎉
Ch Vijayalakishmi
•1 hour ago
Very nice 🎉
Ravi Ch
•1 hour ago
Supar🎉