top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 5

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 5 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 01/01/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 5 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. 


తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమకి అతడు కనిపిస్తాడు. 


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో చెయ్యడానికి సంకోచిస్తాడు.


బస్సు టైర్లు పంక్చర్ కావడంతో అక్కడే మరో రోజు ఉండాల్సి వస్తుంది. షార్ట్ ఫిలిం షూటింగ్ మరికాస్త జరుగుతుంది.



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 5 చదవండి.


“స్వీటీ, స్వీటీ లేవే... ఈరోజు టెంపుల్ కి వెళ్దామని మేడం చెప్పారు కదా లేచి రెడీ అవ్వాలి కదా ఇంకా నిద్ర పోతావ్ ఏంటి లెగు”.


“ఏంటే నీ గోల.. అసలు ఇప్పుడు టైం ఎంతయిందో చూసావా అర్ధరాత్రి రెండు.

అసలు నువ్వు ఏమనుకుంటున్నావు?  నైట్ అంతా నీకోసం టెన్షన్ పడ్డాను. ఎప్పటికో పది దాటిన తర్వాత వచ్చావు. సరే అని ప్రశాంతంగా నిద్రపోతే మళ్ళీ రెండింటికే లేపేస్తున్నావు. ఇప్పుడే రెడీ అయిపోయి కూర్చుందామా ఏంటి…నిద్ర రావట్లేదా ఏంటి సంగతి?”


“ఆ హీరో గారు ఈ హీరోయిన్ గారికి రియల్ గానే ప్రపోజ్ చేశారా”


“అలాంటిదేమీ లేదు ఈ చలికి నిద్ర పట్టడం లేదు…”


“అబ్బా చా.. మరి నిన్న నైట్ ఇంతకన్నా ఎక్కువ చలుంది. స్నో ఫాల్ ఎక్కువగా కూడా ఉంది. చీర కట్టుకొని మరి వెళ్ళావుగా షూటింగ్ అంటూ.. అప్పుడు లేదా చలి? ఎందుకు ఉంటుందిలే మీ హీరో పక్కన ఉన్నాడుగా…”


“ఏయ్ నోరు ముయ్”


“నా నోరుని మూయించినా, నీ మనసు నాకు తెలుసు. మీ షార్ట్ ఫిలింలో ఏం జరుగుతుందో ,నీ హార్ట్ లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఇక మర్యాదగా నిజం ఒప్పేసుకో…”


హిమబిందు సిగ్గుపడుతూ “నిన్న ప్రపోజ్ చేయలా, ఈరోజు ప్రపోజ్ చేస్తున్నాడు”


“ఓ అవునా? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా యాక్సెప్ట్ చేసేద్దామా అన్నట్టు ఉన్నావుగా. అయినా ఈ హిమబిందు ఏంటి ఆ రవికాంత్ కి పడిపోవడమేంటి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయినా పది రోజులు కలిసి షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేయగానే ఇంప్రెస్ అయిపోతారా’.


“పది రోజులు కాదు స్వీటీ. రెండు సంవత్సరాలు తను నన్ను రెండు సంవత్సరాల నుండి లవ్ చేస్తున్నాడు…”


“అవునా!...”


“ అవును. నేను కాలేజీలో జాయిన్ అయినా ఫస్ట్ రోజే రవికాంత్ నన్ను ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు… కాలేజీలో ఇవన్నీ సహజం లే అని అనుకున్నాను అంతగా పట్టించుకోలేదు, అలా మన ఫస్ట్ సెమ్ అయ్యేంతవరకు నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా నీడలా వెంట వచ్చేవాడు. తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి. హాలిడేస్ వచ్చాయి. అప్పుడు అనుకున్నా నేను తనకి ఏ రిప్లై ఇవ్వలేదు కదా వేరే అమ్మాయిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడులే అని…


కానీ తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. అంతకుముందు లాగే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు. నాకు ఏ సమస్య వచ్చినా నాకు తెలియకుండానే దాన్ని పరిష్కరిస్తున్నాడు. నా వెంట వచ్చే అతని నీడ నా ప్రేమకు జాడల మారిపోయింది. నాలో ఏమి నచ్చి నన్ను ఫాలో అవుతున్నాడో అప్పట్లో నాకు తెలియదు కానీ తన సిన్సియారిటీ నాకు నచ్చింది. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. నా కాంటాక్ట్ నెంబర్ అడగలేదు. కానీ ప్రతిక్షణం నా మనసుకి దగ్గరగానే ఉన్నాడు...


చూస్తూ చూస్తూనే మన ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం గా తను మనతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నేను కూడా అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉండేదాన్ని కదా.. అలా ఒక చిన్న పరిచయం అన్నది ఏర్పడింది. అయినా కానీ అప్పుడు కూడా తను ఏ మాత్రం తన హద్దులను క్రాస్ చేయలేదు...


నేను తనకి తెలియకుండా తన గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టాను. తనని ఫాలో అయ్యాను. ఒక్క చదువు విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో చాలా మంచివాడు అని తెలిసింది. అలా సెకండియర్ కూడా అయిపోయింది...


ఇక ఇప్పుడు తను షార్ట్ ఫిలిం చేయడం అందులో నేను యాక్ట్ చేయడం ఈ పది రోజుల నుండి తనకు దగ్గరగా ఉండడము దాన్ని చాలా అర్థం చేసుకున్న ఏదో అప్పుడప్పుడు కొన్ని కోతి వేషాలు వేస్తాడు కానీ మంచోడే. తన కెరియర్ పట్ల తనకి చాలా క్లారిటీ ఉంది. అందుకే నో చెప్పడానికి ఏ 

రీజన్ లేదు…”



“బాగుంది బాగుంది మీ లవ్ స్టోరీ హిమబిందు గారు.. అసలు ఈ షార్ట్ ఫిలిం కూడా ఒక ప్లానే నీతో కలిసి చేయాలని తెలుసా”


“తెలుసు” 


“నీకు తనో పేరు పెట్టాడు అది తెలుసా”


“తింగరి”


“అబ్బో నాకన్నా అన్ని బాగా తెలుసుకున్నావే. ఆరోజు ఇవన్నీ విన్నాను. నీకు చెబుదామని వచ్చాను. కానీ మేడం రావడం వల్ల చెప్పలేకపోయా. ఇవన్నీ నీకు తెలుసు అన్నమాట. ఇంక చేసేదేముందిలే...


నువ్వేమో ఫస్ట్ బెంచ్ క్లవర్ స్టూడెంట్ వి. తనేమో 2 ఇయర్స్ నుండి ఒకే క్లాసులో ఉంటూ బ్యాక్లాగ్ కూడా పూర్తి చేయని లాస్ట్ బెంచ్ స్టూడెంట్. మీ ఇద్దరికీ ఎలా మ్యాచ్ అవుతుంది?’



“ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది స్వీటీ. అలాగే చదువు తన బలహీనత కానీ తనకి యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్స్, వీటిల్లో ఎంతో టాలెంట్ ఉంది. నాకు నమ్మకం ఉంది తను ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతాడు. తన కెరియర్ చాలా బాగుంటుంది. కాబట్టి తన బలహీనతను కూడా నేను అర్థం చేసుకోగలను…”


“ఈ మాత్రం క్లారిటీ నీకు ఉంటే చాలు హిమ, ఆల్ ది బెస్ట్. సరే ఇంకా కొంతసేపైనా నన్ను నిద్రపోని”


“స్వీటీ ఇంకో విషయం”

“ఏంటి?”


“అన్ని ఒక్కసారి చెప్పేస్తే ఎలా.. ఇంకెప్పుడైనా చెప్తాలే హ్యాపీగా నిద్రపో.”


“ఇంక నాకేం నిద్ర పడుతుంది నువ్వు సస్పెన్స్ లో పెట్టావుగా” అంటూ స్వీటీ బలవంతంగా నిద్ర కోసం ప్రయత్నిస్తుంది...



“రేయ్ రవికాంత్, ఏంట్రా నిద్రపోకుండా ఇలా తిరుగుతున్నావు,

ప్రపోజ్ చేసిన ఆనందంలో నిద్ర పట్టడం లేదా.. ఇంతకీ తను నీ లవ్ ని యాక్సెప్ట్ చేసిందా”


“లేదు బబ్లు, నేను తనకి ప్రపోజ్ చేయలేదు. ఈరోజు చేయబోతున్నాను..”


“అదేంట్రా ఇందాక అంత కాన్ఫిడెన్స్ గా చెప్పావు తనకి ప్రపోజ్ చేస్తానని.. ఈ నైట్ అంతా తనతో టైం స్పెండ్ చేస్తాను అని.. ఏమైంది?


అయినా అన్నిట్లో స్పీడ్ గా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? తను కూడా నీతో బానే ఉంటుంది కదా.. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. మేబీ తను నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటా…”


“అదేరా నా ప్రాబ్లం. మనం లవ్ చేసే అమ్మాయికి ఆ విషయం తెలియకపోయినా ప్రపోజ్ చేయవచ్చు కానీ మనం లవ్ చేస్తున్న అమ్మాయికి ఆ విషయం ముందే తెలిసి తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని తెలిసి ప్రపోజ్ చేయడంలోనే చాలా కష్టం ఉంటుంది...


పైగా ఇందాక తను నా వైపు ఎంతో డిఫరెంట్గా చూసింది. ఆ చూపులో నువ్వు నాకు ఎంత ప్రత్యేకంగా ప్రపోజ్ చేస్తావో దాన్నిబట్టి నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాను అన్న అర్థం ఆ చూపులో నాకు కనిపించింది...


షార్ట్ ఫిలింలో యాక్టింగ్ అంటే అక్కడ మేము ఉండము. మా క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. కానీ నా లవ్ ని తన దగ్గర చెప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా నేర్వస్ గా ఉంటుంది. నా హార్ట్ బీట్ ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. నాకు తెలియకుండానే నాకు చెమటలు పడతాయి. మాట తడబడుతుంది. అమ్మో తను తనని అంత దగ్గర నుండి చూస్తూ నా మనసులో మాట చెప్పాలంటే చాలా కష్టం రా బాబు...


ఇదంతా సరిపోనట్టు ఇందాక ఎవరో రా నా దగ్గరికి వచ్చి ‘ప్రమాదం ప్రమాదం నీకు రక్ష కావాలి’ అంటూ చాలా డిఫరెంట్ గా మాట్లాడాడు.”


“ఎవర్రా?”


“ఏమోరా బబ్లు.. అతన్ని అలా చూస్తూ ఆ మాటలు వింటే చాలా భయం వేసింది…”


“ఎవడో పిచ్చోడై ఉంటాడు లే. ఇలాంటోళ్లు ఈమధ్య ఇక్కడ బాగా తిరుగుతున్నారంట. సరే ఇవన్నీ వదిలేసి ముందు నీ లవ్ సంగతి చూడు…”

“వెళ్లి ఈ కొంతసేపైనా నిద్రపోయి గ్లామర్ ని పెంచుకో. అసలే తన పక్కన నువ్వు డి గ్లామర్ గా కనిపిస్తున్నావు. తనేమో గార్జియస్. నువ్వేమో వద్దులే.. చెప్తే ఫీల్ అవుతావ్…”


***

“అందరూ లేచి రెడీ అవ్వండి. ఈరోజు టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పాను కదా.. ఇవాళ మన ట్రిప్ లో ఆఖరి రోజు… ఈ వేళ మనము జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధి దేవాలయం అయిన వైష్ణవి మాత దేవాలయానికి వెళ్తున్నాము…


బస్సులు కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని డైరెక్ట్గా మనం తిరుగు ప్రయాణం అవ్వొచ్చు. కాబట్టి లేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ లో అందరూ రావాలి…”

అంటూ మేడం మాటలు తూటాల్లా అందరి చెవుల్లోకి వెళ్లాయి. అందరూ చకచకా రెడీ అయ్యి ఒకచోట గ్యాదర్ అయ్యారు...


“మేడం! ఈ వైష్ణవి మాత దేవాలయం ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది?”


“ఇది జమ్మూ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా మనం కాట్రా అనే ప్రాంతానికి చేరుకోవాలి. కాట్రా నుండి ఆలయానికి వెళ్లడానికి 15 కిలోమీటర్లు దూరం. ఈ 15 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లాలి ఎలాంటి వాహన సదుపాయం లేదు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్లు మాత్రమే రండి. ఎవరికైతే హెల్త్ బాలేదు మంచు పడదో వాళ్లు డైరెక్ట్ గా జమ్మూ రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్. ఈ టైంలో అక్కడ స్నో ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్లు ఆగిపోండి…”



“మేడం, మరి దర్శనం టికెట్స్ వగైరా”


“అవన్నీ ఆలయానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో బుక్ చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేశాను. ఆ రిసిప్ట్ ని జిరాక్స్ తీసుకొని ఆ ప్రింట్ జిరాక్స్ మన దగ్గర ఉంచుకుంటే చాలు. అక్కడ దాన్ని చూసి లోపలికి పంపిస్తారు… సరే.. మిగిలిన విషయాలు వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం, ఇక బయలుదేరుదాం పదండి…”

***


“ఏయ్ హిమ.. అదిగో నీ హీరో”


“ఊరుకోవే నేను చూసాను లే.”


“చాలా స్మార్ట్ గా రెడీ అయ్యాడు ప్రపోజ్ చేయడానికి అనుకుంటా”


“స్వీటీ ఆపవే నీకు దండం పెడతాను. నాకు ఎందుకో తన వైపు చూడాలంటేనే టెన్షన్ గా ఉంది…”

***

“మేడం”


“ఏంటి రవికాంత్?” 


“ఒక చిన్న సీనుకు సంబంధించిన స్క్రిప్ట్ ఉంది మేడం. హిమబిందుకి ఎక్స్ప్లైన్ చేయాలి. నన్ను కూడా ఆ బస్సులో రానిస్తారా”


“చూడు రవికాంత్! నేను ముందే చెప్పా నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయనని. పిచ్చిపిచ్చి వేషాలేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. మీ బస్సులో మీరు రండి. మా బస్సులో మేము వెళ్తాం…”***

“ఏంట్రా మేడమ్ గెటవుట్ అందా.. నాకు తెలుసు అదే జరిగిందని. సర్లే జర్నీలో ఎలా ప్రపోజ్ చేయాలో ప్లాన్ చేసుకో. ఇంతకు మించి నువ్వు ఏం చేయగలవు లే…”


“దొరికానని బాగా ఆడుకుంటున్నావుగా బబ్లు.. అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉండే నేను హిమబిందు విషయంలోనే వీక్ అయిపోయి నీకు చాలా చీప్ గా కనిపిస్తున్న. ఏం చేస్తాంలే…”

***


కాట్ర ప్రాంతం వరకు బస్సులో వారి ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా జరిగింది. అక్కడి నుండి వైష్ణవి మాత ఆలయంలోకి కాలినడకన కొంతమంది, గుర్రాలపై కొంతమంది, పల్లకిలో మరో కొంతమంది చేరుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు, మంచులో తడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంతో అందరూ పరవశిస్తూ ఉంటారు...


“ఈ ట్రిప్పు లైఫ్ లో మర్చిపోలేము. అసలు ఒక్కో ప్రాంతం ఎంత ఆహ్లాదంగా ఉందో వర్ణించడానికి మాటలు రావడం లేదు. హిమబిందు.. నిన్ను రవికాంత్ పిలుస్తున్నాడు. నీతో ఏదో మాట్లాడాలి అంట. అదిగో టెంపుల్ వెనక ఉన్నాడు చూడు. మేడం చాలా దూరంలో ఉన్నారు. ఆవిడ వచ్చే ముందే కలిసి వచ్చేసేయ్…”


“సరే బబ్లు.. మేడం వస్తే గనుక నువ్వు వచ్చి చెప్పు.”


“సరే నేను చూసుకుంటాను…”



ముంచుకు వస్తున్న సిగ్గుతో తడబడుతున్న నడకతో యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది హిమబిందుకి. తన భావాలను అదుపు చేసుకొని ఎంతో మామూలుగా రవికాంత్ వద్దకు చేరుకుంటుంది.


దూరం నుండి నడిచి వస్తున్న హిమను చూస్తుంటే రవికాంత్ కు ఆలయంలోని దేవత కరుణించి హృదయంలో ఉన్న దేవత వరాలు ఇవ్వడం కోసం నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది...


“ఏంటి పిలిచావంట” అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది…


వామ్మో నువ్వు నటి అని తెలుసుగాని మహానటివని ఇప్పుడే తెలిసింది అని మనసులో అనుకొని “ఏమి లేదు హిమా.. ఈ ఆలయం ప్రత్యేకత నీకు తెలుసా.. తెలియకపోతే చెబుతాను విను. అందుకే పిలిచా..”

.

ఆ మాటలకు కోపం వచ్చిన హిమ చాలా సీరియస్ గా రవికాంత్ వైపు చూస్తుంది.


“అయ్యో హిమ, అంత కోపంగా చూడకు. ఆ చూపులకే నేను భస్మం అయ్యేలా ఉన్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ తీసుకు వద్దామని ఇలా స్టార్ట్ చేశాను. చెప్తాను విను…”


“అవునా చెప్పు. నాకు కూడా ఈ ఆలయం విశిష్టత తెలుసుకోవాలని ఉంది…”


“ఈ ఆలయంలోని వైష్ణవమాత అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అంట. మనుషుల జనన మరణాలను నిర్ణయించే మహాకాళి, జ్ఞానాన్ని పంచే మహా సరస్వతి, ఐశ్వర్యాన్ని అందించే మహాలక్ష్మి...

ఇలా మూడు రూపాలు కలిసి ఏకరూపంగా వైష్ణవి మాత అమ్మవారిగా ఇక్కడ

 వెలిసారంట…”


ఇలా చెబుతూ చెబుతూ హిమబిందు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. తను చెప్పింది విని ఎంతో ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. అలాగే తన చేతిని రవికాంత్ తన చేతుల్లోకి తీసుకోనే విధానాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది...


దూరం నుండి ఇదంతా గమనిస్తున్న మేడం చాలా కోపంగా వాళ్ళ దగ్గరకు వస్తుంది...

=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 6 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








34 views0 comments

Comments


bottom of page