top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 14

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 14 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 04/03/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 14 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.

అక్కడకు వచ్చిన హిమ తండ్రి హిమను ఇంటికి తీసుకొని వెళతాడు. హిమకు కాల్ చేస్తాడు రవి. హిమని ఇంటి దగ్గర కలిసివచ్చిన రవిని రౌడీలతో కొట్టిస్తాడు ప్రభాకర్. రవికాంత్ ని ఇక కలవనని చెబుతుంది హిమ. కెరీర్ పై దృష్టి పెడతాడు రవికాంత్.


ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 14 చదవండి.


“హిమా! మీ నాన్న పిలుస్తున్నారు”


“వస్తున్నానమ్మా”


మౌనంగా వచ్చి నిలబడిన హిమతో “నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఏమి నిర్ణయించుకున్నావు?” అని అడుగుతాడు నాన్న. 


“నన్ను క్షమించండి నాన్నా! నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. అలా అని మీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. ఈ ఇంటి పరువు గడప దాటి బయటకి వెళ్ళదు. నా మనసు గది లోపలికి రవికాంత్ స్థానంలోకి ఎవరిని రానివ్వలేను. 


ఈ విషయాన్ని రవి కాంత్ తో కూడా చెప్పి వస్తున్నా. ‘నీ జీవితంలో నేను ఉండలేక పోవచ్చు కానీ నీ జ్ఞాపకాల్లో నువ్వు సాధించిన విజయంలో నేను ఉంటాను’అని.. 


ఇదే నా నిర్ణయం నాన్నా! మీ కూతురి లాగా ఈ ఇంట్లోనే ఉంటూ మనసులో ఉన్న రవికాంత్ ని నిరంతరం తలుచుకుంటూనే ఉంటాను. మా ఇద్దరినీ భౌతికంగా విడదీయవచ్చు కానీ మానసికంగా ఎవరు విడదీయలేరు.. అతని ప్రేమ మీ ప్రేమ కన్నా గొప్పదని చెప్పను కానీ మీ ప్రేమకు దగ్గరగా ఉంటుందని మాత్రం చెప్పగలను”. తన అభిప్రాయాన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిమబిందు. 


“ఏంటండీ అది మాట్లాడేది”


“ఇందిరా. మన కూతురు ప్రేమ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. పెళ్లి విషయంలో కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అయితే కొంత సమయం పడుతుంది. అంతవరకు ఎదురు చూద్దాం..” 


‘రవి.. నీ కెరియర్ కోసం ఎంత కష్టాన్నయినా భరిస్తాను’ అనుకొని రవి ఇచ్చిన మొబైల్ హృదయానికి హత్తుకొని అతను ఇచ్చిన బుక్ మరియు శారీ అన్నీ ఒకసారి కనులారా చూసుకుంటుంది. రవికాంత్ కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి,

“నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా.. ఎందుకు మళ్లీమళ్లీ కాల్ చేస్తావు”


“నీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి చేశాను హిమ”


“నాతో షేర్ చేసుకోవడానికి నువ్వు ఎవరు.. నేను నీకేం అవుతాను.. ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకు. ఆ షార్ట్ ఫిలిం నాకోసం అప్పుడు రిలీజ్ చేయలేదు కదా. దాన్ని రిలీజ్ చెయ్. అందులో ఏడు అడుగుల కాన్సెప్ట్ తీసేయి. ఎందుకంటే మనం చేయలేనిది వేరే వాళ్ళకి చెప్పలేము కదా. అయినా బలమైన కారణం లేనిదే ఎవ్వరూ ప్రేమని వదులుకోలేరని, వదులుకోరని నాకు ఇప్పుడు అర్థమైంది. 


నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా. దయచేసి నాకు కాల్ చేయకు.. సారీ రవి.. నన్ను క్షమించు. ఇంత కఠినంగా మాట్లాడక తప్పడం లేదు” అంటూ తన జ్ఞాపకాలను భద్రంగా ఓ చోట భద్రపరిచింది.. 


చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. 


రవికాంత్ అతి తక్కువ సమయంలోనే క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఒక్క సినిమాతో మంచి పేరు తెచ్చుకొని రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 


హిమ బిటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటూ ఉంది. 

ఈ ఏడాదిలో ఒకరి మధ్య ఒకరికి ప్రత్యక్షంగా ఎటువంటి సమాచారం లేదు. పరోక్షంగా రవికాంత్ విజయాన్ని హిమ తెలుసుకుంటూనే ఉంటుంది. హిమ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాడు కానీ ఇద్దరి మధ్య చెరగలేనంత దూరం ఏర్పడిపోయింది.. 


ప్రభాకర్ మాత్రం రవికాంత్ హిమబిందుని వేరు చేసినందుకు సంతోషంగానే ఉన్న తనని పెళ్లి చేసుకోలేక పోతున్నందుకు, బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా హిమని పెళ్లి చేసుకుని రవికాంత్ కెరీర్ ని నాశనం చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటాడు.. 


ఒకరోజు ఆ ప్రభాకర్, హిమ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి “అంకుల్! నేను సంవత్సరం నుండి హిమబిందు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. అందరికీ చెప్పుకున్నాము తనే నాకు కాబోయే భార్య అని. మీరు ఈ విషయం గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అందరిలో పరువు పోయేలా ఉంది” అని మాట్లాడటంతో ఆ మాటలకు బాధపడిన నాన్న,

హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పటల్లో జాయిన్ అవుతాడు. 


హిమను పిలిచి “హిమ.. నా ఆఖరి కోరిక తీరుస్తానని నాకు మాట ఇవ్వమ్మా” 


“ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు”. 


“నేను ఎంతసేపు బ్రతికి ఉంటానో నాకు తెలీదు. నా పరువుని నిలబెట్టమ్మా. ఆ ప్రభాకర్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ నాన్న ప్రాణాన్ని నిలబెట్టు”. 


“ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నాను మీ ప్రాణాలను నిలబెట్టడం కోసం పూర్తిగా, చచ్చి పోవడం కోసం నేను సిద్ధమే నాన్న” అంటూ నాన్నకి “సరే నాన్న.. నేను పెళ్లి చేసుకుంటాను” అని మాట ఇస్తుంది.. 


“రేయ్ రవికాంత్! నీపై నేను విజయం సాధించాను. మా వెడ్డింగ్ కార్డ్ అందుకోవడానికి రెడీగా ఉండు. లైఫ్ లో సక్సెస్ అయ్యావని ఆనందిస్తున్నావు కదా.. ఈ విషయం తెలియగానే కృంగిపోవడానికి సిద్ధంగా ఉండు..”

*** 


‘నా చావు పండుగకు నన్ను అందంగా రెడీ చేస్తున్నారు. 

అబద్ధాలు మోసాలతో కూడిన మామిడి తోరణాలు గుమ్మానికి వేలాడుతున్నాయి బలివ్వడానికి వేదిక సిద్ధమవుతుంది చావు పల్లకి పెళ్లి పీటల రూపంలో అలంకరించబడుతుంది.. 

మానసికంగా చచ్చిపోయిన నన్ను దీవించడానికి పసుపు కలిపిన అక్షింతలు సిద్ధమవుతున్నాయి. చనిపోయిన నన్ను కప్పడానికి తలంబ్రాలు సాంప్రదాయబద్ధంగా కలుపు తున్నారు. ఉరి తీయడానికి పసుపు తాడు పచ్చగా నవ్వుతూ ఉంది..’ 


“నేను నాకు కాబోయే భార్యతో మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా” అని ప్రభాకర్ అడగడంతో హిమనీ రెడీ చేసే అమ్మాయిలు వెళ్లిపోతారు. 


“హాయ్ హిమ డార్లింగ్, పాపం నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసావో ఆఖరికి నీ ప్రేమను కూడా వదులుకున్నావు. కానీ ఏమైంది.. అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చావు”. 


ఆ మాటలకు కోపం వచ్చిన హిమ నిప్పులు కురిపిస్తున్నట్టు అతని వైపు కోపంగా చూస్తుంది.


“నువ్వు ఎంత కోపంగా చూసినా ఏమి ఉపయోగం లేదు. అదంతా నేను నడిపించినట్టు నడుస్తుంది.”

 

“చూడు ప్రభాకర్. నువ్వు సకల రాక్షస ప్రయత్నాలతో నన్ను పెళ్లి చేసుకోవచ్చు ఏమో. కానీ నా మనసులో ఉన్న రవికాంత్ ని ఎప్పటికీ తీసివేయలేవు. నేను మా నాన్న కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నా. అంతే. ఎప్పటికీ నీకు భార్యని కాదు.నేను నా రవికాంత్ హిమబిందువు లాగే ఉంటాను..”

*** 


“బబ్లు.. ఇది నిజమేనా. హిమబిందుకి పెళ్ళంటగా!”


“అవునంటరా. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు.”


“రేయ్. మనలో ఎవరైనా కానీ ఈ విషయం రవికాంత్ కి చెప్తే మాత్రం బాగోదు. వాడు ఇప్పుడిప్పుడే కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు, ఇప్పుడ చెప్పి వాడిని డిస్టర్బ్ చేయొద్దు.”

 

“చెప్పకపోతే ఎప్పటికైనా తెలిసేదే కదరా.”


“ఎప్పటికైనా తెలియడం వేరు, ఇప్పుడు తెలియడం వేరు. అయినా వాడిప్పుడు ఫారిన్ లో ఉన్నాడు. షూటింగ్ పనిలో వచ్చిన తర్వాత ఎలాగోలాగా తెలుస్తుందిలే. ఇప్పుడైతే మీరు వాడిని డిస్టర్బ్ చేయొద్దు..” 


“రేయ్ ప్రభాకర్! నువ్వు చాలా గ్రేట్ రా”


“ఎందుకురా”


“ఎవరైనా పెళ్లికి నెలరోజుల ముందు బ్యాచిలర్ పార్టీ ఇస్తారు. నువ్వు పెళ్లి ఇంకో గంటలో ఉందనగా మాకు మందు పార్టీ ఇస్తున్నావు..”

 

“ఒరేయ్. వీడు ఉట్టి గ్రేటు కాదురా డబల్ గ్రేట్. 

ఎందుకో చెప్పమంటారా.. మనకి పార్టీ ఇవ్వడమే గ్రేట్ అనుకుంటే గంటలో తాళికట్టబోతు వీడు కూడా మందు తాగుతున్నాడు అంటే ఎంత గ్రేట్..”

 

“రేయ్ ప్రభాకర్.. ఎవరికైనా డౌట్ వస్తే?”


“వచ్చినా ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు మనం ఎంత చెప్తే అంత. అయినా మా మామ బ్రెయిన్ సంవత్సరం నుండి నేను చెప్పే మాటలు విని విని పనిచేయడం మానేసింది. రెండు మూడు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనకి ఇప్పుడు నేను తప్ప వేరే దిక్కు లేదులే, కాబట్టి మనకి ఇబ్బంది లేదు..” 


“రేయ్! అయినా ఆ హిమబిందు నీ ఎదుటే చెప్పింది కదరా పెళ్లి చేసుకున్నా నీకు భార్యని కాదు ఆ రవికాంత్ కి లవర్ గా ఉంటానని. అయినా ఎలా పెళ్లి చేసుకుంటున్నావురా?”


“రేయ్! పెళ్లి అయ్యే వరకే అంతా ఆ హిమబిందు ఇష్టం .వన్స్ తాళి పడిన తర్వాత తనపై అన్ని హక్కులు నావే. నేను చూపించే టార్చర్ కి ఆ రవికాంత్ కి ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను అంత చెప్పుకోవాలి. వాడు అది విని డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న వాడి కెరియర్ నాశనమవ్వాలి. అల్టిమేట్ గా ఇద్దరు కృంగిపోవాలి. అదే నా గోల్..”

*** 


“ఏంటండీ.. అంత కంగారుగా ఉన్నారు. ఏమైనా తీసుకురానా.. తాగుతారా”


“వద్దు ఇందిరా. అమ్మాయి ఏది”


“రెడీ అవుతుందండి”


“అవునా. నేను ఒక్కసారి తనని కలవాలి.”

 

“అదిగో.. ఆ రూములోనే రెడీ అవుతుంది. వెళ్లి మాట్లాడండి”


“ఏంటి అన్నయ్య.. కూతురికి పెళ్లి అవుతుంటే బాధపడుతున్నావా” అని మాటలు తన చెవులకు వినిపిస్తున్నా మనసుకు పట్టనట్టు రెడీ అయ్యే గది వైపు వెళ్తాడు నాన్న.. 


రూమ్ లో పెళ్లికూతురులా ముస్తాబయ్యి కూర్చున్న కూతురిని చూస్తూ వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకుని తలుపు వేసి,

“అమ్మా హిమ.. నన్ను క్షమించు తల్లి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాను. ఆ రాక్షసుడి ఆలోచన తెలియక నీ జీవితాన్ని బలివ్వబోయాను” అంటూ కూతుర్ని పట్టుకొని భోరున ఏడుస్తాడు.. 


“నాన్న, ఏమైంది.. ఎందుకు అలా బాధపడుతున్నావు.. ముందు ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చో” అని పక్కనే ఉన్న బెడ్డు పైన కూర్చోబెట్టి “ఇప్పుడు చెప్పు నాన్న.. ఏమైంది. “


“అమ్మా హిమ.. నా కళ్ళు తెరుచుకున్నాయి అమ్మా. ఆ నీచుడి నిజస్వరూపం నా చెవులారా విన్నాను. వద్దు తల్లి, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. నిప్పుల గుండంలో దూకొద్దు.. 

నా గురించి ఇంటి పరువు గురించి ఆలోచించొద్దు. వెళ్ళు నీ ప్రేమ నీ వెతుక్కుంటూ నీ రవికాంత్ దగ్గరకు నువ్వు వెళ్ళమ్మా.”


ఆ మాటలకు హిమ కళ్ళల్లోకి ఆనందం పరుగున వచ్చింది. “నాన్న.. నువ్వు చెప్పేది నిజమేనా,”


“నిజమే తల్లి.. సందేహించకు. సమయం చాలా తక్కువగా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుండి బయలుదేరు. కావాలంటే నేనే నిన్ను దింపుతాను”


“వద్దు నాన్న. నీకేమీ తెలియనట్టే ఉండు. లేదంటే ఆ ప్రభాకర్ వలన నీకు ప్రమాదం ఉంటుంది.”

 

“సరేనమ్మా. బట్టలు మార్చుకుని వెనుక డోర్ నుండి వెళ్లిపో. ఎవరు రాకుండా నేను చూస్తాను.”

 

“నాన్న.. చాలా థాంక్స్ నాన్న. నన్ను దీవించండి” అంటూ నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అడుగుతుంది. 


“సంతోషంగా ఉండు తల్లి. ఇలా, చేసిన నా తప్పుని సరి దిద్దుకునే అవకాశం నాకు వచ్చింది.”


“నాన్నా” అంటూ హిమ నాన్నను గట్టిగా హత్తుకుని “అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకునే నాన్న పెళ్లి విషయంలో ఎందుకు అర్థం చేసుకోలేదని ఎంతోకు మిలిపోయాను నాన్నా. కానీ నీ మనసు ఏంటో ఇప్పుడు అర్థమయింది..” 



బీరువాలో తను భద్రంగా దాచుకున్న రవికాంత్ వాళ్ళ అమ్మ ఇచ్చిన బ్లూ కలర్ సారీ కట్టుకొని ఆ ఇంటి నుండి బయటపడుతుంది. 


‘ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి. రావడం అయితే బయటకు వచ్చాను. రవికాంత్ అసలు ఎక్కడున్నాడు.. తనని ఎలా కలుసుకోవాలి. మొబైల్ కూడా ఇంట్లో మర్చిపోయాను. తిరిగి వెళ్ళలేను. కానీ నా మనసు ఒకటి చెబుతుంది. అవును నేను అక్కడికే వెళ్తాను. కచ్చితంగా తను అక్కడే ఉంటాడు. మా ప్రేమకు శాశ్వత చిరునామా అక్కడే దొరుకుతుంది” అంటూ ఆత్మవిశ్వాసంతో నడుస్తూ వెళుతుంది హిమబిందు.. 


“స్వీటీ! నేను వినింది నిజమేనా హిమ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా”


“అవును బబ్లు. కానీ తను ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. అందరం చాలా కంగారు పడుతున్నాము. మొబైల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది..”

 

“బబ్లు.. రవికాంత్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు.. నీకేమైనా ఐడియా ఉందా”


“లేదు స్వీటీ. ఫారన్ లో షూటింగ్ అంటూ చెప్పాడు. కానీ వేరే వాళ్ల వల్ల ఆ షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఇండియా వచ్చాడేమో అని ఫోన్ చేస్తే వాడి మొబైల్ కలవడం లేదు. చాలాసేపటినుండి ట్రై చేస్తున్నాము. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు..” 


ఇప్పటివరకు రవికాంత్ హిమబిందువుల ప్రేమ ప్రయాణంలో టైం లైన్ లో సంవత్సరం వెనకకు వెళ్లి జరిగిన కథ తెలుసుకున్నాము,


ఇప్పుడు ప్రస్తుత కథలోనికి ప్రయాణిద్దాం పదండి.. 


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 15 ( చివరి భాగం ) త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








 
 
 

Comentarios


bottom of page