top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 6

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 6 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 11/01/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 6 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. 


తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమకి అతడు కనిపిస్తాడు. 


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో చెయ్యడానికి సంకోచిస్తాడు.


బస్సు టైర్లు పంక్చర్ కావడంతో అక్కడే మరో రోజు ఉండాల్సి వస్తుంది. షార్ట్ ఫిలిం షూటింగ్ మరికాస్త జరుగుతుంది. మేడం కన్నుగప్పి హిమకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు రవి. 



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 6 చదవండి.


మేడం, హిమబిందు వాళ్ళ దగ్గరకు వెళ్లడం చూసిన స్వీటీ, 

బబ్లు దగ్గరకు వచ్చి విషయం చెప్పి మేడంని ఏదోటి చేసి ఆపు అని అడుగుతుంది.. 


“సరే, నువ్వు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కింద పడిపో. నేను మేడమ్ ని ఇక్కడికి తీసుకు వస్తా. హిమబిందు రవికాంత్ మాట్లాడుకుని వచ్చేంతవరకు నీ యాక్టింగ్ ని కంటిన్యూ చెయ్. ఓకేనా”


“హా సరే..”

 

“మేడం.. మేడం.. స్వీటీకి కళ్ళు తిరుగుతున్నాయి అంట. ఒకసారి రండి” అని కంగారుగా బబ్లు రావడంతో స్వీటీ దగ్గరికి వెళ్తారు మేడం. 


“స్వీటీ? ఏమైంది”


‘హమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది’ అనుకొని బబ్లు రిలాక్స్ అవుతాడు.. 


హిమబిందు చేతిని తన హృదయం పై ఉంచి,

 

“హిమా! ఈ ఆలయంలోని అమ్మవారి సాక్షిగా, 

నా హృదయంలో కొలువైన నీ రూపం సాక్షిగా, 

నా ఈ హృదయ స్పందన ఆగిపోయేంతవరకు 

నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. 

ఐ లవ్ యు హిమ..

విల్ యు మ్యారి మీ?”


ఆ మాటలు విన్న హిమ మాటలు మరిచిన బొమ్మలా నిలబడిపోతుంది. రవికాంత్ హృదయం పై ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటుంది.. 



ఆ ప్రయత్నాన్ని ఆపుతూ రవికాంత్ హిమచేతిని మరింత గట్టిగా పట్టుకొని తన చేతుల్లోకి తీసుకుని, 

“ఏంటి సినిమాటిక్ స్టైల్లో చెప్పానా.. ఇప్పుడు నేను నాలా అంటే రవికాంత్ లా చెప్తాను జాగ్రత్తగా విను.. 


హిమా! నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నా కళ్ళకు నువ్వు ఎంతగానో నచ్చావు. క్లాస్ లోకి వచ్చిన మొదటి రోజు అందరి వైపు చూసి ఎంతో అందంగా నవ్వావు. 


అప్పుడు నీ నవ్వు నచ్చింది. 

పాదం నీ వెంటే పదా అంటూ తరిమింది. 

అలా ప్రతిక్షణం నిన్ను ఫాలో అవుతూ నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరిస్తూ నిరంతరం నీ చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను.. 


నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకున్నాను నీ ఇష్టాలు అలవాట్లు అన్ని తెలుసుకున్నాను.. 

నీ అందానికి తెలివితేటలకి నీ కుటుంబ నేపథ్యానికి నేను చాలా దూరంలో ఉన్నాను అన్న నిజం తెలుసుకున్నాను.. 

అందుకే నీకు దగ్గర అవ్వాలి అని అనుకున్న ప్రతి నిమిషము ఆ నిజం గుర్తుకు వచ్చి నన్ను ఆపింది.. 


కానీ నా కళ్ళకు నచ్చిన నువ్వు మనసుకి చాలా దగ్గర అయిపోయావు. మనసులో ఉన్న మనిషికి దూరంగా ఉండాలి అని అనుకోవడం, ఉండడం అసాధ్యం. 


అందుకే మనసులో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుని జీవితాంతం నా జీవితాన్ని నీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. 


హిమ.. మన ఇద్దరి మధ్య ఒక మ్యాజిక్ ఉంది తెలుసా.. మనిద్దరి మనసులు ఒకరి మనసుతో ఒకరి మనసు ఎంతో కనెక్ట్ అయి ఉంటుంది. నేను తలుచుకున్న ప్రతిసారి నువ్వు నా ఎదురుగా ప్రత్యక్షమవుతావు. ఇది అబద్దంలా అనిపించే నిజం. 


అందుకే నిన్ను దూరం చేసుకోకూడదని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. కెరియర్ పైన ఫోకస్ చేశాను. నాకు నచ్చిన రంగంలో త్వరగా సెటిల్ అవుదామని ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉన్నాను. 


నిన్ను లవ్ చేయడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయి కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఏ అర్హత ఇప్పుడు నాకు లేదు. 

నువ్వు నాకోసం రెండు సంవత్సరాలు ఎదురు చూస్తే చాలు ది బెస్ట్ లైఫ్ నేను నీకు ఇస్తాను. మాటల్లో చెప్పడం లేదు. చేతల్లోనే చేసి చూపిస్తాను. నన్ను నమ్ము హిమ.. 


ప్రతి విషయంలో నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు నువ్వు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఉంది. అదేమిటంటే నేను నిన్ను అర్థం చేసుకోలేని సమయం ఏదైనా ఉంటే ఆ సమయాన్ని నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే చాలు. అంతకు మించి నాకు ఇంకేమీ వద్దు.. 


చివరిగా ఒక్క మాట.. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే హక్కు నాకుంది. నిన్ను ప్రేమించమని అడిగే అర్హత నాకు లేదేమో అని అనుకుంటున్నాను.. 

అర్హతను మించి అడుగుతున్నాను అని అనుకోకు. నన్ను పెళ్లి చేసుకుంటావా హిమ..” 


రవి కాంతులకు హిమము నీరుగా కరిగినట్టు రవికాంత్ మాటలకు హిమ మనసు ప్రేమగా కరిగింది.. 


“ఇంకొక నిజం చెప్పడం మర్చిపోయా.. నా అల్లరిని నా కోతి వేషాలన్ని వీటన్నిటిని కూడా భరించాల్సి ఉంటుంది. నేను మంచివాడినే కానీ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాను సరేనా”. 


పెదవి విప్పి ఏదో చెప్పబోతున్న హిమని, 

“వద్దు హిమ.. నువ్వు ఇప్పుడేమి చెప్పవద్దు. ఈరోజు నుండి సరిగ్గా పది రోజులు తర్వాత మనం కలుస్తాము. అప్పుడు నీ మనసులో ఏముందో నాకు చెప్పు. అప్పటివరకు నేను నీకు కనిపించను. నువ్వు నాకు కనిపించవు. మనం కలవడానికి ఏ ప్లాన్ చేసుకోము. ఈ పది రోజుల్లోపు మన ప్రేమ నిజమైతే మన మధ్య నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంటే నేను నీకు ఎదురవ్వడం నువ్వు నాకు ఎదురవడమో కచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు నీ మనసులో మాట వినడానికి నేను రెడీగా ఉంటాను..” 


హిమ కళ్ళల్లో భయం అనుమానం రవికాంత్ కి అర్థమయింది. 


“హిమ, భయం వద్దు. నా సంకల్పంపై నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా 10 రోజులు తర్వాత మనం కలుస్తాము. నీ మనసులోని మాట నాకు చెబుతావు..” 


“మరి కలవకపోతే?”


“హిమ.. మనం కలవకపోతే మన ప్రేమ ఇక్కడితోనే అంతమైపోతుంది..” అంటూ తన చేతిలో ఉన్న బుక్ ని హిమ చేతుల్లో పెడుతూ, 

“హిమ.. ఇది నా హృదయం. ఈ బుక్ లో నిన్ను చూసిన మొదటి క్షణం నుండి ఈ క్షణం వరకు నా మనసు పలికిన ప్రతి ఫీలింగ్ ని ఇందులో రాసుకున్నాను. మనం మళ్లీ కలుసుకునెంత వరకు దీన్ని చదువుకో. నా హృదయాన్ని తెలుసుకో..”


మరొక మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెను తిరుగుతాడు రవికాంత్.. 


ఈ సంభాషణ అంతా దూరం నుంచి విన్న మేడం రవికాంత్ దగ్గరకు వచ్చి “రవికాంత్! నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నీ మెచ్యూరిటీ, బాధ్యత కలిగిన వ్యక్తిత్వం నాకు నచ్చాయి. నీ ప్రేమ నిజమే అయితే కచ్చితంగా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్” అంటూ రవి కాంత్ ని విష్ చేస్తారు. 

“థాంక్యూ మేడం! థాంక్యూ సో మచ్”. 

“హిమ.. నువ్వు కూడా భయపడకు. బి పాజిటివ్.. ఇక వెళ్దాము పదండి..”


ట్రైన్ వచ్చేసింది. 


“అందరూ ఉన్నట్టేగా.. ఎవరైనా మిస్ అయ్యారేమో ఒకసారి చూసుకోండి..”

 

“అందరూ ఉన్నాము మేడం” అని ఒక స్టూడెంట్ వాయిస్ వినిపించింది.


“ఓకే ఓకే బయలుదేరండి అందరు” 


“మేడం..” 


“ఏంటి రవికాంత్”


“నేను బబ్లు రావట్లేదు మేడం. మాకు ఇక్కడే కొంత పని ఉంది. అది చూసుకొని వచ్చేస్తాము..”

 

“ఓకే రవికాంత్. అయితే నువ్వు ఇప్పుడు నాకు చెప్పిందే మన ప్రిన్సిపల్ సార్ కి మెయిల్ పెట్టు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకువచ్చిన రెస్పాన్సిబిలిటీ తీసుకువెళ్లే రెస్పాన్సిబిలిటీ మాదే కనుక నువ్వు ఇప్పుడు మాతో రావట్లేదని చిన్న మెయిల్ పెట్టేసేయ్ సరిపోతుంది. జస్ట్ ఫార్మాలిటీ కోసమే..”

 

“ఓకే మేడం..”

 

“ఏంటి బబ్లు.. నీ డైరెక్షన్ కింద స్వీటీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది”


“ఏమైంది మేడమ్..”

 

“ఇందాక మీ ఇద్దరూ టెంపుల్ లో మాట్లాడుకోవడం నేను దూరం నుండి చూసాను. చాలా కోపంతో మీ దగ్గరికి వస్తుంటే వీళ్ళు నన్ను ఆపడానికి ట్రై చేశారు. మొదట్లో వీళ్ళ నాటకం నిజమే అనుకున్నాను. కానీ తర్వాత అర్థం అయింది. అందుకే అక్కడి నుండి వెంటనే వచ్చేసాను. రావడం మంచిదయింది. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను అలా వినడం వలన..” 


“సరే రవికాంత్! మేము బయలుదేరుతాము. మళ్లీ రెండు నెలలు తర్వాత కాలేజీలో కలుసుకుందాము. హాలిడేస్ అయిపోయిన తర్వాత..” 



“హిమ.. నువ్వేమి భయపడకు. మనం కచ్చితంగా 10 రోజులు తర్వాత మళ్లీ కలుస్తాము” అంటూ ట్రైన్ ఎక్కుతున్న హిమావైపు చూసి కళ్ళతోనే చెబుతాడు రవికాంత్.. 


దానికి హిమబిందు అందంగా చిరునవ్వుని చిందిస్తూ సరే అంటూ సమాధానం చెబుతుంది.. 


ట్రైన్ లో విండో సీట్ వద్ద కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఏంటి ఈ రవికాంత్ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు తనకి నమ్మకం ఉందేమో కానీ నాకు ఎక్కడో చిన్న భయం వేస్తుంది.. 


అమ్మో నేనేంటి నెగిటివ్గా ఆలోచిస్తున్నాను ఒకరు పాజిటివ్గా ఇంకొకరు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి నేను కూడా రవి లాగే పాజిటివ్గా ఆలోచిస్తాను అప్పుడు ఇద్దరం ఇంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు ఆలకించి తను అనుకున్నట్టుగానే మమ్మల్ని కలుపుతాడు అని మనసులో అనుకుంటూ రవికాంత్ ఇచ్చిన బుక్ ఓపెన్ చేసి చదువుతుంది.. 



“హిమ.. నిన్ను చూసిన మొదటిసారి నా మనసు పాడిన మొదటి పాట, 


 *ఊపిరి లేని చోట ఉన్నా, అందుకున్నా ఊపిరి నీ ప్రేమతో 


పల్లవి. 


‘దివిలో మెరిసిన దివ్య రూపమా కను తెరచి చూసే లోపు కనుమరుగు అయ్యావు.

 

వెను తిరిగి వస్తుంటే నా వెంటే వచ్చావు నాలోనే నిండావు 

కనులలో కంటిపాప నీవై వెలిశావో 

ఊహలతో ఊపిరి లేని చోట వదిలావు

 కావాలి అందించు గుప్పెడైనా ఊపిరి 

నీ తీయనైన ఊసులతో. 


మొదటి చరణం. 


సున్నితమైన సుగుణాల రాసి, మనసు తెలుసుకున్న మనసు ఉన్న మగువ సిరి, స్వప్నంలోనే నిల్వకు, 


అలా కల సాకారం గా, మారగా రా ఇలా. 


ఇలలో కనులతో అల్లావు ప్రేమ మాల 

ఇలా అది నా వైపుకు రాలేను నీ దీవెనల వర మాలగా. 


కంటికి ఏమైంది ఈ వెలుగు నిన్నలో మొన్న లో, 

తెల్లని మనసుతో చిన్నారు వెలుగు జిలుగులు జీవితంలో నిండు పున్నమి ఇవ్వాల్టితో. 


వెన్నెల్లో ఉన్న ఊపిరి లేని చోట ఉన్న అందించు ఉప్పెనంత ఊపిరి నీ నవ్వుతో. 


 రెండవ చరణం. 

అణుకువ అనే మట్టితో రూపాన్ని చేసి, వినయముతో బొట్టు పెట్టి, అందముతో ఊపిరి పోసి, మంచితనముతో మెరుగులు దిద్ది, ఆ బ్రహ్మ నిన్నటి కలలో నిన్ను పుట్టించెను నా మదిలో. 

నేటి నిమిషంలో అందుకున్న నిన్నటి కలల స్వర్గాన్ని. 


శ్రమ అయినా నిర్మించుకుంటా ప్రేమ మందిరాన్ని పెనవేసు కుంట నా జీవిత ప్రయాణాన్ని నీ ప్రేమతో. 

మమతాను రాగాలను ఉంచి మదిలో నిలిచిపోయావు మధుర కావ్యముల. 

నీ కలల తోటలో తోట మాలిగా మారనివ్వు నీ ఆశల పువ్వులకు అంటనివ్వను ఏ మన్ను. 


నీ చిరు ప్రేమ అందుకున్న ఊపిరి ఆడని చోట ఉన్నట్టు కుంటున్నా నా నూరేళ్ల జీవితానికి అందించు నీ వందేళ్ళ ప్రేమానుభూతి”



ఆ అందమైన పాటను చదువుతూ మైమరచిపోయి అందమైన ఊహలోకంలో విహరిస్తూ, 

అలసిపోయి అలసటతో నిద్రలోకి జారిపోయింది హిమబిందు.. 


పరిస్థితులు ఎప్పుడు ఎలా ఎందుకు మలుపు తిరుగుతాయో ఎవరికీ తెలీదు. హిమబిందు ఇంటికి వెళ్లేసరికి ఒక ఊహించని పరిణామం ఆమె మనసుని అతలాకుతలం చేస్తుంది.. 


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 7 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








26 views0 comments

Comentarios


bottom of page