top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 4

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 4 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 23/12/2024

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 4 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



 జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. 


తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమకి అతడు కనిపిస్తాడు. 


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో చెయ్యడానికి సంకోచిస్తాడు.


బస్సు టైర్లు పంక్చర్ కావడంతో అక్కడే మరో రోజు ఉండాల్సి వస్తుంది.



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 4 చదవండి.


“ఏంటి ప్రియా ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంగా నిలబడి పోయావు? ఈ కొద్ది దూరం దగ్గర అవడానికి చాలా సమయం ఉంది..”

 

“అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు?”


“చెప్పను, చూపిస్తా రా,” అంటూ ఆమె చేయి పట్టుకొని చీకటిలో వెలుగుని చిందిస్తూ చలిలో వెచ్చదనాన్ని అందిస్తున్న, చిటపటమంటూ శబ్దం చేస్తున్న వేడి మంటల సెగ తో నిండి ఉన్న అగ్ని గోళం లా ఉన్న ఒక అగ్ని జ్వాలలు ఎగసి పడే ప్రదేశానికి తీసుకొని వస్తాడు.. 


“ఈ ప్లేస్ కి నన్ను ఎందుకు రమ్మన్నావు?”


“ఈ అగ్ని దేవుడి సాక్షిగా నీతో ఏడు అడుగులు నడిచి ప్రేమ ప్రమాణాలు చేయడానికి” అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ 


మొదటి అడుగు ప్రమాణం,

పట్టుకున్న చేతిని ఎప్పటికీ వదలను. 

రెండో అడుగు ప్రమాణం,

కన్నీరు లేని కళ్ళు నీవే అయ్యేలా చూస్తాను. 

మూడవ అడుగు ప్రమాణం,

నీ మాట కన్నా మౌనాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటాను. 

ఐదవ అడుగు ప్రమాణం,

నీ నవ్వునే కాదు కోపాన్ని కూడా ప్రేమిస్తాను. 

ఆరవ అడుగు ప్రమాణం,

ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటాను

ఏడవ అడుగు ప్రమాణం,


పైన చేసిన ప్రమాణాలన్నిటిని నిలబెట్టుకుంటాను అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..” 


అంటూ అగ్ని చుట్టూ తిరిగి చల్లని చలిలో వెచ్చగా ఎగిసిపడే మంటలకు ఎదురుగా నిలబడి అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరింత చేరువుగా చేరి,


“ఐ లవ్ యు ప్రియా” అంటూ ప్రేమ పూరిత స్వరంతో చెబుతాడు. మాటలు రాని శిల్పంలా ఆమె అతని ఎదురుగా నిలుచుండి పోయింది.. ఒకరి కళ్ళు ఒకరితో మౌనంగా ఎన్నో మాటలు చెబుతున్నాయి. 

ఒకరి శ్వాస ఒకరికి వారి మనసులో ఎగసిపడే ఆశను తెలియజేస్తుంది. అంతటి చలిలో కూడా ఆమె నుదిటి పైన స్వేద బిందువులు చోద్యం చూస్తున్నట్టు నిలబడ్డాయి.. 


“షార్ట్ ఓకే” అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఒకరి నుండి ఒకరు దూరంగా జరిగిపోతారు. 


“ఎక్సలెంట్.. షార్ట్ సూపర్ గా వచ్చింది. నటించమంటే జీవించేసారుగా”అంటూ షూట్ చేస్తున్న బబ్లు, రవికాంత్ వద్దకు వచ్చి చెబుతాడు. 


“అయినా హిమబిందు.. షూట్ జరిగిందో లేదో అని లాస్ట్ మినిట్ వరకు డౌటే. కానీ నువ్వు కాస్ట్యూమ్ తో సహా ఎలా రెడీగా ఉన్నావు?”


“ఇవాళ షూట్ జరుగుతుందని రవికాంత్ చెప్పాడు. అతని మాట మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకన్నా మంచిదిలే అని ముందే రెడీగా ఉన్నాను..”

 

“మాకంటే ఈ స్క్రిప్టు యాక్టింగ్ ఏదో అలా అలా టచ్ ఉంది. కానీ నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావ్ కదా.. ఇంత బాగా ఇంత కంఫర్టబుల్గా ఎలా చేయగలిగావు”


“బాబు బబ్లు గారు.. మీ క్వెషన్స్ ఆపి ఒకసారి ఇటు రండి”. 

“ఆగరా, మాట్లాడుతున్నాను కదా..”

“రేయ్! ముందు రా. హిమబిందు.. 10 మినిట్స్ వెయిట్ చెయ్యి. ఇప్పుడే వస్తాను” అంటూ బబ్లు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు రవికాంత్.. 


“రేయ్! టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. నేను ఈరోజు తనకి ప్రపోజ్ చేయబోతున్నాను”. 


“తను ఇంతసేపు ఇక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం కదరా. మేడం కి డౌట్ వస్తే..?”


“అవన్నీ నేను సెట్ చేశాను లేరా. అక్కడ కిరణ్ ఉన్నంతవరకు ఇక్కడ హిమబిందుకి ఏ ప్రాబ్లం ఉండదు..” 


“అక్కడ కిరణ్ ఉండటం ఏంట్రా అర్థమయ్యేలా చెప్పు”

 

“అది ఒక పెద్ద కథ”


“పెద్ద కథ వద్దు చిన్న షార్ట్ వీడియో లా చెప్పు..”

 

“అబ్బా చెప్పే దాకా వదిలేలా లేవుగా.. బబుల్గం లాగా అంటుకున్నావు .నీ పేరుకు తగినట్టే నీ బిహేవియర్ ఉంది. సరే చెప్తాను విను..


బస్సు పంచర్ అయిన తర్వాత మేడం ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేశారు కదా. ఫోన్ మాట్లాడిన తర్వాత మనతో ఏం చెప్పారు?”


“ఏం చెప్పారు? ఈ నైట్ జర్నీ చేయడం కష్టము. అక్కడే ఉన్న గవర్నమెంట్ కోటర్స్ లో ఈ నైట్ స్టే చేయండి అని ప్రిన్సిపల్ సార్ చెప్పారని చెప్పారు. అక్కడి నుంచి ఆ కోటర్స్ కి వెళ్లడానికి 2 కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళాం కదా”


“వెళ్ళాము..”

 

“వెళ్లేముందు మేడమ్ ఏం చెప్పారు?”


“అబ్బా.. నాకు ఈ రివర్స్ క్వెషన్స్ ఏంట్రా.. ఏం చెప్పారు”


“ఇక్కడ చలి బాగా ఉంటుంది. అంత దూరం నడవాలంటే కష్టము. ప్రికాషన్స్ తీసుకోండి. స్వెటర్స్, షూస్, క్యాప్స్ ఇలా అన్ని వెంట ఉంచుకోండి. అవసరమైనప్పుడు వాటిని వేసుకోండి అని చెప్పారు. 


ఆ గ్యాప్ లోనే ఒక మ్యాజిక్ జరిగింది.మన కిరణ్ ని ఫుల్ గా కవర్ చేసి హిమబిందు ప్లేస్ లో ఉంచి హిమబిందుని నాతో తీసుకువచ్చాను. నిన్ను కెమెరాస్ తో ఇక్కడికి రమ్మని చెప్పాను”

 

“మరి మేడమ్ కి డౌట్ వస్తే?”


“మేనేజ్ చేయడానికి స్వీటీ ఉందిలే. ఇక నువ్వు ఆపి బయలుదేరు. ఈ నైట్ మొత్తం హిమబిందువుతో టైం స్పెండ్ చేసి నా మనసులో మాట తనకి చెప్పాలి!”


“లాస్ట్ డౌట్ అంతే”


“ఏంటో అడుగు..” 


“ఆ కిరణ్ గాడికి అమ్మాయిలు అంటేనే ఎలర్జీ కదరా”


“ అందుకే వాడిని అక్కడ పెట్టా. అది అమ్మాయిలకి మనకి సేఫ్..” 


“నీకు నీ థాట్స్ కి దండం రా బాబు. నేను వెళ్తున్న. ఆల్ ది బెస్ట్. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి..”


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 5 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








15 views1 comment

1 comentario


Ravi Ch

6 hours ago

❤❤❤❤

Me gusta
bottom of page