top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 8

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 8 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 24/01/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 8 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు.


టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చుసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు.


ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 8 చదవండి.


“ఏ విషయంలో నిర్ణయం తీసుకోవడం గురించి అడుగుతున్నావు స్వీటీ?”


“అదేనే.. రవికాంత్ విషయంలో” అంటూ సందేహంగా చెబుతుంది.. 


టెంపుల్ లో రవికాంత్ తనకి ప్రపోజ్ చేసిన విధానం మరియు వాళ్లు పెట్టుకున్న కండిషన్ గురించి స్వీటీకి చెబుతుంది హిమ.. 


అది విన్న స్వీటీ ఏ విధమైన ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలీక వింత ఎక్స్ప్రెషన్ తో హిమావైపు చూస్తూ “ఏంటే నువ్వు మాట్లాడేది, ఇంత వింతగా ప్రపోజ్ చేయడం నేను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు.. అంటే టెన్ డేస్ తర్వాత మీరు మీ ప్రమేయం లేకుండా కలుసుకుంటేనే మీ ప్రేమ సక్సెస్ అవుతుందా లేకపోతే లేదా!!”


అవును అన్నట్లు చూస్తుంది హిమ.. 


“అయ్యో రామ! మనం ఉంది 80స్, 90స్ లో కాదు.. 

 మీరు టైం లైన్ లో వెనక్కి 90 స్ లో కి, 80 స్ లోకి వెళ్లిపోయినట్టున్నారు.. 


అయినా ఇప్పుడు పరిస్థితి బాలేదు. పెళ్లి సంబంధం వచ్చింది. ఇంట్లో వాళ్లకు నీపై డౌట్ వచ్చింది. నీ ప్రేమకు పోయేకాలం వచ్చింది.. ఇంకా కాలం నడిచి వచ్చి మమ్మల్ని కలిపిద్ది అని భ్రమలో ఉండకు. 


అయినా కళ్ల ముందు ఎన్నో దారులు ఉంటే కళ్ళు మూసుకొని కొత్త దారి కోసం వెతుకుతున్నట్టు ఉంది మీ ప్రవర్తన. అమ్మమ్మలా ఆలోచించడం మానేసి రవికాంత్ కి కాల్ చేసి విషయం అంతా చెప్పు. నెంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను.. 


మీ ఇద్దరి మధ్య లవ్ అంటే ఎన్నో ఊహించుకున్న ఎన్నో రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేశా. ఎంతో చెప్తావని ఇక్కడికి వస్తే, నువ్వేమో ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పావు” 


“ఏ స్వీటీ.. చిన్నగా మాట్లాడు. అమ్మ వింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అసలు వెళ్ళిపోవే ఇక్కడినుంచి..” 


“హా.. వెళ్తా వెళ్తా. వెళ్లేముందు ఆంటీకి చెప్తాను. మీరు ఏమీ భయపడకండి. అక్కడ ఏమీ లేదు. ఏమీ జరగలేదు అని..”

*** 

రవికాంత్ కి కాల్ చేసి మాట్లాడదామా, వద్దా అని ఆలోచిస్తూ ఉండగా, 


‘హిమా! మన ఇద్దరి మనసుల మధ్య ఒక మ్యాజిక్ ఉంది’ అని రవి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అతను ఇచ్చిన బుక్ ఓపెన్ చేసి మరో పేజ్ ఓపెన్ చేసి చదువుతుంది.. 


మనసున ముసిరిన తొలి ప్రేమ..


“వేసవి మల్లెల వనం

వర్షపు ధారల హారం

చల్లని వెన్నెల లాస్యం

కనిపించాయి నిన్ను

చూసిన తొలి క్షణము


సాగరుని స్వర గానం

పడమటి సంధ్యా రాగం

చంద్రుని మౌన గేయం

వినిపించాయి నువ్వు

మాట్లాడిన తొలి క్షణము


కనులు వెతికే స్వప్నం

మనసు దాచిన కావ్యం

సిరులు దొరికే స్వర్గం

దరి చేరెను నువ్వు

చూసిన తొలి క్షణం 


గాలిలో పాదం తేలినట్టు

నీటిలో నాట్యం ఆడినట్టు

మట్టిలో ముత్యం మొలిచినట్టు

అనిపించెను నీతో నడిచిన తొలి క్షణము


కష్టం గడప దాటేను

ఇష్టం తలుపు తట్టెను 

ఉష్ణం చినుకై రాలెను

నీ స్వచ్ఛమైన ప్రేమను

పొందిన తొలి క్షణము


నిశిలో మెరిసిన శశి

శృతిలో కలిసిన లతి

స్థితిని మార్చిన ఆర్తి

ఉండిపోవా విడువని వాసనలాగా

వెంట రావా వదలని

గుండె లయ లాగా. 


హిమ నువ్వు నన్ను చూసిన తొలి క్షణం నాతో మాట్లాడిన తొలి క్షణం నీతో కలిసి నడిచిన తొలి క్షణం నా మనసు పలికిన మాటే ఈ పదం..”


ఎంత అద్భుతంగా రాశాడు.. ఇందులో ప్రతి అక్షరం నన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.. 


“హిమా! భోజనం చేసి పడుకో. టైం చాలా అయ్యింది”


ఆ మాట వినగానే ఉలిక్కిపడి బుక్ దిండు కింద దాచేసి నాకు “వద్దమ్మా! ఆకలి లేదు. నిద్ర వస్తోంది” 


“సరే, పాలు తెస్తాను. తాగి పడుకో..” 


“వద్దులే. నేనే వస్తున్నాను” అంటూ బయటికి వెళ్లి హడావుడిగా పాలు తాగి రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా పడుకుంటుంది. 


నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ, 


‘రవి.. చాలా బెంగగా భయంగా దిగులుగా ఉంది. 

ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమి అర్థం కావట్లేదు.. 

మనం కలుసుకుంటామా.. అమ్మ వాళ్లు నా ప్రేమని అర్థం చేసుకుంటారా???’


ఆ ఆలోచన రాగానే హృదయం బాధతో బరువెక్కి కన్నీళ్ళ రూపంలో బయటికొచ్చి తలగడను తడిపి మనసు తేలికై కనులు తనువు నిద్రలోకి జారిపోయాయి.. 


“ఏయ్ తింగరి! ఏంటి నువ్వు? నేను పాజిటివ్ గా ఆలోచిస్తుంటే నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. దేవుడు నా దగ్గరకు వచ్చి ‘ఒరేయ్ బాబు.. నీ పాజిటివ్ థింకింగ్ నన్ను కదిలించింది. అందుకే మీరు కలవడానికి దారులను సిద్ధం చేస్తున్నాను. కానీ మీ పాప నన్ను డిస్టర్బ్ చేస్తుంది. తను చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది..”

 

‘అని దేవుడొచ్చి నీతో చెప్పాడా’


‘అవును హిమ’


‘నోరు ముయ్. నీవు చెప్పిన మాటలు దేవుడు చెప్పాడని చెబుతావా.. ఈ లాంగ్వేజ్ అంతా నీదే. దేవుడు ఇలా మాట్లాడుతాడా..’

 

‘అబ్బో కనిపెట్టావులే లాజిక్. హిమ నీకు ఒకటి చెప్పనా!

నిష్కల్మషమైన మనసులో జనించిన మంచి సంకల్పం నెరవేరి తీరుతుంది. దానికి ఈ సమస్త విశ్వం సహకరిస్తుంది. 

కాకపోతే దీన్ని బలంగా నమ్మే వ్యక్తిత్వం మనకి ఉండాలి..”

 

“అంటే దీని అర్థం ఏంటి? కొంచెం తెలుగులో చెప్తావా”


“అంటే ప్యూర్ హార్ట్ తో మనం ఏది అనుకున్నా అది జరుగుతుందని అర్థం.. అర్థమైందా మై డియర్ తింగరి”


“ఏం నువ్వు ఊరుకుంటున్నానని ఎన్నిసార్లు అంటున్నావు.. ఇంకోసారి తింగరి అంటే ఊరుకోను..”

*** 

“టైము 8 అవుతుంది. ఇంకా నిద్రపోతున్నావే.. లెగువు” అని అమ్మ తలుపు తట్టే శబ్దం వినిపించడంతో నిద్రలేచి, 

‘కలలో కూడా ఎంత కాన్ఫిడెంట్ ని అందిస్తున్నావు రవి.. 

ఐ యాం సో హ్యాపీ యువర్ విత్ మీ. ఐ యాం సో లక్కీ యువర్ ఫర్ మీ..’ అనుకుంది హిమ. 


“జాగ్రత్తగా వెళ్లి రండమ్మా. అయినా నేహా.. ఇంత చలికాలంలో అరకు వెళ్లడం అవసరమా?”


“అవసరమే పెద్దమ్మా. వర్షం వచ్చేటప్పుడే ఐస్ క్రీమ్ తినాలి. చలికాలంలోనే ఇంకా ఎక్కువ చలిని వెతుక్కుంటూ వెళ్ళాలి.. అప్పుడే త్రిల్..” 


“హిమా! చెప్పిన విషయాలు గుర్తు ఉన్నాయ్ కదా.. మరే పొరపాటు జరగకుండా చూసుకో. జాగ్రత్తగా ఉండు. మీ నాన్నగారిని ఒప్పించి మరీ బయటికి పంపిస్తున్నాను..”

 

“సరే అమ్మా..”

 

ఒక్కరోజే ఉంది. ఇంకా ఈ ఒక్క రోజు దాటిపోతే రవికాంత్ ని కలుసుకోలేనా.. ఫోన్ చేసి మాట్లాడుదాము. ఏం చేయాలి.. ఇప్పుడు లేదు.. తను చెప్పినట్టు వెయిట్ చేద్దాం. ఇంక నువ్వు వెయిట్ చేయడానికి కూడా టైం లేదు కదా.. అంటూ తనలో తనే మదన పడుతుంది హిమ. 


“ఏంటక్కా ఇంత డల్ గా ఉన్నావు? నీ మూడు చేంజ్ అవుతుందని, ఇక్కడికి తీసుకు వస్తే ఇంకా డల్ గా ఉంటావు ఎందుకు.. చూడు.. మా అందరి లాగా ఎంజాయ్ చెయ్యి..”

*** 

అరకు లోయ:

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన గ్రామం. 

ఇది విశాఖపట్నం నుండి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


అరకు లోయ అందమైన దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం. సముద్రమట్టం నుండి 900 కిలోమీటర్ల పైన ఉన్న, 

అణువణువునా ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతున్న అందమైన కొండ ప్రాంతం.. వింటర్ సీజన్లో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 


జీవితంలో ఒక్కసారి అయినా ఈ అరకులోయ ట్రిప్పు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ అరకు ప్రాంత సోయగాలు చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి.. 


అరకు లోయలోని గార్డెన్ ప్రాంతంలో హిమ ఫోన్ పట్టుకొని నడుస్తూ ఉంటుంది కాల్ చేద్దామని నెంబర్ తీస్తుంది, 

డయల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తూ ఉంటుంది. 


అలా నడుస్తున్న హిమకి ఒక అబ్బాయి మొబైల్ పట్టుకొని ఎదురుగా వస్తాడు. చూడకుండా ఒకరికొకరు తగిలి సారీ అంటూ, తల పైకెత్తి ఒకరిని ఒకరు చూసుకుంటారు.. 


=======================================================================

                                                ఇంకా వుంది

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 9 త్వరలో

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








16 views1 comment

1 Comment


చైత్రశ్రీ సాయి జ్యోతి గారి సీరియల్ "మంచు తాకిన ప్రేమ" ... సస్పెన్స్ గా సాగుతున్నది. హిమ బిందు ను తన ప్రేమికుడితో కలుపుతారు అని ఆశిస్తున్నాం.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page