top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 12

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 12 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 17/02/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 12 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.

అక్కడకు వచ్చిన హిమ తండ్రి హిమను ఇంటికి తీసుకొని వెళతాడు. హిమకు కాల్ చేస్తాడు రవి. 



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 12 చదవండి.


“నిదుర పో ఓ చెలి నిదుర పో 

 నా ఒడినే నీ పాన్పు గా చేసుకుని హాయి గా నిదురపో, నా గుండె చప్పుడు నే, 

నీ జోల పాట గా చేసుకుని ఆనందం గా నిదుర పో, 

జాబిలమ్మ, వెన్నెలను కురిపిస్తూ నిన్ను జో కొడుతుంది నిశ్శబ్దంగా, 

ఆ దృశ్యం చూస్తుంటే నా హ్రుదయం ఎంతో పరవసించిపోతుంది. 


నిదురపో ఓ చెలి నిదుర పో, 


నీ అందమైన కనుపాపలు మూసి నువ్వే ఓ చిన్ని పసి పాప వై నిదుర పో, 

చందమామ చెంతకు చేరిన వేళ, జాబిలమ్మ జోల పాటను పాడిన వేళ, 

నిదురపో నిదురపో నా ఊహల ఊయలలో. 

చల్లగాలి తనువుని చుట్టిన వేళ, నిశి అందాలను పరిచిన వేళ, 

నిదురపో నిదురపో నా పాటల పదనిసలో, 

పక్షులు గూటికి చేరిన వేళ, 

వెన్నెల వెలుగుల కల్లాపి వేళ, 

నిదురపో నిదురపో నా మాటల మధురిమలో, 

తూర్పమ్మ నిదరోయిన వేళ సుగంధపు పరిమళాలు విరజిమ్మే వేళ, 

నిదురపో నిదురపో నా స్మృతుల సుమధుర వాణిలో, 


కలలు కౌగిలించిన వేళ, కలతలు మాయమైన వేళ, 

నిదురపో నిదురపో నా కంటి పాపలో. 

మిణుగురులు మెరిసే వేళ, నీలి నింగి నల్లగా కరిగే వేళ, 

నిదురపో నిదురపో చల్లని నా చెంతలో. 


చెమట చుక్క నుదుటున జారే వేళ, ఆకాశపు చుక్క దాన్ని చుమ్మించిన వేళ

నిదురపో నిదురపో చుక్కల పల్లకిలో”. 


హలో హిమ”


హిమ నుండి ఏ సమాధానం రాకపోయేసరికి

‘ఏంటి.. నిజంగానే నిద్రపోతుందా ఈ తింగరి.. 


“హలో మాట్లాడు..” 


రవి మనసుకి ఫిజియోథెరపీ చేసినంత హాయిగా ఉంది. 

ఇప్పటివరకు ఉన్న దిగులంతా ఒక్క పాటతో మాయం చేశావు. జీవితాంతం ఇలాగే నీ ఒడిలో పడుకొని నీ మాటలు పాటలు వింటూ ఉండాలి అని అనిపిస్తుంది.. 


పాటలతో మాటలతో బ్రతుకు బండి నడవదమ్మాయి, 

మీ నాన్నగారు చెప్పేది కూడా అదే కదా,అందుకే ఇలా కష్టపడుతున్నాను.”

 

“రవి.. అవన్నీ నాకు తెలియదు. ప్లీజ్! అవి ఇప్పుడు గుర్తు చేయకు.”

 

“సరే! ఇంతకీ తిన్నావా?”

 

“తిన్నాను. నువ్వు, ?”


“తిన్నాను హిమ..” 


“రవి, రవి..”


“చెప్పు” 


“ఒక్కసారి చూడాలని ఉంది”. 


“అవునా! అయితే ఒక్కసారి మీ టెర్రస్ పైకి రా కలుద్దాం”. 


ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి, 

“ఏంటి నువ్వు మాట్లాడేది?”


“అవును హిమ.. నాకు నిన్ను చూడాలని అనిపించింది. అందుకే వచ్చేసాను. ఇందాకట్నుంచి అడుగుదామంటే నువ్వేమైనా అనుకుంటావని ఆగాను. ఇప్పుడు నీకు కూడా చూడాలి అని అనిపిస్తుంది కదా.. వెంటనే వచ్చేసేయి..”


“రవి, వద్దు.. వెళ్ళిపో. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది.”

“ప్లీజ్ హిమ.. ఎప్పుడూ భయపడుతూ ఉంటే ఎలా.. ఏమి కాదు రా..” 


ఆ చల్లని చంద్రోదయ వేళ ఒకరి బాధను ఒకరితో పంచుకుంటూ మనసులను తేలికపరచుకొని, 

ఒకరి మాటని ఒకరు ఓదార్పుగా చేసుకొని బాధని ప్రేమని పంచుకున్నారు.. 


“హిమ.. చేతికి బ్యాండేజ్ వేసావు.. ఏమైంది? కొంపతీసి సూసైడ్ అటెంప్ట్ చేసావా ఏంటి చచ్చిపోవడానికి.”

 

“హలో.. ఈ హిమబిందు అంత పిరికిది కాదు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటా. అయినా చచ్చిపోయే ఆలోచన వస్తే నీతో కలిసి చచ్చిపోతాను కానీ నేను ముందే వెళ్లిపోను. బ్రతికి ఉన్నా నీతోనే, చావును పంచుకునేదైనా నీతోనే..” 


“ఏయ్! నేను ఏదో సరదాగా అంటే ఎందుకు అంత సీరియస్ గా మాట్లాడుతావు? ఇంతకీ ఆ చేతికి ఏమైంది..”

 

“ఆనియన్స్ కట్ చేస్తుంటే వేలు కట్ అయింది.”

 

“హిమ.. నీకు వంట వచ్చా..”


“వచ్చు”. 


“హమ్మయ్య!~ బ్రతికించారు. అందరి అబ్బాయిల్లాగా నాకు వంట నేర్చుకునే పని తప్పింది.

 సరేగాని నువ్వు ఏమి తినలేదని నాకు తెలుసు. ఇదిగో దోసెలు తెచ్చాను తినిపిస్తాను రా,”


“నేను తినలేదని నీకెలా తెలుసు”.

 

“అదంతేలే. అలా తెలిసిపోయింది”


“చాలు రవికాంత్.. కడుపు నిండిపోయింది”. 



“హిమ.. ఆ కళ్ళల్లో నీళ్ళు ఏంటి’


“నాన్న కూడా ఇంతే రవి.  నేను తినకుండా పడుకుంటే తను ఇంటికి వచ్చి సరికి ఎంత లేట్ అయినా నాకోసం బయట నుండి ఏదో ఒకటి తెచ్చి నిద్రలేపి తినిపించేవారు. అది గుర్తుకు వచ్చింది.. అలాంటి నాన్న ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయారో తెలియడం లేదు.”

 

“హిమ.. మీ నాన్నకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. నేను నిన్ను ఇష్టపడే దానికన్నా వందరెట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో, వాళ్లకి వేరే వ్యక్తి వల్ల ప్రమాదం ఉందని అనుకుంటే ఆ వ్యక్తి నుండి దూరం చేసి ప్రమాదం నుండి తప్పించాలని అనుకుంటారు. అయితే ఆ ప్రయత్నంలో ఇష్టపడిన వాళ్ల బాధను కూడా పట్టించుకోరు. మీ నాన్న నన్ను ఓ ప్రమాదం అని అనుకుంటున్నారు. అందులో ఆయన తప్పేమీ లేదు. ఆ ప్రభాకర్ అలా క్రియేట్ చేశాడు.. 


ఒప్పిద్దాం హిమా! ఓపికతో, ఓర్పుతో ఎదురు చూద్దాం. నా ప్రేమపై.. ఏంటి, నీ ప్రేమ.. సారీ,, సారీ.  మన ప్రేమపై, నా సంకల్పబలంపై, నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా మనం ఒక్కటవుతాము. ఆ ప్రభాకర్ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా మనల్ని విడదీయలేరు..” 


“సరే, రవి.. ఇంక వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది.”

 

“సరే హిమ.. గుడ్ నైట్” 


“గుడ్ నైట్ రవి. జాగ్రత్తగా వెళ్ళు.”

 

“నువ్వు కూడా వెళ్లి హ్యాపీగా నిద్రపో. పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకు” అంటూ హిమ తలని నిమురుతూ చెబుతాడు రవికాంత్.. 


“సరే..”

*** 

హిమని కలిసిన సంతోషంతో బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఆ చలిలో అర్ధరాత్రిలో మెరుపు వేగంగా దూసుకు వెళ్తున్నాడు రవికాంత్. అతని ఎదురుగా కాషాయం బట్టలతో ఒక సాధువు రావడం గమనించకపోవడంతో దగ్గరికి వెళ్లిన తర్వాత సడన్ బ్రేక్ వేసి బండిని ఆపి “ఏంటయ్యా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నావు. ఎదురుగా బండి కనిపించడం లేదా” అంటూ అతని వైపు చూస్తూ అడుగుతాడు దూరం నుండి అతని ఫేస్ కనిపించకపోవడంతో.


 దగ్గరగా వచ్చిన తర్వాత అతను ఎవరో అన్నది రవికాంత్ కి అర్థం అవుతుంది.. 


“హే నువ్వా.. ఏంటయ్యా నన్ను వదిలిపెట్టవా, 

మొన్న జమ్ములో, నిన్న అరకులో, ఈ వేళ హైదరాబాదులో. 

అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?”


“ప్రమాదం నీకు ప్రమాదం పొంచి ఉంది. 

ఒక అమ్మాయి రూపంలో అపాయం నిన్ను చుట్టుముడుతుంది. 

నీకు రక్ష రక్ష కావాలి..” 


“ఎప్పుడు కనిపించినా సేమ్ డైలాగేనా ఇంకేమీ లేదా.. అసలు డీటెయిల్ గా చెప్పు.”

 

“కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది” అంటూ నవ్వుకుంటూ ఆ సాధువు వెళ్ళిపోతాడు. 


‘ఏంటి ఇతను మాట్లాడేది.. జరిగే వాటికి.. ఇతను చెప్పే దానికి ఏమైనా సంబంధం ఉందా.. అమ్మాయి రూపంలో అపాయమా.. అంటే ఎవరు’ అని ఆలోచనలో మునిగిపోయి కొంతసేపటి తర్వాత తేరుకొని, చూసేలోపే ఆ సాధువు అదృశ్యం అవుతాడు.. 


‘అయ్యో దేవుడా.. ఏంటి నాకీ కష్టాలు. ఒకదాని తర్వాత ఒకటి. నువ్వు అన్ని ఒకేసారి ఇస్తే వాటిని ఎదుర్కోవడం నావల్ల కావడం లేదు’ అనుకొని బైక్ స్టార్ట్ చేసి వెళ్తాడు.. 

***


“హలో బబ్లు, నేను హిమబిందుని మాట్లాడుతున్నాను.”

 

“హాయ్ హిమ, ఎలా ఉన్నావు,”

 

“నేను బాగున్నాను.”

 

“బబ్లు.. రవికాంత్ కి ఏమైంది.. వారం నుంచి తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది?

ఎంత బిజీలో ఉన్నా పనిమీద వేరే ఊరికి వెళ్ళినా, ఫోన్ చేసి మాట్లాడడం కుదరకపోయినా, 

రోజుకి ఒకసారైనా ఒక చిన్న మెసేజ్ అయినా చేసి తను ఎక్కడ ఉన్నాడో అని ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. అలాంటిది వారం నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. నేను ఎన్ని మెసేజెస్ చేస్తున్న రిప్లై లేదు. ఏమైంది. బబ్లు.. తనకేమీ కాలేదు కదా” అంటూ ఏడుస్తూ అడుగుతుంది. “నాకు చాలా భయంగా ఉంది..” 


“హిమ, ఏడవకు. వాడు బానే ఉన్నాడు. వాడికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. నిన్ననే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్లోనే క్షేమంగానే ఉన్నాడు. నువ్వు బాధపడకు..”

 

“యాక్సిడెంట్ ఎలా అయింది.. ఎప్పుడు అయింది? నాకు ఎవ్వరూ చెప్పలేదు ఎందుకు. “


“నువ్వే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు అని ఎందుకులే అని చెప్పలేదు హిమ. అయినా వాడు కూడా నీకు ఇవేమీ చెప్పొద్దన్నాడు..” 


“అసలు ఎలా జరిగింది బబ్లు”

 

“హిమ.. అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు. వాడిని కొంతమంది రౌడీలు కొట్టి రోడ్డు మీద పడేశారు.. ఎవరో చూసి వాడిని హాస్పటల్లో జాయిన్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పారు.. తలకి కాళ్లు చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. మేము హాస్పిటల్ కి వెళ్లేసరికి వాడు స్పృహలో లేడు. గంట తర్వాత స్పృహ వచ్చింది. ట్రీట్మెంట్ చేసి రెండు రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. అలా నిన్న డిశ్చార్జ్ చేసారు.”


హిమ నుండి ఏ సమాధానం రాకపోయేసరికి “హిమ.. వాడికి బాగానే ఉంది. నువ్వు కంగారు పడకు.”

 

“బబ్లు.. ఇదంతా ఎవరు చేస్తుంటారు?”


“ఇంకెవరు హిమ.. ఆ ప్రభాకర్.”

 

“అవునా!”


“అవును హిమ. నేను కొన్ని విషయాలు చెబుతాను. నేను చెప్పినట్టు రవికాంత్ తో నువ్వు చెప్పొద్దు. 

నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక వాడు నీ దగ్గర చాలా విషయాలు దాచాడు.”

 

“చెప్పు బబ్లు. నేను రవితో చెప్పను లే..” 


ఒకరోజు రవి కాంత్ నిన్ను కలవడానికి నైట్ టైం మీ ఇంటికి వచ్చాడు కదా. అది మీ ఇంటి సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయ్యింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ తను తెలుసుకుంటూనే ఉన్నాడు. నిన్ను కలిసి వచ్చిన రోజు కొంతమంది రౌడీలను పెట్టి రవికాంత్ ని కొట్టించాడు. తన కోపాన్ని తీర్చుకున్నాడు.  ఆ ప్రభాకర్ చాలా డేంజర్ పర్సన్ లా ఉన్నాడు. ప్రతిక్షణం నీ చుట్టూ ఏం జరుగుతుందో మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాడు. రవికాంత్ ని అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడు.. 


రీసెంట్గా రవికి ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. అది తెలుసుకున్న ప్రభాకర్ దాన్ని తన ఇన్ఫ్లుయెన్స్ తో చెడగొట్టాడు.. 


పాపం రవికాంత్ అతని వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. ప్రొఫెషనల్ గా ను పర్సనల్ గాను. 

నీకు చెప్పుకోలేక నిన్ను దూరం చేసుకోలేక మధ్యలో నలిగిపోతున్నాడు. అందులోనూ మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చిన టైం దగ్గర పడుతుంది. అసలు ఈ పరిస్థితుల్లో వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధనంత మనసులోనే పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ తిరిగేస్తున్నాడు హిమ..” 


ఆ మాటలు విన్న హిమకు మేఘం నీటి బరువుని ఒక్కసారిగా నేల మీదకు వదిలేసినట్టుగా కళ్ళు కన్నీటి జలపాతాలను వర్షిస్తున్నాయి. “బబ్లు.. థాంక్యు. ఇదంతా నువ్వే నాతో చెప్పినందుకు. ఉంటాను” అని కాల్ కట్ చేసింది. 


ఎడతెరిపిలేని వర్షం ఎడాపెడా కురిసినట్టు, 

దుఃఖం కళ్ళల్లో నుండి ఉప్పొంగుతుంది.. 


అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుండిపోయిందో తనకే తెలీదు

రెండు గంటలకి దుఃఖ సంద్రం నుండి బయటపడి, 


భారీ వర్షం తర్వాత ప్రశాంతంగా మారిన వాతావరణం లాగా, 

తర్వాత మనసు ప్రశాంతంగా మారి

మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది.. 


కళ్ళు తుడుచుకొని దృఢ నిర్ణయం తీసుకున్నట్టుగా, 

అవును నా నిర్ణయం సరైంది ఈ సమస్యకు ఇదే పరిష్కారం అనుకొని, 

ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతున్న హిమబిందువుని ఆపి, 

“హిమ, ఎక్కడికి వెళ్తున్నావు?”

బయటకి వెళ్తున్న హిమనీ ఆపి అడుగుతాడు నాన్న.

 

“నా సమస్యకి సరైన పరిష్కారం దొరికింది నాన్న. ఆ పనిలోనే బయటికి వెళుతున్నాను. 

మీరేమీ కంగారు పడకండి. ఇంటికి తిరిగి వస్తాను. వచ్చి నా నిర్ణయం చెబుతాను..” 

అంటూ ఇంటి గడప దాటి బయటకు నడుస్తుంది హిమబిందు. 

=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 13 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








26 views0 comments

Comentarios


bottom of page