#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Manchu Thakina Prema - Episode 3 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 14/12/2024
మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 3 - తెలుగు ధారావాహిక
రచన : చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది
కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.
తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమకి అతడు కనిపిస్తాడు.
గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో చెయ్యడానికి సంకోచిస్తాడు.
ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 3 చదవండి.
“స్టూడెంట్స్! ఆల్ ఆఫ్ యు కం హియర్..
బస్సులు వచ్చేసాయి చీకటి పడేలోపు మనం శ్రీనగర్ సిటీకి వెళ్ళాలి. ఈ నైట్ అక్కడ స్టే చేసి, రేపు మార్నింగ్ ఒక ఫేమస్ టెంపుల్ కి వెళ్లి, అక్కడి నుంచి మన జర్నీ రిటర్న్ అవుతుంది..
అసలు మన ట్రిప్ లో ఈ బన్నీ హాల్ ప్రాంతము లేదు, కానీ మీ ఇంట్రెస్ట్ మేరకు ఇక్కడి వరకు రావడం జరిగింది. ఇది చాలా రిస్కీ ఏరియా. స్నో ఫాల్ ఎక్కువగా ఉంటే మనము ఎక్కడికి కదల్లేము. చాలా ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఎక్కువ సమయం మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే వీలైనంత త్వరగా వెళ్ళిపోదాం. అందరూ త్వరగా రావాలి” అని మేడం అనౌన్స్మెంట్ వినిపించగానే స్టూడెంట్స్ అందరూ పరుగు పరుగున వస్తారు..
హైదరాబాద్ సిటీలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ కు సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు. ప్రతి ఏడాది ఆ కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదివే విద్యార్థిని విద్యార్థులను కాలేజ్ వాళ్ళు పిక్నిక్ లో భాగంగా ప్రసిద్ధి కలిగిన పర్యాటక ప్రాంతాలకు తీసుకొని వెళతారు.. విద్యార్థులకు మంచి కెరియర్ను అందించడంతోపాటు, విద్యార్థులకు మానసిక ఆరోగ్యాన్ని మరియు మేధో సంపత్తిని పెంపొందించడం ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత అని కాలేజ్ యాజమాన్యం చెబుతూ ఉంటారు..
అందులో భాగమే ఈ, ఫ్రెండ్లీ ట్రావెలింగ్ విత్ స్టూడెంట్స్.. అనే మోటో.
“సార్, మురళి సార్.. బాయ్స్ ని అందర్నీ కూడా రమ్మని చెప్పండి. మనకి టైం లేదు”
“ఆ ఓకే మేడం చెప్తాను” అంటూ భయము వినయము కలబోసిన స్వరంతో మురళి సార్ చెప్పడం చూసి, “ఏంటి సార్! మీరు కూడా ఫ్యాకల్టీ కదా. మరి మేడమ్ కి ఎందుకు అలా భయపడుతున్నారు” అని ఒక స్టూడెంట్ మేడం వెళ్ళిపోగానే ఆ సార్ తో చిన్నగా అడుగుతాడు..
“నేనే కాదు, మా స్టాఫ్ లో చాలామంది ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తాము. అది భయం కాదు. ఎందుకంటే ఆవిడ, ఆవిడ ప్రొఫెషనల్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు నిజాయితీగా ఉంటారు. మనుషులకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామన్నా లేదా వారి మాటకి గౌరవం ఇస్తున్నామన్నా అది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో మేడం ఎంతో ఫర్ఫెక్ట్.. ఆవిడ గర్ల్స్ స్టూడెంట్స్ కే ఇంచార్జ్ కాదు, నాకు కూడా ఇన్చార్జి మేడమే.. సరే సరే.. బయలుదేరండి. రేయ్ రవికాంత్! అందర్నీ ఇక్కడికి వచ్చేయమని చెప్పు. బస్సెస్ వచ్చేసినాయ్ అంట..”
“ఓకే సార్, చెప్తాను. రేయ్ పదండి. అన్ని బస్సులు వచ్చినయ్ అంట. వెళ్లి ఎక్కుదాం పదండి”.
“వీడేంట్రా ఇందాకేమో షూట్ జరిగిద్ది రాసి పెట్టుకో అన్నాడు.. ఇప్పుడేమో బస్సు ఎక్కుదాం అంటున్నాడు..”
“రేయ్ బబ్లు.. నేను బస్సు ఎక్కుదాం అన్నా. అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అన్లా. కొంచెంసేపు ఓపికతో చూడు, ఏం జరిగిందో నీకే తెలుస్తుంది..”
“డ్రైవర్ గారు.. ఇక స్టార్ట్ చేయండి. అందరూ వచ్చేసారు. లేట్ అయితే మనం అక్కడికి చేరుకోవడం కష్టం”
“మేము బస్సెస్ పెట్టి అరగంట అవుతుంది మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాము”
“అవును, నాకు తెలుసు. ఇదిగో స్టూడెంట్స్ తో ప్రోగ్రాం అంటే కొంచెం అటు ఇటు అవుతుంది లేండి. ఇక లేట్ ఎమీ లేదు బయలుదేరుదాం స్టార్ట్ చేయండి..”
“మేడం అందరికీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కదా. హిమ.. హలో హిమబిందు గారు.. ఏ లోకంలో ఉన్నారు? ఇందాకట్నుంచి పిలుస్తున్నా.”
“ఏం లేదే.. ఏంటి ఏదో చెప్తున్నావు?”
“ఇప్పటికీ పది సార్లు చెప్పా. అయినా మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే చెప్పేది ఏం వినిపిస్తుంది.. కళ్ళు ఎవరినో వెతుకుతుంటే వినేది ఏం అర్థం అవుతుందిలే.. అదిగో నువ్వు వెతుకుతున్న మీ హీరో రవికాంత్ అక్కడ ఉన్నాడు” అంటూ స్వీటీ అవతలి బస్సులో విండో ప్రక్కన కూర్చున్న రవికాంత్ ని చూపిస్తుంది..
“నేనేమీ అతని కోసం వెతకడం లేదు” అంటూ సీరియస్ గా చెప్తుంది హిమ.
“హే, నేనేదో సరదాగా అన్నాను ఎందుకు అంత సీరియస్ అవుతావు కూల్ కూల్..”
బస్సు ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్న డ్రైవర్ దగ్గరకు వచ్చి “ఏమైందండీ.. ఏదైనా ప్రాబ్లమా?”
“అవును మేడమ్. ఇందాక వచ్చేటప్పుడు బస్ కండిషన్ లోనే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవ్వటం లేదు.. ఒక నిమిషం ఆగండి, కిందకి దిగి చూస్తాను”.
మేడం “హా చెప్పండి, ఏంటి ప్రాబ్లం”
“టైర్ పంచర్ అయిందండి. ఎలా జరిగిందో తెలియడం లేదు. మొత్తం అన్ని టైర్లు పంచర్ అయ్యాయి..”
“అయ్యో అవునా.. ఇప్పుడు ఏం చేయాలి..” అని ఒక నిమిషం ఆలోచించి, “సరే, ఇంకో బస్సు ఉంది కదా.. ఆ బస్సులో అందరం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోదాము”
“మేడం.. గీత మేడం..”
“ఏంటి మురళి సార్.. ఏమైంది.. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు”
“బస్ రిపేర్ అంట మేడం. టైర్ పంచర్ అయింది అంట. అందరం కలిసి ఆ బస్సులో వెళ్ళిపోదాము”
“అరే విచిత్రంగా ఉందే.. మీ బస్ కూడా పంచర్ అయిందా?”
“ఏంటి మేడం.. ఈ బస్సు కూడా పంచరా?”
“అవును సార్”
“అదేంటి ఇలా జరిగింది.. ఇప్పుడు ఏం చేయాలి”
“ఒక్క నిమిషం ఆగండి. నేను ప్రిన్సిపాల్ సార్ తో మాట్లాడతాను..”
ఫోన్ ప్రిన్సిపల్ సార్ కి డయల్ చేస్తూ “మురళి సార్.. ఒకవేళ మన స్టూడెంట్స్ లో ఎవరైనా ఈ పని చేసి ఉంటారా..”
“అబ్బే లేదు మేడం. అందరూ మనతోనే ఉన్నారు కదా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అంతే.. మీరు అలాంటి ఆలోచనలేమీ మనసులో పెట్టుకోకండి. ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పండి. ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం..”
బస్సు రిపేర్ అవ్వడంతో ఇంకో కొన్ని గంటలు ఈ మంచు ప్రాంతంలో గడపవచ్చు అని స్టూడెంట్స్ అందరూ ఎంతో ఆనందిస్తారు. బస్ దిగి వారి ఆనందాన్ని చాటుతూ చుట్టూ అంతా ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు..
“రేయ్, రవికాంత్! ఏం చేసావురా..”
“చెప్పింది వినిపించలేదా రా.. బస్సు రిపేర్ అంట. నేనేం చేశాను.. పద వెళ్లి షూటింగ్ చేసుకుందాం..”
“నటించింది చాల్లే కానీ ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసులే. హిమబిందు కోసమే కదా”.
“రేయ్! తనకోసం మాత్రమే కాదు, మన షార్ట్ ఫిలిం కోసం కూడా. అయినా నేనేం చేశాను రా.. బస్సు రిపేర్ అంట.. నీకు ఎన్ని సార్లు చెప్పాలి.. నేను గట్టిగా అనుకున్నా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన లాస్ట్ షూట్ జరగాలి అని. నా సంకల్పబలం ఎంతో బలమైనది. అలా అని చెప్పి దేవుడిపై భారం వేసి ఊరుకోలేను. ఏదో నా ప్రయత్నం చేశా. అలా నా ప్రయత్నం నా సంకల్పం కలిసి ఇలా మన షూట్ ఇక్కడ జరిగేలా చేశాయి..
ఇక జరిగిపోయిన దాని గురించి పదే పదే మాట్లాడకు మేడం చెవిలో పడిందో నా పని అవుటే. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ హిమబిందుని షూటింగ్ కి తీసుకురావడమే..”
***
నెల రాజు, తార గణం నిండు జాబిలమ్మ..
చీకటి గగన సామ్రాజ్యంలో ఈ మంచు కురిసిన వేళ సమావేశం అయ్యారు..
మంచు తెర వాతావరణం పొరని కప్పివేసింది.
చిమ్మ చీకటిలో సూర్యోదయం వలె అగ్ని జ్వాలలు మంచు
పొరని చీల్చడానికి ఎగసి ఎగసి పడుతున్నాయి..
నిండు పున్నమి వెలుగులో కాంతుల్ని విరజిమ్ముతూ,
మంచు వానకి మౌనంగా కరుగుతూ,
వెచ్చని వేడి సెగకు సేదతీరుతూ
ఒక అందాల సిరి సొగసైన చీరలో కాటుక కనులతో,
తన నెల రాజు కోసం ఎదురుచూస్తుంది..
దూరం నుండి తన కోసమే అన్నట్టు పరుగున వస్తున్న తన ప్రియమైన యువరాజుని చూసి,
తీరాన్ని తాకే అలలాగా ఆమె అతని దగ్గరకు వెళ్లి ఒక అడుగు దూరంలో నిలుస్తుంది..
=======================================================================
ఇంకా వుంది
========================================================================
చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi
చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది.
వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా.
ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం.
సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం...
Ravi Ch
•11 hours ago
Very nice