top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 11

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 11 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 10/02/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 11 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.

అక్కడకు వచ్చిన హిమ తండ్రి హిమను ఇంటికి తీసుకొని వెళతాడు.



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 11 చదవండి.


“చూడు హిమా! నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ రవికాంత్ ని, నీ ప్రేమని నేను అంగీకరించలేను. అసలు ఈ ప్రభాకర్ ని కాదు అని అనుకోడానికి ఒక్క కారణం చెప్పు?”


‘ఒక్క కారణం కాదు నాన్న వంద కారణాలు ఉన్నాయి కానీ అవి చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు’ అని మనసులో అనుకుంటుంది హిమబిందు. 


“ఈ రవికాంత్ ని వద్దనడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి”.

 

‘నాన్నా! నువ్వు పైకి కనిపించేదే నిజం, కనిపించినది అబద్ధం అనే భ్రమలో ఉన్నావు. ఆ ప్రభాకర్ నిన్ను తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు’ అని నాన్నతో చెప్పే ధైర్యం లేక మనసులోనే అనుకుంటుంది. 


“అతనితో నీ భవిష్యత్తుని ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంటుందమ్మా. ఈ వయసులో మీరు అనుకునే ప్రేమ ఒక భ్రమ అది ఒత్తి ఆకర్షణ మాత్రమే. 


ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి చేసుకుని వెళ్లేచోట కళ్ళు మూసుకొని బ్రతికేయాలి అని అనుకుంటాడు. నేను నీ శత్రువుని కాదురా నాన్నని. అందుకే నీకు అన్ని విధాలుగా సరిపోయే సంబంధం తీసుకువచ్చాను.. 



సరే నీకు అర్థమయ్యేలా చెబుతాను చూడు.. ఆ రవికాంత్ ఎన్నో సంవత్సరాల నుండి బీటెక్ లోనే ఉన్నాడు. తన డిగ్రీ కూడా తను పూర్తి చేయలేకపోతున్నాడు”.

 

“నాన్నా! తనకి చదువు పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు. తన గోల్ మొత్తం మూవీ డైరెక్టర్ అవ్వాలని.”

 

“సరే అక్కడికే వస్తున్నా. మరి తనకు నచ్చిన రంగంలో ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి సాధించాడా? ఒక్క దానిలో నైనా గుర్తింపు తెచ్చుకున్నాడా?”

 

“నాన్నా! తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పైగా తను వేరే వాళ్ళకి ఎడిటింగ్ లో డైరెక్షన్లో షూటింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. డబ్బుల కోసం ఇప్పుడు తన ఓన్ గా ప్రయత్నించడం మొదలుపెట్టాడు..” 


“హిమ.. అతడు నీకు చెప్పిన మాయ మాటలు నాకు చెప్పకు. 

అదే మన ప్రభాకర్ విషయంలో చూడు.. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. అన్నిటిల్లో ఫస్ట్. క్యాంపస్ లో జాబ్ వచ్చినప్పటికీ నాన్న బిజినెస్ ని డెవలప్ చేయాలని ఆ కంపెనీకి అతి చిన్న వయసులోనే సీఈవో అయ్యాడు. ఇంతకు మించిన బెస్ట్ పర్సన్ నీకు దొరుకుతాడా?”


ఆ మాటలకు హిమకు ఎంతో చిరాగ్గా అనిపిస్తుంది. రవికాంత్ ని తక్కువ చేసి ఆ ప్రభాకర్ ని పొగుడుతుంటే మనసులో ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నప్పటికీ ఓపికతో మాట్లాడుతుంది. ‘నాన్నా! నా రవికాంత్ క్యారెక్టర్ లో శిఖరం వలే ఉంటాడు. ఈ ప్రభాకర్ క్యారెక్టర్ లో పాతాళంలోకి దిగిపోయి ఉంటాడు. కానీ ఇది మీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను నాన్న..’ 



“హిమా! నీ మౌనమే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం అని నాకు అర్థం అయింది. కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలను తీసివేసి జరిగబోయే వాటికి సిద్ధంగా ఉండు అందరికీ అదే మంచిది.” 


ఆ మాటలకు హిమకి ఒక్కసారిగా దుఃఖం పొంగి వచ్చింది. వచ్చే ఏడుపుని అతి కష్టం మీద ఆపుకుంటూ, 

“నాన్నా! నేను మౌనంగా ఉన్నానంటే నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు.”

 

“ఏంటి.?”

 

“అవును నాన్న..”

 

“ఏంటే మీ నాన్నగారితో ఇలానేనా మాట్లాడేది.”

 

“నువ్వు ఆగమ్మా. నాన్నా! కొంచెం సేపు రవికాంత్ విషయము, నా ప్రేమ విషయము పక్కన పెట్టండి. నేను అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోను. బీటెక్ పూర్తి చేయాలి, జాబ్ చేయాలి. అప్పుడే పెళ్లి.. అదంతా..” అంటూ ఖచ్చితమైన తన నిర్ణయాన్ని చెప్పి చక చకమంటూ తన రూమ్ లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడుస్తుంది. 


‘నన్ను క్షమించండి నాన్న.. అలా మాట్లాడినందుకు. నాకు వేరే మార్గం కనిపించడం లేదు.’ 


ఆవేశంతో ఊగిపోతూ హిమ గది దగ్గరకు వెళ్తున్న నాన్నని అమ్మ ఆపుతుంది. 


“ఏంటండీ ఆ ఆవేశం, అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. కొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుమను గుతుంది.” 


“అదేమీ చిన్నపిల్ల కాదు. అరకు వెళ్ళింది ఆ రవికాంత్ ని కలవడానికి. ఆ విషయము ప్రభాకర్ నాకు చెప్పాడు. వైజాగ్లో పనుండి వెళ్లాడట. అక్కడ ఇది కనిపించడంతో మాట్లాడదామని వెళ్లాడంట. ఇది అక్కడ ఆ రవికాంత్ తో మాట్లాడటం చూసి మౌనంగా తిరిగి వచ్చేసాడంట. 


ఇంత తెలిసినా ఆ అబ్బాయి ఏమంటున్నాడో తెలుసా.. అంకుల్. హిమబిందు ది తప్పేమీ లేదు. ఆ రవికాంత్ ఏదో మాయ చేస్తున్నాడు. తనని మెల్లిగా ఒప్పించండి. నేను తనకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను.. అని అంటున్నాడు. అంత గొప్ప మనసు అతనిది. ఈ పిచ్చి దానికి అది అర్థం కావడం లేదు.

 

చూడు ఇందిరా.. నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ నెల రోజుల్లో దాని మనసు మార్చి పెళ్లికి ఒప్పించు. అది ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తా. ఎందుకంటే నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం. అది ఇప్పుడు బాధపడొచ్చు కానీ రేపు సంతోషంగా ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది..” 






గదిలో ఉన్న హిమకు ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. 

అంటే నాకు తెలియకుండా నా వెనుక నీడలాగా నన్ను ఫాలో అవుతున్నాడు అన్నమాట ఆ ప్రభాకర్.. 

రవికాంత్ చెప్పింది నిజమే, అతనికి పెద్ద నెట్వర్క్ ఉందని. 


‘నెల రోజుల్లో ఒప్పుకోకపోతే బలవంతంగా చేస్తారంట.. పెళ్లి.. నేను మనిషిని అనుకుంటున్నారా లేదా బానిసని అనుకుంటున్నారా నాన్నా, ఎందుకు నాన్నా ఇలా మారిపోయావు.. నా ఇష్టాన్ని నా అభిప్రాయాన్ని గౌరవించే నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు???’

అంటూ జవాబు దొరకని ప్రశ్నల వైపు అన్వేషణ మొదలు పెట్టింది హిమబిందు.. 

***

“ఇదంతా ఎప్పుడు జరిగింది రా” 


“టెన్ డేస్ క్రితం జరిగింది బబ్లు”. 


“చివరిసారిగా హిమనీ ఎప్పుడు కలిశావు”

 

“అదేరా నీకు చెప్పా కదా.. మా అరకు స్టోరీ. ఆరోజు అమ్మని కలిసి వస్తాను వెయిట్ చెయ్ అని చెప్పి వెళ్లి వచ్చి చూసేసరికి హిమ లేదు, తర్వాత టు డేస్ కి ఇదిగో ఇదంతా మెసేజ్ లో చెప్పింది. 


తను కాల్ చేసేవరకు నన్ను చేయొద్దని నెలరోజుల తర్వాత తన నిర్ణయం ఇంట్లో చెప్పమన్నారని వాళ్ళ నాన్న తనతో మాట్లాడడం మానేశారని చెప్పింది.” 


“మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా?”


“ఏమో బబ్లు.. ఏమి అర్థం కావట్లేదు. దేనిమీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను”.

 

రవికాంత్ కి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో “రేయ్ బబ్లు.. ఎవరో అన్నోన్ నెంబర్ రా, ఒకవేళ హిమనేమో లిఫ్ట్ చేసి మాట్లాడరా.” 


“హలో, హలో మాట్లాడేది రవికాంత్ ఏనా అండి”


“అవును మీరెవరు?”

“మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి” అంటూ యాక్సిడెంట్ అయిన అడ్రస్ చెప్పి అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తారు.


“రేయ్ బబ్లు.. నాన్నకి యాక్సిడెంట్ అయిందంట. నేను మళ్ళీ కలుస్తాను నిన్ను” 


“సరే రా వెళ్ళు”


రవికాంత్ బైక్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. 

అసలే కంగారుగా ఉన్న రవికాంత్ ని మరింత ఇబ్బంది పెట్టడం కోసమే అన్నట్టు బైక్ సడన్గా ఆగిపోతుంది. 


‘చ.. దీనికేమైంది ఇప్పుడు..’ అంటూ బైక్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అమ్మ నుండి ఫోన్ రావడంతో, 

అమ్మకి ఇదేమి చెప్పకూడదని మామూలుగానే “హలో అమ్మ” అంటాడు.


“రేయ్ రవి.. ఎక్కడున్నావు.. వచ్చేటప్పుడు నిన్ను నాన్నగారు ఆయన ఎప్పుడు మెడిసిన్ తీసుకుని మెడికల్ షాప్ కి వెళ్లి మెడిసిన్ తీసుకురమ్మని చెప్పమన్నారు.” 


“అమ్మ, నాన్న ఇంట్లోనే ఉన్నారుగా.. ఏమి కాలేదుగా”


“ఇంట్లోనే ఉన్నారు రా మీ నాన్నగారు. అయినా ఆయనకేమవుతుంది.. ఇప్పుడే కప్పు కాఫీ తాగి తీరికగా పేపర్ చదువుకుంటూ ఉన్నారు.. ఎందుకు అలా అడుగుతున్నావు”


“ఏమి లేదమ్మా. సరే ఉంటాను. వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకొని వస్తాను లే. బాయ్.”

 

‘ఇదంతా ఎవరు చేసుంటారు.. ఏమీ అర్థం కావట్లేదు. సర్లే నాన్నకైతే ఏమీ కాలేదు’ అని కొంచెం ఊపిరి పీల్చుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. 


జేబులో ఉన్న ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో, 

మళ్లీ ఎవడ్రా బాబు అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని ‘ఇదేంటి ఈ ప్రభాకర్ వీడియో కాల్ చేస్తున్నాడు.. 

లిఫ్ట్ చేయాలా వద్దా, అయినా వీడికి భయపడేదేంటి లిఫ్ట్ చేద్దాం’ అని గ్రీన్ బటన్ పై క్లిక్ చేసి, 

“ఏంటి నాకు ఫోన్ చేసావ్” అంటాడు.  


“కూల్ రవికాంత్ కూల్. 

ఏంటి.. ఏం చేయాలో అర్థం కాక పిచ్చితో జుట్టు పీక్కుంటున్నావా, నాకు చాలా సంతోషంగా ఉంది రా నిన్ను ఎలా చూడాలనుకున్నానో అలానే చూస్తున్నా. 


కాకపోతే ఒక చిన్న అసంతృప్తి.. నీ మాటల్లో పొగరు కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదు. 


హిమబిందు నీ పక్కనే ఉంటుంది అనే కదా నీ ధైర్యం. తగ్గిస్తా. ఆ ధైర్యాన్ని కూడా తగ్గిస్తా. నీ కళ్ళల్లో భయం గొంతులో వణుకు త్వరలోనే వింటా. సారీ కళ్ళల్లో భయం చూస్తా. గొంతులో వణుకు వింటా. రాసి పెట్టుకో.. 


దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమని నీకు కాకుండా చేస్తా. నీ హిమబిందుని నా సొంతం చేసుకుంటా.” 


“రేయ్ ప్రభాకర్! అది ఇది కాదు. తన పేరు హిమబిందు. జాగ్రత్తగా మాట్లాడు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు.”

 

“రేయ్ రవి. నీ దగ్గర రెస్పెక్ట్ నేర్చుకునే పరిస్థితిల్లో నేను లేనులే. త్వరలో మా వెడ్డింగ్ కార్డ్ అందుకోవడానికి రెడీగా ఉండు” అంటూ కాల్ కట్ చేస్తాడు ప్రభాకర్.. 


‘రవి.. ఇవాళ ఎందుకో బాగా గుర్తొస్తున్నావు. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండగలిగాను. కానీ ఇవాళ మాట్లాడాలని అనిపిస్తుంది. నిన్ను గట్టిగా హగ్ చేసుకుని తనివి తీరా ఏడవాలని ఉంది. నేను ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అసలు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని అనుకుంటూ తనలో తను మదన పడుతూ నిద్ర రాక లేచి అటు ఇటు తిరుగుతూ, ఇక నావల్ల కాదు తనకి కాల్ చేసి మాట్లాడుతాను టైం 12 అవుతుంది నిద్రపోతాడా, నాకు రాని నిద్ర తనకి వస్తుందా..


మొదట తన ఫోన్ నుండి చేద్దామనుకొని, ‘వద్దు   దీని నుండి వద్దు. రవి ఇచ్చిన మొబైల్ ఉంది కదా. దాని నుండి చేస్తా. అదే సేఫ్..’ 


నిద్ర రాక మొబైల్లో హిమబిందు ఆక్ట్ చేసిన వీడియోస్ చూస్తున్న రవికాంత్ కి మొబైల్ స్క్రీన్ పై హిమబిందు నెంబర్ కనిపించడంతో పోతున్న ప్రాణం నిలబడినట్టు అనిపించి వెంటనే లిఫ్ట్ చేసి, 


“ఏంటి హిమ. ఫోన్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందా” 


“ఏం చేయను రవికాంత్. అంతా నీకు కూడా తెలుసు కదా”


“హే ఏదో సరదాగా అన్నాను అంతే. ఎలా ఉన్నావు హిమ?”


“నీ ప్రేమలో ఉన్నాను కదా బాగానే ఉన్నా. కానీ నీ సన్నిధిలో లేనందుకు కొంచెం బాధలో ఉన్న..”

 

“అబ్బబ్బ సూపర్. ఎంత పోయెట్రిక్ స్టైల్లో చెప్పావు హిమ, నేను ఇచ్చిన బుక్ బాగా చదివేసినట్టున్నావు ఇట్టే కవిత్వం వల్లెస్తున్నావు..”

 

“ఎంతైనా నీ తింగరిని కదా.. ఆ మాత్రం ఉండాలి మరి..”

 

ఇద్దరూ బాధలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు. ప్రేమలో ఉన్న మహత్యం అదేనేమో ఎన్ని ఇబ్బందులను చవిచూచినప్పటికీ ఒక్క పది నిమిషాలు మనసుకి నచ్చిన వారితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికి వీరిద్దరే నిదర్శనం.. 


“ఇంతకీ నువ్వేం చేస్తున్నావు రవి..”

 

“నేనా, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఎప్పుడైనా నిద్ర రాలేదనుకో జోల పాట పాడి నిన్ను నిద్రపుచ్చడానికి ఒక మంచి పాటని రాస్తున్న,”

 

“అవునా ఏది చెప్పు వింటా” 


“హిమ.. ఇది అలా ఇలా ఎలాగో వింటే అర్థం కాదు. మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కనపెట్టి, 

కళ్ళు మూసుకొని హృదయంతో వింటే అర్థమవుతుంది. ఆ ఫీల్ నీకు తెలుస్తుంది” 


“ఓకే సార్! అలాగే వింటాను, చెప్పండి”


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 12 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








21 views0 comments

Comentarios


bottom of page