top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 7

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 7 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 18/01/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 7 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. 


 గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. 


టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. 


ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 7 చదవండి. 


కాలేజ్ ట్రిప్ నుండి ఇంటికి వెళ్లిన హిమబిందుకి, ఇల్లంతా ఎంతో కొత్తగా వింతగా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది.. 


కానీ ఇంటి వాతావరణం ఏమీ మారలేదు. మారింది హిమబిందు. తనలో వచ్చిన మార్పు వల్ల అంతా కొత్తగా అనిపిస్తుంది. ట్రిప్ కి వెళ్లకముందు తన మనసు ఖాళీగా ఉంది. ట్రిప్ నుండి వచ్చిన తర్వాత తన మనసు రవికాంత్ తో నిండి ఉంది. ప్రేమ అనే కొత్త భావన తనతో ఉంది. అందుకే ఈ మార్పు.. 

ఈ ప్రేమ సంబరంలో ఉన్న హిమబిందుకి అనుకోని సంఘటన ఎదురవుతుంది.. 


“హిమా! ఈ అబ్బాయి పేరు ప్రభాకర్. సిరి యాడ్ కంపెనీ సీఈవో. మనకి దూరపు బంధువులు కూడా.. 

కొద్ది రోజుల్లో నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఇతనితోనే నీ పెళ్లి..” 


నాన్న, ప్రేమకి నిలువెత్తు అర్థం లా ఉండే నాన్న ఇంత కటువుగా కోపంగా మాట్లాడుతున్నాడు ఎందుకు.. ప్రేమగా ఉన్నప్పుడు చనువుతో నాన్నని ఏదైనా అడగవచ్చు. అడగగలను. కోపంగా ఉన్న నాన్న దగ్గర మాట్లాడే సాహసం ఎప్పుడు చెయ్యలేదు. చెయ్యలేను కూడా.. చెప్పాల్సిందంతా చెప్పి ఫోటో ఎదురుగా ఉన్న టేబుల్ పై పెట్టి వెళ్ళిపోతారు నాన్న.. 


మౌనంగా మనసులోనే మదన పడుతున్న హిమ దగ్గరకు హిమ వాళ్ళ అమ్మ వస్తుంది. 

అమ్మని అడిగే ధైర్యం ఉంది కనుక “అమ్మా! ఏంటి.. ఏంటి ఇదంతా.. నాకు పెళ్ళా..? అదీ ఇంత సడన్ గానా.. నన్ను ఒక్క మాట కూడా అడక్కుండా ఏంటిది..?”


“అన్నిటికీ పర్మిషన్ అడగాలా? నువ్వు షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేయడానికి పర్మిషన్ అడిగావా

అన్ని మాతో పంచుకునే నువ్వు లవ్ చేసే విషయంలో మమ్మల్ని సంప్రదించావా?”

ఎంతో కోపంగా అడుగుతున్న అమ్మ ప్రశ్నలు విని హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. 


“అమ్మా!..” అంటూ జరిగింది చెప్పబోతున్న హిమని “వద్దు. నువ్వు ఏమి మాట్లాడొద్దు.. 

ఎవరో అబ్బాయితో నువ్వు చనువుగా ఉన్న ఫొటోస్ మీ నాన్న ఫోన్ కి వచ్చాయి. వాటిని చూసి ఆయన గుండె ఆగిన పని అయింది తెలుసా.. ఆ ఫొటోస్ గురించి ఎంక్వయిరీ చేస్తే నువ్వు ఆ షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నావని చెప్పారు మీ కాలేజ్ వాళ్ళు.. ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు కూడా ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.. “


“అమ్మా.. అదంతా అబద్ధం”

 

“చంప పగులుతుంది అదంతా అబద్ధం అన్నావంటే..” అంటూ ఫోన్లో ఉన్న ఫొటోస్ ని తీసి చూపిస్తుంది.. 


ఆ ఫొటోస్ ని చూసి హిమ ఎంతో ఆశ్చర్య పోతుంది.. 


హిమబిందు రవికాంత్ తో అంత క్లోజ్ గా ఆ షార్ట్ ఫిలింలో ఎప్పుడూ లేదు. ఆ ఫోటోలో మాత్రం వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ లో ఉన్నట్లు ఉంది.. 



“అమ్మా! నేను షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేయడం నిజం, కానీ ఆ ఫోటోలో ఉన్నది మాత్రం అబద్దం. ఇది ఎవరో కావాలనే చేశారు. ఫోటోని మాఫింగ్ చేశారు. నేను ఈ విషయం గురించి మీతో చెబుదామని అనుకున్నాను. కానీ మీరు వద్దంటారేమో అని భయపడ్డాను. ట్రిప్ నుండి వచ్చిన తర్వాత చెప్పి

ఒప్పిద్దామని అనుకున్నాను. కానీ ట్రిప్ లోనే అనుకోకుండా షార్ట్ ఫిలిం ప్లాన్ చేశారు. ఇందులో నా తప్పేమీ లేదమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి..” 


“ఇక అర్థం చేసుకోవడానికి చెప్పడానికి ఏమీ లేదు హిమ. అన్నీ మర్చిపోయి నీ జాగ్రత్తలో నువ్వుంటే అందరికీ మంచిది.. నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న పెంకుటిల్లు లో కోడలిగా వెళ్లాను.. నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్న నీకు మంచి జీవితం ఇవ్వడం కోసం పెంకుటిల్లు ఉన్న మన స్థితిని పెద్ద కోటలో నివసించే స్థితికి తీసుకువచ్చారు.ఇదంతా నీకోసమే.. ఒక్కగానొక్క కూతురువని ఎంతో గారాబంగా పెంచుకుంటే నువ్వు మాకు చేసింది ఇదా” అంటూ అమ్మ కోపంగా వెళ్ళిపోతుంది.. 


ఒక్కసారిగా హిమ మైకం వచ్చినట్టు కళ్ళు తిరిగి పడిపోబోతుండగా తనని తాను అదుపు చేసుకుని

వంట గదిలోకి వెళ్లి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగుతుంది.. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం హిమకి ఒక్కసారిగా ఒంటరిని అని అనిపించింది తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని వెక్కివెక్కి ఏడుస్తుంది. 

ఇలాంటి పరిస్థితి తనెప్పుడూ ఎదురుకోలేదు. ఎదుర్కొంటానని కూడ ఊహించలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నాదే తప్పు. నాదే తప్పు.. అంటూ తనని తాను నిందించుకుంది.. 


రెండు మూడు రోజుల తర్వాత పరిస్థితి కొంచెం సద్దుమణిగింది. హిమ చెప్పే మాటలను అమ్మ నమ్మడం మొదలుపెట్టింది.. ఆమె చేసిన పరిశీలనలో షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడం తప్ప మరే తప్పు హిమది లేదని తెలుసుకుంది.. 


ఒకరోజు కూతురు దగ్గరకు వచ్చి, “చూడు హిమా.. మా పెంపకం పైన మాకు నమ్మకం ఉంది. నీ గురించి మేము అర్థం చేసుకున్నాము.. కోపంలో నీకు పెళ్లి చెయ్యాలి అని అనుకున్న మాట నిజమే కానీ, ఈ సంబంధం మేము తీసుకువచ్చింది కాదు. ఆ అబ్బాయి నిన్ను ఏదో ఫంక్షన్ లో చూశాడంట. నిన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అంట. వాళ్ళ ఇంట్లో చెప్పి మన డీటెయిల్స్ తెలుసుకొని వాళ్లకి ఇచ్చాడు. అనుకోకుండా మనం దూరపు చుట్టాలము అయ్యాము.. 


అబ్బాయి చాలా మంచివాడు. అన్ని విధాలుగా నీకు సరిపోతాడు. సంవత్సరం ఆగిన తర్వాత చేద్దామని అనుకుంటే వాళ్లు ఈ సంవత్సరమే చేసేద్దాం అని అంటున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. ఆలోచించు హిమ..”


ఏంటిది.. ఒక సమస్య సద్దు మణిగిందనుకుంటే మరో సమస్య వచ్చింది. ఇప్పుడు నేనేమి చేయాలి..


“హిమా.. హిమా..” అంటూ స్వీటీ లోపలికి వస్తుంది. 


హాల్లో హిమ వాళ్ళ అమ్మ ఉండడం చూసి “ఆంటీ! హిమ లేదా” అడుగుతుంది.


“లోపల ఉంది” అంటూ కొంచెం సీరియస్ గా చెప్పడంతో, 

‘ఏంటి ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఆంటీ ఇంత సీరియస్ గా ఉన్నారు’ అనుకుంటూ హిమ గదిలోకి వెళ్తుంది. 


“హిమా.. ఏమైందే.. ఏంటి అలా ఉన్నావు?” ఎంతో దిగాలుగా ఉన్న హిమని చూసి అడుగుతుంది.

 

జరిగిందంతా హిమ చెప్పగా “అదేంటే.. అసలు ఇదంతా ఎవరు చేశారు? అసలు ఇదంతా రవికాంత్ తో చెప్పావా నువ్వు ..ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావు???”


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 8 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








12 views1 comment

1 Comment


మంచు తాకిన ప్రేమ: సి. సాయి జ్యోతి. సి


చాలా ఆసక్తికరంగా ఉన్నది.


ఏమౌతుంది హిమ-బిందు కి .. ప్రేమ ఫలిస్తుందా? .. తన ప్రేమికుడు అయిన రవి కాంత్ తో పెళ్ళి జరుగుతుందా??? .. కాస్త సస్పెన్స్ గా ఉన్నది.

పి.వి.పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page